#460 కాసా నీ చెలి నే kAsA nI cheli nE

Titleకాసా నీ చెలి నేkAsA nI cheli nE
Written Byధర్మపురి?dharmapuri?
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
Previously Published At47
పల్లవి pallaviకాసా నీ చెలి నే గాదటర నీ
బాసలెల్ల ఏమాయెనురా
kAsA nI cheli nE gAdaTara nI
bAsalella EmAyenurA
చరణం
charaNam 1
సారుకు నా సరిపారి యెదుట నిన్ను
రారా రారా రారా యని పిలిచిన
sAruku nA saripAri yeduTa ninnu
rArA rArA rArA yani pilichina
చరణం
charaNam 2
ఆ సతులతో పరిహాసము సలుపగ
రోసముతో ఒరోరని పిలిచిన
A satulatO parihAsamu salupaga
rOsamutO orOrani pilichina
చరణం
charaNam 3
రేపగలని భేదము లెంచక నే
నీపైకొని యుపరతులను సలిపిన
rEpagalani bhEdamu lenchaka nE
nIpaikoni yuparatulanu salipina
చరణం
charaNam 4
మాటలోన పొరపాటు లేని నీ
మాటలెల్ల బల్ సూటిగ నేర్చిన
mATalOna porapATu lEni nI
mATalella bal sUTiga nErchina
చరణం
charaNam 5
ధర్మపురిని నెలకొన్న సామి శ్రీ
నిర్మలమగు మకుటేశుని సాక్షిగ
dharmapurini nelakonna sAmi SrI
nirmalamagu makuTESuni sAkshiga

#459 చాలే చాలే chAlE chAlE

Titleచాలే చాలేchAlE chAlE
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaచాపుchApu
See Alsoprevious posts 159 and 11
పల్లవి pallaviచాలే చాలే అలవానితో పొందు
చాలే చాలే ఈ లాభము ఇక
chAlE chAlE alavAnitO pondu
chAlE chAlE I lAbhamu ika
చరణం
charaNam 1
అలివేణిరొ ఆ నలినాక్షి కాళ్ళకు
మ్రొక్కెడి వానితో స్నేహము ఇక
alivENiro A nalinAkshi kALLaku
mrokkeDi vAnitO snEhamu ika
చరణం
charaNam 2
కలకంఠిరొ భూతల మందున
కల్లలు పలికెడి వానితో స్నేహము ఇక
kalakanThiro bhUtala manduna
kallalu palikeDi vAnitO snEhamu ika

#458 చెలి మనకేల cheli manakEla

Titleచెలి మనకేలcheli manakEla
Written Byధర్మపురి?dharmapuri?
BookగాయకలోచనముgAyakalOchanamu
Also look at2
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaత్రిశ్ర లఘువుtriSra laghuvu
పల్లవి pallaviచెలి మనకేల వానితోను పొందు చాలునే
వాని పొందు చాలునే
వానితో పొందు చాలునే
cheli manakEla vAnitOnu pondu chAlunE
vAni pondu chAlunE
vAnitO pondu chAlunE
చరణం
charaNam 1
కనికర మెంచని కౌగలింత లేలనే
వానితో కౌగిలేలనే
kanikara menchani kaugalinta lElanE
vAnitO kaugilElanE
ఎంగిలని ఎంచు వాని రంగు విడెమేలనే
వానెంగిలి మనకేలనే
engilani enchu vAni rangu viDemElanE
vAnengili manakElanE
మర్మము నెఱింగిన శ్రీ ధర్మపురి నిలయుడే
ఆ కన్నెల కేకాంతుడే
marmamu ne~ringina SrI dharmapuri nilayuDE
A kannela kEkAntuDE

#457 దూరులకు నే dUrulaku nE

Titleదూఱులకు నేdU~rulaku nE
Written Byధర్మపురి?dharmapuri?
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaబ్యాగుbyAgu
తాళం tALaమిశ్ర లఘువుmiSra laghuvu
పల్లవి pallaviదూఱులకు నే లోనైతి గదవే వట్టిdU~rulaku nE lOnaiti gadavE vaTTi
సారసాక్షుడు నాతో కద్దని మఱి వట్టిsArasAkshuDu nAtO kaddani ma~ri vaTTi
ఆట పాటలకు నే మాటిమాటికి వాని
చోటికి నే బోవగా వట్టి
ATa pATalaku nE mATimATiki vAni
chOTiki nE bOvagA vaTTi
బోటుల కెదుట నే జూచి నవ్వే
అలవాటు చేసినందుకా వట్టి
bOTula keduTa nE jUchi navvE
alavATu chEsinandukA vaTTi
ధర్మపురిని నెలకొన్న శ్రీపరవాసుదేవు డెఱుగు గదవే వట్టిdharmapurini nelakonna SrIparavAsudEvu De~rugu gadavE vaTTi

“dUrulaku nE” – added to facilitate search without ~

#456 ఏలా మా రమణిపై ElA mA ramaNipai

Titleఏలా మా రమణిపైElA mA ramaNipai
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకేదార గౌళkEdAra gauLa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏలా మా రమణిపై చలము నీకిది
మేర గాదుర సామి వినరా
ElA mA ramaNipai chalamu nIkidi
mEra gAdura sAmi vinarA
చరణం
charaNam 1
చాలా మరుని సుమ శరావళికి
నది పాలాయె దయ గనుగొనరా
ఈ లీల జాగొనరించుట నీకిది
chAlA maruni suma SarAvaLiki
nadi pAlAye daya ganugonarA
I lIla jAgonarinchuTa nIkidi
చరణం
charaNam 2
పరాకు సలుపకు సరోజ ముఖిపై
విరాళి కోర్వదు గదరా
నిరాదరణ చేయుటే బిరుద ఇది
parAku salupaku sarOja mukhipai
virALi kOrvadu gadarA
nirAdaraNa chEyuTE biruda idi
చరణం
charaNam 3
ఎన్నో విధములను హితవు దెలిపినను
అన్నాదులను వదలెనురా
మన్నింపవేర రాజగోపాల ఇది నీకు
ennO vidhamulanu hitavu delipinanu
annAdulanu vadalenurA
mannimpavEra rAjagOpAla idi nIku

#455 పలుకవు నాతో palukavu nAtO

Titleపలుకవు నాతోpalukavu nAtO
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviపలుకవు నాతో మఱి ఇదేటి మోడిరాpalukavu nAtO ma~ri idETi mODirA
చరణం
charaNam 1
చెలుల బోధన లెల్ల తలకెక్కె నేమో కాని
చెలిమిని దలచవు మేరా
chelula bOdhana lella talakekke nEmO kAni
chelimini dalachavu mErA
చరణం
charaNam 2
విడెమొసగుచు ముద్దు లిడగబోతే
నను విదలించుట మరియాదా
viDemosaguchu muddu liDagabOtE
nanu vidalinchuTa mariyAdA
చరణం
charaNam 3
సరివారిలో నను చౌక చేయకుర
సరసుడ రాజ గోపాలా
sarivArilO nanu chauka chEyakura
sarasuDa rAja gOpAlA

#454 సామి నాపై sAmi nApai

Titleసామి నాపైsAmi nApai
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviసామి నాపై చలమేలా
సరగ నేలుకొనరా
sAmi nApai chalamElA
saraga nElukonarA
కాము బారి కోర్వ జాల
కరుణ నేలుకొనరా
kAmu bAri kOrva jAla
karuNa nElukonarA
నిమిషమైన బాయనట్టి
నెనరు మఱవ నగునా
nimishamaina bAyanaTTi
nenaru ma~rava nagunA
మరులు కొంటి నిన్నె చాల
మనవి చేకొనరా
marulu konTi ninne chAla
manavi chEkonarA
పంతమేల రాజ గోపాల
సామి వినురా
pantamEla rAja gOpAla
sAmi vinurA

#453 మగువరో వానిపైని maguvarO vAnipaini

Titleమగువరో వానిపైనిmaguvarO vAnipaini
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaత్రిశ్ర లఘువుtriSra laghuvu
పల్లవి pallaviమగువరో వానిపైని మమత యెటుల తీఱునేmaguvarO vAnipaini mamata yeTula tI~runE
చరణం
charaNam 1
పొగరున సుమ శరుడు పొంచి విలు వంచెనే
అంతంతకు తమి మించెనే
pogaruna suma SaruDu ponchi vilu vanchenE
antantaku tami minchenE
చరణం
charaNam 2
వానితో సుఖింపని ప్రాయమది యేటికే
ఈ కాయమది యేటికే
vAnitO sukhimpani prAyamadi yETikE
I kAyamadi yETikE
చరణం
charaNam 3
రతి పతి గన్న శ్రీ రాజ గోపాలుడే
ఉదార గుణ శీలుడే
rati pati ganna SrI rAja gOpAluDE
udAra guNa SIluDE

#452 రారా మా రమణి rArA mA ramaNi

Titleరారా మా రమణిrArA mA ramaNi
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaబ్యాగుbyAgu
తాళం tALaమిశ్ర లఘువుmiSra laghuvu
రారా మా రమణి తాళలేదురా ||సామి||rArA mA ramaNi tALalEdurA ||sAmi||
తాళలేదురా ఇది పాడి గాదురా ||సామి|| ||రా||tALalEdurA idi pADi gAdurA ||sAmi|| ||rA||
మారుబారి వేమఱు సొమ్మ సిల్లినది ||రా||mArubAri vEma~ru somma sillinadi ||rA||
చెలులతో నెప్పుడు పలుకదురా నిన్నే
తలచుచు నున్నదిరా సామి నిన్నె
chelulatO neppuDu palukadurA ninnE
talachuchu nunnadirA sAmi ninne
అన్న పానములపై ఆశయే లేదురా
కన్నె నిక నేలురా దయ యుంచి
anna pAnamulapai ASayE lEdurA
kanne nika nElurA daya yunchi
రసికుడైన శ్రీ రాజ గోపాల
రట్టు సేయుటేలరా చెలి నిటు
rasikuDaina SrI rAja gOpAla
raTTu sEyuTElarA cheli niTu

#451 చెలియ నేనెట్లోర్తునే cheliya nEneTlOrtunE

Titleచెలియ నేనెట్లోర్తునేcheliya nEneTlOrtunE
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviచెలియ నేనెట్లోర్తునే చెలువుని బాసి
నే నిలువగ జాలనె
cheliya nEneTlOrtunE cheluvuni bAsi
nE niluvaga jAlane
చరణం
charaNam 1
అలివేణి నా విభు డలగి రాడాయెనో
చెలి బోధన విని చలమును బూనెనొ
alivENi nA vibhu Dalagi rADAyenO
cheli bOdhana vini chalamunu bUneno
చరణం
charaNam 2
మరుడురమున విరి శరముల నేసెనె
సరగున సామితో సరసము లాడక
maruDuramuna viri Saramula nEsene
saraguna sAmitO sarasamu lADaka
చరణం
charaNam 3
వెన్నెల కాకల వెత జెంద లేనే
కన్నెరో చెలువుని కౌగిట జేరక
vennela kAkala veta jenda lEnE
kannerO cheluvuni kaugiTa jEraka
చరణం
charaNam 4
రమణుడైన శ్రీ రాజ గోపాలుని
నిమిషము జూడక నిదుర రాదు గదే
ramaNuDaina SrI rAja gOpAluni
nimishamu jUDaka nidura rAdu gadE