| Title | యేలా మనకు వాని జోలి | yElA manaku vAni jOli | ||
| Written By | ||||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni | ||
| తాళం tALa | ఆది | Adi | ||
| పల్లవి pallavi | యేలా మనకు వాని జోలి చెలియలా | yElA manaku vAni jOli cheliyalA | ||
| చరణం charaNam 1 | మాటీమాటికి యీ రాపైతే యేటి మాట పోపోవే నాటి బాస యెమాయ చెలి | mATImATiki yI rApaitE yETi mATa pOpOvE nATi bAsa yemAya cheli | ||
| చరణం charaNam 2 | మారుబారి మీరి దనుచేర బిలచెటందుకు పై నేరమెంచుట గాదె వో చెలి | mArubAri mIri danuchEra bilacheTanduku pai nEramemchuTa gAde vO cheli | ||
| చరణం charaNam 3 | యేమొగాని శ్రీగోపాలుడె మరసినాడె మరచెనమ్మ ప్రేమ యెంచుట మేరగాదె చెలి | yEmogAni SrIgOpAluDe marasinADe marachenamma prEma yemchuTa mEragAde cheli | ||
Category: Javali
#26 పోయిరమ్మ పొలతిరొ pOyiramma polatiro
| Title | పోయిరమ్మ పొలతిరొ | pOyiramma polatiro | ||
| Written By | ||||
| రాగం rAga | జంఝూటి | jamjhUTi | ||
| తాళం tALa | మధ్యాది | madhyAdi | ||
| పల్లవి pallavi | పోయిరమ్మ పొలతిరొ సామిని పొగడె చెలి యింటికి | pOyiramma polatiro sAmini pogaDe cheli yimTiki | ||
| చరణం charaNam 1 | వొంటిగానున్న దాని నింటిలో జూచి నా వంటి చెలి దెల్పె నె కంటివని నాతో | vomTigAnunna dAni nimTilO jUchi nA vamTi cheli delpe ne kamTivani nAtO | ||
| చరణం charaNam 2 | వెలదిరొమును వనజాసనుడేమి వ్రాసనోయే పెనుగొనుటేలను | veladiromunu vanajAsanuDEmi vrAsanOyE penugonuTElanu | ||
| చరణం charaNam 3 | వెలదిరొ చక్కని సురపురి సూనుతో మదనుని కేళిలో మనసీయనంటె | veladiro chakkani surapuri sUnutO madanuni kELilO manasIyanamTe | ||
#25 మనసేమో సైచదే manasEmO saichadE
| Title | మనసేమో సైచదే | manasEmO saichadE |
| Written By | ||
| రాగం rAga | జంఝూటి | jamjhUTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మనసేమో సైచదే మానినీమణి నా వారిజముఖి సరి వారిలో నన్నిటుదూరి దాని యిలు చేరగనా | manasEmO saichadE mAninImaNi nA vArijamukhi sari vArilO nanniTudUri dAni yilu chEraganA |
| చరణం charaNam 1 | మరు శరములు అతి దురుసుగ నిరతము గురు కుచముల పై గురియగ నా | maru Saramulu ati durusuga niratamu guru kuchamula pai guriyaga nA |
| చరణం charaNam 2 | గోపాలుడు నను రాపుచేసి పరి తాపములకు నెనెటు లోపుదునె నా | gOpAluDu nanu rApuchEsi pari tApamulaku neneTu lOpudune nA |
#24 అంతలోనె తెల్లవారె amtalOne tellavAre
| Title | అంతలోనె తెల్లవారె | amtalOne tellavAre | ||
| Written By | ||||
| రాగం rAga | బ్యాగ్ | byAg | ||
| తాళం tALa | రూపకము | rUpakamu | ||
| పల్లవి pallavi | అంతలోనె తెల్లవారె అయ్యో యేమిసేతునే కాంతుని మనసెంత నొచ్చెనొ ఇంతి యెటుసైతునే | ||అంత|| | amtalOne tellavAre ayyO yEmisEtunE kAmtuni manasemta nochcheno imti yeTusaitunE | ||amta|| |
| చరణం charaNam 1 | కొదమ గుబ్బలెదను గదియ నదుముకొదుచు చాలా పెదవి తేనె లాననా మదిని దోచువేళ | ||అంత|| | kodama gubbaledanu gadiya nadumukoduchu chAlA pedavi tEne lAnanA madini dOchuvELa | ||amta|| |
| చరణం charaNam 2 | పంతమున తటాల లేచి పైటకొంగు జారగా కాంత దొంతర విడె మొసంగి కౌగలింపుచుండగా | ||అంత|| | pamtamuna taTAla lEchi paiTakomgu jAragA kAmta domtara viDe mosamgi kougalimpuchumDagA | ||amta|| |
| చరణం charaNam 3 | సోమభూపాల రమ్మని భామ ప్రేమమీరగా కామకేళిలోన మిగుల కలసిమెలసి యుండగా | ||అంత|| | sOmabhUpAla rammani bhAma prEmamIragA kAmakELilOna migula kalasimelasi yumDagA | ||amta|| |
#23 వలచితె యింత valachite yimta
| Title | వలచితె యింత | valachite yimta | ||
| Written By | ||||
| రాగం rAga | ఫరజు | faraju | ||
| తాళం tALa | ఏక | Eka | ||
| పల్లవి pallavi | వలచితె యింత చలమ్యాల రార సామి | ||వల|| | valachite yinta chalamyAla rAra sAmi | ||vala|| |
| చెలువుడనుచు మతి దలచి దలచినను | ||వల|| | cheluvuDanuchu mati dalachi dalachinanu | ||vala|| | |
| చరణం charaNam 1 | మక్కువతో నా మనసెటు నిల్పక మిక్కిలి వేడితి తామస మ్యాలర యెక్కువ మమతతొ పిలిచిన బలుకవె | ||వల|| | makkuvatO nA manaseTu nilpaka mikkili vEDiti tAmasa myAlara yekkuva mamatato pilichina balukave | ||vala|| |
| చరణం charaNam 2 | వెన్నెల రెయిని వేడిని తాళను నిన్నటి మాటలు శాయకురా సామి నిన్నెడబాసి నె నిమిషము తాళను | ||వల|| | vennela reyini vEDini tALanu ninnaTi mATalu SAyakurA sAmi ninneDabAsi ne nimishamu tALanu | ||vala|| |
| చరణం charaNam 3 | వరభీమేశుడు నేరము లెంచకు సారసమిత్రుడ సమ్మత మా సామి యేర సుందరా నిన్ను నేమముతో | ||వల|| | varabhImESuDu nEramu lemchaku sArasamitruDa sammata mA sAmi yEra sumdarA ninnu nEmamutO | ||vala|| |
#22 పోపోవే చెలియా pOpOvE cheliyA
| Title | పోపోవే చెలియా | pOpOvE cheliyA |
| Written By | ||
| రాగం rAga | జంఝూటి | jamjhUTi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | పోపోవే చెలియా రాప్యాలే పోపోవే చెలియా | pOpOvE cheliyA rApyAlE pOpOvE cheliyA |
| చరణం charaNam 1 | అక్కఱ వేళలో దక్కిన విటుల కెక్కడి మమత | akka~ra vELalO dakkina viTula kekkaDi mamata |
| చరణం charaNam 2 | జారుల సమరతి తీరిన వెనుక దూరేదీ మరియాద | jArula samarati tIrina venuka dUrEdI mariyAda |
| చరణం charaNam 3 | వాసిగ నను శ్రీనివాసుడు గూడి మోసము చేసెనే | vAsiga nanu SrInivAsuDu gUDi mOsamu chEsenE |
#21 మానినీ వాని జోలి mAninI vAni jOli
| Title | మానినీ వాని జోలి | mAninI vAni jOli |
| Written By | ||
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | మానినీ వాని జోలి దానను గాదే వో కానిదాని మాటవిని కాంత మరచి యుంటినే | mAninI vAni jOli dAnanu gAdE vO kAnidAni mATavini kAmta marachi yumTinE |
| చరణం charaNam 1 | కలికిరొ నను బాయవని పలికిన దేమాయనె అల చెలితో కలసిరాక అయిదారు నెలలాయెనె | kalikiro nanu bAyavani palikina dEmAyane ala chelitO kalasirAka ayidAru nelalAyene |
| చరణం charaNam 2 | సన్నుతాంగి చాలవేచి యిన్ని దినములుంటినే నన్ను గూడి వెంకటేశుడన్న మాట వింటినే | sannutAmgi chAlavEchi yinni dinamulumTinE nannu gUDi venkaTESuDanna mATa vimTinE |
#20 నిన్నెడబాసిన ninneDabAsina
| Title | నిన్నెడబాసిన | ninneDabAsina |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | ధృవ | dhRva |
| పల్లవి pallavi | నిన్నెడబాసిన మొదలు కనులకు నిదుర రాదె చెలి | ninneDabAsina modalu kanulaku nidura rAde cheli |
| చరణం charaNam 1 | రేయి పగలు రెప్పపాటు లేక పలుమారు నీ పేరు బిలుచుచును కనులనీరు కడవలై పారెనయ్యో అన్నము కూడ సహించలేదె | rEyi pagalu reppapATu lEka palumAru nI pEru biluchuchunu kanulanIru kaDavalai pArenayyO annamu kUDa sahinchalEde |
| చరణం charaNam 2 | సుదతిరొ యిప్పుడు యీ సుందరాంగుడె నను నిక్కముగాను వీక్షించుచును గాఢాలింగనముతో నను గూడుచును అయ్యో సంతోష సముద్రమున నీదుచును | sudatiro yippuDu yI sundarAmguDe nanu nikkamugAnu vIkshinchuchunu gADhAlinganamutO nanu gUDuchunu ayyO santOsha samudramuna nIduchunu |
#19 మానభిమానము mAnabhimAnamu
| Title | మానభిమానము | mAnabhimAnamu |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మానభిమానము లాతనిదే చెలి | mAnabhimAnamu lAtanidE cheli |
| చరణం charaNam 1 | మునుపటి నెనరైన తన మది నెంచక ననబోణి రాడాయనే ఆయనె చెలి | munupaTi nenaraina tana madi nenchaka nanabONi rADAyanE Ayane cheli |
| చరణం charaNam 2 | తరుణీ బోధన విని తానిందు రాడాయ తరుణయు లేదాయనే ఆయనెచెలి | taruNI bOdhana vini tAnindu rADAya taruNayu lEdAyanE Ayanecheli |
| చరణం charaNam 3 | వనితరొ గోపాలుడు నన్నేలుట తనదె భారమననె అననె చెలి | vanitaro gOpAluDu nannEluTa tanade bhAramanane anane cheli |
#18 సామిగ నాతొ sAmiga nAto
| Title | సామిగ నాతొ | sAmiga nAto |
| Written By | ||
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామిగ నాతొ మాట్లాడవెందుకురా అరమరయిక న్యాలరా | sAmiga nAto mATlADavemdukurA aramarayika nyAlarA |
| చరణం charaNam 1 | చిరుతప్రాయము నాడు జేసిన చెలిమిని మరచుట తగునటరా | chirutaprAyamu nADu jEsina chelimini marachuTa tagunaTarA |
| చరణం charaNam 2 | సొగసుగ నిన్ను జూచి సోలి వచ్చిన దాని అగడేల చేసేవురా | sogasuga ninnu jUchi sOli vachchina dAni agaDEla chEsEvurA |
| చరణం charaNam 3 | వరభీమేశుని వలచిన దానరా సరసతొ నన్ను గూడి యేలరా | varabhImESuni valachina dAnarA sarasato nannu gUDi yElarA |