| Title | ఓరి సామి మాటలేటికి పోపోరా | Ori sAmi mATalETiki pOpOrA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | మాటలేటికి పోపోరా నీ వలచిన మగువ యిల్లిది గాదురా | mATalETiki pOpOrA nI valachina maguva yillidi gAdurA |
| చరణం charaNam 1 | బోటిని గూడిన నీటు దెలిసెరా మాటిమాటికి రాకురా || ఓరి సామి|| | bOTini gUDina nITu deliserA mATimATiki rAkurA || Ori sAmi|| |
| చరణం charaNam 2 | ఇంతి నీ రాకకు ఎదురు చూచునురా ఎంతో ప్రొద్దాయెరా || ఓ|| | inti nI rAkaku eduru chUchunurA entO proddAyerA || O|| |
| చరణం charaNam 3 | అతివ చూచిన నన్ను నారడి పెట్టును హితవుగ మది నెంచరా || ఓ|| | ativa chUchina nannu nAraDi peTTunu hitavuga madi nencharA || O|| |
| చరణం charaNam 4 | రచ్చ సేయుటేలా రాజ గోపాలా మచ్చికతో గావరా || ఓ మాట|| | rachcha sEyuTElA rAja gOpAlA machchikatO gAvarA || O mATa|| |
Category: Javali
#449 వాని మాటలిక vAni mATalika
| Title | వాని మాటలిక | vAni mATalika |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | వాని మాటలిక మనకేలే వంచనలకు గురు పీఠము గదే వేడుకతో నే విడెమీబోతే జాడగా తీసి యా చాన కొసగె | vAni mATalika manakElE vanchanalaku guru pIThamu gadE vEDukatO nE viDemIbOtE jADagA tIsi yA chAna kosage |
| చరణం charaNam 1 | మోము మోమున జేర్చి ముద్దిడ బోతే మోమటు త్రిప్పి యా ముదిత దలచె | mOmu mOmuna jErchi muddiDa bOtE mOmaTu trippi yA mudita dalache |
| చరణం charaNam 2 | అడుగులకు నే మడుగులు పరచిన జడియక సవతికి సరిగాదనే | aDugulaku nE maDugulu parachina jaDiyaka savatiki sarigAdanE |
| చరణం charaNam 3 | పణతిరో రాజగోపాలుడీ రీతిని కనికర మెంచక గాసి బెట్టెనే | paNatirO rAjagOpAluDI rItini kanikara menchaka gAsi beTTenE |
#448 తామసమేలరా tAmasamElarA
| Title | తామసమేలరా | tAmasamElarA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | తామసమేలరా నా మనోహర తాళగ జాలనురా | tAmasamElarA nA manOhara tALaga jAlanurA |
| కాముడు నాపై కరుణ దప్పెనురా కళ లంటి నను గూడరా | kAmuDu nApai karuNa dappenurA kaLa lanTi nanu gUDarA | |
| మునుపటి దయ నీ మనసున లేదా మోహము దీర్చరా చక్కగ నాపై చనువు చూపకు మని సవతి చెప్పెనటరా | munupaTi daya nI manasuna lEdA mOhamu dIrcharA chakkaga nApai chanuvu chUpaku mani savati cheppenaTarA | |
| అంతరంగుడవై అరమర చేయుట వింతగ నున్నదిరా రమణుడైన శ్రీ రాజ గోపాలా సమయము దెలసి కోరా | antaranguDavai aramara chEyuTa vintaga nunnadirA ramaNuDaina SrI rAja gOpAlA samayamu delasi kOrA | |
#447 ఈ విరహ I viraha
| Title | ఈ విరహ | I viraha |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని భైరవి | hindusthAni bhairavi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఈ విరహ మెటుల సైతునె కామినీ ఏవియు నా మది కింపు లేదాయెనే భావజుడెంతో నను బాధింపగ సాగెనే | I viraha meTula saitune kAminI Eviyu nA madi kimpu lEdAyenE bhAvajuDentO nanu bAdhimpaga sAgenE |
| చరణం charaNam 1 | వెన్నెల నా మదికి వెగటుగ దోచెనే కన్నెరో చల్లని గాలి విష మాయెనే | vennela nA madiki vegaTuga dOchenE kannerO challani gAli visha mAyenE |
| చరణం charaNam 2 | బాలరో రాజ గోపాలుడు మును నను నేలిన ప్రీతి మది నెంచి యిటు రాడాయెనే | bAlarO rAja gOpAluDu munu nanu nElina prIti madi nenchi yiTu rADAyenE |
#446 మనసిజు బారికి manasiju bAriki
| Title | మనసిజు బారికి | manasiju bAriki |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | మనసిజు బారికి నెటులోర్తునే వనితరో విభు నెడబాసిన మొదలు దినమొక యుగమాయెనే | manasiju bAriki neTulOrtunE vanitarO vibhu neDabAsina modalu dinamoka yugamAyenE |
| చరణం charaNam 1 | ముదితరో రమణిపై మోహమగ్గలమై నిదురయు రాదాయెనే | muditarO ramaNipai mOhamaggalamai nidurayu rAdAyenE |
| చరణం charaNam 2 | కన్నెరో చెలువుని కనుల జూడమిచే అన్నము సైచ దాయెనే | kannerO cheluvuni kanula jUDamichE annamu saicha dAyenE |
| చరణం charaNam 3 | పణతిరో రాజ గోపాలుడు నాపై కనికర మెంచ డాయెనే | paNatirO rAja gOpAluDu nApai kanikara mencha DAyenE |
#445 న్యాయమేమిరా nyAyamEmirA
| Title | న్యాయమేమిరా | nyAyamEmirA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | న్యాయమేమిరా నీకిది సామి వేయి మాట లేలర నా విభుడని నెఱ నమ్మినార మాయలాడి బోధనకే మమత జెంది యుండ నీకు | nyAyamEmirA nIkidi sAmi vEyi mATa lElara nA vibhuDani ne~ra namminAra mAyalADi bOdhanakE mamata jendi yunDa nIku |
| చరణం charaNam 1 | విరహ మోర్వరా నను వేగ నేలరా మరుడు నా యురమునను విరి శరముల వడి నేసెనురా కరుణ మఱవ వలదుర యీ కాయము నీ సొమ్మేర | viraha mOrvarA nanu vEga nElarA maruDu nA yuramunanu viri Saramula vaDi nEsenurA karuNa ma~rava valadura yI kAyamu nI sommEra |
| చరణం charaNam 2 | పంతమేలరా సామి పాడి గాదురా అంతరంగ మెఱిగి నన్నిటు లారడి పెట్టేవదేర చెంత జేరి తావులంటి వింత రతుల గూడవేర | pantamElarA sAmi pADi gAdurA antaranga me~rigi nanniTu lAraDi peTTEvadEra chenta jEri tAvulanTi vinta ratula gUDavEra |
| చరణం charaNam 3 | వలచినానురా నాపై చలము మానురా అలగి యుండు టేలర నా యపరాధము లేమిరా పలుకవేర రాజగోపాల నీకు మ్రొక్కేరా | valachinAnurA nApai chalamu mAnurA alagi yunDu TElara nA yaparAdhamu lEmirA palukavEra rAjagOpAla nIku mrokkErA |
#444 సరగున నిటరారా saraguna niTarArA
| Title | సరగున నిటరారా | saraguna niTarArA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | యమన్ | yaman |
| తాళం tALa | త్రిశ్ర లఘువు | triSra laghuvu |
| పల్లవి pallavi | సరగున నిటరారా మరియాదటరా వినురా మరుని బారి కోర్వ లేక మరులైతిరా సామి నీకు సరివారలు నవ్వగ జేయుట న్యాయము గాదుర నేనెఱ నెమ్మిన దాననురా | saraguna niTarArA mariyAdaTarA vinurA maruni bAri kOrva lEka marulaitirA sAmi nIku sarivAralu navvaga jEyuTa nyAyamu gAdura nEne~ra nemmina dAnanurA |
| చరణం charaNam 1 | బాస లొసగి ఇటు నను నెడబాయ నగునా నను నెడ మోసమెందుకు చేసేవురా మది నెంచర యీ తనువే నీ సొమ్ముగ చేకొనరా | bAsa losagi iTu nanu neDabAya nagunA nanu neDa mOsamenduku chEsEvurA madi nenchara yI tanuvE nI sommuga chEkonarA |
| చరణం charaNam 2 | బ్రాణనాథ రాజ గోపాల చలమా రాజగో మాన మెంచవదేమిర నాయెడ నేరము లేమిర నే నిను జూడక తాళనురా | brANanAtha rAja gOpAla chalamA rAjagO mAna menchavadEmira nAyeDa nEramu lEmira nE ninu jUDaka tALanurA |
#443 రారా మనవి rArA manavi
| Title | రారా మనవి | rArA manavi |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | రారా మనవి చేకోరా మారుని బారికి నోర్వగ లేర | rArA manavi chEkOrA mAruni bAriki nOrvaga lEra |
| చరణం charaNam 1 | వలచినట్టి నను చులకన సేయుట మేరా సామి పలుకవ దేరా చలము మాని కలసెడు సరసులు లేరా సుకుమారా సమయమిదేర | valachinaTTi nanu chulakana sEyuTa mErA sAmi palukava dErA chalamu mAni kalaseDu sarasulu lErA sukumArA samayamidEra |
| చరణం charaNam 2 | చెలుల బోధనలు విని నను నాడగలేదా నాతో పలుమాఱు వాదా సలిపినట్టి చెలిమిని మది నిడరాదా మరియాదా వంచన పోదా | chelula bOdhanalu vini nanu nADagalEdA nAtO palumA~ru vAdA salipinaTTi chelimini madi niDarAdA mariyAdA vanchana pOdA |
| చరణం charaNam 3 | రాను రాను నీ గుణమిటు లాయెన దేలా శ్రీ రాజ గోపాలా కానివారు నవ్వగ బ్రదుకిక నేలా శ్రీ లోలా తాళగ జాల | rAnu rAnu nI guNamiTu lAyena dElA SrI rAja gOpALA kAnivAru navvaga bradukika nElA SrI lOlA tALaga jAla |
#442 రావేలర చెంతకు rAvElara chentaku
| Title | రావేలర చెంతకు | rAvElara chentaku |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రావేలర చెంతకు రాజసమా ఏ వనిత చెవి గఱిచె | rAvElara chentaku rAjasamA E vanita chevi ga~riche |
| చరణం charaNam 1 | భావభవుని బారికి నను ద్రోసి బాధ నొంద జేయకు నే వేడగ | bhAvabhavuni bAriki nanu drOsi bAdha nonda jEyaku nE vEDaga |
| చరణం charaNam 2 | ఆనాటి నేస్తమెంచకను నన్నగడు చేయ న్యాయమటర సామిగ ఏణాక్షి వలను దగిలి చలమును మానవేర కరుణ సుంత లేక | AnATi nEstamenchakanu nannagaDu chEya nyAyamaTara sAmiga ENAkshi valanu dagili chalamunu mAnavEra karuNa sunta lEka |
| చరణం charaNam 3 | వాదేల చేసేవురా నావంటి చెలిని నేచగ తగునటరా నీ దాన ననుచు నమ్మినందుకు నెనరుతోను కలిసి మెలసి యుండగ | vAdEla chEsEvurA nAvanTi chelini nEchaga tagunaTarA nI dAna nanuchu namminanduku nenarutOnu kalisi melasi yunDaga |
| చరణం charaNam 4 | శ్రీ రాజగోపాల నీదు చిత్తమీ రీతి యైన నా సరి వారిజాక్షులెల్ల నన్ను నెంతుర మేరగాదు నేరమేమి చేసితి | SrI rAjagOpAla nIdu chittamI rIti yaina nA sari vArijAkshulella nannu nentura mEragAdu nEramEmi chEsiti |
#441 సామిని తోడి తేగదే sAmini tODi tEgadE
| Title | సామిని తోడి తేగదే | sAmini tODi tEgadE |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందోళ | hindOLa |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | సామిని తోడి తేగదే నా సకియరో జాగు సేయవలదే బిరాన | sAmini tODi tEgadE nA sakiyarO jAgu sEyavaladE birAna |
| చరణం charaNam 1 | భామరో నేనేమి సేతు కాముని బారికి తాళగ జాలనే ప్రేమ యుంచి రా రమ్మటంచు | bhAmarO nEnEmi sEtu kAmuni bAriki tALaga jAlanE prEma yunchi rA rammaTanchu |
| చరణం charaNam 2 | ఇంతిరో వాడిందు రాక పంతము సాధించెను గదవే అంతరంగ మెఱిగించి వేగ | intirO vADindu rAka pantamu sAdhinchenu gadavE antaranga me~riginchi vEga |
| చరణం charaNam 3 | కమల వైరి గాసి చేయ రమణిరో రాజగోపాలుని జూడక నిమిషమైన తమి నిలుపజాల | kamala vairi gAsi chEya ramaNirO rAjagOpAluni jUDaka nimishamaina tami nilupajAla |