| Title | ఎంత జేసితివి | enta jEsitivi |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | సారంగ | sAranga |
| తాళం tALa | ఖండ గతి | khanDa gati |
| పల్లవి pallavi | ఎంత జేసితివి నిన్నే మందునో మాయి కాంతుతో నీవునుం గలసి తోయమ్మాయి | enta jEsitivi ninnE mandunO mAyi kAntutO nIvunum galasi tOyammAyi |
| చరణం charaNam 1 | కోరినానా నాకు గోతి మొగ ముంచుమని నేరకే గడ్డి తిని నీ మాట నమ్మితిని | kOrinAnA nAku gOti moga munchumani nErakE gaDDi tini nI mATa nammitini |
| చరణం charaNam 2 | మొగమాట మెక్కడిది మోసకాడా నీకు నగుబాటు తెచ్చితివ నలుగురిలో నాకు | mogamATa mekkaDidi mOsakADA nIku nagubATu techchitiva nalugurilO nAku |
Category: Javali
#549 నా వంటి సొగసు nA vanTi sogasu
| Title | నా వంటి సొగసు | nA vanTi sogasu |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | ఖమాచ్ | khamAch |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | నా వంటి సొగసు కాడేడీ వలవదా ముద్దులాడి | nA vanTi sogasu kADEDI valavadA muddulADi |
| అనుపల్లవి anupallavi | తుంటవిల్తుడీడా నాకు దొయ్యలి నాపై బడదా | tunTaviltuDIDA nAku doyyali nApai baDadA |
| చరణం charaNam 1 | అదిగో గన్ను వైచి నాపయి హంస నడకలన్వచ్చెడు ముదిత నన్ను గనుకొని తన మోము ద్రిప్పె సిగ్గు కదా | adigO gannu vaichi nApayi hamsa naDakalanvaccheDu mudita nannu ganukoni tana mOmu drippe siggu kadA |
| చరణం charaNam 2 | ఆ వైపు కల నృపుల గని యీ వరుసకు మళ్ళిన హహ యీ వంక నొకడు తప్ప నేనే తుది నుండి నిహిహి | A vaipu kala nRpula gani yI varusaku maLLina haha yI vanka nokaDu tappa nEnE tudi nunDi nihihi |
#548 ఇతడెవ్వడో itaDevvaDO
| Title | ఇతడెవ్వడో | itaDevvaDO |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | ఆనంద భైరవి | Ananda bhairavi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | ఇతడెవ్వడో కాని యింతీ నిన్న నా కలలో నేగుదెంచిన వీరుడే మారాకారుడే | itaDevvaDO kAni yintI ninna nA kalalO nEgudenchina vIruDE mArAkAruDE |
| చరణం charaNam 1 | ప్రాణ నాయకీ చేర రమ్మని నను బిలిచి వలచి సందిట గ్రుచ్చెనే ముద్దులిచ్చెనే ఏను బులకించి యేమరి యుండగ నెంతో వింత కూడ సేసెనే వీని జూడకున్న నా యుసురు వీసమైన నిక నిల్వబోదు | prANa nAyakI chEra rammani nanu bilichi valachi sandiTa gruchchenE muddulichchenE Enu bulakinchi yEmari yunDaga nentO vinta kUDa sEsenE vIni jUDakunna nA yusuru vIsamaina nika nilvabOdu |
#547 ఎవరి దానవే evari dAnavE
| Title | ఎవరి దానవే | evari dAnavE |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | శహన | Sahana |
| తాళం tALa | చతురస్ర గతి | chaturasra gati |
| పల్లవి pallavi | ఎవరి దానవే తరుణీ నీవెందుకుంటి వీకరణి | evari dAnavE taruNI nIvendukunTi vIkaraNi |
| అనుపల్లవి anupallavi | చివురు చేతులకు గరుకు వెదురు గడ చెల్లునె యోడం గడుప జమన కడ | chivuru chEtulaku garuku veduru gaDa chellune yODam gaDupa jamana kaDa |
| చరణం charaNam 1 | ఇమ్ము రాచ సుంకమ్ము నీ కెమ్మోవి మానికమ్ము కొమ్మా నీ కటాక్షమ్మున దాటం గోరెద మమ్మురంపు మోహాంబుధి | immu rAcha sunkammu nI kemmOvi mAnikammu kommA nI kaTAkshammuna dATam gOreda mammurampu mOhAmbudhi |
#546 ఏర యింత Era yinta
| Title | ఏర యింత | Era yinta |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | అఠాణా | aThANA |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఏర యింత నక్క వినయమేల జూపినావు ఱేడ | Era yinta nakka vinayamEla jUpinAvu ~rEDa |
| అనుపల్లవి anupallavi | కోరిన పొసగెదనని వాకొనలేలేదా నా తోడ | kOrina posagedanani vAkonalEdA nA tODa |
| చరణం charaNam 1 | కల్లలాడు వాడు నిక్కముగ నొక్క మగవాడా చెల్లరే సంపద వంతులకి సీ మాట పరువేడ | kallalADu vADu nikkamuga nokka magavADA chellarE sampada vantulaki sI mATa paruvEDa |
| చరణం charaNam 2 | ఏల భయము నీ నుతుపై నీగ వాల నిచ్చెనే చాల దెలసె నీ యోగ్యత చాలు పోయి వచ్చెదనే | Ela bhayamu nI nutupai nIga vAla nichchenE chAla delase nI yOgyata chAlu pOyi vachchedanE |
#545 కొమ్మా గాకిది kommA gAkidi
| Title | కొమ్మా గాకిది | kommA gAkidi |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
| తాళం tALa | త్రస్య గతి | trasya gati |
| పల్లవి pallavi | కొమ్మా గాకిది మేలి బంగారు బొమ్మా యౌరరా యీ ముద్దు గుమ్మ సొగసు వర్ణింప నా తరమ్మా హా | kommA gAkidi mEli bangAru bommA yaurarA yI muddu gumma sogasu varNimpa nA tarammA hA |
| చరణం charaNam 1 | చూపా పువ్విలు కాని క్రొవ్వాడి తూపా తమి ద్రుల్లెడు బేడిస చేపా దీని చూచి శక్యము ధైర్యమాప హా | chUpA puvvillu kAni krovvADi tUpA tami drulleDu bEDisa chEpA dIni chUchi Sakyamu dhairyamApa hA |
| చరణం charaNam 2 | కరుణా మౌని మానసంబుల కైన మురులా తమ్మి ముసురు కొన్న భ్రమరులా కారా వేల్పులైన గింకరులా హా | karuNA mouni mAnasambula kaina murulA tammi musuru konna bhramarulA kArA vElpulaina ginkarulA hA |
#544 సరసకు రావేమిరా sarasaku rAvEmirA
| Title | సరసకు రావేమిరా | sarasaku rAvEmirA |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | కాఫీ | kAfI |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సరసకు రావేమిరా శ్రీకృష్ణ సరసకు రమ్మని నిరతము నిన్ను నే పరిపరి విధముల స్మరణ జేసిన గాని | sarasaku rAvEmirA SrIkRshNa sarasaku rammani niratamu ninnu nE paripari vidhamula smaraNa jEsina gAni |
| చరణం charaNam 1 | మదన బాధలతో నే మది నిల్ప లేనురా నిదుర లేక నిను ఎదురు జూచితిరా మధురమైన నీ మృదువైన పలుకులు హృదయమందు నను బాధ జేసిన గాని | madana bAdhalatO nE madi nilpa lEnurA nidura lEka ninu eduru jUchitirA madhuramaina nI mRduvaina palukulu hRdayamandu nanu bAdha jEsina gAni |
| చరణం charaNam 2 | శృంగారమైన నీ అంగ సంగమునకు ముంగురులను దూపి నిలచి యుంటినిరా మంగళ రూప నీ మోము జూపక ఆ రంగైన మేడలో రంజిల్లు కృష్ణ | SRngAramaina nI anga sangamunaku mungurulanu dUpi nilachi yunTinirA mangaLa rUpa nI mOmu jUpaka A rangaina mEDalO ranjillu kRshNa |
#543 ఏమి సేతురా Emi sEturA
| Title | ఏమి సేతురా | Emi sEturA |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | అమీరు కల్యాణి | amIru kalyANi |
| తాళం tALa | అద్దా | addA |
| పల్లవి pallavi | ఏమి సేతురా నా మనోభవా | Emi sEturA nA manObhavA |
| చరణం charaNam 1 | ఏమో కాని నిన్ను నే మఱుతునన్న నా మనము నందు నాటి యుంటివిరా | EmO kAni ninnu nE ma~rutunanna nA manamu nandu nATi yunTivirA |
| చరణం charaNam 2 | మలయ సమీరము వడ గాలియై తోచె చలువల పన్నీరు చిలువల విసమయ్యె | malaya samIramu vaDa gAliyai tOche chaluvala pannIru chiluvala visamayye |
| చరణం charaNam 3 | మారుని శరముల బారికి బాల్పడ గూరిచి నా విధి క్రూరత సూపెరా | mAruni Saramula bAriki bAlpaDa gUrichi nA vidhi krUrata sUperA |
| చరణం charaNam 4 | మహిత భుజంగ మాన్య కవిపాలా మహిమ తెలిసెరా మాటలాడ రారా | mahita bhujanga mAnya kavipAlA mahima teliserA mATalADa rArA |
#542 సరస కత్తెయని sarasa katteyani
| Title | సరస కత్తెయని | sarasa katteyani |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | సరస కత్తెయని సకియ వలలో బడ సామి నేనేమందురా | sarasa katteyani sakiya valalO baDa sAmi nEnEmandurA |
| చరణం charaNam 1 | విరి బంతులచే ముంచి విసము లోన నుంచి మురిపించి తేనెతో మోచేయి నాకించు | viri bantulachE munchi visamu lOna nunchi muripinchi tEnetO mOchEyi nAkinchu |
| చరణం charaNam 2 | మందుల మారి యా మాయలాడి దాని పొందు పాయ వేమిరా యందఱి విన హరి యల్లరి వాడనె సుందరాంగి వలపు సూది మొన కొలుపు | mandula mAri yA mAyalADi dAni pondu pAya vEmirA yanda~ri vina hari yallari vADane sundarAngi valapu sUdi mona kolupu |
| చరణం charaNam 3 | పాటలాధరికి నేపాటి ప్రేమ కలదొ మాటికి లంచమురా కూటమిక నీకు గూడదు చూడుమా రాట బెట్టి బల్పోరాటము నొనరించు | pATalAdhariki nEpATi prEma kalado mATiki lanchamurA kUTamika nIku gUDadu chUDumA rATa beTTi balpOrATamu nonarinchu |
| చరణం charaNam 4 | మాటికి మాటికి నిన్ను మమత జూపుమన్న నేటికి దయ రాదురా మాటికి శ్రీ వెలయు మంత్రిప్రగడ రాజ కోటి భుజంగ రాయని బోటి గుణ మడుగు | mATiki mATiki ninnu mamata jUpumanna nETiki daya rAdurA mATiki SrI velayu mantripragaDa rAja kOTi bhujanga rAyani bOTi guNa maDugu |
#541 ఏమిరా మనోహరా EmirA manOharA
| Title | ఏమిరా మనోహరా | EmirA manOharA |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | హిందుస్థానీ తోడి | hindusthAnI tODi |
| తాళం tALa | అద్దా | addA |
| పల్లవి pallavi | ఏమిరా మనోహరా నాకేమి తోచదాయరా కాము బారి ద్రోచి నన్నే భామ గూడి నావురా | EmirA manOharA nAkEmi tOchadAyarA kAmu bAri drOchi nannE bhAma gUDi nAvurA |
| చరణం charaNam 1 | పండు వెన్నెలలు వేసగి యెండలయి మండెరా బొండు మల్లె పాన్పు నిప్పుల గుండముగ నుండెరా | panDu vennelalu vEsagi yenDalayi manDerA bonDu malle pAn&pu nippula gunDamuga nunDerA |
| చరణం charaNam 2 | నిన్ను గూడు వేడుక మును నన్నె యెఱుగ నైతిరా నిన్ను గాన లేక పిదప నన్న మెఱుగ నైతిరా | ninnu gUDu vEDuka munu nanne ye~ruga naitirA ninnu gAna lEka pidapa nanna me~ruga naitirA |
| చరణం charaNam 3 | సుందరి బ్రతిమాలితి నీదు పొందు నాకు గూర్పరా యందమయిన యిరవు మనకు బొందు పఱచి నానురా | sundari bratimAliti nIdu pondu nAku gUrparA yandamayina yiravu manaku bondu pa~rachi nAnurA |
| చరణం charaNam 4 | అల్లదె పూబందిటికి మెల్ల నన్ను జేర్పరా చల్లగా భుజంగ రావు సరసు బ్రోచు వల్లభా | allade pUbandiTiki mella nannu jErparA challagA bhujanga rAvu sarasu brOchu vallabhA |