| Title | ఏరా మోసపోయెద | ErA mOsapOyeda |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏరా మోసపోయెద వింత లోనే | ErA mOsapOyeda vinta lOnE |
| చరణం charaNam 1 | దారి తప్పితివో దాని యిలు కాదురా యోర వాకిటి నాకె యుంచి పరుండురా | dAri tappitivO dAni yilu kAdurA yOra vAkiTi nAke yunchi parunDurA |
| చరణం charaNam 2 | దరి జేరి నా మేను తడవి చూచెదవు మరియాద దక్కదు మఱి కోపవతి యాపె | dari jEri nA mEnu taDavi chUchedavu mariyAda dakkadu ma~ri kOpavati yApe |
| చరణం charaNam 3 | ప్రొద్దైన జూడవు పోకెల్లు పోయెదు ముద్దులు కుడిచెదు మోమాట ముంచదు | proddaina jUDavu pOkellu pOyedu muddulu kuDichedu mOmATa munchadu |
| చరణం charaNam 4 | నను జేర రాకురా నను నంట బోకురా ఘనత భుజంగ రావు కవి నుతి వినబోరా | nanu jEra rAkurA nanu nanTa bOkurA ghanata bhujanga rAVu kavi nuti vinabOrA |
Category: Javali
#539 మాయ చేసినాడే mAya chEsinADE
| Title | మాయ చేసినాడే | mAya chEsinADE |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | హిందుస్థాని కాఫీ | hindusthAni kAfI |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మాయ చేసినాడే చెలి మాయ చేసినాడే | mAya chEsinADE cheli mAya chEsinADE |
| చరణం charaNam 1 | వేయ సాగె సుమ సాయకు డమ్ముల డాయ వెతలు పిక దీయవె యని వాడు | vEya sAge suma sAyaku Dammula DAya vetalu pika dIyave yani vADu |
| చరణం charaNam 2 | మారుని పోర మై జారిన చెమటల నారుప వీవన తేర బొమ్మని వాడు | mAruni pOra mai jArina chemaTala nArupa vIvana tEra bommani vADu |
| చరణం charaNam 3 | చానరొ నిముసము జామయి తోచెనే కానుక దేబోదు గాదనకని వాడు | chAnaro nimusamu jAmayi tOchenE kAnuka dEbOdu gAdanakani vADu |
| చరణం charaNam 4 | ధరను భుజంగ రావు దాసుని బ్రోచిన సరసుని మాటలు వరములౌ బలె వాడె | dharanu bhujanga rAvu dAsuni brOchina sarasuni mATalu varamulau bale vADe |
#538 ఏమి సేతు Emi sEtu
| Title | ఏమి సేతు | Emi sEtu |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఏమి సేతు నెటుల సైతు నా మనోహరా కాము విరి శరమిటు నను గాసి చేసెరా | Emi sEtu neTula saitu nA manOharA kAmu viri SaramiTu nanu gAsi chEserA |
| చరణం charaNam 1 | నీ మనసు నన్ను జూచి నీఱు కాదేరా కోమలుల నేచ నింత కోరికేలరా | nI manasu nannu jUchi nI~ru kAdErA kOmalula nEcha ninta kOrikElarA |
| చరణం charaNam 2 | కరము యౌవనంబిదె నీకు గట్ట మిచ్చెద విరివిగా నధరా మృతమున విందు చేసెద | karamu yauvanambide nIku gaTTa michcheda virivigA nadharA mRtamuna vindu chEseda |
| చరణం charaNam 3 | ఆ రమణి వలె నిను నే నాదరించెద కరుణ జేసి కఱవు తీర గౌగలింపరా | A ramaNi vale ninu nE nAdarincheda karuNa jEsi ka~ravu tIra gaugalimparA |
| చరణం charaNam 4 | సారెకు భుజంగ రావు సన్నుతించెరా మార జనక నా మీద మనసు నిల్పరా | sAreku bhujanga rAvu sannutincherA mAra janaka nA mIda manasu nilparA |
#537 రేపనెద వేమిరా rEpaneda vEmirA
| Title | రేపనెద వేమిరా | rEpaneda vEmirA |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | రేపనెద వేమిరా సామి నా లోపమేమో తెల్పరా | rEpaneda vEmirA sAmi nA lOpamEmO telparA |
| చరణం charaNam 1 | ఈ పూటకైన నే మోపలేరా సామి రేపు మాపటికె పోపో దాని జేర | I pUTakaina nE mOpalErA sAmi rEpu mApaTike pOpO dAni jEra |
| చరణం charaNam 2 | ఒక్క నాడుండిన మొక్క మొలచెదో యక్కడ నీకున్న మక్కువ తెలిసెలే | okka nADunDina mokka molachedO yakkaDa nIkunna makkuva teliselE |
| చరణం charaNam 3 | పొందు కోరెద నీవా సుందరి గూడిన యంద మంటునని యాస జేసి యిక | pondu kOreda nIvA sundari gUDina yanda manTunani yAsa jEsi yika |
| చరణం charaNam 4 | అందము కాదు గోవింద భుజంగ రావు వందనంబుల నందుకొను మిక | andamu kAdu gOvinda bhujanga rAvu vandanambula nandukonu mika |
#536 రావటరా rAvaTarA
| Title | రావటరా | rAvaTarA |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | హిందుస్థానీ కాఫీ | hindusthAnI kAfI |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రావటరా రాతిరి యింటికి | rAvaTarA rAtiri yinTiki |
| చరణం charaNam 1 | భూ వలయమునను బూబోడులు లేరా యే వనిత కైన నీవిద్ది కలదా | bhU valayamunanu bUbODulu lErA yE vanita kaina nIviddi kaladA |
| చరణం charaNam 2 | అవసర పడి నీపయి నాస చేసితి నని చవుకగా జూడగా నవునట రాయేరా | avasara paDi nIpayi nAsa chEsiti nani chavukagA jUDagA navunaTa rAyErA |
| చరణం charaNam 3 | చలువ పన్నీటితో జలక మాడింతు నన్గలసి యీ వేళ నా కలవర ముడుపరా | chaluva pannITitO jalaka mADintu nan&galasi yI vELa nA kalavara muDuparA |
| చరణం charaNam 4 | ఘనత భుజంగ రాయ కవి పోషకుడవని వినతుల జేసెద వేగ రారా యిక | ghanata bhujanga rAya kavi pOshakuDavani vinatula jEseda vEga rArA yika |
#535 విరి శరమెటు viri SarameTu
| Title | విరి శరమెటు | viri SarameTu |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | విరి శరమెటు సైతురా | viri SarameTu saiturA |
| చరణం charaNam 1 | మరు డురుముచును శరములను బై గురి జొనిపి కడు నురమున గొలిపె చురుకుమన | maru Durumuchunu Saramulanu bai guri jonipi kaDu nuramuna golipe churukumana |
| చరణం charaNam 2 | తలపుల దనుప గలవనుచు నిను వలచితిని మది గలపకుర కవుగిలి యిడర | talapula danupa galavanuchu ninu valachitini madi galapakura kavugili yiDara |
| చరణం charaNam 3 | మొగతనమె నా బిగి చనుల కన పొగ రడపకయ సొగసుల గులుక దగునటర | mogataname nA bigi chanula kana poga raDapakaya sogasula guluka dagunaTara |
| చరణం charaNam 4 | నతి సలిపెదను బ్రతిమాలెదను సతి నేలినను మతి భుజంగ రావు నుతి సలుపు | nati salipedanu bratimAledanu sati nElinanu mati bhujanga rAvu nuti salupu |
#534 వగపేలనే vagapElanE
| Title | వగపేలనే | vagapElanE |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వగపేలనే? వలదనవే | vagapElanE? valadanavE |
| చరణం charaNam 1 | పగవాడనే పతి దూరెడు వగలాడికి మగడేలనే | pagavADanE pati dUreDu vagalADiki magaDElanE |
| చరణం charaNam 2 | తరుణి నాతో చగవు చేసె చిరు నగవు చెల్లదనవే | taruNi nAtO chagavu chEse chiru nagavu chelladanavE |
| చరణం charaNam 3 | మానిసి కొక మాట నాడు మానినితో మనకేలనే | mAnisi koka mATa nADu mAninitO manakElanE |
| చరణం charaNam 4 | రహి భుజంగ రావు నేలిన మహిమ విని మఱి రమ్మనవే | rahi bhujanga rAvu nElina mahima vini ma~ri rammanavE |
#533 ఎంత కాంతమే enta kAntamE
| Title | ఎంత కాంతమే | enta kAntamE |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | వసంత | vasanta |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఎంత కాంతమే వసంత ఋతు ||వెంత|| యింతిరో! యీ కనుల పండు వెపుడు జూడమే | enta kAntamE vasanta Rtu ||venta|| yintirO! yI kanula panDu vepuDu jUDamE |
| చరణం charaNam 1 | కలువల దొర రేయి కాసె వెన్నెల చిలుకలు కోకిలలు చేసె రొదల | kaluvala dora rEyi kAse vennela chilukalu kOkilalu chEse rodala |
| చరణం charaNam 2 | మల్లెలు చేమంతు లెల్ల కొల్ల లాయెనే చల్లని వాయువు వెదచల్ల సాగెనే | mallelu chEmantu lella kolla lAyenE challani vAyuvu vedachalla sAgenE |
| చరణం charaNam 3 | ఝుమ్మనుచు వీను లెంతో సొగియు లీలలే దుమ్మెదలు పూవులెల్ల గ్రమ్మెనౌ బలే | jhummanuchu vInu lentO sogiyu lIlalE dummedalu pUvulella grammenau balE |
| చరణం charaNam 4 | ఇంత వింత యౌట వాసంత కాలము కాంతుడౌ భుజంగ రాయ కవి నుతింపడే | inta vinta yauTa vAsanta kAlamu kAntuDau bhujanga rAya kavi nutinpaDE |
#532 బలె బలె నను bale bale nanu
| Title | బలె బలె నను | bale bale nanu |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | హిందుస్థానీ కాఫీ | hindusthAnI kAfI |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | బలె! బలె! నను జేరి బాసలు చేసి కలికిరో! నా మాట తలపడే రాడే | bale! bale! nanu jEri bAsalu chEsi kalikirO! nA mATa talapaDE rADE |
| చరణం charaNam 1 | అత్తరు వేలనే అల గంద మేలనే పొత్తు మఱచి పోయి పురుషుడు రాడాయె చిత్తజు బారి నే జేరితినే చెలి | attaru vElanE ala ganda mElanE pottu ma~rachi pOyi purushuDu rADAye chittaju bAri nE jEritinE cheli |
| చరణం charaNam 2 | సారెకు బయ్యెద జాఱ దీయుచు వాడు కూరిమి కౌగిటి గోరెడు వాడేడే మారు బారి నెటు నోరుతునే చెలి | sAreku bayyeda jA~ra dIyuchu vADu kUrimi kaugiTi gOreDu vADEDE mAru bAri neTu nOrutunE cheli |
| చరణం charaNam 3 | సన్మానముల నెంతో సలుపుచున్న నాపై మన్మనోహరునకు మనసేమి రాకపోయె మన్మధు చేతలెటు మాన్పుదునే చెలి | sanmAnamula nentO salupuchunna nApai manmanOharunaku manasEmi rAkapOye manmadhu chEtaleTu mAn&pudunE cheli |
| చరణం charaNam 4 | రంగనాధుడు కవి రాజ భుజంగ రావు మంగళ నుతుల నన్మఱచి రాకున్నాడే యంగజు ఢాకకు నాగుదునే చెలి | ranganAdhuDu kavi rAja bhujanga rAvu mangaLa nutula nanma~rachi rAkunnADE yangaju DhAkaku nAgudunE cheli |
#531 పలుకడేమే చెలి palukaDEmE cheli
| Title | పలుకడేమే చెలి | palukaDEmE cheli |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | పలుకడేమే చెలి కలికి బోధన విని | palukaDEmE cheli kaliki bOdhana vini |
| చరణం charaNam 1 | కలకాలము నీ యలుకలె యౌటను వలపు లనునవి తలపు లాయెగదె | kalakAlamu nI yalukale yauTanu valapu lanunavi talapu lAyegade |
| చరణం charaNam 2 | వెన్నెల నా బిగి చన్నుల మోపుచు నున్నను నా మోము కన్నుల జూడడె | vennela nA bigi channula mOpuchu nunnanu nA mOmu kannula jUDaDe |
| చరణం charaNam 3 | విరి బంతులు పై విసరిన గాంతుడు మరుని కేళి మాట మనమున దల్పడె | viri bantulu pai visarina gAntuDu maruni kELi mATa manamuna dalpaDe |
| చరణం charaNam 4 | రమణిరో! భుజంగ రావు నుతిపయి తమి సుమ శయ్యను దార్పగ జూడడె | ramaNirO! bhujanga rAvu nutipayi tami suma Sayyanu dArpaga jUDaDe |