| Title | ఓ విరిబోడిరో | O viribODirO |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఓ విరిబోడిరో యోర్వగ జాలనె కావవె నన్ను గూడి ఘన రతుల దేల్చి | O viribODirO yOrvaga jAlane kAvave nannu gUDi ghana ratula dElchi |
| చరణం charaNam 1 | చెమ్మగిల్లు నీకు చమ్ముల నాయెద గ్రుమ్ముచు గౌగిలి యిమ్మని వేడెద | chemmagillu nIku chammula nAyeda grummuchu gaugili yimmani vEDeda |
| చరణం charaNam 2 | కళలూరగ నిక గాము కేళిని నా కలవర ముడుపవే కాంతరో! మ్రొక్కెద | kaLalUraga nika gAmu kELini nA kalavara muDupavE kAntarO! mrokkeda |
| చరణం charaNam 3 | లలనా మణిరో వలసిన రతుల గలలో నిను గూడి సొలయు చుంటినే | lalanA maNirO valasina ratula galalO ninu gUDi solayu chunTinE |
| చరణం charaNam 4 | రాజ బహదరు విరాజి భుజంగ్రావు పూజల గైకొను భూజన ప్రియుడనే | rAja bahadaru virAji bhujangrAvu pUjala gaikonu bhUjana priyuDanE |
Category: Javali
#529 లీల మరువలేనే lIla maruvalEnE
| Title | లీల మరువలేనే | lIla maruvalEnE |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | లీల మఱువలేనే వాని లీల మఱువలేనే | lIla ma~ruvalEnE vAni lIla ma~ruvalEnE |
| చరణం charaNam 1 | ఏలాగు తాళుదు బాలామణిరో నేడు చాల రతుల చేత సౌఖ్యము గూర్చిన | ElAgu tALudu bAlAmaNirO nEDu chAla ratula chEta saukhyamu gUrchina |
| చరణం charaNam 2 | నిన్నటి రేయి నా కన్నులు మూసి తా దిన్నగా నిలుమని చన్నుల జేబట్టు | ninnaTi rEyi nA kannulu mUsi tA dinnagA nilumani channula jEbaTTu |
| చరణం charaNam 3 | దూరమున నిల్వ మారు కేళికిటు చేరు మనుచు నా జారు పైట లాగు | dUramuna nilva mAru kELikiTu chEru manuchu nA jAru paiTa lAgu |
| చరణం charaNam 4 | తనయుల వలె దన దాసుల జూచుచు దనర భుజంగ రావు దాసు నేలువాని | tanayula vale dana dAsula jUchuchu danara bhujanga rAvu dAsu nEluvAni |
#528 సరసకు రారా sarasaku rArA
| Title | సరసకు రారా | sarasaku rArA |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | హిందుస్థానీ భైరవి | hindusthAnI bhairavi |
| తాళం tALa | అద్దా | addA |
| పల్లవి pallavi | సరసకు రారా సమయమిదేరా | sarasaku rArA samayamidErA |
| చరణం charaNam 1 | పరిపరి విధముల బ్రతిమాలు కొన్నను చిరచిర లాడెదు సరసుడ వౌదురా | paripari vidhamula bratimAlu konnanu chirachira lADedu sarasuDa vaudurA |
| చరణం charaNam 2 | అరవిరి పానుపు లమరిచితినిరా కురువ ముదవనము కుదురు పఱచితిరా | araviri pAnupu lamarichitinirA kuruva mudavanamu kuduru pa~rachitirA |
| చరణం charaNam 3 | బిగువగు గుబ్బల పొగురన రవికెలు పగులగ సాగెను సెగలను సైపరా | biguvagu gubbala pogurana ravikelu pagulaga sAgenu segalanu saiparA |
| చరణం charaNam 4 | మనవి చేకొనవేమి మదన గోపాల ఘనమా భుజంగ రాయ కవిరాజ పాలా | manavi chEkonavEmi madana gOpAla ghanamA bhujanga rAya kavirAja pAlA |
#527 తాళజాలరా tALajAlarA
| Title | తాళజాలరా | tALajAlarA |
| Written By | మంత్రిప్రగడ భుజంగరావు | mantripragaDa bhujangarAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | హిందుస్థానీ కమాచి | hindusthAnI kamAchi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | తాళజాలరా యిక నే దాళజాలరా జాలమేల వెన్నెలల రాజు వలరాజు జేరెనిక | tALajAlarA yika nE dALajAlarA jAlamEla vennelala rAju valarAju jErenika |
| చరణం charaNam 1 | చనుమానముచే మనవి చేసినను మనమున నెన్నవు మంచివాడవౌ | chanumAnamuchE manavi chEsinanu manamuna nennavu manchivADavau |
| చరణం charaNam 2 | సరసుడంచు నిను సరసకు బిలిచితి గరుణ జేసి తాప భరము తీర్పరా | sarasuDanchu ninu sarasaku bilichiti garuNa jEsi tApa bharamu tIrparA |
| చరణం charaNam 3 | మదనుడు శరముల పదనురా నూరెడు నదనిదే కౌగిట గదియింప గనను | madanuDu Saramula padanurA nUreDu nadanidE kaugiTa gadiyimpa gananu |
| చరణం charaNam 4 | రాజనుత భుజంగ రాయ కవిదేవ భూజమా! నీ కీర్తి రాజిల్లు నిక భూమి | rAjanuta bhujanga rAya kavidEva bhUjamA! nI kIrti rAjillu nika bhUmi |
#526 ఆపలేని మోహమేలరా ApalEni mOhamElarA
| Title | ఆపలేని మోహమేలరా | ApalEni mOhamElarA |
| Written By | మంత్రిప్రగడ భుజంగరావు | mantripragaDa bhujangarAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | శుద్ధ తోడి | Suddha tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఆపలేని మోహమేమిరా సామిగ నాపై | ApalEni mOhamEmirA sAmiga nApai |
| చరణం charaNam 1 | రేపటికి మాపటికి గోపమేల దానితోడ నాపలేక దాని పొందు నమృతపు సారమొందు | rEpaTiki mApaTiki gOpamEla dAnitODa nApalEka dAni pondu namRtapu sAramondu |
| చరణం charaNam 2 | మనసు తీర నొక్కసారి మారుకేళి గూడుమని మనవి చేసి వేడుకొన్న మాటలాడని వానికింత | manasu tIra nokkasAri mArukELi gUDumani manavi chEsi vEDukonna mATalADani vAnikinta |
| చరణం charaNam 3 | ఎన్ని దినముల నాడు నన్ను జూచి నాడవో యిన్ని నాళ్ళు లేని ప్రేమ యిప్పుడేల కలిగెరా | enni dinamula nADu nannu jUchi nADavO yinni nALLu lEni prEma yippuDEla kaligerA |
| చరణం charaNam 4 | మదన జనక నేడు నీదు మనసు తీరిచెదరా ముదము మీఱ భుజంగ రావు సదయత బాలింప బోరా | madana janaka nEDu nIdu manasu tIrichedarA mudamu mI~ra bhujanga rAvu sadayata bAlinpa bOrA |
#525 మ్రొక్కెద సామి mrokkeda sAmi
| Title | మ్రొక్కెద సామి | mrokkeda sAmi |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | ఆనంద భైరవి | Ananda bhairavi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మ్రొక్కెద సామి నీకు మ్రొక్కెద | mrokkeda sAmi nIku mrokkeda |
| చరణం charaNam 1 | రేపు రమ్మని మాపు రమ్మని తేప తేపకు ద్రిప్ప బోకుర కాపురము బాసితిని నీకై యోప జాలర మారు బారి | rEpu rammani mApu rammani tEpa tEpaku drippa bOkura kApuramu bAsitini nIkai yOpa jAlara mAru bAri |
| చరణం charaNam 2 | నిబ్బరంబుగ నాదు బిగి చను గుబ్బలం గొని కౌగిలింపర గొబ్బు నను నబ్బబ్బ! యామరు దెబ్బలకు నే నోర్వ జాలర | nibbarambuga nAdu bigi chanu gubbalam goni kaugilimpara gobbu nanu nabbabba! yAmaru debbalaku nE nOrva jAlara |
| చరణం charaNam 3 | మల్లెలును విరి జాజి పూవులు కొల్లగా దెప్పించి యుంచితి నుల్లమిక రంజిల్ల నాపై చల్లి పాపర కాము తాపము | mallelunu viri jAji pUvulu kollagA deppinchi yunchiti nullamika ramjilla nApai challi pApara kAmu tApamu |
| చరణం charaNam 4 | చాలు చాలు భుజంగ రావటు చాలగా నిను సన్నుతించిన జాలమిటు సేయంగ నౌర యేలరా యీ కోపమేలర? | chAlu chAlu bhujanga rAvaTu chAlagA ninu sannutinchina jAlamiTu sEyanga naura yElarA yI kOpamElara? |
#524 మేలమా సామీ mElamA sAmI
| Title | మేలమా సామీ | mElamA sAmI |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | హిందుస్థాని కాఫీ | hindusthAni kAfI |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మేలమా? సామీ! యేమిర మేలమా? తాళజాలదు బాలరా మరు- కేళి గూడగ వేళరా తడ- వేల చేసెదు గోలరా నీ లీల నైనను దేఱి చూడవు | mElamA? sAmI! yEmira mElamA? tALajAladu bAlarA maru- kELi gUDaga vELarA taDa- vEla chEsedu gOlarA nI lIla nainanu dE~ri chUDavu |
| చరణం charaNam 1 | పంతమా? సామీ! దానితో బంతమా? చెంత చేరవు కోపమా? యిసు- మంత జూడవు శాపమా? యల- కంతుడే చెర పాపమా? యా యింతి నీకయి యెంత సొక్కెర | pantamA? sAmI! dAnitO bantamA? chenta chEravu kOpamA? yisu- manta jUDavu SApamA? yala- kantuDE chera pApamA? yA yinti nIkayi yenta sokkera |
| చరణం charaNam 2 | మాటరా సామీ! నీకు మాటరా సాటి దానితో గూటమా? నీ పాటి వారికి వాటమా? యా బోటికై యారాటమా – హా! సూటి కాదది మేటి వారికి | mATarA sAmI! nIku mATarA sATi dAnitO gUTamA? nI pATi vAriki vATamA? yA bOTikai yArATamA – hA! sUTi kAdadi mETi vAriki |
| చరణం charaNam 3 | యంత్రమా? సామీ! యేమిర? యంత్రమా మంత్రిప్రగడ కులేంద్రుడు కవి- తంత్ర పరమానందుడు స- న్మంత్రియౌ భుజగేంద్రుడీ నీ మంత్ర మెఱగెను దంత్ర మేలర? | yantramA? sAmI! yEmira? yantramA mantripragaDa kulEndruDu kavi- tantra paramAnanduDu sa- nmantriyau bhujagEndruDI nI mantra me~ragenu dantra mElara? |
#523 రారా మా చెలి rArA mA cheli
| Title | రారా మా చెలి | rArA mA cheli |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | కన్నడ | kannaDa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రారా మా చెలినేలరా లేచి రారా మా చెలి మేరా నీకిది మంచిదేరా వేకువ యయ్యె లేరా లోకులు నవ్వి పోరా రారా చెలినేలరా | rArA mA chelinElarA lEchi rArA mA cheli mErA nIkidi manchidErA vEkuva yayye lErA lOkulu navvi pOrA rArA chelinElarA |
| చరణం charaNam 1 | మల్లి విరుల జాల వెల్లి విరియగ బాన్పు జల్లి కురుల జడలల్లి సిరుల విలసిల్లి త్రుళ్ళినదిర | malli virula jAla velli viriyaga bAn&pu jalli kurula jaDalalli sirula vilasilli truLLinadira |
| చరణం charaNam 2 | సొక్కి మారుని ఢాక జిక్కి యారని కాక స్రుక్కి తీరని మోహమెక్కి నేరము సైప మ్రొక్కి దక్కితి ననె | sokki mAruni DhAka jikki yArani kAka srukki tIrani mOhamekki nEramu saipa mrokki dakkiti nane |
| చరణం charaNam 3 | మేని మెఱుగుల జాల బైని మెఱయగ జేయు దాని మెఱపుల మోసపోని తెఱగును గానవేని హాని యౌననె | mEni me~rugula jAla baini me~rayaga jEyu dAni me~rapula mOsapOni te~ragunu gAnavEni hAni yaunane |
| చరణం charaNam 4 | మేల? చనవు తడవేల? కినుక కిది వేళ? విను భుజగ పాల! ఘనుల కిది వాల? పోలదుర | mEla? chanavu taDavEla? kinuka kidi vELa? vinu bhujaga pAla! ghanula kidi vAla? pOladura |
#522 బంగారు తండ్రి bangAru tanDri
| Title | బంగారు తండ్రి | bangAru tanDri |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | బంగారు తండ్రి యటే యశోదా నీ పట్టి కొంటె కాడటే | bangAru tanDri yaTE yaSOdA nI paTTi konTe kADaTE |
| చరణం charaNam 1 | అంగనరో యెంత నంగనాచివె నీవు ముంగిటనే నాడు బంగరు కెంపుల బొంగరములు కన్మొఱంగ జేసి పైట కొంగున రవికె మఱుంగన డాచితె దొంగ తనము నెఱింగి నాడ న- నంగునకు దెలుపంగల నవి యొ- సంగు మని యుప్పొంగు చనులటె చెంగునం గొని భంగ పఱచెను | anganarO yenta nanganAchive nIvu mungiTanE nADu bangaru kempula bongaramulu kanmo~ranga jEsi paiTa konguna ravike ma~rungana DAchite donga tanamu ne~ringi nADa na- nangunaku delupangala navi yo- sangu mani yuppongu chanulaTe chengunam goni bhanga pa~rachenu |
| చరణం charaNam 2 | ఎట్టి వాడొ నీదు పట్టి చూడవమ్మ యెట్టు సైతుమమ్మా పట్ట పగలందఱి యెట్ట యెదుట నొక్క చిట్టి పూల బంతి కట్టి నాపై వైచి కుట్టె గుట్టెనదె గట్టి తేలు నీదు కట్టు చీరె దూరె నెట్టు లొక్కొ యని యట్టె పైబడి పుట్ట మూడిచి బిట్టు కౌగిట జుట్టి కుచముల బట్టి బయలున నిట్ట నిలువుగ బెట్టి నవ్వుచు దట్టె చేతుల | eTTi vADo nIdu paTTi chUDavamma yeTTu saitumammA paTTa pagalanda~ri yeTTa yeduTa nokka chiTTi pUla banti kaTTi nApai vaichi kuTTe guTTenade gaTTi tElu nIdu kaTTu chIre dUre neTTu lokko yani yaTTe paibaDi puTTa mUDichi biTTu kaugiTa juTTi kuchamula baTTi bayaluna niTTa niluvuga beTTi navvuchu daTTe chEtula |
| చరణం charaNam 3 | బిత్తరి నీవెంత యెత్తొ కాంతునని హత్తి కౌగిట నొత్తెనే అత్తఱి చూచి మా యత్త గారు కోప- మెత్తి యౌర! యోరి! మత్త దంతు నన్న బెత్తనంబు నీకు సత్తువ లేదు నీ చిత్తము రీతి కేలెత్తి సల్పువాడ- గుత్తకొని నీ మత్త కాశిని క్రొత్త గుబ్బల మత్తడంచెద తత్తధిమి తధి తత్త యని న- న్నెత్తి కొని పఱుగెత్తి యాడెనె | bittari nIventa yetto kAntunani hatti kaugiTa nottenE atta~ri chUchi mA yatta gAru kOpa- metti yaura! yOri! matta dantu nanna bettanambu nIku sattuva lEdu nI chittamu rIti kEletti salpuvADa- guttakoni nI matta kASini krotta gubbala mattaDamcheda tattadhimi tadhi tatta yani na- nnetti koni pa~rugetti yADene |
| చరణం charaNam 4 | దండను నా నాధుడుండగా వాతెఱ- గండి వడ నొక్కెనే దుండగీడు వాడె వండురా? యన జను- గొండల నడుమ నుండి నూగారను నుండు నెపమున రానుండు రాహువు చేర- కుండగ ముఖ శశి మండలమున నధర- కుండమున గడు నిండిన సుధకు గండి చేసితి వండ బాపితి గొండెమా? యిది రండు భుజగ వి- భుండు తీరుచు గొండు తగవనె | danDanu nA nAdhuDunDagA vAte~ra- ganDi vaDa nokkenE dunDagIDu vADe vanDurA? yana janu- gonDala naDuma nunDi nUgAranu nunDu nepamuna rAnunDu rAhuvu chEra- kunDaga mukha SaSi manDalamuna nadhara- kunDamuna gaDu ninDina sudhaku ganDi chEsiti vanDa bApiti gonDemA? yidi ranDu bhujaga vi- bhunDu tIruchu gonDu tagavane |
#521 చానరొ వే చనవే chAnaro vE chanavE
| Title | చానరొ వే చనవే | chAnarovE chanavE |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | వసంత | vasanta |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చానరొ వే చనవే సకి పాలికి | chAnaro vE chanavE saki pAliki |
| చరణం charaNam 1 | మానము వలదిక నా మౌనము విడదగు నా మనవి వినుమనవె | mAnamu valadika nA maunamu viDadagu nA manavi vinumanave |
| చరణం charaNam 2 | ఆ మగువ బిగువు చనుగవ బల్ సొగసు గనగ నెద బిగి తటాలుననె పటాలు మను తుటారి మిటారి వటారి కటారి యగు బలె | A maguva biguvu chanugava bal sogasu ganaga neda bigi taTAlunane paTAlu manu tuTAri miTAri vaTAri kaTAri yagu bale |
| చరణం charaNam 3 | ఆ కలికి చిలుకల కొలికి సుమా వలపు గెలుపు గొన గ- ళలూర గదిసి నీ పనుపును దా- నయముగా భయముగా గొను భుజంగ వినుతు రతుల కృతుల నతుల గతుల ననగియు బెనగియు మనుప దెలుపవె | A kaliki chilukala koliki sumA valapu gelupu gona ga- LalUra gadisi nI panupunu dA- nayamugA bhayamugA gonu bhujanga vinutu ratula kRtula natula gatula nanagiyu benagiyu manupa delupave |
swaram is also available for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.