#248 లింగా నీకిదె limgA nIkide

Titleలింగా నీకిదె (ప్రతి) మంగళంlimgA nIkide (prati) mamgaLam
Written By
BookprAchIna-navIna
రాగం rAgaఆనందభైరవిAnandabhairavi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
లింగా నీకిదె మంగళం వృషతు
రంగా నీకిదె మంగళం
limgA nIkide mamgaLam vRshatu
ramgA nIkide mamgaLam
చరణం
charaNam 1
లింగా వృషభతురంగా చక్రవిభంగా
కరుణాంతరంగ జయశివ
limgA vRshabhaturamgA chakravibhamgA
karuNAmtaramga jayaSiva
చరణం
charaNam 2
వృత్రాసురహర స్తోత్ర భవ్యచారిత్రా
పరమపవిత్రా పురహర
vRtrAsurahara stOtra bhavyachAritrA
paramapavitrA purahara
చరణం
charaNam 3
దక్ష పాపవిమోక్షా జ్ఞానపరోక్షా
భక్త సంరక్షా ఫాలాక్ష
daksha pApavimOkshA jnAnaparOkshA
bhakta sam^rakshA phAlAksha
చరణం
charaNam 4
సోమా రేపలెధామా సంగరభీమ
నిర్జితకామ రామేశ
sOmA rEpaledhAmA samgarabhIma
nirjitakAma rAmESa
చరణం
charaNam 5
నాగభూషణ భోగనుతపాల
భాగానిలయశ్రీ భోగి కంకణ
nAgabhUshaNa bhOganutapAla
bhAgAnilayaSrI bhOgi kamkaNa
ప్రాచీన జావళీలు సంపూర్ణము

With this, we completed sharing all the works from the book – “prAchIna-navIna jAvaLIlu”
Next one will be from a different, old book.

#247 రంగా నీకిదె ramgA nIkide

Titleరంగా నీకిదెramgA nIkide
Written By
BookprAchIna-navIna
రాగం rAgaఆనందభైరవిAnamdabhairavi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
రంగా నీకిదె మంగళం జయ
రంగా ఖగరాత్తు రంగా కలుసావిభంగా
నవమోహనాంగా వయ్యారి
ramgA nIkide mangaLam jaya
ramgA khagarAttu ramgA kalusAvibhamgA
navamOhanAmgA vayyAri
చరణం
charaNam 1
హరివిభుదా విహారి ఉభయ
కావేరీ తీర విహారి వయ్యారి
harivibhudA vihAri ubhaya
kAvErI tIra vihAri vayyAri
చరణం
charaNam 2
అన్నా యితరుల నెన్నా యెవరు నీకన్నా నను బ్రోవుమన్నా వయ్యారిannA yitarula nennA yevaru nIkannA nanu brOvumannA vayyAri
చరణం
charaNam 3
లీలా శేషాంశు సీలా కరుణాలవాల
జగపరిపాల వయ్యారి
lIlA SEshAmSu sIlA karuNAlavAla
jagaparipAla vayyAri
చరణం
charaNam 4
అయ్యావరమకీయ్యా నిను నమ్మితయ్యా నను బ్రోవుమయ్యా వయ్యారిayyAvaramakIyyA ninu nammitayyA nanu brOvumayyA vayyAri
చరణం
charaNam 5
హాసా వన చిద్విలాసా శేషాచల
దాసార్చిత పరమేశా వయ్యారి
hAsA vana chidvilAsA SEshAchala
dAsArchita paramESA vayyAri

#245 నేను నీదాననా nEnu nIdAnanA

Titleనేను నీదాననాnEnu nIdAnanA
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశంకరాభరణంSamkarAbharaNam
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
నేను నీదాననా మేను నీదేనుర
నీనా సందున వేరేనాడు దానర
nEnu nIdAnanA mEnu nIdEnura
nInA samduna vErEnADu dAnara
చరణం
charaNam 1
ఎన్నడు నీమాట కెదురాడలేదుర
మన్నించి తిన్నగ మాటాడవేమిర
ennaDu nImATa kedurADalEdura
mannimchi tinnaga mATADavEmira
చరణం
charaNam 2
ఓరి నాసామి నేకోరితిరా నిన్నే
తీరైన గుబ్బలి గోరులుంచ రార
Ori nAsAmi nEkOritirA ninnE
tIraina gubbali gOrulumcha rAra
చరణం
charaNam 3
భాసుర వేణు గోపాల దయావాల
దాసు శ్రీరాముని దయ నేలవదేల
bhAsura vENu gOpAla dayAvAla
dAsu SrIrAmuni daya nElavadEla

#246 రారా నా కోర్కె rArA nA kOrke

Titleరారా నా కోర్కె (ప్రతి)rArA nA kOrke (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
రారా నా కోర్కెలీరా ధీర
మారకోటి సుకుమారా శరీరా
rArA nA kOrkelIrA dhIra
mArakOTi sukumArA SarIrA
చరణం
charaNam 1
దంతిరాడ్వరద నిన్నెంత వేడినను
పంతమేల జేసేవు భావజ జనకహరి
damtirADvarada ninnemta vEDinanu
pamtamEla jEsEvu bhAvaja janakahari
చరణం
charaNam 2
సన్నుతాకార శ్రీ సారస భవనుత
పన్నగశయన యీ కన్నడేల జేసేవుర
sannutAkAra SrI sArasa bhavanuta
pannagaSayana yI kannaDEla jEsEvura
చరణం
charaNam 3
రారా రమ్మని రామనే బిలిచిన
సారసాక్ష యింత జాగేల జేసేవుర
rArA rammani rAmanE bilichina
sArasAksha yimta jAgEla jEsEvura
చరణం
charaNam 4
నందకుమారక శ్రీ నాగభూషణ కవి
యందున దయయుంచి యాదరించి బ్రోవర
namdakumAraka SrI nAgabhUshaNa kavi
yamduna dayayumchi yAdarimchi brOvara

#244 జాణర అలివేణి jANara alivENi

Titleజాణర అలివేణి (ప్రతి)jANara alivENi (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
జాణర అలివేణిరా పూబోణి పల్లవపాణిర
దానిగూడని జన్మమేలర మానినీమణిమేలరా
jANara alivENirA pUbONi pallavapANira
dAnigUDani janmamElara mAninImaNimElarA
చరణం
charaNam 1
సారసంబును బోలురా కమలారి నపహసించురా
సారసాక్షి ముఖము ముకురము మీరురా వహవ్వారిరా
sArasambunu bOlurA kamalAri napahasimchurA
sArasAkshi mukhamu mukuramu mIrurA vahavvArirA
చరణం
charaNam 2
కలువలకు సమమౌనురా మరు ఘనత బాణము వేలురా
కలికి కన్నుల నెంచునో రంగముల దూరుచుండురా
kaluvalaku samamaunurA maru ghanata bANamu vElurA
kaliki kannula nemchunO ramgamula dUruchumDurA
చరణం
charaNam 3
లికుచఫలముల గేరురా గిరిలీలలను బహునెంచురా
ప్రకటితంబుగ దాని కుచములు బంగరు కలశములురా
likuchaphalamula gErurA girilIlalanu bahunemchurA
prakaTitambuga dAni kuchamulu bamgaru kalaSamulurA
చరణం
charaNam 4
సుందరీ కందర్పుడు శరబృందములు మరివేయగా
డెందమందున నోర్వకను తమిజెంది తల్పమునొందెరా
sumdarI kamdarpuDu SarabRmdamulu marivEyagA
Demdamamduna nOrvakanu tamijemdi talpamunomderA
చరణం
charaNam 5
సరసిజాక్షి నాగభూషణ సన్నుత కరుణాకర
తరుణి తోడను మారుకేళిని దేలు రేపలె పురవరా
sarasijAkshi nAgabhUshaNa sannuta karuNAkara
taruNi tODanu mArukELini dElu rEpale puravarA

#243 రాములు శ్రీరాములు rAmulu SrIrAmulu

Titleరాములు శ్రీరాములుrAmulu SrIrAmulu
Written By
BookprAchIna-navIna
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
రాములు శ్రీరాములు హో రాములు నా బాములు
ప్రేమతో తొలిగించి బ్రోచి కామితార్థములివ్వరా
rAmulu SrIrAmulu hO rAmulu nA bAmulu
prEmatO toligimchi brOchi kAmitArthamulivvarA
చరణం
charaNam 1
బువ్వకై రుసుమిచ్చె రహితుల యివ్వవద్దన్నారురా
గవ్వ దొరుకదు మాకు భత్యఖర్చు లెవరిస్తారురా
buvvakai rusumichche rahitula yivvavaddannArurA
gavva dorukadu mAku bhatyakharchu levaristArurA
చరణం
charaNam 2
ఆలుబిడ్డల విడచి పరదేశాలు దిరుగలేనురా
చాలగా శెలవిచ్చి పంపితే మేలుగా మ్రొక్కేనురా
AlubiDDala viDachi paradESAlu dirugalEnurA
chAlagA Selavichci pampitE mElugA mrokkEnurA
చరణం
charaNam 3
పచ్చి తురకల యిచ్చు కత్తుల పారవుంచినారురా
గిరిగీసి గిరిలోను నిలువబెట్టినారురా
pachchi turakala yichchu kattula pAravumchinArurA
girigIsi girilOnu niluvabeTTinArurA

#242 పరమేశ్వర paramESvara

Titleపరమేశ్వర (ప్రతి) మంగళంparamESvara (prati) mangaLam
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
పరమేశ్వర కరుణాకర శ్రీకర
మురహర జయమంగళం శౌరీ హరి
paramESvara karuNAkara SrIkara
murahara jayamamgaLam SaurI hari
చరణం
charaNam 1
సరసిజభవతోష సన్మృదువేష
నిరవయ నిర్విశేష సుభాష
sarasijabhavatOsha sanmRduvEsha
niravaya nirviSEsha subhAsha
చరణం
charaNam 2
చక్రశాఙ్ర్గధర చక్రాంచితభర
చక్రశశి యనవర సర్వేశ్వర
chakraSA~mrgadhara chakrAmchitabhara
chakraSaSi yanavara sarvESvara
చరణం
charaNam 3
కారణకారణ కలుష విమర్ద స
కౄర దైత్యహరణ నారాయణ
kAraNakAraNa kalusha vimarda sa
kRUra daityaharaNa nArAyaNa
చరణం
charaNam 4
ధరరేపలె పురవర ఖేల భూధర
పరమపూరుష ధీర దామోదర
dhararEpale puravara khEla bhUdhara
paramapUrusha dhIra dAmOdara
చరణం
charaNam 5
నాగభూష పాల నవ్యగానలోల
రాగము చే రా వేలా రాజగోపాల
nAgabhUsha pAla navyagAnalOla
rAgamu chE rA vElA rAjagOpAla

#241 నిమిజాం nimijAm

TitleనిమిజాంnimijAm
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
నిమిజాం శ్రీ గణనాధ గజానన
మంగళదాయక హా ఆలరేయాల
nimijAm SrI gaNanAdha gajAnana
mamgaLadAyaka hA AlarEyAla
చరణం
charaNam 1
శుక్లాంబరకోటి మూషకవాహ
మంతక మకుటమడలరు రేయాల
SuklAmbarakOTi mUshakavAha
mamtaka makuTamaDalaru rEyAla
చరణం
charaNam 2
పాశాంకుశధర మోదక జాకరే
విఘ్న వినాశిత పాలరెయాల
pASAmkuSadhara mOdaka jAkarE
vighna vinASita pAlareyAla
చరణం
charaNam 3
హరిగోవింద శ్రీ నిజసుఖదాత
భక్తవత్సల ప్రతిపాల రేయాల
harigOvimda SrI nijasukhadAta
bhaktavatsala pratipAla rEyAla

#240 రారా శివశంకర rArA SivaSamkara

Titleరారా శివశంకర (ప్రతి)rArA SivaSamkara (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
రారా శివశంకర నన్ను రక్షించు గంగాధరrArA SivaSamkara nannu rakshimchu gamgAdhara
చరణం
charaNam 1
యే పాపముజేసితి నికనెట్లెయిన నీవేగతిyE pApamujEsiti nikaneTleyina nIvEgati
చరణం
charaNam 2
పతితుల బ్రోవలేదా నన్ను భక్తులలో జేర్చరాదpatitula brOvalEdA nannu bhaktulalO jErcharAda
చరణం
charaNam 3
మాతంగ చర్మచేల సన్మానిత భక్తపాలాmAtamga charmachEla sanmAnita bhaktapAlA
చరణం
charaNam 4
జాలముసేయ రాదా యో సర్వేశ్వరా మ్రొక్కెదjAlamusEya rAdA yO sarvESvarA mrokkeda
చరణం
charaNam 5
అన్యుల వేడబోను వేడక నాపదల జెందలేనుanyula vEDabOnu vEDaka nApadala jemdalEnu
చరణం
charaNam 6
పూర్వజన్మ ప్రారభ్ధము బాధ బుట్టించె నన్నేలుముpUrvajanma prArabhdhamu bAdha buTTimche nannElumu
చరణం
charaNam 7
పద్మాసంజాతభంగ అనంతపల్లి శ్రీ వేగిలింగాpadmAsamjAtabhamga anamtapalli SrI vEgilimgA
చరణం
charaNam 8
కొండగూంటూరి నాగభూషణ కోవిదుని బ్రోవవేగాkomDagUmTUri nAgabhUshaNa kOviduni brOvavEgA

#239 రారా రాజగోపాల rArA rAjagOpAla

Titleరారా రాజగోపాలrArA rAjagOpAla
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
రారా రాజగోపాల నన్ను రక్షించ రావదేలాrArA rAjagOpAla nannu rakshimcha rAvadElA
చరణం
charaNam 1
కారుణ్య మూర్తివని నిన్నే కడువడి నమ్మితినీkAruNya mUrtivani ninnE kaDuvaDi nammitinI
చరణం
charaNam 2
పారావార గంభీర నాతో పలుకవేమనందురాpArAvAra gambhIra nAtO palukavEmanamdurA
చరణం
charaNam 3
గ్రక్కున నను గావరా నిన్ను మక్కువతో నమ్మితిరాgrakkuna nanu gAvarA ninnu makkuvatO nammitirA
చరణం
charaNam 4
సమ్మతి తోడ నను నా సామి దయనేలుముsammati tODa nanu nA sAmi dayanElumu
చరణం
charaNam 5
మురహరి యేచకురా నీ ముద్దుమోము జూపరాmurahari yEchakurA nI muddumOmu jUparA
చరణం
charaNam 6
అన్నా వీరరాఘవా సుప్రసన్నా క్రన్నన బ్రోవాannA vIrarAghavA suprasannA krannana brOvA
చరణం
charaNam 7
ధర సికింద్రాపురీశా నేరమేరా జేసితిలెసdhara sikindrApurISA nEramErA jEsitilesa
చరణం
charaNam 8
నీ సుదర్శనమివ్వరా రామానుజదాసు గదరాnI sudarSanamivvarA rAmAnujadAsu gadarA