| Title | మగువరో నా ముద్దు | maguvarO nA muddu |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| 1 | మగువరో నా ముద్దు మగని మాయల జిక్కి మంచిదంటిని వినవే దిగులేల మనకు సందియము దీరుట మేలు తెగనాడి రమ్ము నే తీరాదానను గానూ | maguvarO nA muddu magani mAyala jikki mamchidanTini vinavE digulEla manaku samdiyamu dIruTa mElu teganADi rammu nE tIrAdAnanu gAnU |
| 2 | మోవియాను వేళ తావులంటిన వేళ నీవి ముట్టిన వేళ నే కౌగలించుచు భావజుదురమున బంధగతుల చేత జీవేశ్వరుని మెప్పించినదెల్లా కల్లలాయె | mOviyAnu vELa tAvulamTina vELa nIvi muTTina vELa nE kaugalimchuchu bhAvajuduramuna bamdhagatula chEta jIvESwaruni meppimchinadellA kallalAye |
| 3 | రానురాను వాని రాకడ యొకతీరుగాను దోచుచునుండె గంటివే నీవు జాణ యెవ్వతొ మంచి సాటువులు బల్కి నివా నన్నెడబాప వలెనని దలచెనో | rAnurAnu vAni rAkaDa yokatIrugAnu dOchuchunumDe gamTivE nIvu jANa yevvato mamchi sATuvulu balki nivA nanneDabApa valenani dalachenO |
| 4 | ధరణీవరుడు బుచ్చి తమ్మయ్య మారసుందరుడని నెరనమ్మి దరి జేసినందుకా దరిలేని మోహనా గరము పాలుజేసి సరకుశేయడతని సరళి దెలసి రమ్మా | dharaNIvaruDu buchchi tammayya mArasumdaruDani neranammi dari jEsinamdukA darilEni mOhanA garamu pAlujEsi sarakuSEyaDatani saraLi delasi rammA |
Category: Lyrics
#278 నీదు పొందుబాసి nIdu pomdubAsi
| Title | నీదు పొందుబాసి | nIdu pomdubAsi |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | శంఖరాభరణం | SankharAbharaNam |
| తాళం tALa | జంపె | jampe |
| 1 | నీదు పొందు బాసి నే నోర్వజాలను వాదేల నిక యేలరా నాతో యిట్టి వాదేల నిక యేలరా | nIdu pomdu bAsi nE nOrvajAlanu vAdEla nika yElarA nAtO yiTTi vAdEla nika yElarA |
| 2 | వాదమేల విరహ వారధి నేనెట్లు నీదుదాన చలమేల వలదు వలదు | vAdamEla viraha vAradhi nEneTlu nIdudAna chalamEla valadu valadu |
| 3 | సురతాయాసమున సొక్కియున్న వేళ యెరుకాలేక నేనేమంటినోగాని సరకు సేతురె కనికరము లేక నాపై సరసాగ్రేసర చాలు బీరములింక | suratAyAsamuna sokkiyunna vELa yerukAlEka nEnEmanTinOgAni saraku sEture kanikaramu lEka nApai sarasAgrEsara chAlu bIramulimka |
| 4 | క్షీరనీరకుచా శ్లేష లక్షణముల కోరికదీర్చర కూరిమి మీరా చేర రార నవచిత్తాజాకారా నేరము సైచి నన్నేలర యికనైన | kshIranIrakuchA SlEsha lakshaNamula kOrikadIrchara kUrimi mIrA chEra rAra navachittAjAkArA nEramu saichi nannElara yikanaina |
| 5 | యినుగంటి సూర్యరాట్తనయా సదయా హృదయా ధన దోపమ బుచ్చి తమ్మయ్య ధీరా మునుపటి వలె వేగమున నన్ను నెనరున నెనయుము నాదు పాలిండ్లు కానుక సేతు | yinugamTi sUryarATtanayA sadayA hRdayA dhana dOpama buchchi tammayya dhIrA munupaTi vale vEgamuna nannu nenaruna nenayumu nAdu pAlimDlu kAnuka sEtu |
#277 యినుగంటి వంశపావన yinugamTi vamSapAvana
| Title | యినుగంటి వంశపావన | yinugamTi vamSapAvana |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | అట | aTa |
| 1 | యినుగంటి వంశపావన బుచ్చి తమ్మయ్య మనుజేంద్రుని బ్రతిమాలితిననవే అనయామాతని మనమున నిల్పినాననవే కనుపండువు సేయమనవే రమ్మనవే | yinugamTi vamSapAvana buchchi tammayya manujEmdruni bratimAliti nanavE anayAmAtani manamuna nilpinAnanavE kanupamDuvu sEyamanavE rammanavE |
| 2 | దానకర్ణుడె విదిత గానాశీలుడె మానీనిగణ నవమారుడె యతడు దీన మందారుడె ధీరోధ్ధతుడె వాని పొందెడబాయలేనే ఓ మానినీ | dAnakarNuDe vidita gAnASIluDe mAnInigaNa navamAruDe yataDu dIna mamdAruDe dhIrOdhdhatuDe vAni pomdeDabAyalEnE O mAninI |
| 3 | వెన్నెల కాకలు వెక్కసములాయె చిన్ని గాడ్పులు వెడలుచున్నావె చెలియా కన్నాడ వలదనవె కరుణా బూనుమనవే వన్నెకానికి వేగ విన్నావించి రావే | vennela kAkalu vekkasamulAye chinni gADpulu veDaluchunnAve cheliyA kannADa valadanave karuNA bUnumanavE vannekAniki vEga vinnAvimchi rAvE |
| 4 | చక్కెర విలుకాని శరములకు నన్ను దక్కాజేయుట తనకు తగదు తగదనవే తక్కకు నా తనువు దారాబోసితి ననవే మక్కువ దీర్చ రమ్మనవే తాళజాల | chakkera vilukAni Saramulaku nannu dakkAjEyuTa tanaku tagadu tagadanavE takkaku nA tanuvu dArAbOsiti nanavE makkuva dIrcha rammanavE tALajAla |
#276 యేమిజేతునే చెలియ yEmijEtunE cheliya
| Title | యేమి జేతునే చెలియ | yEmi jEtunE cheliya |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ఏక | Eka |
| 1 | యేమిజేతునే చెలియ యేమని దెలుపుదు సామి యెంతో మోసాబుచ్చెనే | yEmijEtunE cheliya yEmani delupudu sAmi yemtO mOsAbuchchenE |
| 2 | కామునికేళిని గలసిన దాకా వేమరు బాసలెల్ల వింతగ జేసి కోమలి వింటివే గుట్టు బయలుబెట్టినహా | kAmunikELini galasina dAkA vEmaru bAsalella vimtaga jEsi kOmali vimTivE guTTu bayalubeTTinahA |
| 3 | చక్కగ బల్కుచు సరసను జేర్చి చెక్కిలి నొక్కి యెన్నొ చేష్టలుజేసి అక్కర దీర్చి నన్నరమర జేసునే సామి | chakkaga balkuchu sarasanu jErchi chekkili nokki yenno chEshTalujEsi akkara dIrchi nannaramara jEsunE sAmi |
| 4 | రాజా వెంకట రామరాయా భూపతి యేరామనుగూడి యిటురాక యుండెనే యో జలజాక్షి నా యోగ మెటులుండినదొ | rAjA vemkaTa rAmarAyA bhUpati yErAmanugUDi yiTurAka yumDenE yO jalajAkshi nA yOga meTulunDinado |
#275 మొగమాట మించుకలేక mogamATa mimchukalEka
| Title | మొగమాట మించుకలేక | mogamATa mimchukalEka |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | మోహన | mOhana |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | మొగమాట మించుకలేక పోపొమ్మన దగునా | mogamATa mimchukalEka pOpommana dagunA |
| 2 | వగకాడ నన్నింత తెగనాడుటేలరా మగువా తావలసిన మనసూ రాదటరా | vagakADa nannimta teganADuTElarA maguvA tAvalasina manasU rAdaTarA |
| 3 | మోహము చేతను మోవి యానబోతె మోమటు ద్రిప్పితి వేమిరా నాసామి సాహసమున నిన్ను సందిలి బట్టబోతే చాలు చాలునని సాములు జేసేవు మచ్చకంటెవతైనా మందుబెట్టెనటరా మాటలాడవదేరా మనసు దీరగాను పచ్చవిల్తుని ఘోర బాధల సైచక ముచ్చట దీర్చుమనగ మురసెద వేలరా | mOhamu chEtanu mOvi yAnabOte mOmaTu drippiti vEmirA nAsAmi sAhasamuna ninnu samdili baTTabOtE chAlu chAlunani sAmulu jEsEvu machchakamTevatainA mamdubeTTenaTarA mATalADavadErA manasu dIragAnu pachchaviltuni ghOra bAdhala saichaka muchchaTa dIrchumanaga muraseda vElarA |
| 4 | శ్రీ యినుగంటి కులజేశ శ్రీ ప్రకాశ రాయాత్మజ వేంకట రామ రాయయేరా బాయని ప్రేమను బ్రతిమాలుచుండిన న్యాయముగాదు నన్నారడి సేయుట | SrI yinugamTi kulajESa SrI prakASa rAyAtmaja vEmkaTa rAma rAyayErA bAyani prEmanu bratimAluchumDina nyAyamugAdu nannAraDi sEyuTa |
#274 సామి జాలమేలరా sAmi jAlamElarA
| Title | సామి జాలమేలరా | sAmi jAlamElarA |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | హిందుస్తాని కాఫి | hindustAni kAfi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| 1 | సామి జాలమేలరా సామి జాలమేలరా | sAmi jAlamElarA sAmi jAlamElarA |
| 2 | మోము మోమునందు జేర్చరా మోవి తేనెలాననివ్వరా | mOmu mOmunandu jErcharA mOvi tEnelAnanivvarA |
| 3 | కుచములందు గోరులుంచరా కుస్తరించి కేళి దేల్చరా | kuchamulamdu gOrulumcharA kustarimchi kELi dElcharA |
| 4 | కామబాధ కోర్వజాలరా రామరాయ ప్రేమనేలరా | kAmabAdha kOrvajAlarA rAmarAya prEmanElarA |
#273 వెలదిరో veladirO
| Title | వెలదిరో | veladirO |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | అట | aTa |
| 1 | వెలదిరో యినుగంటి వెంకట రామరాయ విభుని తోడి తేగదే ఓ చెలియా విభుని తోడి తేగదే తేగదే | veladirO yinugamTi vemkaTa rAmarAya vibhuni tODi tEgadE O cheliyA vibhuni tODi tEgadE tEgadE |
| 2 | ఘోర సుమశరా సారములోబడి ఓరువదని దెల్పవే ఓ చెలియా ఓరువదని దెల్పవే దెల్పవే | ghOra sumaSarA sAramulObaDi Oruvadani delpavE O cheliyA Oruvadani delpavE delpavE |
| 3 | ఆ సమీరతానధరా చుంబనమును జేసినది యాది శేయవే ఓ చెలియా జేసినది యాది సేయవే సేయవే | A samIratAnadharA chumbanamunu jEsinadi yAdi SEyavE O cheliyA jEsinadi yAdi sEyavE sEyavE |
| 4 | నాదు చక్కెర మోవి మీదుగట్టితి ననవే వాదాములిక చాలనవే ఓ చెలియా వాదములిక చాలనవే చాలనవే | nAdu chakkera mOvi mIdugaTTiti nanavE vAdAmulika chAlanavE O cheliyA vAdamulika chAlanavE chAlanavE |
| 5 | నా భూవిభుని వేగ నన్ను గూర్చిన కనకాభిషేకము జేసెద ఓ చెలియా కనకాభిషేకము జేసెద చేసెద | nA bhUvibhuni vEga nannu gUrchina kanakAbhishEkamu jEseda O cheliyA kanakAbhishEkamu jEseda chEseda |
#272 ఏటీకె యీ తగవు ETIke yI tagavu
This is the first jAvaLi from this book
| Title | ఏటీకె యీ తగవు | ETIke yI tagavu |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | భయిరవి | bhayiravi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| 1 | ఏటీకె యీ తగవు మాటిమాటికి నాతో సాటివారు గేలి సలుపాగనూ బోటీరొ నా ప్రియుని మాటాలు వింటివె నీటీపై వ్రాతాయె నేనేమి సేతూ | ETIke yI tagavu mATimATiki nAtO sATivAru gEli salupAganU bOTIro nA priyuni mATAlu vinTive nITIpai vrAtAye nEnEmi sEtU |
| 2 | అక్కార దీర్చి నన్నాదరింతు నాని చెక్కిలిబట్టి తాజేసిన బాస రొక్కాపు మూటాయె లోకాపవాదాయె యెక్కడి స్నేహ మింకెక్కడి ప్రేమా | akkAra dIrchi nannAdarimtu nAni chekkilibaTTi tAjEsina bAsa rokkApu mUTAye lOkApavAdAye yekkaDi snEha mimkekkaDi prEmA |
| 3 | తుంటవింటివాడు తూపూలు నా యెద జంటనేయ సైచజాలానితరిని కంటబడని వాని కాపురమిక నేలా రెంటా జెడిన నావంటిదిలగలదా | tumTavimTivADu tUpUlu nA yeda jamTanEya saichajAlAnitarini kamTabaDani vAni kApuramika nElA remTA jeDina nAvamTidilagaladA |
| 4 | రాజా వేంకట రామారాయ భూపాలుడు భోజరాజ రాజరాజ నిభుడనియా రాజీవాయతనేత్రి రాయబారము సేయ యాజీవమని నమ్మినందుల కిటులాయెనే | rAjA vEmkaTa rAmArAya bhUpAluDu bhOjarAja rAjarAja nibhuDaniyA rAjIvAyatanEtri rAyabAramu sEya yAjIvamani namminamdula kiTulAyenE |
#271 పొమ్మనవే వాని దానింటికి pommanavE vAni dAnimTiki
| Title | పొమ్మనవే వాని దానింటికి | pommanavE vAni dAnimTiki |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కమాస్ | kamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | పొమ్మనవే వాని దానింటికి | pommanavE vAni dAnimTiki |
| చరణం charaNam 1 | సవతితో ఏ వేళను సరసములాడుచును వలలో జిక్కిన వాని పిలచి పిలచి ఏమో | savatitO E vELanu sarasamulADuchunu valalO jikkina vAni pilachi pilachi EmO |
| చరణం charaNam 2 | ప్రియముతో చామేంద్రుడు నన్ను దలచి అపుడు మరచినాడు యెవతో బోధన చేత | priyamutO chAmEndruDu nannu dalachi apuDu marachinADu yevatO bOdhana chEta |
#270 చెలువుని రా రమ్మనవే cheluvuni rA rammanavE
| Title | చెలువుని రా రమ్మనవే | cheluvuni rA rammanavE |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | తిశ్రనడ ఆది | tiSranaDa Adi |
| పల్లవి pallavi | చెలువుని రా రమ్మనవే ఓ చెలియరో | cheluvuni rA rammanavE O cheliyarO |
| అనుపల్లవి anupallavi | వారిజముఖి పగవారి బోధనచే సారెకు నాపై నేరమెంచగ నిక | vArijamukhi pagavAri bOdhanachE sAreku nApai nEramemchaga nika |
| చరణం charaNam 1 | కోరిన సామి ఈ దారి వచ్చేను గాదే నారీమణి రారాయే పారమేమిక నిక | kOrina sAmi I dAri vachchEnu gAdE nArImaNi rArAyE pAramEmika nika |
| చరణం charaNam 2 | అందరివలె నన్ను నిందలు సేయక సుందరీ చామ రాజేంద్రుని వలచితి | amdarivale nannu nimdalu sEyaka sumdarI chAma rAjEmdruni valachiti |