| Title | వద్దురా రద్దు (ప్రతి) | vaddurA raddu (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | జంఝూటి | jamjhUTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వద్దురా రద్దు పోరా వెన్నెలా వచ్చెవేళ గాదుర అద్దెర మాయత్త గద్దించు గయ్యాళి సుద్దులు విను బుధ్ధి కద్దురా కద్దురా | vaddurA raddu pOrA vennelA vachchevELa gAdura addera mAyatta gaddimchu gayyALi suddulu vinu budhdhi kaddurA kaddurA |
| చరణం charaNam 1 | మామ మన్నెకాడురా నాధుడు మర్యాద చేయడురా కామునికేళిలో గలసి మెప్పించెద భామిని రమ్మనెడు బాగుర బాగుర | mAma mannekADurA nAdhuDu maryAda chEyaDurA kAmunikELilO galasi meppimcheda bhAmini rammaneDu bAgura bAgura |
| చరణం charaNam 2 | మరది రచ్చబెట్టురా యేరాలు మరిమరి నను దిట్టురా విరిబంతులిచ్చెద వెలది మాటాడుమని సరసములాడేవు చాలుర చాలుర | maradi rachchabeTTurA yErAlu marimari nanu diTTurA viribamtulichcheda veladi mATADumani sarasamulADEvu chAlura chAlura |
| చరణం charaNam 3 | చాడికోరుగదరా జాణ నాయాడబిడ్డ వినరా ఆడేది వినుచు నా తోడ గూడుము యోచేడె రమ్మనుట చెడ్డరా చెడ్డరా | chADikOrugadarA jANa nAyADabiDDa vinarA ADEdi vinuchu nA tODa gUDumu yOchEDe rammanuTa cheDDarA cheDDarA |
| చరణం charaNam 4 | వదినైతె నాలిముచ్చుర పొరుగు వారిది చూడ వాదువచ్చుర పదరా రేపలె గోపాలుడ ప్రఖ్యాతి గదురా యీ మర్యాద కాదుర కాదుర | vadinaite nAlimuchchura porugu vAridi chUDa vAduvachchura padarA rEpale gOpAluDa prakhyAti gadurA yI maryAda kAdura kAdura |
Category: Lyrics
#207 ఇద్దరి పొందేలరా iddari pomdElarA
| Title | ఇద్దరి పొందేలరా | iddari pomdElarA |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | జంఝూటి | jamjhUTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇద్దరి పొందేలరా సామి దానింటికి పోపో పోరా సద్దేల జేసెదవు సామి నే నోర్వనా వద్దికి నీవురావద్దురా వద్దురా | iddari pomdElarA sAmi dAnimTiki pOpO pOrA saddEla jEsedavu sAmi nE nOrvanA vaddiki nIvurAvaddurA vaddurA |
| చరణం charaNam 1 | నాజోలి నీకేలర యా బ్రహ్మ నన్నిట్లు పుట్టించెరా యేజాము దానింట నీజాడ నేజూడ బేజారుగాజాల నే జెల్ల నే జెల్ల | nAjOli nIkElara yA brahma nanniTlu puTTimcherA yEjAmu dAnimTa nIjADa nEjUDa bEjArugAjAla nE jella nE jella |
| చరణం charaNam 2 | కన్నుల యెరుపేమిరా చెక్కుల కాటుక నలుపేమిర కన్నుల విలుకాని కయ్యాల మెలగిన చిన్నెలే తోచెరా చెప్పరా చెప్పరా | kannula yerupEmirA chekkula kATuka nalupEmira kannula vilukAni kayyAla melagina chinnelE tOcherA chepparA chepparA |
| చరణం charaNam 3 | శ్రీ పావల్లూరిపురా శ్రీవేణుగోపాల బాగాయరా రాపేల దాసు శ్రీరామకవిపాల యీ పట్ల నీ పనులింతాయె వింతాయె | SrI pAvallUripurA SrIvENugOpAla bAgAyarA rApEla dAsu SrIrAmakavipAla yI paTla nI panulimtAye vimtAye |
#206 నీ సరియే చాన nI sariyE chAna
| Title | నీ సరియే చాన (ప్రతి) | nI sariyE chAna (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | నీ సరియే చాన నే గాన జగాన నా సరివారిని నీవుగానా ఆసతో జేసిన బాసలు ఓ సఖి మోసపుచ్చి యీ సరి గాసిల జేసెనే | nI sariyE chAna nE gAna jagAna nA sarivArini nIvugAnA AsatO jEsina bAsalu O sakhi mOsapuchchi yI sari gAsila jEsenE |
| చరణం charaNam 1 | వద్దు వద్దననా వద్దికి వచ్చియొ ముద్దియ తద్దయో ముద్దివ్వలేదా అద్దిర యద్దాని బుద్ధులు విన్నావొ గద్దించి యీ ప్రొద్దు వద్దురా వద్దన | vaddu vaddananA vaddiki vachchiyo muddiya taddayO muddivvalEdA addira yaddAni buddhulu vinnAvo gaddimchi yI proddu vaddurA vaddana |
| చరణం charaNam 2 | మక్కువచే రతి స్రుక్కించి చెక్కులు నొక్కి నాపక్కను నొగిజేరలేదా టక్కులాడి నిక్కమని మిక్కిలి నిక్కిన ఇక్కపటము జేసితి వక్కటా అక్కటా | makkuvachE rati srukkimchi chekkulu nokki nApakkanu nogijEralEdA TakkulADi nikkamani mikkili nikkina ikkapaTamu jEsiti vakkaTA akkaTA |
| చరణం charaNam 3 | ధారుణి రేపలె శ్రీరాజగోపాల చేరరారాయని చేపట్టలేదా సారసాక్షి నే బహు దూరమెంచ నీదరి జేరిన నీరీతి సేయుట సేమామ | dhAruNi rEpale SrIrAjagOpAla chErarArAyani chEpaTTalEdA sArasAkshi nE bahu dUramemcha nIdari jErina nIrIti sEyuTa sEmAma |
#205 నీ తోటి nI tOTi
| Title | నీ తోటి | nI tOTi |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | నీతోటి మాటలు నాకేలరా సామి నాతోటి మాటలు నీకేలర నే తాళ దానితో ఖాతలు నీకేల ప్రీతిగల నాతియని పోతివి రాతిరి | nItOTi mATalu nAkElarA sAmi nAtOTi mATalu nIkElara nE tALa dAnitO khAtalu nIkEla prItigala nAtiyani pOtivi rAtiri |
| చరణం charaNam 1 | పరువటరా నాతో పనులేమిరా సామి పరువటరా నాతో పనులేమిరా విరజాజి బంతులు విసరకురా సామి సరసము విరసమౌ చాలుర చాలుర | paruvaTarA nAtO panulEmirA sAmi paruvaTarA nAtO panulEmirA virajAji bamtulu visarakurA sAmi sarasamu virasamau chAlura chAlura |
| చరణం charaNam 2 | ఒయ్యార మిదియేమి యూరుకోరా సామి యొయ్యార మెదియేమి యూరుకోర యుయ్యల మంచము నూచకురా యిది కయ్యాల గయ్యాళ అయ్యయ్యో అయ్యయ్యో | oyyAra midiyEmi yUrukOrA sAmi yoyyAra mediyEmi yUrukOra yuyyala mamchamu nUchakurA yidi kayyAla gayyALa ayyayyO ayyayyO |
| చరణం charaNam 3 | వేసమా వల్లూరి వేణుగోపసామి వేసమా వల్లూరి వేణుగోపా దాసు శ్రీరాముని భాసుర వాక్యము చేసెరా వెయివేలు సేబాసు సేబాసు | vEsamA vallUri vENugOpasAmi vEsamA vallUri vENugOpA dAsu SrIrAmuni bhAsura vAkyamu chEserA veyivElu sEbAsu sEbAsu |
#204 యెంత మోహ yemta mOha
| Title | యెంత మోహ (ప్రతి) | yemta mOha (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కాంబోది | kAmbOdi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యెంత మోహపరచినావు యేమి సేతుర నన్నెం కంతుకేళిలోన నన్ను గలసి మెలసి వలపు గలిగి | yemta mOhaparachinAvu yEmi sEtura nannem kamtukELilOna nannu galasi melasi valapu galigi |
| చరణం charaNam 1 | కుక్కటాహి బంధములను గూడువేళలా మక్కువ పెంపెక్కగ రతి స్రుక్కజేసి నిక్కముగ | kukkaTAhi bandhamulanu gUDuvELalA makkuva pempekkaga rati srukkajEsi nikkamuga |
| చరణం charaNam 2 | చాల నిన్ను కనుల జూడక తాళజాల నీ వేళ బోవుననుచు నెంతో నేర్పు మాటలాడుచు | chAla ninnu kanula jUDaka tALajAla nI vELa bOvunanuchu nemtO nErpu mATalADuchu |
| చరణం charaNam 3 | రేపలె పట్టణ లలామ గోపాల బాలుడ ఆ పడతి గూడి నేడు అయ్యయ్యో నన్ను విడనాడితి | rEpale paTTaNa lalAma gOpAla bAluDa A paDati gUDi nEDu ayyayyO nannu viDanADiti |
#203 యేమి సేతు yEmi sEtu
| Title | యేమి సేతు | yEmi sEtu |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కాంబోది | kAmbOdi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యేమి సేతు యెటుల సైతు మరులు తాళలేనుర | yEmi sEtu yeTula saitu marulu tALalEnura |
| సామి ధర్మపుర నివాస సమయము నన్నేలుకోర | sAmi dharmapura nivAsa samayamu nannElukOra | |
| చరణం charaNam 1 | పిలువ బిగువు చేసేది మేరగాదురా అలుక నాటి సుఖము గోరి చెలువుడ దయసేయు మిటుల | piluva biguvu chEsEdi mEragAdurA aluka nATi sukhamu gOri cheluvuDa dayasEyu miTula |
| చరణం charaNam 2 | రామప్రాణసఖిని బాసి రాముడెటుల తాళెనో ప్రేమ మాటలాడిన సామి చేర రారా యిపుడు | rAmaprANasakhini bAsi rAmuDeTula tALenO prEma mATalADina sAmi chEra rArA yipuDu |
| చరణం charaNam 3 | మాటిమాటికి నీయడ మట్టు విడువ బాగాయె గట్టు విల్తుని పగతుడిపుడు మట్టు మీరి వచ్చెనయ్యయ్యో | mATimATiki nIyaDa maTTu viDuva bAgAye gaTTu viltuni pagatuDipuDu maTTu mIri vachchenayyayyO |
#202 వచ్చితె vachchite
| Title | వచ్చితె (ప్రతి) | vachchite (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | వచ్చితె మేలాయర వహ్వవా మెచ్చవచ్చుర | vachchite mElAyara vahvavA mechchavachchura |
| మచ్చికతో మదివచ్చి యిచ్చోటికి | machchikatO madivachchi yichchOTiki | |
| చరణం charaNam 1 | అలదానిగూడి నీవట కాపురముగా నిలిచెదవని నిన్నెదబూని దలచితి పలుమరు వలపు గలిగి యిటు | aladAnigUDi nIvaTa kApuramugA nilichedavani ninnedabUni dalachiti palumaru valapu galigi yiTu |
| చరణం charaNam 2 | చక్కని మోవిని నొక్కుచు వేగమే పక్కను జేరి చెక్కులు జీరి యక్కున జేర్చి రతి స్రుక్కించిన మక్కువచే | chakkani mOvini nokkuchu vEgamE pakkanu jEri chekkulu jIri yakkuna jErchi rati srukkinchina makkuvachE |
| చరణం charaNam 3 | ధైర్య పిఠాపురి ధాముడవౌ శ్రీ సూర్యరాయసుగుణ విధేయ చర్యనుతించిన నీ పర్యాయమాశ్చర్యమాయ | dhairya piThApuri dhAmuDavau SrI sUryarAyasuguNa vidhEya charyanutimchina nI paryAyamAScharyamAya |
#201 వలచితే valachitE
| Title | వలచితే | valachitE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | వలచితే యింత చలమేల రారా సామి | valachitE yimta chalamEla rArA sAmi |
| చెలువుడనుచు మది దలచి దలచి నిను | cheluvuDanuchu madi dalachi dalachi ninu | |
| చరణం charaNam 1 | మక్కువతో నా మనసిటు నిల్వక మిక్కిలి వేడితి తామసమేలర యెక్కువ మమతతొ బిలచిన బలుకవు | makkuvatO nA manasiTu nilvaka mikkili vEDiti tAmasamElara yekkuva mamatato bilachina balukavu |
| చరణం charaNam 2 | వెన్నెల రేయిని వేడిని తాళను నిన్నటి మాటలు సేయకురా సామి నిన్నెడబాసి నే నిముసము తాళర | vennela rEyini vEDini tALanu ninnaTi mATalu sEyakurA sAmi ninneDabAsi nE nimusamu tALara |
| చరణం charaNam 3 | ధర భీమేశుడ నేరము లెంచకు సారస నేత్రుడ సమ్మతమా సామి యేర సుందరాకార నిన్నే నేమముతో | dhara bhImESuDa nEramu lemchaku sArasa nEtruDa sammatamA sAmi yEra sumdarAkAra ninnE nEmamutO |
#200 యెంత మోహ yemta mOha
| Title | యెంత మోహ (ప్రతి) | yemta mOha (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | యెంత మోహాపరచినాడే యేమి సేతునే నన్నింత సంతతము విడనిబాస సల్పి కాంతుడు | yemta mOhAparachinADE yEmi sEtunE nannimta samtatamu viDanibAsa salpi kAmtuDu |
| చరణం charaNam 1 | పట్టిరట్టు కెట్టవద్దు గట్టు గుబ్బెత నన్నిట్టులాడి తానట్టెజేరి చన్నుగవ బట్టి నవ్వుచు | paTTiraTTu keTTavaddu gaTTu gubbeta nanniTTulADi tAnaTTejEri channugava baTTi navvuchu |
| చరణం charaNam 2 | మక్కువ పెంపెక్కగ రతిస్రుక్క జేయుచు నా పక్కడాయుచు చక్కని కెమ్మోవి పంట నొక్కి స్రొక్కుచు | makkuva pempekkaga ratisrukka jEyuchu nA pakkaDAyuchu chakkani kemmOvi pamTa nokki srokkuchu |
| చరణం charaNam 3 | రావు సూర్యరాయ మహరాజధీరుడే భావజాకారుడే ఆ వనిత గూడి నేడు అయ్యయో రాడే | rAvu sUryarAya maharAjadhIruDE bhAvajAkAruDE A vanita gUDi nEDu ayyayO rADE |
#199 ముద్దుబెట్టి muddubeTTi
| Title | ముద్దుబెట్టి | muddubeTTi |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ముద్దుబెట్టి పోయినాడే మోహనంగిరో నాకొక | muddubeTTi pOyinADE mOhanangirO nAkoka |
| చరణం charaNam 1 | సద్దుసేయ వద్దనుచు సైగ జేయుచు నాడొక టక్కులొల్క వాడు నాదుపక్కలో జేరి వలపెక్కగ గోరి చెక్కులోన చెక్కు జేర్చి మ్రొక్కివేడుచు నాకొక | saddusEya vaddanuchu saiga jEyuchu nADoka Takkulolka vADu nAdupakkalO jEri valapekkaga gOri chekkulOna chekku jErchi mrokkivEDuchu nAkoka |
| చరణం charaNam 2 | కప్పురంపు విడెమిచ్చి కొప్పును బెట్టి తల త్రిప్పగ తట్టి సర్పవేణి యేరితోడ చెప్పవద్దని నాకొక | kappurampu viDemichchi koppunu beTTi tala trippaga taTTi sarpavENi yEritODa cheppavaddani nAkoka |