| Title | ఈ విరహ మెటులోర్తునె | I viraha meTulOrtune |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగు | byAgu |
| తాళం tALa | త్రిశ్ర లఘువు | triSra laghuvu |
| Previously posted at | 4, 147 | |
| పల్లవి pallavi | ఈ విరహ మెటులోర్తునె చెలియా | I viraha meTulOrtune cheliyA |
| చరణం charaNam 1 | నేనేమి సేతు నా మనోహరుండు రాడటే నా సామి కే మిఠారి దూఱు చెప్పెనో చెలియా | nEnEmi sEtu nA manOharunDu rADaTE nA sAmi kE miThAri dU~ru cheppenO cheliyA |
| చరణం charaNam 2 | ఎందాక సైతు వాని బాసి ఈ సుమ శరుని చిగురాకు బాకుచే కుచంబు దాకెనే చెలియా | endAka saitu vAni bAsi I suma Saruni chigurAku bAkuchE kuchambu dAkenE cheliyA |
| చరణం charaNam 3 | రతి కేళి నేలు వేళనో మరాళ గామిని నే తాళజాల బాల చంద్ర సామిని బాసి | rati kELi nElu vELanO marALa gAmini nE tALajAla bAla chandra sAmini bAsi |
Category: Javali
#469 ఏలా మనకు ElA manaku
| Title | ఏలా మనకు | ElA manaku |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously posted at | 27 | |
| పల్లవి pallavi | ఏలా మనకు వాని జోలి చెలి | ElA manaku vAni jOli cheli |
| చరణం charaNam 1 | మాటిమాటికి ఈ రాపైతే ఏటి మాట పోపో పోవే నాటి బాస లేమాయె చెలి | mATimATiki I rApaitE ETi mATa pOpO pOvE nATi bAsa lEmAye cheli |
| చరణం charaNam 2 | మారుబారికి మీఱి నేను చేరి పిలిచినందుకా వేఱు మాటలాడెనే చెలి | mArubAriki mI~ri nEnu chEri pilichinandukA vE~ru mATalADenE cheli |
| చరణం charaNam 3 | సారోదారుడౌ సదయ భీమేశుడు సరస జేరి నన్ను గూడి విరసమెంతో చేసెనే చెలి | sArOdAruDau sadaya bhImESuDu sarasa jEri nannu gUDi virasamentO chEsenE cheli |
#468 సామి రాడేమందునే sAmi rADEmandunE
| Title | సామి రాడేమందునే | sAmi rADEmandunE |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగు | byAgu |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 5, 137 | |
| పల్లవి pallavi | సామి రాడేమందునే చానరో తోడితేవే నిమిషము తామసింప లేనే | sAmi rADEmandunE chAnarO tODitEvE nimishamu tAmasimpa lEnE |
| కోమలాంగి వాని కెంతటి మందు బెట్టనే ఎంతటి మాయ చేసెనే | kOmalAngi vAni kentaTi mandu beTTanE entaTi mAya chEsenE | |
| ఇందుముఖీ వాని బాసి ఎట్లు సైతునే ఈ వలపెట్లు సైతునే | indumukhI vAni bAsi eTlu saitunE I valapeTlu saitunE | |
| ముందు నన్ను గూడిన బాలచంద్ర నాథుడే వాడతి సుందరాంగుడే | mundu nannu gUDina bAlachandra nAthuDE vADati sundarAnguDE | |
#467 సరసకు రారా sarasaku rArA
| Title | సరసకు రారా | sarasaku rArA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | చాపు | chApu |
| Previously posted at | 56 | |
| పల్లవి pallavi | సరసకు రారా సామి మ్రొక్కేరా | sarasaku rArA sAmi mrokkErA |
| చరణం charaNam 1 | మరులు గొన్న నాకు మనసీయవేరా తరుణి పెట్టిన మందు తలకెక్కె నటరా | marulu gonna nAku manasIyavErA taruNi peTTina mandu talakekke naTarA |
| చరణం charaNam 2 | నిరతము నిన్ను నే నెఱనమ్మినారా కరుణను నను నేల గారడమేలా | niratamu ninnu nE ne~ranamminArA karuNanu nanu nEla gAraDamElA |
| చరణం charaNam 3 | పూజ సేయుట నీకు పొందిక లేదా రాజస మేలరా రాజ గోపాలా | pUja sEyuTa nIku pondika lEdA rAjasa mElarA rAja gOpAlA |
#466 పోరా దానింటికి pOrA dAninTiki
| Title | పోరా దానింటికి | pOrA dAninTiki |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously posted at | 397 | |
| పల్లవి pallavi | పోరా దానింటికి సామి చాల ప్రొద్దాయెరా ఆ వారిజాక్షి విన్నను మోసము | pOrA dAninTiki sAmi chAla proddAyerA A vArijAkshi vinnanu mOsamu |
| చరణం charaNam 1 | నక్క వినయములు నిజమని యెంతో నమ్మి యుంటి గదరా పక్క జేర రావద్దుర యిక | nakka vinayamulu nijamani yentO nammi yunTi gadarA pakka jEra rAvaddura yika |
| చరణం charaNam 2 | తేనెలూర నాతో బలుకుచు ఆ చాన కడకు పోనేలా కాని వారికిది వేడుక గద | tEnelUra nAtO balukuchu A chAna kaDaku pOnElA kAni vArikidi vEDuka gada |
| చరణం charaNam 3 | సరసమైన మాటలు వేరాయె చనువు దూరమాయె మరుని కేళికి ఇక సున్నే గద | sarasamaina mATalu vErAye chanuvu dUramAye maruni kELiki ika sunnE gada |
| చరణం charaNam 4 | జాజి సరము లంపిన వెగటాయె చాల కోపమాయె రాజగోపాల చాలునిక | jAji saramu lampina vegaTAye chAla kOpamAye rAjagOpAla chAlunika |
#465 రమణిరో సామిని ramaNirO sAmini
| Title | రమణిరో సామిని | ramaNirO sAmini |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously posted at | ||
| పల్లవి pallavi | రమణిరో సామిని రమ్మనవే రమ్మనవే మనవి చేకొమ్మనే వేగ | ramaNirO sAmini rammanavE rammanavE manavi chEkommanE vEga |
| చరణం charaNam 1 | సుమ శరుడలరుల సూటిగా వేసెనే సమయ మిదేయని సామికి దెలుపవే | suma SaruDalarula sUTigA vEsenE samaya midEyani sAmiki delupavE |
| చరణం charaNam 2 | సవతిల్లు వానికి సతమాయె గదవే ఎవతె బోధించెనో హితవుగ వానికి | savatillu vAniki satamAye gadavE evate bOdhinchenO hitavuga vAniki |
| చరణం charaNam 3 | రాజగోపాలుడా రమణిని గూడి తేజరిల్లుచు చెలిమి దిటవుగ మఱచెనే | rAjagOpAluDA ramaNini gUDi tEjarilluchu chelimi diTavuga ma~rachenE |
#464 మాయలాడి బోధనచే mAyalADi bOdhanachE
| Title | మాయలాడి బోధనచే | mAyalADi bOdhanachE |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | మిశ్ర లఘువు | miSra laghuvu |
| Previously posted at | 37, 193 | |
| పల్లవి pallavi | మాయలాడి బోధనచే మైమఱచితి వేమో మాటలాడ రావదేమిరా | mAyalADi bOdhanachE maima~rachiti vEmO mATalADa rAvadEmirA |
| చరణం charaNam 1 | కాయజు బారికి తాళగా లేరా కౌగిట జేర్చి నను గారవించరా న్యాయమటర నీకిది తగదుర సరగున | kAyaju bAriki tALagA lErA kaugiTa jErchi nanu gAravincharA nyAyamaTara nIkidi tagadura saraguna |
| చరణం charaNam 2 | కలకాలము నన్ను గాసి బెట్టకురా కాంతల నేచుట కార్యము గాదుర చెలువుడ వని నిను నేఱ నమ్మినందు కిక | kalakAlamu nannu gAsi beTTakurA kAntala nEchuTa kAryamu gAdura cheluvuDa vani ninu nE~ra namminandu kika |
| చరణం charaNam 3 | సరివారిలో నను చౌక సేయకురా చాల నమ్మితి రతి కేళిని గూడరా వరదుడౌ మువ్వపురి నిలయుడ చనువున | sarivArilO nanu chauka sEyakurA chAla nammiti rati kELini gUDarA varaduDau muvvapuri nilayuDa chanuvuna |
#463 ఎన్నాళ్ళు సైరింతునే ennALLu sairintunE
| Title | ఎన్నాళ్ళు సైరింతునే | ennALLu sairintunE |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | చాపు | chApu |
| Previously at | 395 | |
| పల్లవి pallavi | ఎన్నాళ్ళు సైరింతునే ఓ చెలియ నే సామిని తోడితేవే | ennALLu sairintunE O cheliya nE sAmini tODitEvE |
| చరణం charaNam 1 | క్రొన్నన విల్తుడు కోపము తోను తిన్నగ నాపై శరము లేసెనే ||సా|| ||ఎ|| | kronnana viltuDu kOpamu tOnu tinnaga nApai Saramu lEsenE ||sA|| ||e|| |
| చరణం charaNam 2 | కనుల పండువై కాచెడు వెన్నెల మనసు కెంతో గాసిని బుట్టించెనే ||సా|| ||ఎ|| | kanula panDuvai kAcheDu vennela manasu kentO gAsini buTTinchenE ||sA|| ||e|| |
| చరణం charaNam 3 | కోకిల లెల్ల గుంపులు గూడి ఓ కమలాక్షి రవములు గావించెనే ||సా|| ||ఎ|| | kOkila lella gumpulu gUDi O kamalAkshi ravamulu gAvinchenE ||sA|| ||e|| |
| చరణం charaNam 4 | శింగర నుతుడు చెంగట బాసి అంగన గూడి ఇందు రాకున్నాడె ||సా|| ||ఎ|| | Singara nutuDu chengaTa bAsi angana gUDi indu rAkunnADe ||sA|| ||e|| |
#462 వాని జోలి vAni jOli
| Title | వాని జోలి | vAni jOli |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగు | byAgu |
| తాళం tALa | చాపు | chApu |
| Posted before | 378 | |
| పల్లవి pallavi | వాని జోలి నాకేలే ఇందుముఖిరో ఆ వనిత బోధనచే మైమఱచె | vAni jOli nAkElE indumukhirO A vanita bOdhanachE maima~rache |
| చరణం charaNam 1 | మానినిరో వాని మమత లెందు బోయె పూని దాని యిలు విడిచి రాక యున్నాడిక | mAninirO vAni mamata lendu bOye pUni dAni yilu viDichi rAka yunnADika |
| చరణం charaNam 2 | ఇంతిరో నిను బాయనని నాతో ఎన్నో బూటకములు పలికెనే సంతసమెల్ల నా చాన కొసగి నన్ను పంతముతో మరుని పాలు చేసెనిక | intirO ninu bAyanani nAtO ennO bUTakamulu palikenE santasamella nA chAna kosagi nannu pantamutO maruni pAlu chEsenika |
| చరణం charaNam 3 | మాట తప్పని వాడని నేను మనసున నెంచితి గదనే బోటిరో అలవాని మోము జూడనగునా సాటి వారలు నవ్వ జాలరేమె యిక | mATa tappani vADani nEnu manasuna nenchiti gadanE bOTirO alavAni mOmu jUDanagunA sATi vAralu navva jAlarEme yika |
| చరణం charaNam 4 | శింగర నుతుడు నాతో మును చేసిన చెలిమిని మఱచెనే బంగారము వంటి వాని గుణము లెల్ల అంగనా మణి మోహాబ్ధి జేరెనిక | Singara nutuDu nAtO munu chEsina chelimini ma~rachenE bangAramu vanTi vAni guNamu lella anganA maNi mOhAbdhi jErenika |
#461 సామి నెడబాసి sAmi neDabAsi
| Title | సామి నెడబాసి | sAmi neDabAsi |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | దేవమనోహరి | dEvamanOhari |
| తాళం tALa | చాపు | chApu |
| Previously posted | 377 | |
| పల్లవి pallavi | సామి నెడబాసి నేనెట్టు సైరింతునే కోమలి శ్రీ రాజ గోపాల | sAmi neDabAsi nEneTTu sairintunE kOmali SrI rAja gOpAla |
| చరణం charaNam 1 | మరుడురమున విరి శరముల నేసెనే సరసిజాక్షి ఇదే సమయము రమ్మనవే | maruDuramuna viri Saramula nEsenE sarasijAkshi idE samayamu rammanavE |
| చరణం charaNam 2 | కలువల దొర పగ నాపై గావించెనే కలికిరో తమి నిలుప నా తరమటే | kaluvala dora paga nApai gAvinchenE kalikirO tami nilupa nA taramaTE |
| చరణం charaNam 3 | శింగర నుతుడు మోసము జేసెగదే అంగనా మణి ఇపుడైనను బిలువవే | Singara nutuDu mOsamu jEsegadE anganA maNi ipuDainanu biluvavE |