1299 అపుడేమనె apuDEmane

TitleఅపుడేమనెapuDEmane
Written Byఅన్నమాచార్యannamAchArya
Book..
రాగం rAgaఆహిరిAhiri
తాళం tALa
పల్లవి pallaviఅపుడేమనె నేమనుమను
తపమే విరహ తాపమనె
apuDEmane nEmanumanu
tapamE viraha tApamane
చరణం
charaNam 1
పవనజ ఏమనెనె పడతి మరేమనె
అవనిజ నిను నేమనుమనెను
రవి కులేంద్ర భారము ప్రాణంబనె
ఇవల నెట్లు ధరియించే ననె
pavanaja Emanene paDati marEmane
avanija ninu nEmanumanenu
ravi kulEndra bhAramu prANambane
ivala neTlu dhariyinchE nane
చరణం
charaNam 2
యింకా యేమనె యింతి మరేమనె
కొంకక యేమని కొసరు మనె
బొంకుల దేహము పోదిది వేగనె
చింక వేట యిటు చేసెననె
yinkA yEmane yinti marEmane
konkaka yEmani kosaru mane
bonkula dEhamu pOdidi vEgane
chinka vETa yiTu chEsenane
చరణం
charaNam 3
నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నీవలెనె తాపమనె
మను కులేశ ప్రేమవు మన కూటమి
ఘన వేంకట గిరి గంటిననె
nanu nEmane prANamu mana kokaTane
tanaku nIvalene tApamane
manu kulESa prEmavu mana kUTami
ghana vEnkaTa giri ganTinane

1298 ఎక్కడ తాళుదునే ekkaDa tALudunE

Titleఎక్కడ తాళుదునేekkaDa tALudunE
Written By
Book
రాగం rAgaసావేరిsAVEri
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఎక్కడ తాళుదునే యేమని దూరుదునేekkaDa tALudunE yEmani dUrudunE
అనుపల్లవి anupallaviమ్రొక్కిన నాడు కేగిలీడు
మువ్వ గోపాలుడో చెలియ
mrokkina nADu kEgilIDu
muvva gOpAluDO cheliya
చరణం
charaNam 1
దయ గోరింతైన లేదాయె
వట్టి తచ్చనలే ఘనమాయ
ప్రియముతో నను జూడడాయ
ప్రేమతో చేపట్టడా వచ్చో చెలియ
daya gOrintaina lEdAye
vaTTi tacchanalE ghanamAya
priyamutO nanu jUDaDAya
prEmatO chEpaTTaDA vacchO cheliya
చరణం
charaNam 2
బతిమాలిన రాడాయ నన్ను
పగవాడై యల కంతుడేయ
హితవని నన్నేలడాయ
యెంతటి మాయయో చెలియ
batimAlina rADAya nannu
pagavADai yala kantuDEya
hitavani nannElaDAya
yentaTi mAyayO cheliya
చరణం
charaNam 3
కూడియున్నదే వెగటాయ
నేను విడెమిచ్చిన నీల్లుడాయ
మోడిచేసి మువ్వ గోపాలుడు
నా మోహ మెన్నడాయెనో చెలియ
kUDiyunnadE vegaTAya
nEnu viDemicchina nIlluDAya
mODichEsi muvva gOpAluDu
nA mOha mennaDAyenO cheliya

1297 నిన్ను నే మరతునా ninnu nE maratunA

Titleనిన్ను నే మరతునాninnu nE maratunA
Written By
Book
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaమఠ్యmaThya
పల్లవి pallaviనిన్ను నే మరతునా ఓ చెలియాninnu nE maratunA O cheliyA
అనుపల్లవి anupallaviనిన్ను నే సొమ్ముగ జేసి వేంకట
నాథ రారాయనిన జాణవు
ninnu nE sommuga jEsi vEnkaTa
nAtha rArAyanina jANavu
చరణం
charaNam 1
పొలతిరో నీ గుణ మరయ వలసి అలుక జేసి కన్నెర్ర జేసితె
పలుకక యూరకుండి నపుడె పణుతురో జేరి
కిలకిల నవ్వుచు సారెను చక్కిలి గింత లిడుచు నన్ను
తరుణి గుబ్బల రొమ్మున గుమ్మి దక్కించు కొన్న చలపాదిని
polatirO nI guNa maraya valasi aluka jEsi kannerra jEsite
palukaka yUrakunDi napuDe paNuturO jEri
kilakila navvuchu sArenu chakkili ginta liDuchu nannu
taruNi gubbala rommuna gummi dakkinchu konna chalapAdini
చరణం
charaNam 2
మొదల తరితీపు సేయ మాయ నిదుర దెచ్చున పవ్వళించితే
అది తెలిసి నీవు నా కెమ్మోవి ఆన వచ్చితే
పెదవులు రెండు గట్టిగ బట్టి వదన మిట్టట్టు ద్రిప్పనీయక
గదిమి యదిమి మోవి యాని విదలించి వేసిన హొంతకారివి
modala taritIpu sEya mAya nidura decchuna pavvaLinchitE
adi telisi nIvu nA kemmOvi Ana vacchitE
pedavulu renDu gaTTiga baTTi vadana miTTaTTu drippanIyaka
gadimi yadimi mOvi yAni vidalinchi vEsina hontakArivi
చరణం
charaNam 3
వెలయు మువ్వ గోపాలుడైన వేంకటేశ గోప భావమల
నలయక పదునారు వేల గూడి ఆవయిన గానిమ్మని
కలయ వేళ నేమో కొన్ను కథల చేత జాగు చేసి
సాలయన రతుల గూడి నన్ను జూడర నా మార్గమనిన జాణవు
velayu muvva gOpAluDaina vEnkaTESa gOpa bhAvamala
nalayaka padunAru vEla gUDi Avayina gAnimmani
kalaya vELa nEmO konnu kathala chEta jAgu chEsi
sAlayana ratula gUDi nannu jUDara nA mArgamanina jANavu

1296 ఇంతిరో వరదునికి intirO varaduniki

Titleఇంతిరో వరదునికిintirO varaduniki
Written By
Book
రాగం rAgaధన్యాసిdhanyAsi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఇంతిరో వరదునికి నీపై నెంత మోహమే
సంతతంబని వెత జూడ జాలక యిందు వచ్చితిని
intirO varaduniki nIpai nenta mOhamE
santatambani veta jUDa jAlaka yindu vacchitini
చరణం
charaNam 1
చెక్కిట చేయి చేర్చుకొనెను
చిరు నవ్వు నవ్వుకొనెను
అక్కట నే దలచినట్లే నైరాదనెను
మక్కువ మును చేసిన చెలిమి
మరపు రాదాయనెను
చక్కని ఈ చెలిని గూడని
జన్మమేటి జన్మమనెను
chekkiTa chEyi chErchukonenu
chiru navvu navvukonenu
akkaTa nE dalachinaTlE nairAdanenu
makkuva munu chEsina chelimi
marapu rAdAyanenu
chakkani I chelini gUDani
janmamETi janmamanenu
చరణం
charaNam 2
పడతి యుండుండి నేనేమి
పాపము జేసితి ననెను
తడవు నిన్నెడ బాసి
తాళ లేననెను
నడువ నోరాడదనెను
నొసట చేయించుకొనెను
అడిగితె మీరేమైన
నార్చేరో తీర్చేరో యనెను
paDati yunDunDi nEnEmi
pApamu jEsiti nanenu
taDavu ninneDa bAsi
tALa lEnanenu
naDuva nOrADadanenu
nosaTa chEyinchukonenu
aDigite mIrEmaina
nArchErO tIrchErO yanenu
చరణం
charaNam 3
పలవరించుచు మా మువ్వ
గోపాలుడైన వరదుడు
నళినాక్షి! యానాటి వింత
నడుచునో యనెను
తలచి యసురుసురు మనెను
దైవమిట్ల చేసెననెను
వలపనే పాపము పగ
వారికైన గారాదనెను (2)
palavarinchuchu mA muvva
gOpAluDaina varaduDu
naLinAkshi! yAnATi vinta
naDuchunO yanenu
talachi yasurusuru manenu
daivamiTla chEsenanenu
valapanE pApamu paga
vArikaina gArAdanenu (2)

1295 ఇంక నిన్ను inka ninnu

Titleఇంక నిన్నుinka ninnu
Written By
Book
రాగం rAgaమోహనmOhana
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఇంక నిన్ను బోనిత్తునా – యిభరాజ వరదా
శుక వాణి చేత నీ సుద్దు లెల్ల విన్నట్లాయె
inka ninnu bOnittunA – yibharAja varadA
Suka vANi chEta nI suddu lella vinnaTlAye
చరణం
charaNam 1
నవ్వులంట యున్నావేమొ
నా పద్దు చూడు మీసారి
పువ్వు బోడుల చేత
రవ్వ సయించమాన
navvulanTa yunnAvEmo
nA paddu chUDu mIsAri
puvvu bODula chEta
ravva sayinchamAna
చరణం
charaNam 2
జవ్వన మెల్ల నీ పాలు చేసి
చాల నమ్మ యున్నందు
కెవ్వతి తోనో కూడి వచ్చి యిపుడు
లేదని బొంకేవు
javvana mella nI pAlu chEsi
chAla namma yunnandu
kevvati tOnO kUDi vacchi yipuDu
lEdani bonkEvu
చరణం
charaNam 3
పన్నుగ మువ్వ గోపాల
బాసలచ్చి నన్ను గూడి
వన్నెలాడికే లోనైన
వగలెల్ల విన్నార నేడు
pannuga muvva gOpAla
bAsalacchi nannu gUDi
vannelADikE lOnaina
vagalella vinnAra nEDu

1294 ఈ మాట I mATa

Titleఈ మాటI mATa
Written By
Book
రాగం rAgaఘంటారవghanTArava
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఈ మాట వలన ఫలమిక నేమి కద్దుI mATa valana phalamika nEmi kaddu
అనుపల్లవి anupallaviభామరో చాలు మువ గోపాలు పొందే మనకు వద్దుbhAmarO chAlu muva gOpAlu pondE manaku vaddu
చరణం
charaNam 1
వామాక్షిరో! వాడీడకు వచ్చే మనసు లేదు
రామ వాడు రాదలచితే రానిచ్చేది కాదు
ఏమో నాటి కాయా ఫల మింక బని లేదు
నా మేలు వానిపై నింక నాటి యండగ బోతు
vAmAkshirO! vADIDaku vacchE manasu lEdu
rAma vADu rAdalachitE rAnicchEdi kAdu
EmO nATi kAyA phala minka bani lEdu
nA mElu vAnipai ninka nATi yanDaga bOtu
చరణం
charaNam 2
వనజాక్షిరో! వాని కొరకై దిన దిన మీ పోరు
కని విని మీరెందరైన గాదనగ లేరు
చెనకి వానితో నను మోడి చేసుకొమ్మనేరు
చనువు లేని చోట యింత చలమెట్ల యీడేరు
vanajAkshirO! vAni korakai dina dina mI pOru
kani vini mIrendaraina gAdanaga lEru
chenaki vAnitO nanu mODi chEsukommanEru
chanuvu lEni chOTa yinta chalameTla yIDEru
చరణం
charaNam 3
ఎంత లాలించి కూడిన హితవు మాట నున్న
వింత మువ్వ గోపాలుని విధములు నేవిన్న
అంతరంగము శోధించి ఊలసిత నేవిన్న
రంతు సేయక చిత్తము రాయి చేసుకున్న
enta lAlinchi kUDina hitavu mATa nunna
vinta muvva gOpAluni vidhamulu nEvinna
antarangamu SOdhinchi ualasita nEvinna
rantu sEyaka chittamu rAyi chEsukunna

1293 ఇంత నా inta nA

Titleఇంత నాinta nA
Written By
Book
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviఇంత నా పొరుగింటనే తావు లేనట్లెinta nA poruginTanE tAvu lEnaTle
అనుపల్లవి anupallaviఇంతనా పొరుగింటనే ఇంత విజయ రాఘవేంద్రుని మింతintanA poruginTanE inta vijaya rAghavEndruni minta
చరణం
charaNam 1
ప్రొద్దు పోదు గాబోలు నమ్మ దాని
వద్ద నున్న సుద్దులే అందు చేత
నిద్దుర పట్టక నేనుంటా దానికి
ముద్దు మీద ముద్దులే అది
సద్దు వినలేక సఖియ యింట నుండి
proddu pOdu gAbOlu namma dAni
vadda nunna suddulE andu chEta
niddura paTTaka nEnunTA dAniki
muddu mIda muddulE adi
saddu vinalEka sakhiya yinTa nunDi
చరణం
charaNam 2
వారిజ ముఖి ననావలె నంట
కేరడంపు నవ్వులె దానింట క
వారి కుంకుమ కస్తూరి గాక మితి
మేర లేని పువ్వులే
సారెకు నా యింటి వాసన లిందు వచ్చితె
ఓరువ జాలక యువిద యింటనుండిత
vArija mukhi nanAvale nanTa
kEraDampu navvule dAninTa ka
vAri kumkuma kastUri gAka miti
mEra lEni puvvulE
sAreku nA yinTi vAsana lindu vacchite
Oruva jAlaka yuvida yinTanunDita
చరణం
charaNam 3
భావజు కేళి నా పడతి కూడే వేళ
పావురంపు పలుకులే
ఆ వేళ విడువుమని నమ్మిక లిమ్మని
ఆమెకెంత కులుకులే
నా వద్దకి రాడో నాతో మాటాడడో
విజయ రాఘవుడెల మీతో నుండేది
bhAvaju kELi nA paDati kUDE vELa
pAvurampu palukulE
A vELa viDuvumani nammika limmani
Amekenta kulukulE
nA vaddaki rADO nAtO mATADaDO
vijaya rAghavuDela mItO nunDEdi

1292 వదరక పోపోవే vadaraka pOpOvE

Titleవదరక పోపోవేvadaraka pOpOvE
Written By
Book
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviవదరక పోపోవే వాదేల వచ్చీని వద్ద రావద్దనవేvadaraka pOpOvE vAdEla vacchIni vadda rAvaddanavE
అనుపల్లవి anupallaviఅది యొక్క యుగము వేరే జన్మ మిపుడు
అతడెవ్వరో నేనెవ్వరో ఓ చెలియా
adi yokka yugamu vErE janma mipuDu
ataDevvarO nEnevvarO O cheliyA
చరణం
charaNam 1
నిచ్చ నిచ్చలుడే వచ్చొని రేపైన వచ్చీననుచు మదిలో
నిచ్చగాబలు వేడి నిట్టూర్పుల చేత యింతిరో పెదవు తిండి
హెచ్చైన వెన్నెల చిచ్చుల రాత్రులు
యెన్నెన్నో గడిపితినిక నేట మాటలే
niccha nicchaluDE vacchoni rEpaina vacchInanuchu madilO
nicchagAbalu vEDi niTTUrpula chEta yintirO pedavu tinDi
hecchaina vennela chicchula rAtrulu
yennennO gaDipitinika nETa mATalE
చరణం
charaNam 2
వలపుకాడితే కదా వచ్చు ననుచు తెరువులు చూచి వేసారితి
వెల తెరిచి యలసితి నిలువరాని ప్రేమ నెమ్మిది నడచుకొంటి
కలకంఠ పిక నాదములు మించు మధు మాసములు
గడపితే వట్టి ముచ్చటలికనేతే
valapukADitE kadA vacchu nanuchu teruvulu chUchi vEsAriti
vela terichi yalasiti niluvarAni prEma nemmidi naDachukonTi
kalakanTha pika nAdamulu minchu madhu mAsamulu
gaDapitE vaTTi mucchaTalikanEtE
చరణం
charaNam 3
భామరో శకునము లడిగితి మువ్వ గోపాలుడు వచ్చుననుచు
కామించి నాథుని గలయు చెలిల చూచి కరగి చింత నొందితి
రామరామ యీ మేనితో వాని మేమి చూడవలెనా
మొదటి పొందే శాలు వదరక పోపోదే
valapukADitE kadA vacchu nanuchu teruvulu chUcho vEsAriti
vela terichi yalasiti niluvarAni prEma nemmidi naDachukonTi
kalakanTha pika nAdamulu minchu madhu mAsamulu
gaDapitE vaTTi mucchaTalikanEtE

1291 మేరగాదు రమ్మనవే mEragAdu rammanavE

Titleమేరగాదు రమ్మనవేmEragAdu rammanavE
Written By
Book
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviమేరగాదు రమ్మనవే నా సామినిmEragAdu rammanavE nA sAmini
అనుపల్లవి anupallaviమోర తోపు సేయక మువ్వ గోపాల సామినిmOra tOpu sEyaka muvva gOpAla sAmini
చరణం
charaNam 1
అలిగే వారలు లేరో అంతలోనే సమ్మతించి
కలిసే వారు లేరో కలికిరో యిపుడు
చలపట్టి యిందు రాడు చాల మ్రొక్కిన వినడు
వల రాజు బారి కోర్వ వశము గాదో యమ్మ
aligE vAralu lErO antalOnE sammatinchi
kalisE vAru lErO kalikirO yipuDu
chalapaTTi yindu rADu chAla mrokkina vinaDu
vala rAju bAri kOrva vaSamu gAdO yamma
చరణం
charaNam 2
నెనరున నేనొక్కటంటే నెలత యందే నెపము చేసి
అనరాని మాటలాడి అలయించెనే
వనిత మోహాంబుధిలో మునిగి యెట్లోర్చు దాన
తనవంటి సామికిది తగవు కాదే కొమ్మా
nenaruna nEnokkaTanTE nelata yandE nepamu chEsi
anarAni mATalADi alayinchenE
vanita mOhAmbudhilO munigi yeTlOrchu dAna
tanavanTi sAmikidi tagavu kAdE kommA
చరణం
charaNam 3
మమతతో జిన్ననాడే మచ్చిక చేసి నన్ను
సమరతుల నేలినట్టి చనువుగ నను
గమకించి మోవి పంటగంటి జేసితినని
రమణి! మువ్వ గోపాలుడు రాక పరాకు జేసెనే
mamatatO jinnanADE macchika chEsi nannu
samaratula nElinaTTi chanuvuga nanu
gamakinchi mOvi panTaganTi jEsitinani
ramaNi! muvva gOpAluDu rAka parAku jEsenE

1289 పలుకరించిన palukarinchina

Titleపలుకరించినpalukarinchina
Written By
Book
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviపలుకరించిన గాని పలుకక పొయ్యేవు
పడతి నీ గర్వమేమే
palukarinchina gAni palukaka poyyEvu
paDati nI garvamEmE
అనుపల్లవి anupallaviతలచిన వేయారు తరుణుల చేకొన్న
కలిగి గోపాలు చనవలె నటీ నా పేరు
talachina vEyAru taruNula chEkonna
kaligi gOpAlu chanavale naTI nA pEru
చరణం
charaNam 1
తియ్యని కెమ్మైని తేనెలానగను సయ్యాటల
ప్రొద్దు జరుప నోపవా
పయ్యదను తొలగించి పాలిండ్లపై నొక్క
చెయ్యి నేనటు వెయ్య నిచ్చెదనా
tiyyani kemmaini tEnelAnaganu sayyATala
proddu jarupa nOpavA
payyadanu tolaginchi pAlinDlapai nokka
cheyyi nEnaTu veyya nicchedanA
చరణం
charaNam 2
మోము మోమున జేర్చి ముద్దు పెట్టుచు నీవు
వేమారు నన్ను నవ్వించ నోపుదువా
భామరో యొకసారి పలుకులు పలుకుచు
ప్రేమతో రామన్న పిలుప పంపెదవా
mOmu mOmuna jErchi muddu peTTuchu nIvu
vEmAru nannu navvincha nOpuduvA
bhAmarO yokasAri palukulu palukuchu
prEmatO rAmanna pilupa pampedavA
చరణం
charaNam 3
ఎక్కువగా నన్నేలుకొమ్మన్న గ్రక్కున
గళబంట కౌగలించెదవా
మక్కువ తోడుత మువ్వ గోపాల రమ్మని
యొక్కసారైన నను నుండనిచ్చెదవా
ekkuvagA nannElukommanna grakkuna
gaLabanTa kougalinchedavA
makkuva tODuta muvva gOpAla rammani
yokkasAraina nanu nunDanicchedavA