1292 వదరక పోపోవే vadaraka pOpOvE

Titleవదరక పోపోవేvadaraka pOpOvE
Written By
Book
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviవదరక పోపోవే వాదేల వచ్చీని వద్ద రావద్దనవేvadaraka pOpOvE vAdEla vacchIni vadda rAvaddanavE
అనుపల్లవి anupallaviఅది యొక్క యుగము వేరే జన్మ మిపుడు
అతడెవ్వరో నేనెవ్వరో ఓ చెలియా
adi yokka yugamu vErE janma mipuDu
ataDevvarO nEnevvarO O cheliyA
చరణం
charaNam 1
నిచ్చ నిచ్చలుడే వచ్చొని రేపైన వచ్చీననుచు మదిలో
నిచ్చగాబలు వేడి నిట్టూర్పుల చేత యింతిరో పెదవు తిండి
హెచ్చైన వెన్నెల చిచ్చుల రాత్రులు
యెన్నెన్నో గడిపితినిక నేట మాటలే
niccha nicchaluDE vacchoni rEpaina vacchInanuchu madilO
nicchagAbalu vEDi niTTUrpula chEta yintirO pedavu tinDi
hecchaina vennela chicchula rAtrulu
yennennO gaDipitinika nETa mATalE
చరణం
charaNam 2
వలపుకాడితే కదా వచ్చు ననుచు తెరువులు చూచి వేసారితి
వెల తెరిచి యలసితి నిలువరాని ప్రేమ నెమ్మిది నడచుకొంటి
కలకంఠ పిక నాదములు మించు మధు మాసములు
గడపితే వట్టి ముచ్చటలికనేతే
valapukADitE kadA vacchu nanuchu teruvulu chUchi vEsAriti
vela terichi yalasiti niluvarAni prEma nemmidi naDachukonTi
kalakanTha pika nAdamulu minchu madhu mAsamulu
gaDapitE vaTTi mucchaTalikanEtE
చరణం
charaNam 3
భామరో శకునము లడిగితి మువ్వ గోపాలుడు వచ్చుననుచు
కామించి నాథుని గలయు చెలిల చూచి కరగి చింత నొందితి
రామరామ యీ మేనితో వాని మేమి చూడవలెనా
మొదటి పొందే శాలు వదరక పోపోదే
valapukADitE kadA vacchu nanuchu teruvulu chUcho vEsAriti
vela terichi yalasiti niluvarAni prEma nemmidi naDachukonTi
kalakanTha pika nAdamulu minchu madhu mAsamulu
gaDapitE vaTTi mucchaTalikanEtE

1291 మేరగాదు రమ్మనవే mEragAdu rammanavE

Titleమేరగాదు రమ్మనవేmEragAdu rammanavE
Written By
Book
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviమేరగాదు రమ్మనవే నా సామినిmEragAdu rammanavE nA sAmini
అనుపల్లవి anupallaviమోర తోపు సేయక మువ్వ గోపాల సామినిmOra tOpu sEyaka muvva gOpAla sAmini
చరణం
charaNam 1
అలిగే వారలు లేరో అంతలోనే సమ్మతించి
కలిసే వారు లేరో కలికిరో యిపుడు
చలపట్టి యిందు రాడు చాల మ్రొక్కిన వినడు
వల రాజు బారి కోర్వ వశము గాదో యమ్మ
aligE vAralu lErO antalOnE sammatinchi
kalisE vAru lErO kalikirO yipuDu
chalapaTTi yindu rADu chAla mrokkina vinaDu
vala rAju bAri kOrva vaSamu gAdO yamma
చరణం
charaNam 2
నెనరున నేనొక్కటంటే నెలత యందే నెపము చేసి
అనరాని మాటలాడి అలయించెనే
వనిత మోహాంబుధిలో మునిగి యెట్లోర్చు దాన
తనవంటి సామికిది తగవు కాదే కొమ్మా
nenaruna nEnokkaTanTE nelata yandE nepamu chEsi
anarAni mATalADi alayinchenE
vanita mOhAmbudhilO munigi yeTlOrchu dAna
tanavanTi sAmikidi tagavu kAdE kommA
చరణం
charaNam 3
మమతతో జిన్ననాడే మచ్చిక చేసి నన్ను
సమరతుల నేలినట్టి చనువుగ నను
గమకించి మోవి పంటగంటి జేసితినని
రమణి! మువ్వ గోపాలుడు రాక పరాకు జేసెనే
mamatatO jinnanADE macchika chEsi nannu
samaratula nElinaTTi chanuvuga nanu
gamakinchi mOvi panTaganTi jEsitinani
ramaNi! muvva gOpAluDu rAka parAku jEsenE

1289 పలుకరించిన palukarinchina

Titleపలుకరించినpalukarinchina
Written By
Book
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviపలుకరించిన గాని పలుకక పొయ్యేవు
పడతి నీ గర్వమేమే
palukarinchina gAni palukaka poyyEvu
paDati nI garvamEmE
అనుపల్లవి anupallaviతలచిన వేయారు తరుణుల చేకొన్న
కలిగి గోపాలు చనవలె నటీ నా పేరు
talachina vEyAru taruNula chEkonna
kaligi gOpAlu chanavale naTI nA pEru
చరణం
charaNam 1
తియ్యని కెమ్మైని తేనెలానగను సయ్యాటల
ప్రొద్దు జరుప నోపవా
పయ్యదను తొలగించి పాలిండ్లపై నొక్క
చెయ్యి నేనటు వెయ్య నిచ్చెదనా
tiyyani kemmaini tEnelAnaganu sayyATala
proddu jarupa nOpavA
payyadanu tolaginchi pAlinDlapai nokka
cheyyi nEnaTu veyya nicchedanA
చరణం
charaNam 2
మోము మోమున జేర్చి ముద్దు పెట్టుచు నీవు
వేమారు నన్ను నవ్వించ నోపుదువా
భామరో యొకసారి పలుకులు పలుకుచు
ప్రేమతో రామన్న పిలుప పంపెదవా
mOmu mOmuna jErchi muddu peTTuchu nIvu
vEmAru nannu navvincha nOpuduvA
bhAmarO yokasAri palukulu palukuchu
prEmatO rAmanna pilupa pampedavA
చరణం
charaNam 3
ఎక్కువగా నన్నేలుకొమ్మన్న గ్రక్కున
గళబంట కౌగలించెదవా
మక్కువ తోడుత మువ్వ గోపాల రమ్మని
యొక్కసారైన నను నుండనిచ్చెదవా
ekkuvagA nannElukommanna grakkuna
gaLabanTa kougalinchedavA
makkuva tODuta muvva gOpAla rammani
yokkasAraina nanu nunDanicchedavA

1290 రమ్మనవే rammanavE

Titleరమ్మనవేrammanavE
Written By
Book
రాగం rAgaకేదారkEdAra
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviరమ్మనవే సుముఖాన రాయబారము లేవేrammanavE sumukhAna rAyabAramu lEvE
అనుపల్లవి anupallaviకమ్మువిల్తుని గన్న చక్కని మువ్వ గోపాలునిkammuviltuni ganna chakkani muvva gOpAluni
చరణం
charaNam 1
సొగసు జేసుక వచ్చి సుదతు లందరు జూడ
వగలు చేసి పతల వాకిట నిలిచి
తెగనాడే విధమేమో దినదినము క్రొత్తలాయ
చిగురు బోణిరో వచ్చి యెంత సేపాయెనో
sogasu jEsuka vacchi sudatu landaru jUDa
vagalu chEsi patala vAkiTa nilichi
teganADE vidhamEmO dinadinamu krottalAya
chiguru bONirO vacchi yenta sEpAyenO
చరణం
charaNam 2
ఇరవంద నిన్న మా యింటి వరకు వచ్చి
తిరుగ వేంచేసెనట సరి ప్రొద్దు వేళ
విరిబోణి యెవ్వరో వేళ గాదనిరట
తరుణిరో మేమంత దొరలమా బాగాదు
iravanda ninna mA yinTi varaku vacchi
tiruga vEnchEsenaTa sari proddu vELa
viribONi yevvarO vELa gAdaniraTa
taruNirO mEmanta doralamA bAgAdu
చరణం
charaNam 3
రానురో తానెన్నడు రాలేదో పోలేదో
కాముకేళిని నన్ను గలయలేదో
ఏమే నేనందాక యెదురుగా రావలెనో
మా మువ్వ గోపాలుడు మనసు శోధించెనేమో
rAnurO tAnennaDu rAlEdO pOlEdO
kAmukELini nannu galayalEdO
EmE nEnandAka yedurugA rAvalenO
mA muvva gOpAluDu manasu SOdhinchenEmO

1288 అలగితి వెందుకు alagiti venduku

Titleఅలగితి వెందుకుalagiti venduku
Written By
Book
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviఅలగితి వెందుకు అల మువ్వ గోపాలునితో
ఆయాయపోవే
alagiti venduku ala muvva gOpAlunitO
AyAyapOvE
అనుపల్లవి anupallaviనెలతరో నీవంటి నిర్దయురాలను
యిలనెందు గాన యిది యేమి వానిపై
nelatarO nIvanTi nirdayurAlanu
yilanendu gAna yidi yEmi vAnipai
చరణం
charaNam 1
భామరో! నీ మది కేమి దెలుపుదు
కోమలాంగుడు నిన్నె కోరి యుండగను
వేమారు నీవేమొ వేడి నావనినాడు
నోము ఫలమని నొచ్చు కొన్నాడట
bhAmarO! nI madi kEmi delupudu
kOmalAnguDu ninne kOri yunDaganu
vEmAru nIvEmo vEDi nAvaninADu
nOmu phalamani nocchu konnADaTa
చరణం
charaNam 2
వలువ చక్కెర పురి నిలయుని మదిలో
వల వేసి నను వలపించ లేద
కళలూర రతి కేళి కలసిన పిమ్మట
చెలువుడ నీ పొందు చాలు పొమ్మని
valuva chakkera puri nilayuni madilO
vala vEsi nanu valapincha lEda
kaLalUra rati kELi kalasina pimmaTa
cheluvuDa nI pondu chAlu pommani
చరణం
charaNam 3
ఎనసిన వానిపై కినుక సేయుట నీకు
మనసి యెటువలె వచ్చెనె మానవతిరో
నెనరు గల దానవని నీ విభుడు యిందు రాగానే
వనజాక్షిరో వాని వలపు లారడి జేసి
enasina vAnipai kinuka sEyuTa nIku
manasi yeTuvale vacchene mAnavatirO
nenaru gala dAnavani nI vibhuDu yindu rAgAnE
vanajAkshirO vAni valapu lAraDi jEsi

1287 ఏమనెనె సుద్దు Emanene suddu

Titleఏమనెనె సుద్దుEmanene suddu
Written By
Book
రాగం rAgaనాదనామక్రియnAdanAmakriya
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏమనెనె సుద్దు లేమనెనే! బంగారు బొమ్మEmanene suddu lEmanenE! bangAru bomma
అనుపల్లవి anupallaviఏమనెనే మరుగేల దాచకే
రామ తుపాకుల రాయడు నీతో
EmanenE marugEla dAchakE
rAma tupAkula rAyaDu nItO
చరణం
charaNam 1
మానిని! ముందుగా నా మాట నీవెత్తితివో
తానె పలుకరించెనో దయ నాపయి గలిగి
కానుక తన చేత బూనెనో యందిమ్మని
యానతీవే నా మీదాన యో చెలియ
mAnini! mundugA nA mATa nIvettitivO
tAne palukarinchenO daya nApayi galigi
kAnuka tana chEta bUnenO yamdimmani
yAnatIvE nA mIdAna yO cheliya
చరణం
charaNam 2
వనితరో! వాడీడకు వచ్చెననెనో లేక
నను తోడి తెమ్మనెనో నా ప్రాణ విభుడు
నెనరుతో మాటాడనో నేరమించెనో లేక
వినుపింపు వాని మాట విన ముచ్చటయ్యేని
vanitarO! vADIDaku vacchenanenO lEka
nanu tODi temmanenO nA prANa vibhuDu
nenarutO mATADanO nEraminchenO lEka
vinupimpu vAni mATa vina mucchaTayyEni
చరణం
charaNam 3
వేడుక దుపాకుల వేంకట కృష్ణుడు
గూడే వేళలో నే వోడితినని
నేడా సుద్దు లేమైనా నీతో మందలించెనో
మోదిగా నున్నాడో ముదితరో యేమె
vEDuka dupAkula vEnkaTa kRshNuDu
gUDE vELalO nE vODitinani
nEDA suddu lEmainA nItO mandalinchenO
mOdigA nunnADO muditarO yEme

1286 సామికి సరి sAmiki sari

Titleసామికి సరిsAmiki sari
Written By
Book
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసామికి సరి ఎవ్వరి నా చక్కనిsAmiki sari evvari nA chakkani
అనుపల్లవి anupallaviభామరో తిరువళ్ళూరి వీర రాఘవbhAmarO tiruvaLLUri vIra rAghava
చరణం
charaNam 1
నెలతరో యెప్పుడైన నేనె చెక్కిలి జీరి
కలగి యెరుల లేకయే చెలియ జీరెనంట
తెలుగు కొమ్మను గాని యలగి మారు బలుకక
చలి యించని నిండు కుండ వలె నుండునమ్మ
nelatarO yeppuDaina nEne chekkili jIri
kalagi yerula lEkayE cheliya jIrenanTa
telugu kommanu gAni yalagi mAru balukaka
chali yinchani ninDu kunDa vale nunDunamma
చరణం
charaNam 2
కదసి నేనే వాని గంటి చేసి మరపున
వదరి యీ లాగుననే పడతి యుంచెనందునె
ఆదరిన కోపగించిన అలసిన సొలసిన
మదిరాక్షి రాచిత్తము సమ్మతి బరుచు నమ్మ
kadasi nEnE vAni ganTi chEsi marapuna
vadari yI lAgunanE paDati yunchenandune
Adarina kOpaginchina alasina solasina
madirAkshi rAchittamu sammati baruchu namma
చరణం
charaNam 3
భామరో మా మువ్వ గోపాలుడే వీర రాఘవుడు
కాముకేళి హొయలుగ గలసి యుండగ
ఏ మగువ వద్దనైన యీలాగుందునో యంటి
ఈ మాటలెట్లంటినని యెంతో యుస్సురనెనమ్మ
bhAmarO mA muvva gOpAluDE vIra rAghavuDu
kAmukELi hoyaluga galasi yunDaga
E maguva vaddanaina yIlAgundunO yanTi
I mATaleTlanTinani yentO yussuranenamma

1285 ఏమి సేతురా ప్రాణేశ Emi sEturA prANESa

Titleఏమి సేతురా ప్రాణేశEmi sEturA prANESa
Written By
Book
రాగం rAgaకేదార గౌళkEdAra gouLa
తాళం tALaఅటaTa
పల్లవి pallaviఏమి సేతురా ప్రాణేశ నేనెటువలె తాళుదురాEmi sEturA prANESa nEneTuvale tALudurA
అనుపల్లవి anupallaviఏమో కాని నిన్నెడ బాసినపుడె
ఈ మేన ప్రానము లేమిటికని తోచీ
EmO kAni ninneDa bAsinapuDe
I mEna prAnamu lEmiTikani tOchI
చరణం
charaNam 1
ఒక మాటు నీ మోవానక ఒక పుస్తవు
జిహ్వకు జవిగాడు చేదయ్యీరా
మకురు మనసి నీతో మచ్చికై యున్నట్లు
వేనొక చోటను మోద మొంద నీయదెందు
oka mATu nI mOvAnaka oka pustavu
jihvaku javigADu chEdayyIrA
makuru manasi nItO macchikai yunnaTlu
vEnoka chOTanu mOda monda nIyadendu
చరణం
charaNam 2
నీ మాటలు వినవే కాని
వేరేమియు వీనుల కితవుగాదు
నీ ముద్దు మోము చూడనె కాని యితరము
కామింప నొల్లవు కన్ను లయ్యయ్యో
nI mATalu vinavE kAni
vErEmiyu vInula kitavugAdu
nI muddu mOmu chUDane kAni yitaramu
kAmimpa nollavu kannu layyayyO
చరణం
charaNam 3
ఎలమితో మువ్వ గోపాల యిపుడు నిన్ను నా యెదపై
నలము కొన మన సయ్యీరా
చెలరేగి రతుల సెంతసేపు కూడి
యలసిన తనివి తేరదెందు
elamitO muvva gOpAla yipuDu ninnu nA yedapai
nalamu kona mana sayyIrA
chelarEgi ratula sentasEpu kUDi
yalasina tanivi tEradendu

1284 ఏలా దయ ElA daya

Titleఏలా దయElA daya
Written By
Book
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviఏలా దయ నేల రానే నీకు పగదాన నటరాElA daya nEla rAnE nIku pagadAna naTarA
అనుపల్లవి anupallaviచాలా వలచినాను రాజగోపాలాchAlA valachinAnu rAjagOpAlA
చరణం
charaNam 1
చనువియ్యవు నాకింత చలమేలర నీకింత
ననువంటిది నీకు వింత గోపాలా
chanuviyyavu nAkinta chalamElara nIkinta
nanuvanTidi nIku vinta gOpAlA
చరణం
charaNam 2
తరితీవేల చేసేవు తగవా యింటికి రావు
కరుణతో నను జూడవు గోపాలా
taritIvEla chEsEvu tagavA yinTiki rAvu
karuNatO nanu jUDavu gOpAlA
చరణం
charaNam 3
శ్రీనిధి మువ్వ గోపాల చెలుల తనను చాల
లాలించి యేలితి నీ లీల గోపాలా
SrInidhi muvva gOpAla chelula tananu chAla
lAlinchi yEliti nI lIla gOpAlA

1283 వలపు నిలువ valapu niluva

Titleవలపు నిలువvalapu niluva
Written By
Book
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviవలపు నిలువ నాదు వశము గాదేమి సేతు వనితరో ఈ వేళvalapu niluva nAdu vaSamu gAdEmi sEtu vanitarO I vELa
అనుపల్లవి anupallaviపొలతిరో మా మువ్వ గోపాల రాయడు చలము చేసినాడుpolatirO mA muvva gOpAla rAyaDu chalamu chEsinADu
చరణం
charaNam 1
చలువ గంధము నిరుల సరము లేలేపొమ్ము లేలే
సాలపైన మీ సొగసు జూచే వారెవ్వరే
చెలియరో సేడది చెప్ప సక్కెము గాదు
వలపైన యీ పాపము వద్దే పగ వారికైన
chaluva gandhamu nirula saramu lElEpommu lElE
sAlapaina mI sogasu jUchE vArevvarE
cheliyarO sEDadi cheppa sakkemu gAdu
valapaina yI pApamu vaddE paga vArikaina
చరణం
charaNam 2
చిలుక తేజీ పైనెక్కి చెలరేగి యెదురెక్కి
విలు గుణ ధ్వని చేసి విరి శరము బూని
కులుకు గుబ్బల నడుమ గురి జూచు చున్నాడే
అలరు విల్తుని బారి నార్చే వారెవ్వరిక
chiluka tEjI painekki chelarEgi yedurekki
vilu guNa dhvani chEsi viri Saramu bUni
kuluku gubbala naDuma guri jUchu chunnADE
alaru viltuni bAri nArchE vArevvarika
చరణం
charaNam 3
సరసకు రాడాయె సరి ప్రొద్దు వేళాయె
విరహము మెండాయే వెన్నెల కాకాయె
మరుని కేళిలో నన్ను మువ్వ గోపాలుడు
సరసముతో పెనగి చౌక చేసినాడిక
sarasaku rADAye sari proddu vELAye
virahamu menDAyE vennela kAkAye
maruni kELilO nannu muvva gOpAluDu
sarasamutO penagi chouka chEsinADika