#420 సామి నిన్నే sAmi ninnE

Titleసామి నిన్నేsAmi ninnE
Written Byవీణ పద్మనాభయ్యvINa padmanAbhayya
Bookరసరాజ వైభవrasarAja vaibhava
రాగం rAgaకమాచిkamAchi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviసామి నిన్నే నమ్మినానురా
సామగాన లోల చామ
భూమి పాల జాలమేల
sAmi ninnE namminAnurA
sAmagAna lOla chAma
bhUmi pAla jAlamEla
అనుపల్లవి anupallaviనన్ను కౌగలించుటకు తామసంబు వలదురా
అన్ని నీవైన నాదు విన్నపంబు వినుమురా
తిరిగి జూడరా నన్ను గూడరా
సరసమాడరా కృష్ణరాజ తనయ
వినయ దయా హృదయ
nannu kaugalinchuTaku tAmasambu valadurA
anni nIvaina nAdu vinnapambu vinumurA
tirigi jUDarA nannu gUDarA
sarasamADarA kRshNarAja tanaya
vinaya dayA hRdaya
చరణం
charaNam 1
జలజ నయన జలజ నాభ
సమానమై వెలయు నీవె నాకు దైవము
నీదే ధ్యానము ఓర్వ వశమా
తమకము సార్వభౌమ సకలములకు
jalaja nayana jalaja nAbha
samAnamai velayu nIve nAku daivamu
nIdE dhyAnamu Orva vaSamA
tamakamu sArvabhauma sakalamulaku

#419 పంచ బాణుడు pancha bANuDu

Titleపంచ బాణుడుpancha bANuDu
Written Byమైసూరు సదాశివరావుmaisUru sadASivarAvu
Bookరసరాజ వైభవrasarAja vaibhava
రాగం rAgaపంచ బాణ రాగమాలికpancha bANa rAgamAlika
తాళం tALaఆదిAdi
పల్లవి pallavi** తోడి **
పంచ బాణుడు నాపై వెడలినాడు ఇంక
కొంచమైన సైరించుట వశమా
** tODi **
pancha bANuDu nApai veDalinADu inka
konchamaina sairinchuTa vaSamA
అనుపల్లవి anupallaviనన్ను తోడికొని సరసమాడుటకు
కన్నడ సేయుట నీకు తగునా
nannu tODikoni sarasamADuTaku
kannaDa sEyuTa nIku tagunA
చరణం
charaNam 1
తుమ్మెదలు మ్రోయగ కోకిలలు అమ్మరో కూయగ చిలుకలు
కలకలమని పలుకగ చెంత చేరి నను
చెలిమి జేసి గారవించి కౌగలించి వెతల దీర్చర
సరిగాదు మౌనము సారసాక్ష
tummedalu mrOyaga kOkilalu ammarO kUyaga chilukalu
kalakalamani palukaga chenta chEri nanu
chelimi jEsi gAravinchi kaugalinchi vetala dIrchara
sarigAdu maunamu sArasAksha
చరణం
charaNam 2
** అభోగి **
మదన బాధల దీర్చర రారా కమల
వదన సుందరా భోగసదన
మధురమైన నీ పలుకుల అమృతము
సుదతీ మణి కిచ్చి దయ యుంచరా
** abhOgi **
madana bAdhala dIrchara rArA kamala
vadana sundarA bhOgasadana
madhuramaina nI palukula amRtamu
sudatI maNi kichchi daya yuncharA
చరణం
charaNam 3
** శంకరాభరణం **
అని శంకరాభరణముతో వెలగె
ఘనమైన నీ కర పరిఘములో
పట్టి నన్ను విడువరాదని వేడిన
వట్టి పంతము జేసేవేలరా
** SankarAbharaNam **
ani SankarAbharaNamutO velage
ghanamaina nI kara parighamulO
paTTi nannu viDuvarAdani vEDina
vaTTi pantamu jEsEvElarA
చరణం
charaNam 4
** కాంభోజి **
సరసిజాస్త్రుని బాధ ఇక తాళజాల
రారా కృష్ణ భూపాల
విరహ దాయ కాంభోజ వైరిని
పరిహాసము చాల నరవర తామసమేల
** kAmbhOji **
sarasijAstruni bAdha ika tALajAla
rArA kRshNa bhUpAla
viraha dAya kAmbhOja vairini
parihAsamu chAla naravara tAmasamEla
చరణం
charaNam 5
** సహన **
శాన వయ్యారము జేసిన అతి
మౌనముతో శ్రీ సదాశివుని
ధ్యానములో నుండె నిను కదలించుట
కామునికూ ఇంక సాధ్యమా
** sahana **
SAna vayyAramu jEsina ati
maunamutO SrI sadASivuni
dhyAnamulO nunDe ninu kadalinchuTa
kAmunikU inka sAdhyamA
This jAvaLi has many chittaswara – will be added soon. ఈ జావళిలో పలు చిట్ట స్వరములు కలవు. త్వరలో వాటిని కలుపుతాము.