#228 భామ రావే bhAma rAvE

Titleభామ రావే (ప్రతి)bhAma rAvE (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
భామ రావే భయము నీకేలే
కాముని కేళికి కరుణ జూచి యిటు
bhAma rAvE bhayamu nIkElE
kAmuni kELiki karuNa jUchi yiTu
చరణం
charaNam 1
యింత నాపై పంతమిదేలే
కంతుని బారికి గాసిజెందితిని
yimta nApai pamtamidElE
kamtuni bAriki gAsijemditini
చరణం
charaNam 2
చిన్ననాడె నీ చిన్నెలు జూచి
కన్నెరో నిను వలచియున్న వాడనిక
chinnanADe nI chinnelu jUchi
kannerO ninu valachiyunna vADanika
చరణం
charaNam 3
ఆసతో మున్ను జేసిన బాసలు
మోసములాయెనే వో సఖి వినవే
AsatO munnu jEsina bAsalu
mOsamulAyenE vO sakhi vinavE
చరణం
charaNam 4
యింత నిర్దయ నీకేల గల్గెనే
దంతి గమన నీ దయను విడువకను
yimta nirdaya nIkEla galgenE
damti gamana nI dayanu viDuvakanu
చరణం
charaNam 5
సుందరివని భ్రమ జెందితినిపుడే
పొందుగోరి నాయందు నెపముంచక
sumdarivani bhrama jemditinipuDE
pomdugOri nAyamdu nepamumchaka
చరణం
charaNam 6
చిత్రబంధముల చేతను రతి జేయ
స్తోత్రము జేసితి తోయజముఖి యిటు
chitrabandhamula chEtanu rati jEya
stOtramu jEsiti tOyajamukhi yiTu
చరణం
charaNam 7
వాదము సేయక వదనము జూపవే
నీదు చెలిమియును నిక్కము నమ్మితి
vAdamu sEyaka vadanamu jUpavE
nIdu chelimiyunu nikkamu nammiti
చరణం
charaNam 8
యెప్పుడు మదిలో నేమరకను నే
తప్పక దలచితి నిప్పుడు దయతో
yeppuDu madilO nEmarakanu nE
tappaka dalachiti nippuDu dayatO
చరణం
charaNam 9
అరమరలేలనె అతివరొ వినవే
కరుణ జూచి యిక కఠినము సేయక
aramaralElane ativaro vinavE
karuNa jUchi yika kaThinamu sEyaka
చరణం
charaNam 10
నాగభూషణుని వేగమె బ్రోచిన
భోగిశయనుడను భోగించుటకును
nAgabhUshaNuni vEgame brOchina
bhOgiSayanuDanu bhOgimchuTakunu

#227 భజమన bhajamana

Again, the poet started with his prati for each original jAvaLi in the rest of this book.

Titleభజమనbhajamana
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
భజమనరామ కా ఉమఖ నామbhajamanarAma kA umakha nAma
తారకనామ పావనరామtArakanAma pAvanarAma
చరణం
charaNam 1
అజసోహవుఠే హుడుంబియా కే
కయిత కఫీరే మాయకుఠారే
ajasOhavuThE huDumbiyA kE kayita kafIrE mAyakuThArE

Here’s our attempt to improve/correct the lyrics.

భజ మన రమ కోఉ ముఖ నామbhaja mana rama kOu mukha nAma
తారక నామ పావనtAraka nAma pAvana
అజ సోహ ఉఠేహుం డుబియాకే
కహత కపీరే మాయ కుఠారే
aja sOha uThEhum DubiyAkE
kahata kapIrE mAya kuThArE

#226 యేర సామి yEra sAmi

Titleయేర సామిyEra sAmi
Written By
BookprAchIna-navIna
రాగం rAgaధన్యాసిdhanyAsi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యేరసామి నీ మనసేల గరుగదేర ధీరyErasAmi nI manasEla garugadEra dhIra
చరణం
charaNam 1
సారసాక్షి నిన్ను మది
చాల కోరియున్నదిర
sArasAkshi ninnu madi
chAla kOriyunnadira
చరణం
charaNam 2
నిన్ను నమ్మియున్నదాని
నన్నదేల జేసేవుర
ninnu nammiyunnadAni
nannadEla jEsEvura
చరణం
charaNam 3
ధరణి నరసాపుర విహారా
తరుణి గరుణ నేలవేరా
dharaNi narasApura vihArA
taruNi garuNa nElavErA

#225 యో చెలి yO cheli

Titleయో చెలిyO cheli
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaజుల్వాjulvA
పల్లవి
pallavi
యో చెలి యో చెలి యో చెలి యో చెలీ
యీ చలంబేల జేసెద
yO cheli yO cheli yO cheli yO chelI
yI chalambEla jEseda
చరణం
charaNam 1
పంతగించి సామి నను పగగ నెంచెనే
కంతుని కేళిలోన వాని కలియ జేయవే చెలి
pamtagimchi sAmi nanu pagaga nemchenE
kamtuni kELilOna vAni kaliya jEyavE cheli
చరణం
charaNam 2
యింతి బోధనలు విని యేమరకను దానిగూడి
కాంతుడు యిందువచ్చి నాపై కరుణ జూడడే చెలి
yimti bOdhanalu vini yEmarakanu dAnigUDi
kAmtuDu yimduvachchi nApai karuNa jUDaDE cheli
చరణం
charaNam 3
సారసాక్షి సామిగూర్చితే రమణిరో వినుము
శృంగారపు సొమ్ములిచ్చెదను కరుణ నేలవే చెలి
sArasAkshi sAmigUrchitE ramaNirO vinumu
SRmgArapu sommulichchedanu karuNa nElavE cheli
చరణం
charaNam 4
ధరణి నరసాపుర విహారుని ఉరగరచిత భూషణునీ
తరుణి యెడల కరుణ నుంచి దయను గూడమనవె చెలి
dharaNi narasApura vihAruni uragarachita bhUshaNunI
taruNi yeDala karuNa numchi dayanu gUDamanave cheli

#224 సరసుడ sarasuDa

TitleసరసుడsarasuDa
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశ్రీSrI
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సరసుడ నీ పొందు చాలునులేరా
విరిబోణిని మది వీడకుండుమురా
sarasuDa nI pomdu chAlunulErA
viribONini madi vIDakumDumurA
చరణం
charaNam 1
గొప్ప కన్నుల నిద్దుర గప్పియున్నదిర
అప్పుడతివేణితో నప్పళించెనే రా
goppa kannula niddura gappiyunnadira
appuDativENitO nappaLinchenE rA
చరణం
charaNam 2
ఘనతగు నీ మేన గంధమలదెనురా
అనయము నీ శిఖ యలరు లే వీర
ghanatagu nI mEna gandhamaladenurA
anayamu nI Sikha yalaru lE vIra
చరణం
charaNam 3
ఆ సఖి గూడిన యంకములివిరా
రసికుడ యిచటికి రారాదు పోపోరా
A sakhi gUDina yamkamulivirA
rasikuDa yichaTiki rArAdu pOpOrA
చరణం
charaNam 4
ధరణి శ్రీ రేపలె పురవర వినరా
కరుణాకర చిహ్నగనుగొంటి గదర
dharaNi SrI rEpale puravara vinarA
karuNAkara chihnaganugomTi gadara

#223 సరసుని sarasuni

Titleసరసునిsarasuni
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశహనSahana
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
సరసుని తోడితేవే చానా నా మాటవిని
మరుబారి కోర్వలేను మగువ చలము మాను
sarasuni tODitEvE chAnA nA mATavini
marubAri kOrvalEnu maguva chalamu mAnu
చరణం
charaNam 1
గండుకోవెలలు గూయ కమలాలు శాకసేయ
మెండు తుమ్మెదలు మ్రోయ గుండె ఝల్‌ఝల్‌మనెనే
ganDukOvelalu gUya kamalAlu SAkasEya
menDu tummedalu mrOya gunDe jhal^jhal^manenE
చరణం
charaNam 2
ఆసతోడుత మునుజేసిన బాసలను
బాసి యుండిన నినుబాసి యోర్వలేదను
AsatODuta munujEsina bAsalanu
bAsi yumDina ninubAsi yOrvalEdanu
చరణం
charaNam 3
మదిరాక్షి వానిని నెమ్మదిలో దలచిన సుంత
ముదము ఘటించెనని ముదిత వచించెనని
madirAkshi vAnini nemmadilO dalachina sumta
mudamu ghaTimchenani mudita vachimchenani
చరణం
charaNam 4
వామాక్షి వినవే రావు వంశోదధిసోముడైన
కామితమిచ్చెడు గంగాధర రామరాజ
vAmAkshi vinavE rAvu vamSOdadhisOmuDaina
kAmitamichcheDu gamgAdhara rAmarAja

#222 భామిని bhAmini

TitleభామినిbhAmini
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకాంభోదిkAmbhOdi
తాళం tALaజుల్వాjulvA
పల్లవి
pallavi
భామిని నా సామినిందు
ప్రేమతో రమ్మనవే
bhAmini nA sAminimdu
prEmatO rammanavE
కాముని విరిశరములకును కలికి తాళననవేkAmuni viriSaramulakunu kaliki tALananavE
చరణం
charaNam 1
పవనుడు చెలరేగి చాలబాధ నొందజేసెనే
యువిదరొ నాధుడు రాకయున్న విధము దోచెనే
pavanuDu chelarEgi chAlabAdha nomdajEsenE
yuvidaro nAdhuDu rAkayunna vidhamu dOchenE
చరణం
charaNam 2
అలుకజేసియే తరుణినొ యాదరించిగూడెనె
పలువిధముల నెనరులేక పడతిరో నను వీడెనే
alukajEsiyE taruNino yAdarimchigUDene
paluvidhamula nenarulEka paDatirO nanu vIDenE
చరణం
charaNam 3
నాగభూషణావనుడిటు నలువురిలో
మిగులా వోగుజేయదలచి యా యువతి వలలో దగుల
nAgabhUshaNAvanuDiTu naluvurilO
migulA vOgujEyadalachi yA yuvati valalO dagula

#221 చాలునె చాలునె chAlune chAlune

Titleచాలునె చాలునెchAlune chAlune
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
చాలునె చాలునె మోహము
బాలరో మున్జేసిన బాసలేమాయనే
chAlune chAlune mOhamu
bAlarO mun&jEsina bAsalEmAyanE
చరణం
charaNam 1
విడదికి రమ్మని వెలదిని బంపిన
పడతిరో రాకను పంతము లేలనే
viDadiki rammani veladini bampina
paDatirO rAkanu pamtamu lElanE
చరణం
charaNam 2
స్నేహమే స్థిరమని చెలియ నే నమ్మియు
మోహము నే జెందిన మోసము లాయనే
snEhamE sthiramani cheliya nE nammiyu
mOhamu nE jemdina mOsamu lAyanE
చరణం
charaNam 3
ప్రేమరహితులకు ప్రీతియు గల్గునె
భామిని యీ చెలిమి బాగాయనే చెలి
prEmarahitulaku prItiyu galgune
bhAmini yI chelimi bAgAyanE cheli
చరణం
charaNam 4
రసికుడౌ రేపలె రాజగోపాలుని
వసుధలో నింత వంచన జేసితౌ
rasikuDou rEpale rAjagOpAluni
vasudhalO nimta vamchana jEsitau

#220 వేగమె నాధుని vEgame nAdhuni

Titleవేగమె నాధునిvEgame nAdhuni
Written By
BookprAchIna-navIna
రాగం rAgaసురటsuraTa
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
వేగమె నాధుని దేవేమనంటునే చెలి
జాగేలను మరుబారికి చాన నిలువజాలనే
vEgame nAdhuni dEvEmananTunE cheli
jAgElanu marubAriki chAna niluvajAlanE
చరణం
charaNam 1
తుమ్మెదలును రొదలు సేయ తుహినాంశుడు మరిగాయ
కమ్మవిల్తుడు శరమువేయ ఘనముగాను వాయువేయ
tummedalunu rodalu sEya tuhinAmSuDu marigAya
kammaviltuDu SaramuvEya ghanamugAnu vAyuvEya
చరణం
charaNam 2
చిన్ననాటనుండి విభుడెన్నడు దయ విడనాడి
కన్నెలతో చెలిమి జేసియున్న వాడుకాడే చెలి
chinnanATanumDi vibhuDennaDu daya viDanADi
kannelatO chelimi jEsiyunna vADukADE cheli
చరణం
charaNam 3
వారిజాక్షి వల్లూరి వంశాబ్ధి సోముడైన
సారెకు శ్రీ పురుషోత్తమ సన్నుత గుణశాలి నిటు
vArijAkshi vallUri vamSAbdhi sOmuDaina
sAreku SrI purushOttama sannuta guNaSAli niTu

#219 సరసిజముఖి sarasijamukhi

Titleసరసిజముఖిsarasijamukhi
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకమాచిkamAchi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
సరసిజముఖిరో నా సామినిందు తోడితేవేsarasijamukhirO nA sAminindu tODitEvE
చరణం
charaNam 1
అరమరేల ప్రాణేశుని చరణంబులు
నెరనమ్మితి మరుకేళికి
సరగున యిటు సజలజశరుడు
నేడు పూని చాల బాణములేయగాను
తలచి తాళలేకయున్న కలికిన నిను
బలు విధముల కలిపిన శ్రీ కమలాక్షుని
aramarEla prANESuni charaNambulu
neranammiti marukELiki
saraguna yiTu sajalajaSaruDu
nEDu pUni chAla bANamulEyagAnu
talachi tALalEkayunna kalikina ninu
balu vidhamula kalipina SrI kamalAkshuni
చరణం
charaNam 2
సుందరాంగి మున్ను నను
సుందరాకారుడు జూచి
మందగమన నాదు మనము
నందున నే పొందుగ భ్రమ
జెందితినని చెలువుడనియె
sumdarAmgi munnu nanu
sumdarAkAruDu jUchi
mamdagamana nAdu manamu
namduna nE pomduga bhrama
jemditinani cheluvuDaniye
చరణం
charaNam 3
స్థిరతరమతి శ్రీ గౌరీశెట్టి
శ్రీరామాఖ్యుని కరుణజూచి రమ్మనె
మందరధరుని వరసుందర తర గాత్రుని సరసుని యిటు
sthirataramati SrI gourISeTTi
SrIrAmAkhyuni karuNajUchi rammane
mamdaradharuni varasumdara tara gAtruni sarasuni yiTu