#160 కమలాకర kamalAkara

Titleకమలాకర (ప్రతి)kamalAkara (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకన్నడkannaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
కమలాకర కన్నెనుర తాళనుర ఓkamalAkara kannenura tALanura O
సమరతి గూడెటి సరళి తెలియదు ఓsamarati gUDeTi saraLi teliyadu O
చరణం
charaNam 1
నాధుని జూచిన ఖేదము నొందక
మోదముచే తను మ్రొక్కిన విడువవు ఓ
nAdhuni jUchina khEdamu nondaka
mOdamuchE tanu mrokkina viDuvavu O
చరణం
charaNam 2
చక్కని సామి మోవి నొక్కుచు గోటను
చెక్కులు స్తనములు జీరిన వేసారితినీ
chakkani sAmi mOvi nokkuchu gOTanu
chekkulu stanamulu jIrina vEsAritinI
చరణం
charaNam 3
సరవితో రేపలె పురవర ముత్యపు
సరములిచ్చెదనని సరసములాడెదవు ఓ
saravitO rEpale puravara mutyapu
saramulichchedanani sarasamulADedavu O

#159 చాలే చాలే chAlE chAlE

This jAvaLi has been published before too. ఈ జావళి ఇంతకుముందు ప్రచురింపబడినది.

Titleచాలే చాలేchAlE chAlE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకన్నడkannaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
చాలే చాలే అలవాని పొందిక చాలే చాలే
యీ లాభము యిక
chAlE chAlE alavAni pomdika chAlE chAlE
yI lAbhamu yika
చరణం
charaNam 1
కలకంఠిరో భూతలమందున యే
కల్లలు బల్కెడు వారితో చెలిమిక
kalakanThirO bhUtalamanduna yE
kallalu balkeDu vAritO chelimika
చరణం
charaNam 2
విరిబోణిరో పోకిరి కుక్కలకేమె
మారుని సరియని కోరి చేరుట యిక
viribONirO pOkiri kukkalakEme
mAruni sariyani kOri chEruTa yika
చరణం
charaNam 3
అలివేణిరో యా నలినాక్షికి యేమొ
కాళ్ళకు మ్రొక్కెడు వారితో స్నేహము
alivENirO yA nalinAkshiki yEmo
kALLaku mrokkeDu vAritO snEhamu
చరణం
charaNam 4
ధరయందున శ్రీ పరవాసునియేమొ
సరిజెప్పను యెవ్వరితరమే యిక
dharayamduna SrI paravAsuniyEmo
sarijeppanu yevvaritaramE yika

#158 యెందుకురా yemdukurA

Titleయెందుకురా (ప్రతి)yemdukurA (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
యెందుకురా కోపముyendukurA kOpamu
మకరాంకుని శరమరయదాకెmakarAmkuni SaramarayadAke
చరణం
charaNam 1
గ్రక్కున నను నీ యక్కున జేర్చగ
చక్కని మోవిని నొక్కితినని
grakkuna nanu nI yakkuna jErchaga
chakkani mOvini nokkitinani
చరణం
charaNam 2
సరగున నను రతి సల్పగ దలచిన
గురుకుచములచే గ్రుమ్మితినని
saraguna nanu rati salpaga dalachina
gurukuchamulachE grummitinani
చరణం
charaNam 3
ధర రేపలెపురవర మందిర మరు
దుర మొనరింపక తొలగి చనెద
dhara rEpalepuravara mandira maru
dura monarimpaka tolagi chaneda

#157 రమ్మనవే rammanavE

Titleరమ్మనవేrammanavE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
రమ్మనవే సామిని రమణీమణిరో నను వలచిన యిటుrammanavE sAmini ramaNImaNirO nanu valachina yiTu
చరణం
charaNam 1
ఆదరమున నపరాధము నెంచుట
వాదు జేయుట మరియాదగాదు
Adaramuna naparAdhamu nemchuTa
vAdu jEyuTa mariyAdagAdu
చరణం
charaNam 2
సారెకు నా సరివారిలో నన్నిటు
దూరుట నతనికి మేరగాదు
sAreku nA sarivArilO nanniTu
dUruTa nataniki mEragAdu

#156 యెందుకె సామిని yemduke sAmini

Titleయెందుకె సామిని (ప్రతి)yemduke sAmini (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకాపిkApi
తాళం tALaమిశ్రమmiSrama
పల్లవి
pallavi
యెందుకె సామిని యేమరి కోరుట
సుందరి నాధునితో పొలదుట వలదిక
yemduke sAmini yEmari kOruTa
sumdari nAdhunitO poladuTa valadika
చరణం
charaNam 1
ఆసతో మున్జేసిన బాసలు మరచియు
నోసఖి ప్రేమను బాసియున్నాడట
AsatO mun&jEsina bAsalu marachiyu
nOsakhi prEmanu bAsiyunnADaTa
చరణం
charaNam 2
నా సరివారిని నాధుడు గనుగొని
ఆ సఖి కూడనని బాసలు జేసెనట
nA sarivArini nAdhuDu ganugoni
A sakhi kUDanani bAsalu jEsenaTa
చరణం
charaNam 3
వసుధ రేపలెపురవాసుడు దానితో
కుసుమ శరుకేళిని గూడి యున్నాడట
vasudha rEpalepuravAsuDu dAnitO
kusuma SarukELini gUDi yunnADaTa

#155 ఏలర నాపై Elara nApai

Titleఏలర నాపైElara nApai
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకాపిkApi
తాళం tALaమిశ్రమmiSrama
పల్లవి
pallavi
ఏలర నాపై బాలుర మోహము
బాలమణితో యేమో బాసలుజేసితవట
Elara nApai bAlura mOhamu
bAlamaNitO yEmO bAsalujEsitavaTa
చరణం
charaNam 1
ఆమెను గూడి రతి అనుభవించితివేమొ
మాపటి వేళలో రాపు జేసేవట
Amenu gUDi rati anubhavinchitivEmo
mApaTi vELalO rApu jEsEvaTa
చరణం
charaNam 2
అలరుబోణి నీతో అలగినదేమో
చెలికాడ ననుగూడి బలిమిజేసేవట
alarubONi nItO alaginadEmO
chelikADa nanugUDi balimijEsEvaTa
చరణం
charaNam 3
హితవుతో పార్థసారథి ననుగూడితె
అతివలు జూచితె అపరాధమగునేమొ
hitavutO pArthasArathi nanugUDite
ativalu jUchite aparAdhamagunEmo

#154 సామిని దలచకె sAmini dalachake

Titleసామిని దలచకె (ప్రతి)sAmini dalachake (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకాపిkApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
సామిని దలచకె సఖి కామిని పతి నిటు
ఘనమానసమున
sAmini dalachake sakhi kAmini pati niTu
ghanamAnasamuna
చరణం
charaNam 1
భామిని జేసిన బాసలు మరువక
కామించి యెన్ని దినములు గడపి వేసారితినే
bhAmini jEsina bAsalu maruvaka
kAminchi yenni dinamulu gaDapi vEsAritinE
చరణం
charaNam 2
సదయుని రాక కెదురెదురే నే జూచి
మదనుని బారికిని మగువరోలోనైతినే
sadayuni rAka keduredurE nE jUchi
madanuni bArikini maguvarOlOnaitinE
చరణం
charaNam 3
యే సఖి గూడెనొ వేడుకచే రేయి
నాసరివారిలోన నన్నిటుల జేసెనే
yE sakhi gUDeno vEDukachE rEyi
nAsarivArilOna nanniTula jEsenE
చరణం
charaNam 4
విటులతో కలిసే విధములు మరి చూచి
కటకటాయని నే మది కరగి చింతించితినే
viTulatO kalisE vidhamulu mari chUchi
kaTakaTAyani nE madi karagi chimtimchitinE
చరణం
charaNam 5
పొలతిరో శ్రీ రేపలె పురవరునితో నే
కలసి సుఖించుటకు రుణము కలికిరో లేదాయెనే
polatirO SrI rEpale puravarunitO nE
kalasi sukhinchuTaku ruNamu kalikirO lEdAyenE

#153 యేమని సహింతునే yEmani sahintunE

Titleయేమని సహింతునేyEmani sahintunE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకాపిkApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
యేమని సహింతునే నేనే
కాముని విరిశరముల బారికి
yEmani sahintunE nEnE
kAmuni viriSaramula bAriki
చరణం
charaNam 1
సామి రాడాయనె నిముసమేడాయనె
నా మనవి తెలియబలికె ప్రేమసఖి లేదాయనె
sAmi rADAyane nimusamEDAyane
nA manavi teliyabalike prEmasakhi lEdAyane
చరణం
charaNam 2
బాలరో యీ చలమేలనె వానికి
యే లలనామణి బోధించెనో నేమొ నను మరచెనే
bAlarO yI chalamElane vAniki
yE lalanAmaNi bOdhinchenO nEmo nanu marachenE
చరణం
charaNam 3
భామరొ కాముని కేళి నన్నేలిన సామి ధరగిరి నిలయునిపై
ప్రేమ యెటుల మరతునే
bhAmaro kAmuni kELi nannElina sAmi dharagiri nilayunipai
prEma yeTula maratunE

#152 తరుణిరో సామి taruNirO sAmi

Titleతరుణిరో సామి (ప్రతి)taruNirO sAmi (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
తరుణిరో సామి యిటు దయవీడెనేtaruNirO sAmi yiTu dayavIDenE
చరణం
charaNam 1
మరుపాయ మునుపటి మక్కువ నాధునికే
సరసిజాక్షి జెప్పెనేమొ సరసుడు నాపైని చలము బూనెనె చెలి
marupAya munupaTi makkuva nAdhunikE
sarasijAkshi jeppenEmo sarasuDu nApaini chalamu bUnene cheli
చరణం
charaNam 2
మగువరొ చెలియచే మరి రాయబారము
తగునని బంపినను తరలాక్షి మనమున దలచ దాయెనే
maguvaro cheliyachE mari rAyabAramu
tagunani bampinanu taralAkshi manamuna dalacha dAyenE
చరణం
charaNam 3
వనిత శ్రీ కూల్లిపర వంశజుడు శ్రీరాములు
ఘన మరుబారికి గలయ ద్రోచినం గలయడాయెనే
vanita SrI kUllipara vamSajuDu SrIrAmulu
ghana marubAriki galaya drOchinam galayaDAyenE

#151 ఘనరాయ ghanarAya

TitleఘనరాయghanarAya
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
ఘనరాయ రాయుని బిల్వబోనె యనెనె చెలిghanarAya rAyuni bilvabOne yanene cheli
చరణం
charaNam 1
అబలనైనను నాపై అలుక బూనకు మంటి
హై సోమ జాహోన్మేయని యా దర్బాల యించి యాజ్ మేలాయనెనె
abalanainanu nApai aluka bUnaku mamTi
hai sOma jAhOnmEyani yA darbAla yinchi yaaz mElAyanene
చరణం
charaNam 2
తగదు చైబట్టుట మగనాలనే నంటె
అగజారి చుంబిణీ వోనై యాతో కంజార్ దేఖో యనెనె చెలీ
tagadu chaibaTTuTa maganAlanE nanTe
agajAri chumbiNI vOnai yAtO kamjAr dEkhO yanene chelI
చరణం
charaNam 3
అత్తమామలు వింటే రిత్తకాపురమవునంటే
అత్త గిత్త కుచ్చు నై కర్తె గిర్తె తు క్యావు యిదరానెనె
attamAmalu vinTE rittakApuramavunanTE
atta gitta kuchchu nai karte girte tu kyAvu yidarAnene
చరణం
charaNam 4
సరస గోపాలనాడు సంగతి చాలించుమంటే
అంగుబడ్డ సమయమందు చెంగులు వదలదీసి వాడేమో జేసెనె
sarasa gOpAlanADu samgati chAlinchumanTE
angubaDDa samayamamdu chengulu vadaladIsi vADEmO jEsene