| Title | సామజయాన (ప్రతి) | sAmajayAna (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | సామజయాన ప్రాణసఖుని దోడి తేవే | sAmajayAna prANasakhuni dODi tEvE |
| చరణం charaNam 1 | కాముకేళి లోనం గలసిన నాధుని భామిని బాగుగ బ్రోవుమని | kAmukELi lOnam galasina nAdhuni bhAmini bAguga brOvumani |
| చరణం charaNam 2 | చందురు వెన్నెల పొందుగ గాయగ సుందరీ మందర ధీరుని | chamduru vennela pomduga gAyaga sumdarI mamdara dhIruni |
| చరణం charaNam 3 | పవనుడు మార్కొని బాధలు బెట్టగ యువిదరో కవి బుధలోలుని | pavanuDu mArkoni bAdhalu beTTaga yuvidarO kavi budhalOluni |
| చరణం charaNam 4 | గౌరిశెట్టి కుల ఘన కమలాకర సారసారిని శ్రీరాముని | gauriSeTTi kula ghana kamalAkara sArasArini SrIrAmuni |
Category: Javali
#106 సుందరి నేలుముర sumdari nElumura
| Title | సుందరి నేలుముర (ప్రతి) | sumdari nElumura (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సుందరి నేలుముర సామి | sumdari nElumura sAmi |
| కుందరదనమో మిందుని బోలుర | kumdaradanamO mimduni bOlura | |
| చరణం charaNam 1 | అంగన కురులు సారంగము నేలు శోభాంగిని బొగడగ పద్మజుని వశమె | amgana kurulu sAramgamu nElu SObhAmgini bogaDaga padmajuni vaSame |
| చరణం charaNam 2 | చెలియ పయోధరములు లికుచ ఫలంబుల మీరును యా లలనను కలియర | cheliya payOdharamulu likucha phalambula mIrunu yA lalananu kaliyara |
| చరణం charaNam 3 | సుమశరు బారికి సుదతి తాళనని కమలనయన నీ కరుణను గోరిన | sumaSaru bAriki sudati tALanani kamalanayana nI karuNanu gOrina |
| చరణం charaNam 4 | సరవితో శ్రీపీఠి సద్వంశజమణి గరితనేలు చారుస్మర రాఘావాచార్య | saravitO SrIpIThi sadvamSajamaNi garitanElu chArusmara rAghAvAchArya |
#105 సామిని రమ్మనవే sAmini rammanavE
| Title | సామిని రమ్మనవే | sAmini rammanavE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామిని రమ్మనవే సఖి కామిని వినవె శ్రీకాళహస్తీపుర ధామునిపై మరులు దాచగలేనే | sAmini rammanavE sakhi kAmini vinave SrIkALahastIpura dhAmunipai marulu dAchagalEnE |
| చరణం charaNam 1 | అన్నము నోటికింపుగ లేదె నానుబాలజుంటి తేనియు చేదే | annamu nOTikimpuga lEde nAnubAlajumTi tEniyu chEdE |
| చరణం charaNam 2 | మారుడు తాను బల్ మమతతోను సారెకు విల్వంచి సాహస మొనర్చెనే | mAruDu tAnu bal mamatatOnu sAreku vilvamchi sAhasa monarchenE |
| చరణం charaNam 3 | నేటికి సామిని సూటిగ దెచ్చితె బోటిరొ నీకు నె కోటిదలిత్తునే | nETiki sAmini sUTiga dechchite bOTiro nIku ne kOTidalittunE |
#104 రాఘవాచార్య నిను rAghavAchArya ninu
| Title | రాఘవాచార్య నిను (ప్రతి) | rAghavAchArya ninu (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | రాఘవాచార్య నిను నమ్మినాను యీ చలికులను యింపుతోను | rAghavAchArya ninu namminAnu yI chalikulanu yimputOnu |
| చరణం charaNam 1 | చిన్ననాడె నీదు చిన్నెలన్ని చూచి యెన్నగాను వలసున్నదాన | chinnanADe nIdu chinnelanni chUchi yennagAnu valasunnadAna |
| చరణం charaNam 2 | సన్నుతాంగ మది సమయమిది యనుచు నన్ను బ్రోవకను కన్నడేల | sannutAmga madi samayamidi yanuchu nannu brOvakanu kannaDEla |
| చరణం charaNam 3 | మాలిమితో నను మారుని బాధకు చాల గాసి జేయకు జాలికుల | mAlimitO nanu mAruni bAdhaku chAla gAsi jEyaku jAlikula |
| చరణం charaNam 4 | సరవితో శ్రీపీఠీ సద్వంశజుడవని కరుణగోరినాడ కఠినమేర | saravitO SrIpIThI sadwamSajuDavani karuNagOrinADa kaThinamEra |
103 మాణిక్య నిను mANikya ninu
| Title | మాణిక్య నిను | mANikya ninu |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మాణిక్య నిను నమ్మినాను గురు | mANikya ninu namminAnu guru |
| చరణం charaNam 1 | ||
** Original book did NOT have the rest of the lyrics for this “prAchIna” javaLI.
#102 సరసిజ నయనరో sarasija nayanarO
| Title | సరసిజ నయనరో (ప్రతి) | sarasija nayanarO (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | సరసిజనయనరో సామిని దేవే అరమరలేలనె అతివరోపోవే | sarasijanayanarO sAmini dEvE aramaralElane ativarOpOvE |
| చరణం charaNam 1 | ఆసతో మునుజేసిన బాసలేమాయెనొ యా సఖి గూడినప్పుడె మరచెనో | AsatO munujEsina bAsalEmAyeno yA sakhi gUDinappuDe marachenO |
| చరణం charaNam 2 | కంతుని బారికి నెంతని సైసుదు నింతిరో వాని కేమని తెల్పుదు | kamtuni bAriki nemtani saisudu nimtirO vAni kEmani telpudu |
| చరణం charaNam 3 | రమణిరో పీఠి రాఘవాచార్యుని కమలనేత్రుని కాముని కేళికిని | ramaNirO pIThi rAghavAchAryuni kamalanEtruni kAmuni kELikini |
#101 కోరేది నీకు kOrEdi nIku
| Title | కోరేది నీకు | kOrEdi nIku |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | కోరేది నీకు మరియాదె నా కోమలాంగి ఆరడిబెట్టి నా చెలికాని మీరటు జేసినమ్మిన నామది | kOrEdi nIku mariyAde nA kOmalAmgi AraDibeTTi nA chelikAni mIraTu jEsinammina nAmadi |
| చరణం charaNam 1 | యిచ్చపు చెలియింటను జేరి తత్సన జేసే తామరసాక్షి | yichchapu cheliyimTanu jEri tatsana jEsE tAmarasAkshi |
| వేమరు సురపురి వేణుగోపాలుని కామునికేళిలో గలయరాదే | vEmaru surapuri vENugOpAluni kAmunikELilO galayarAdE | |
#100 సారసాక్షి నీపై sArasAkshi nIpai
| Title | సారసాక్షి నీపై (ప్రతి) | sArasAkshi nIpai (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | సారసాక్షి నీపై మది చాల మరులు కొన్నదిరా మారుకేళి గూడ రాక మర్మకుల సింధుధీర | sArasAkshi nIpai madi chAla marulu konnadirA mArukELi gUDa rAka marmakula simdhudhIra |
| చరణం charaNam 1 | కన్నెనీదు వన్నెబన్నె అన్ని చూచి వలచి మది యున్నదాని నెనరుబూనకున్న నోర్వజాలదుర | kannenIdu vannebanne anni chUchi valachi madi yunnadAni nenarubUnakunna nOrvajAladura |
| చరణం charaNam 2 | మగువ బొమలు మరుని యిల్లు మధురవాణి పాలిండ్లు సొగసుమీరిన పూలచళ్ళు తగుజాణర నీకు జెల్లు | maguva bomalu maruni yillu madhuravANi pAlimDlu sogasumIrina pUlachaLLu tagujANara nIku jellu |
| చరణం charaNam 3 | వసుధ వెలయు శ్రీపీఠి వంశోదధి సుధాకర రసికుడౌ దాని చేకోర రాఘవాచార్య సుధీర | vasudha velayu SrIpIThi vamSOdadhi sudhAkara rasikuDau dAni chEkOra rAghavAchArya sudhIra |
#99 నాపై ప్రేమలేని nApai prEmalEni
| Title | నాపై ప్రేమలేని | nApai prEmalEni |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | నాపై ప్రేమలేని జాడ నాడే తెలిసెను పోపోపోరా | nApai prEmalEni jADa nADE telisenu pOpOpOrA |
| పాపి సవతి మాయలలో జిక్కి గోపాలుని కొనగోరంతైనా | pApi savati mAyalalO jikki gOpAluni konagOramtainA | |
| చరణం charaNam 1 | ఎందాక జూచిన నీ మగజాతి యింతుల నేలేదాక ప్రీతి సందేహమా మాటప్రఖ్యాతి సరసుల లక్షణమా యీ నీతి | emdAka jUchina nI magajAti yimtula nElEdAka prIti samdEhamA mATaprakhyAti sarasula lakshaNamA yI nIti |
| చరణం charaNam 2 | మోహమందు మోసమందు యేవేళ బుధ్ధులు నీ యందు యేలకలిగెనొ యికనేమందు స్నేహము జేసినదే బలుపొందు | mOhamamdu mOsamamdu yEvELa budhdhulu nI yamdu yElakaligeno yikanEmamdu snEhamu jEsinadE balupomdu |
| చరణం charaNam 3 | యెప్పటివలెనే యెదపైజేరి తప్పులనెంచకు తాలిమి మీరి గొప్పగు సురపురి రాజగోపాలా కాముని కేళికి మనసాయెలేరా | yeppaTivalenE yedapaijEri tappulanemchaku tAlimi mIri goppagu surapuri rAjagOpAlA kAmuni kELiki manasAyelErA |
#97 కోపము శాయాకురా kOpamu SAyAkurA
| Title | కోపము శాయాకురా | kOpamu SAyAkurA |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | రం. సురటి | raM. suraTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కోపము శాయాకురా యేరా నా సామీ | kOpamu SAyAkurA yErA nA sAmI |
| రాపేల జేసెవు రేపు మాపటి కట్లానే రారా | rApEla jEsevu rEpu mApaTi kaTlAnE rArA | |
| చరణం charaNam 1 | ప్రేమతోడా నొకనిమిషమైనా నిల్తామునంటె యేమిసేతు సామి లక్ష్మీనోమాయె నా మాట విని | prEmatODA nokanimishamainA niltAmunamTe yEmisEtu sAmi lakshmInOmAye nA mATa vini |
| చరణం charaNam 2 | నిన్న రేయి మనామనుకున్న మాటాలన్న మది నున్నవి మాయన్న తోడ నన్ను తప్పులెన్నకిక | ninna rEyi manAmanukunna mATAlanna madi nunnavi mAyanna tODa nannu tappulennakika |
| చరణం charaNam 3 | హరిహరి జక్కమె నొరుల నేరుగాను సరసీజా జయనా సలనుడౌ నరశింగరాయా వొరునీ కరుణించిన సామి | harihari jakkame norula nErugAnu sarasIjA jayanA salanuDou naraSimgarAyA vorunI karuNimchina sAmi |
| చరణం charaNam 4 | భాసురామా చెర్లపురివాసా చెన్నకేశవాయ శేషాద్రి వంశశ్రీ రంగదాసు నీ హృదయేశ నాపై | bhAsurAmA cherlapurivAsA chennakESavAya SEshAdri vamSaSrI ramgadAsu nI hRdayESa nApai |