| Title | సామిని రమ్మనవే | sAmini rammanavE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామిని రమ్మనవే సఖి కామిని వినవె శ్రీకాళహస్తీపుర ధామునిపై మరులు దాచగలేనే | sAmini rammanavE sakhi kAmini vinave SrIkALahastIpura dhAmunipai marulu dAchagalEnE |
| చరణం charaNam 1 | అన్నము నోటికింపుగ లేదె నానుబాలజుంటి తేనియు చేదే | annamu nOTikimpuga lEde nAnubAlajumTi tEniyu chEdE |
| చరణం charaNam 2 | మారుడు తాను బల్ మమతతోను సారెకు విల్వంచి సాహస మొనర్చెనే | mAruDu tAnu bal mamatatOnu sAreku vilvamchi sAhasa monarchenE |
| చరణం charaNam 3 | నేటికి సామిని సూటిగ దెచ్చితె బోటిరొ నీకు నె కోటిదలిత్తునే | nETiki sAmini sUTiga dechchite bOTiro nIku ne kOTidalittunE |
Category: Javali
#104 రాఘవాచార్య నిను rAghavAchArya ninu
| Title | రాఘవాచార్య నిను (ప్రతి) | rAghavAchArya ninu (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | రాఘవాచార్య నిను నమ్మినాను యీ చలికులను యింపుతోను | rAghavAchArya ninu namminAnu yI chalikulanu yimputOnu |
| చరణం charaNam 1 | చిన్ననాడె నీదు చిన్నెలన్ని చూచి యెన్నగాను వలసున్నదాన | chinnanADe nIdu chinnelanni chUchi yennagAnu valasunnadAna |
| చరణం charaNam 2 | సన్నుతాంగ మది సమయమిది యనుచు నన్ను బ్రోవకను కన్నడేల | sannutAmga madi samayamidi yanuchu nannu brOvakanu kannaDEla |
| చరణం charaNam 3 | మాలిమితో నను మారుని బాధకు చాల గాసి జేయకు జాలికుల | mAlimitO nanu mAruni bAdhaku chAla gAsi jEyaku jAlikula |
| చరణం charaNam 4 | సరవితో శ్రీపీఠీ సద్వంశజుడవని కరుణగోరినాడ కఠినమేర | saravitO SrIpIThI sadwamSajuDavani karuNagOrinADa kaThinamEra |
103 మాణిక్య నిను mANikya ninu
| Title | మాణిక్య నిను | mANikya ninu |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మాణిక్య నిను నమ్మినాను గురు | mANikya ninu namminAnu guru |
| చరణం charaNam 1 | ||
** Original book did NOT have the rest of the lyrics for this “prAchIna” javaLI.
#102 సరసిజ నయనరో sarasija nayanarO
| Title | సరసిజ నయనరో (ప్రతి) | sarasija nayanarO (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | సరసిజనయనరో సామిని దేవే అరమరలేలనె అతివరోపోవే | sarasijanayanarO sAmini dEvE aramaralElane ativarOpOvE |
| చరణం charaNam 1 | ఆసతో మునుజేసిన బాసలేమాయెనొ యా సఖి గూడినప్పుడె మరచెనో | AsatO munujEsina bAsalEmAyeno yA sakhi gUDinappuDe marachenO |
| చరణం charaNam 2 | కంతుని బారికి నెంతని సైసుదు నింతిరో వాని కేమని తెల్పుదు | kamtuni bAriki nemtani saisudu nimtirO vAni kEmani telpudu |
| చరణం charaNam 3 | రమణిరో పీఠి రాఘవాచార్యుని కమలనేత్రుని కాముని కేళికిని | ramaNirO pIThi rAghavAchAryuni kamalanEtruni kAmuni kELikini |
#101 కోరేది నీకు kOrEdi nIku
| Title | కోరేది నీకు | kOrEdi nIku |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | కోరేది నీకు మరియాదె నా కోమలాంగి ఆరడిబెట్టి నా చెలికాని మీరటు జేసినమ్మిన నామది | kOrEdi nIku mariyAde nA kOmalAmgi AraDibeTTi nA chelikAni mIraTu jEsinammina nAmadi |
| చరణం charaNam 1 | యిచ్చపు చెలియింటను జేరి తత్సన జేసే తామరసాక్షి | yichchapu cheliyimTanu jEri tatsana jEsE tAmarasAkshi |
| వేమరు సురపురి వేణుగోపాలుని కామునికేళిలో గలయరాదే | vEmaru surapuri vENugOpAluni kAmunikELilO galayarAdE | |
#100 సారసాక్షి నీపై sArasAkshi nIpai
| Title | సారసాక్షి నీపై (ప్రతి) | sArasAkshi nIpai (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | సారసాక్షి నీపై మది చాల మరులు కొన్నదిరా మారుకేళి గూడ రాక మర్మకుల సింధుధీర | sArasAkshi nIpai madi chAla marulu konnadirA mArukELi gUDa rAka marmakula simdhudhIra |
| చరణం charaNam 1 | కన్నెనీదు వన్నెబన్నె అన్ని చూచి వలచి మది యున్నదాని నెనరుబూనకున్న నోర్వజాలదుర | kannenIdu vannebanne anni chUchi valachi madi yunnadAni nenarubUnakunna nOrvajAladura |
| చరణం charaNam 2 | మగువ బొమలు మరుని యిల్లు మధురవాణి పాలిండ్లు సొగసుమీరిన పూలచళ్ళు తగుజాణర నీకు జెల్లు | maguva bomalu maruni yillu madhuravANi pAlimDlu sogasumIrina pUlachaLLu tagujANara nIku jellu |
| చరణం charaNam 3 | వసుధ వెలయు శ్రీపీఠి వంశోదధి సుధాకర రసికుడౌ దాని చేకోర రాఘవాచార్య సుధీర | vasudha velayu SrIpIThi vamSOdadhi sudhAkara rasikuDau dAni chEkOra rAghavAchArya sudhIra |
#99 నాపై ప్రేమలేని nApai prEmalEni
| Title | నాపై ప్రేమలేని | nApai prEmalEni |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | నాపై ప్రేమలేని జాడ నాడే తెలిసెను పోపోపోరా | nApai prEmalEni jADa nADE telisenu pOpOpOrA |
| పాపి సవతి మాయలలో జిక్కి గోపాలుని కొనగోరంతైనా | pApi savati mAyalalO jikki gOpAluni konagOramtainA | |
| చరణం charaNam 1 | ఎందాక జూచిన నీ మగజాతి యింతుల నేలేదాక ప్రీతి సందేహమా మాటప్రఖ్యాతి సరసుల లక్షణమా యీ నీతి | emdAka jUchina nI magajAti yimtula nElEdAka prIti samdEhamA mATaprakhyAti sarasula lakshaNamA yI nIti |
| చరణం charaNam 2 | మోహమందు మోసమందు యేవేళ బుధ్ధులు నీ యందు యేలకలిగెనొ యికనేమందు స్నేహము జేసినదే బలుపొందు | mOhamamdu mOsamamdu yEvELa budhdhulu nI yamdu yElakaligeno yikanEmamdu snEhamu jEsinadE balupomdu |
| చరణం charaNam 3 | యెప్పటివలెనే యెదపైజేరి తప్పులనెంచకు తాలిమి మీరి గొప్పగు సురపురి రాజగోపాలా కాముని కేళికి మనసాయెలేరా | yeppaTivalenE yedapaijEri tappulanemchaku tAlimi mIri goppagu surapuri rAjagOpAlA kAmuni kELiki manasAyelErA |
#97 కోపము శాయాకురా kOpamu SAyAkurA
| Title | కోపము శాయాకురా | kOpamu SAyAkurA |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | రం. సురటి | raM. suraTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కోపము శాయాకురా యేరా నా సామీ | kOpamu SAyAkurA yErA nA sAmI |
| రాపేల జేసెవు రేపు మాపటి కట్లానే రారా | rApEla jEsevu rEpu mApaTi kaTlAnE rArA | |
| చరణం charaNam 1 | ప్రేమతోడా నొకనిమిషమైనా నిల్తామునంటె యేమిసేతు సామి లక్ష్మీనోమాయె నా మాట విని | prEmatODA nokanimishamainA niltAmunamTe yEmisEtu sAmi lakshmInOmAye nA mATa vini |
| చరణం charaNam 2 | నిన్న రేయి మనామనుకున్న మాటాలన్న మది నున్నవి మాయన్న తోడ నన్ను తప్పులెన్నకిక | ninna rEyi manAmanukunna mATAlanna madi nunnavi mAyanna tODa nannu tappulennakika |
| చరణం charaNam 3 | హరిహరి జక్కమె నొరుల నేరుగాను సరసీజా జయనా సలనుడౌ నరశింగరాయా వొరునీ కరుణించిన సామి | harihari jakkame norula nErugAnu sarasIjA jayanA salanuDou naraSimgarAyA vorunI karuNimchina sAmi |
| చరణం charaNam 4 | భాసురామా చెర్లపురివాసా చెన్నకేశవాయ శేషాద్రి వంశశ్రీ రంగదాసు నీ హృదయేశ నాపై | bhAsurAmA cherlapurivAsA chennakESavAya SEshAdri vamSaSrI ramgadAsu nI hRdayESa nApai |
#96 సొగసుకాడని sogasukADani
| Title | సొగసుకాడని | sogasukADani |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | రం. కమాసు | raM. kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సొగసుకాడని వగలుమాని రారా | sogasukADani vagalumAni rArA |
| తగదురా ఇటుసేయా పగతిజాణా రాయా | tagadurA iTusEyA pagatijANA rAyA | |
| చరణం charaNam 1 | తుమ్మెద లొక్కాసారి ఝుమ్మఝుమ్మని మ్రోయా సమ్మదుడై మరుడమూలునేయతాళా | tummeda lokkAsAri jhummajhummani mrOyA sammaduDai maruDamUlunEyatALA |
| చరణం charaNam 2 | చక్కగ కౌగాలించి చెక్కిలీ ముద్దూలీడీ చక్కెరా కెమ్మోవి నొక్కనివారా నేడు | chakkaga kaugAlimchi chekkilI muddUlIDI chakkerA kemmOvi nokkanivArA nEDu |
| చరణం charaNam 3 | సామీ మనా చెలిమీవేమరచితి వేమొ మోము మోమునా జేర్చి మోహము దీర్చరా | sAmI manA chelimIvEmarachiti vEmo mOmu mOmunA jErchi mOhamu dIrcharA |
| చరణం charaNam 4 | ధరను కంచనావల్లి నరసింగరాయుని కరుణతో బ్రోచిన వరచెన్న కేశవా | dharanu kamchanAvalli narasimgarAyuni karuNatO brOchina varachenna kESavA |
| చరణం charaNam 5 | ప్పొంగుచూ శేషాద్రి శ్రీరంగదాసుని వినా అంగజ జనకా నీ సంగతి తెలసెరా | ppomguchU SEshAdri SrIramgadAsuni vinA amgaja janakA nI samgati telaserA |
#95 మారుని బారికి mAruni bAriki
| Title | మారుని బారికి | mAruni bAriki |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | రం. హనుమతోడి | raM. hanumatODi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మారుని బారికి నేనీ కోరువజాలనే కోరువ జాలనే వోరువజాలనే | mAruni bAriki nEnI kOruvajAlanE kOruva jAlanE vOruvajAlanE |
| చరణం charaNam 1 | నగుచు నగుచు తన యిరుగు కఠారిని ధగధగమెరీ సింబాబుగులు దగిలే చెలి | naguchu naguchu tana yirugu kaThArini dhagadhagamerI simbAbugulu dagilE cheli |
| చరణం charaNam 2 | తుంట విలుకాడు తనూ జంట శరముల వెనువెంటనె కుచములానంటగ నేసెగదా | tumTa vilukADu tanU jamTa Saramula venuvemTane kuchamulAnamTaga nEsegadA |
| చరణం charaNam 3 | రంగెమీర శేషాద్రి శ్రీరంగదాసు నేలు సామీ అంగజు కేళికీ కలయంగ రాడాయె సఖినిక | ramgemIra SEshAdri SrIramgadAsu nElu sAmI amgaju kELikI kalayamga rADAye sakhinika |