| Title | చలమేలరా | chalamElarA |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చలమేలరా నా సామి వలపెట్లు నిలుపగలనికను చలమేలరా మనసు దీరగా మాటలాడగా మానితివిది తగునా | chalamElarA nA sAmi valapeTlu nilupagalanikanu chalamElarA manasu dIragA mATalADagA mAnitividi tagunA |
| 2 | కోరినట్ల నీ కోర్కె దీర్చినా కోపగించ తగునా | kOrinaTla nI kOrke dIrchinA kOpagimcha tagunA |
| 3 | కమ్మని విల్తుని గాసి దీర్చరా తమ్మయ భూపాలా | kammani viltuni gAsi dIrcharA tammaya bhUpAlA |
Category: Lyrics
#288 నేరము లెంచక nEramu lemchaka
| Title | నేరము లెంచక | nEramu lemchaka |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | బిళహరి | biLahari |
| తాళం tALa | అట | aTa |
| 1 | నేరము లెంచక కూరిమి తోడను కీరవాణి నేలరా రారా సామి | nEramu lemchaka kUrimi tODanu kIravANi nElarA rArA sAmi |
| 2 | ఘోరమారుని బాధల కోరువలేకను వారిజాక్షి బంపెరా సారెకు మ్రొక్కి | ghOramAruni bAdhala kOruvalEkanu vArijAkshi bamperA sAreku mrokki |
| 3 | మోవి యాననిచ్చి మోహతాపమార్చి ముచ్చటలను దీర్చ రావే వేగమే | mOvi yAnanichchi mOhatApamArchi muchchaTalanu dIrcha rAvE vEgamE |
| 4 | ధరణీ నాయక బుచ్చి తమ్మయ్య ధీరా తరుణిమణీ మదనా సరసాగ్రణి | dharaNI nAyaka buchci tammayya dhIrA taruNimaNI madanA sarasAgraNi |
#287 రమ్మని దెల్పవే rammani delpavE
| Title | రమ్మని దెల్పవే | rammani delpavE |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | రమ్మని దెల్పవే రమ్మని దెల్పవే రమ్మని దెల్పవె రామరో వేగము మారుత మొలసెనే కీరము గూసెనే మారుడు రాసె నేడు మానిని తాళనే | rammani delpavE rammani delpave rammani delpavE rAmarO vEgamu mAruta molasenE kIramu gUsenE mAruDu rAse nEDu mAnini tALanE |
| 2 | ఆ పగరాని నా కోపము చేతను రాపులు జేసిన రాకడ మానెనే | A pagarAni nA kOpamu chEtanu rApulu jEsina rAkaDa mAnenE |
| 3 | సమ్మతిచే బుచ్చి తమ్మయ సామికి కమ్మని వా తెర కానుక యిచ్చెద | sammatichE buchchi tammaya sAmiki kammani vA tera kAnuka yichcheda |
#286 ఏమానెనేమనెనే EmAnenEmanenE
| Title | ఏమానెనేమనెనే | EmAnenEmanenE |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | ఏమానునేమనెనే సామి నీతో ఏమనెనేమానెనే కామినీ నీచేతి కానుక బూనెనే ప్రేమ గలదనెనా | EmAnunEmanenE sAmi nItO EmanenEmAnenE kAminI nIchEti kAnuka bUnenE prEma galadanenA |
| 2 | వేడుకచే నను గూడిన వేళలో నోడినదని చెప్పెనా సామి | vEDukachE nanu gUDina vELalO nODinadani cheppenA sAmi |
| 3 | మచ్చకంటిరొ నేడు బుచ్చి తమ్మయేంద్రుడు విచ్చేతునని బల్కెనా సామి | machchakamTiro nEDu buchchi tammayEmdruDu vichchEtunani balkenA sAmi |
#285 తాళుము వగలేలా tALumu vagalElA
| Title | తాళుము వగలేలా | tALumu vagalElA |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | ఫరుజు | faruju |
| తాళం tALa | ఏక | Eka |
| 1 | తాళుము వగలేలా తామస మింతేలనే చాలుచాలునే ఓ తరుణీ తాళిమి లేకను బాలిక తీరున బాళిని జెంది నన్నేలను దూరెద ఓ లలనా గేలి గాదె యిపుడేలనె యీ తమి | tALumu vagalElA tAmasa mimtElanE chAluchAlunE O taruNI tALimi lEkanu bAlika tIruna bALini jemdi nannElanu dUreda O lalanA gEli gAde yipuDElane yI tami |
| 2 | మారుని బారికి నోరువ లేదని కోరిన సామిని గూరిచినందుకా కీరవాణీ నేరమయ్యె సరివారలు నవ్వెదర | mAruni bAriki nOruva lEdani kOrina sAmini gUrichinamdukA kIravANI nEramayye sarivAralu navvedara |
| 3 | దంతి గమనరో తమ్మయ భూపతి కంతుని కేళిని గలసిన వేళలో వంతులేలా గిలిగింతవేళా అతి వింతలు బల్కెదవు | damti gamanarO tammaya bhUpati kamtuni kELini galasina vELalO vamtulElA giligimtavELA ati vimtalu balkedavu |
#284 పణతీరో వినవమ్మ paNatIrO vinavamma
| Title | పణతీరో వినవమ్మ | paNatIrO vinavamma |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | ద్విజావంతి | dvijAvamti |
| తాళం tALa | అట | aTa |
| 1 | పణతీరో వినవమ్మ పతినీ కేలుబట్టి పాన్పుదార్చు వేళ భయము చేత బెనగి యాతని వెనుక జనరాదుసుమ్మ మనమున దిటమూని మన్నించవలెనమ్మ | paNatIrO vinavamma patinI kElubaTTi pAn&pudArchu vELa bhayamu chEta benagi yAtani venuka janarAdusumma manamuna diTamUni mannimchavalenamma |
| 2 | కపురంపు విడెమిడి కౌగలించరాగ కుపితవై మోముద్రిప్ప గూడదు సుమ్మా కపటమునిడి వేగకదియుట మేలమ్మ నెపమెంచరాదు నీవెపుడు నాధుని పైని | kapurampu viDemiDi kaugalimcharAga kupitavai mOmudrippa gUDadu summA kapaTamuniDi vEgakadiyuTa mElamma nepamemcharAdu nIvepuDu nAdhuni paini |
| 3 | సామి నీ గుబ్బల చందన మలదిన భామా రోరవ శేయ బాడిగాదమ్మ బ్రేమాను వేసవిని విరులు గట్ట రాగ తామసించి తగవు తగదు తగదమ్మా | sAmi nI gubbala chamdana maladina bhAmA rOrava SEya bADigAdamma brEmAnu vEsavini virulu gaTTa rAga tAmasimchi tagavu tagadu tagadammA |
| 4 | ధరణీ నాధుడు బుచ్చి తమ్మయేంద్రుడు మిగుల సరసాగ్రేసరుడె చానరో యతడు దరిజేరి యల్లన తావులంటి సుమశరుని పనులు సేయు తరినిక సరరాదు | dharaNI nAdhuDu buchchi tammayEmdruDu migula sarasAgrEsaruDe chAnarO yataDu darijEri yallana tAvulamTi sumaSaruni panulu sEyu tarinika sararAdu |
#283 జాలమేలరా jAlamElarA
| Title | జాలమేలరా | jAlamElarA |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | దేశీయ తోడి | dESIya tODi |
| తాళం tALa | ఏక | Eka |
| 1 | జాలమేలరా సామి యేలరా పూలవింటి వాని పోరు యేలా సైతురా | jAlamElarA sAmi yElarA pUlavimTi vAni pOru yElA saiturA |
| 2 | మోము జూపరా వేగ మోవి యివ్వరా తామసింపనేల మోహ తాప మార్చరా | mOmu jUparA vEga mOvi yivvarA tAmasimpanEla mOha tApa mArcharA |
| 3 | కౌగిలివ్వరా నాదు కాంక్ష దీర్చరా నాగరాది బంధగతుల నన్ను దేల్చరా | kaugilivvarA nAdu kAmksha dIrcharA nAgarAdi bandhagatula nannu dElcharA |
| 4 | భూమి నాయకా రాజా బుచ్చి తమ్మయా నా మనంబులోన నిన్నే నమ్మి యుంటిరా | bhUmi nAyakA rAjA buchchi tammayA nA manambulOna ninnE nammi yumTirA |
#282 తరుణిరో యినుగంటి taruNirO yinugamTi
| Title | తరుణిరో యినుగంటి | taruNirO yinugamTi |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| 1 | తరుణిరో యినుగంటి తమ్మయ్య వసుంధరా వరునిపై నలుక వలదు రావే వేగము | taruNirO yinugamTi tammayya vasumdharA varunipai naluka valadu rAvE vEgamu |
| 2 | కంతుని నలు నిజయంతుని సొముని వసంతుని నేలిన యెంతో సుందరుడే | kamtuni nalu nijayamtuni somuni vasamtuni nElina yemtO sumdaruDE |
| 3 | వితరణమున ఘనుడె విభవమున యింద్రుడె చతురత యందున చక్రాయుధ ధరుడె | vitaraNamuna ghanuDe vibhavamuna yimdruDe chaturata yamduna chakrAyudha dharuDe |
| 4 | మారుని యాలమున కూరిమిని నాధుడో కోరి తావులంటిన నేరముగాదు సుమ్మ | mAruni yAlamuna kUrimini nAdhuDO kOri tAvulamTina nEramugAdu summa |
#281 భామ మోసపోతినే bhAma mOsapOtinE
| Title | భామ మోసపోతినే | bhAma mOsapOtinE |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | జంపె | jampe |
| 1 | భామ మోసపోతినే సామి మాయామాట విని యేమనందు నేవగచిన యేమి లాభమే | bhAma mOsapOtinE sAmi mAyAmATa vini yEmanamdu nEvagachina yEmi lAbhamE |
| 2 | గబ్బి గుబ్బలదిమి వాని కౌగలించితి ఆసను కౌగలించితి | gabbi gubbaladimi vAni kaugalimchiti Asanu kaugalimchiti |
| 3 | వాలుగంటి మోవి యాని కేళి దేల్చితి మారుని కేళి దేల్చితి మారుని కేళి దేల్చితి | vAlugamTi mOvi yAni kELi dElchiti mAruni kELi dElchiti mAruni kELi dElchiti |
| 4 | బుచ్చి తమ్మయేంద్రుడే వాడతి మోహనాంగుడె వాడతి మోహనాంగుడె మరలిటు మోము జూపడే | buchchi tammayEmdruDE vADati mOhanAmguDe vADati mOhanAmguDe maraliTu mOmu jUpaDE |
#280 చలమేల రార chalamEla rAra
| Title | చలమేల రార | chalamEla rAra |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చలమేల రార ఆ చెలిపై యింత చలమేల రార చిలుకవజీరుని చిలుకుల బారికి పలుమరు తాళదు పాలన సేయర | chalamEla rAra A chelipai yimta chalamEla rAra chilukavajIruni chilukula bAriki palumaru tALadu pAlana sEyara |
| 2 | లలన బేలయై కలయు సమయమున నలగిన నీవిట్లు నారడి సేయన్ | lalana bElayai kalayu samayamuna nalagina nIviTlu nAraDi sEyan |
| 3 | దలచుటేల బుచ్చి తమ్మయ్య భూపాల వలదు జాలము పలసి వలపించక | dalachuTEla buchchi tammayya bhUpAla valadu jAlamu palasi valapimchaka |