#150 నాధుని మనమున nAdhuni manamuna

Titleనాధుని మనమున (ప్రతి)nAdhuni manamuna (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaధన్యాశిdhanyASi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
నాధుని మనమున నమ్మగరాదె
బాధకు తాళనె భామిని వాడె
nAdhuni manamuna nammagarAde
bAdhaku tALane bhAmini vADe
చరణం
charaNam 1
బాసలు నిజమని మోసము నే పోతి
నా సఖుడిటు జేయ న్యాయమె నాతి
bAsalu nijamani mOsamu nE pOti
nA sakhuDiTu jEya nyAyame nAti
చరణం
charaNam 2
యేమని మదిలోన యెంచెనోగాని
కామిని గూడెనె కాంతరో పూని
yEmani madilOna yemchenOgAni
kAmini gUDene kAmtarO pUni
చరణం
charaNam 3
కమ్మవిల్తుడు పువ్వుటమ్ముల నేయ
కొమ్మరో కోరిక కొనసాగదాయ
kammaviltuDu puvvuTammula nEya
kommarO kOrika konasAgadAya
చరణం
charaNam 4
సరసులకీ లక్షణమునె గాన
మరుకేళి గూడి నన్ మరచెనే చాన
sarasulakI lakshaNamune gAna
marukELi gUDi nan marachenE chAna
చరణం
charaNam 5
ధరణి శ్రీ రేపలె పురవరు నందు
మరులు మించెనిక మగువ యేమందు
dharaNi SrI rEpale puravaru namdu
marulu mimchenika maguva yEmandu

#149 నా సామియని nA sAmiyani

Titleనా సామియనిnA sAmiyani
Written By
BookprAchIna-navIna
రాగం rAgaధన్యాశిdhanyASi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
నా సామియని బిలచినా వేగరాడే
ఓ సఖి నీవైన యిక తోడి తేవే
nA sAmiyani bilachinA vEgarADE
O sakhi nIvaina yika tODi tEvE
చరణం
charaNam 1
మ్రొక్కి వేడిన జూచి మోమటు జేసెనె
చక్కెర విలుకాడు శరముల నేసెనె
mrokki vEDina jUchi mOmaTu jEsene
chakkera vilukADu Saramula nEsene
చరణం
charaNam 2
సరసుడు లేని యీ జన్మమదేలనే
పురుషులతో గూడే పొందిక చాలునే
sarasuDu lEni yI janmamadElanE
purushulatO gUDE pomdika chAlunE
చరణం
charaNam 3
నెలతవాని బాసి నే తాళలేను
చెలువుని పై బాళీ చే సొక్కె మేను
nelatavAni bAsi nE tALalEnu
cheluvuni pai bALI chE sokke mEnu
చరణం
charaNam 4
వలప నెడెటువంటి వస్తువో గాన
కలనైన మరువ నా కనుల నా చాన
valapa neDeTuvamTi vastuvO gAna
kalanaina maruva nA kanula nA chAna

#148 చలమూనెనె chalamUnene

Titleచలమూనెనె (ప్రతి)chalamUnene (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
చలమూనెనె చెలియా నా విభుడుchalamUnene cheliyA nA vibhuDu
చరణం
charaNam 1
మది అలరువిలతు ములుకులకు
నులికెనె చెలియా నా
madi alaruvilatu mulukulaku
nulikene cheliyA nA
చరణం
charaNam 2
యీ వింత యేమో తెలియదు నన్నేమరి
మదిని వరభావజా శరీరుడనన్ బ్రోవక చెలియా నా
yI vimta yEmO teliyadu nannEmari
madini varabhAvajA SarIruDanan brOvaka cheliyA nA
చరణం
charaNam 3
వాడెంతగా నన్బాయనని బాస బలికీ యా
చేడె తోడగూడి నేడు వీడెనే చెలియా
vADemtagA nan&bAyanani bAsa balikI yA
chEDe tODagUDi nEDu vIDenE cheliyA
చరణం
charaNam 4
యీ ధారుణిలో రేపలె పురనాధుని
సముఖమున వాదభేద మోదమునం గాదనె చెలియా
yI dhAruNilO rEpale puranAdhuni
samukhamuna vAdabhEda mOdamunam gAdane cheliyA

#147 ఈ విరహమెటులోర్తునే I virahameTulOrtunE

Titleఈ విరహమెటులోర్తునేI virahameTulOrtunE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
ఈ విరహమెటులోర్తునే చెలియాI virahameTulOrtunE cheliyA
చరణం
charaNam 1
నేనేమి సేతు నా మనోహరుండు రాడటే
నా సామి కేమిఠారి దూరి చెప్పెనో చెలియా
nEnEmi sEtu nA manOharumDu rADaTE
nA sAmi kEmiThAri dUri cheppenO cheliyA
చరణం
charaNam 2
యెందాక సయితు వానిబాసి
యీ సుమశరుని చిగురాకు బాకుచే
కుచంబు దాకునే చెలియా
yemdAka sayitu vAnibAsi
yI sumaSaruni chigurAku bAkuchE
kuchambu dAkunE cheliyA
చరణం
charaNam 3
రతికేళి వేళ నేల సోమరాళగామినీ
నే తాళజాల బాలచంద్ర సామిని బాశీ
ratikELi vELa nEla sOmarALagAminI
nE tALajAla bAlachamdra sAmini bASI

#146 తాళజాలనే tALajAlanE

Titleతాళజాలనే (ప్రతి)tALajAlanE (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
తాళజాలనే యిక తాళజాలనేtALajAlanE yika tALajAlanE
చరణం
charaNam 1
బాల కాముకేళి గూడవే
చాల కఠినమేల విడవే
bAla kAmukELi gUDavE
chAla kaThinamEla viDavE
చరణం
charaNam 2
కన్నె మరులు కొన్నవాడను
మన్ననతో నిన్ను వీడను
kanne marulu konnavADanu
mannanatO ninnu vIDanu
చరణం
charaNam 3
యింతి నీకు యంత రోసమే
వంత బెట్టవద్దు దోసమే
yimti nIku yamta rOsamE
vamta beTTavaddu dOsamE
చరణం
charaNam 4
మందయాన యేమిసేతునే
మగువా వలపునెట్లు దాతునే
mamdayAna yEmisEtunE
maguvA valapuneTlu dAtunE
చరణం
charaNam 5
రేపలే పురీశు సాక్షిగా
బాపవేల బాధ వేవేగ
rEpalE purISu sAkshigA
bApavEla bAdha vEvEga

#145 వేళగాదుర vELagAdura

TitleవేళగాదురvELagAdura
Written By
BookprAchIna-navIna
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
వేళగాదుర నా సామీ వేళ గాదురvELagAdura nA sAmI vELa gAdura
చరణం
charaNam 1
ముద్దుబెట్ట వద్దు చాలుర
సద్దు సేయరాదు తాళర
muddubeTTa vaddu chAlura
saddu sEyarAdu tALara
చరణం
charaNam 2
సన్నసయిగ జేసే వేళరా
వెన్నుడనే మగనాలర
sannasayiga jEsE vELarA
vennuDanE maganAlara
చరణం
charaNam 3
సామి ధరగిరి నిలయా
సమయము గాని కలియా
sAmi dharagiri nilayA
samayamu gAni kaliyA

#144 తెలియనైతినె teliyanaitine

Titleతెలియనైతినె (ప్రతి)teliyanaitine (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహంసధ్వనిhamsadhwani
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
తెలియనైతినె జలజాక్షి మరిteliyanaitine jalajAkshi mari
పలువిధముల పలుకరించినెpaluvidhamula palukarimchine
చరణం
charaNam 1
అందరాని పండ్ల గాసజెందిన
పొందుగాను వృధాపోవునని నే
amdarAni pamDla gAsajemdina
pomdugAnu vRdhApOvunani nE
చరణం
charaNam 2
స్త్రీలమనసు నమ్మజెల్లదనుచు
చాలగాను విని సరసిజాక్షి నే
strIlamanasu nammajelladanuchu
chAlagAnu vini sarasijAkshi nE
చరణం
charaNam 3
మటుమాయచే నిటుజేయవని
కటకటమది గరగించి నే
maTumAyachE niTujEyavani
kaTakaTamadi garagimchi nE
చరణం
charaNam 4
వాసిగ రేపలె వాసుని నను
గాసిబెట్టు మది గరుగ దాని నే
vAsiga rEpale vAsuni nanu
gAsibeTTu madi garuga dAni nE

#143 నను గన్నతల్లి nanu gannatalli

Titleనను గన్నతల్లిnanu gannatalli
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహంసధ్వనిhamsadhwani
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
నను గన్నతల్లి నా భాగ్యమా
నారాయణీ ధర్మాంబికే
nanu gannatalli nA bhAgyamA
nArAyaNI dharmAmbikE
కనకాంగి రమాపతి సోదరీ
కరుణించవే కాత్యాయనీ
kanakAmgi ramApati sOdarI
karuNimchavE kAtyAyanI
చరణం
charaNam 1
కావు కావుమని నే మొరబెట్టగా
కరుగదేమి మది కమలలోచనీ
నీవు బ్రోవకున్న నెవరు బ్రోతురే
స్థావరంబొసగు త్యాగరాజనుత
kAvu kAvumani nE morabeTTagA
karugadEmi madi kamalalOchanI
nIvu brOvakunna nevaru brOturE
sthAvarambosagu tyAgarAjanuta

Not a jAvaLi. Multiple performances available on youtube and elsewhere. However, many sites seem to claim this to be in a different rAga or taLa. Found an interesting post at http://guruguha.org/blog/2016/10/29/true-identity-raga-tyagarajas-nannu-kanna-talli/

#142 సారసముఖిరో sArasamukhirO

Titleసారసముఖిరో (ప్రతి)sArasamukhirO (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సారసముఖిరో నా సామిని దేవే
సామిని దేవే నా సామిని దేవే
sArasamukhirO nA sAmini dEvE
sAmini dEvE nA sAmini dEvE
చరణం
charaNam 1
మానశీరాకారుడే సుదతిని గూడెనె
మానిని దయలేక మది నను వీడే
mAnaSIrAkAruDE sudatini gUDene
mAnini dayalEka madi nanu vIDE
చరణం
charaNam 2
కాంతుడు నను యేకాంతమునందున
కంతుని కేళిగూడ ఘనుడిటురాడే
kAmtuDu nanu yEkAmtamunamduna
kamtuni kELigUDa ghanuDiTurADE
చరణం
charaNam 3
వనిత శ్రీరేపలెవాసుడు తన మది
ఘనమనుకొని నను గాసిలజేసె
vanita SrIrEpalevAsuDu tana madi
ghanamanukoni nanu gAsilajEse

#141 బేబాబె బంగలాని bEbAbe bamgalAni

Titleబేబాబె బంగలానిbEbAbe bamgalAni
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
బేబాబె బంగలాని మౌలానియజా
మౌలాని యజారె మౌలానియజా
bEbAbe bamgalAni maulAniyajA
maulAni yajAre maulAniyajA
చరణం
charaNam 1
తేరె తేరె ఖాతర్బే బైమా గంగానియ
బేబైరో తండ బయ్యమాలానియజా
tEre tEre khAtarbE baimA gamgAniya
bEbairO tamDa bayyamAlAniyajA
More likely to be a Bengali lyric.

Again, here’s an attempt to guess the lyrics.

బే బాబే బంగలానీ మౌలా నియెజా
మౌలా నియెజా రే మౌలా నియెజా
bE bAbE bangalAnI moulA niyejA
moulA niyejA rE moulA niyejA
తేరే తేరే ఖాతర్ బే భయి మా గంగా నియా
భయి భైరో టాండ్ భి మౌలా నియెజా
tErE tErE khAtar bE bhayi mA gangA niyA
bhayi bhairO TAmD bhi moulA niyejA

Definitely could use a lot of help to improve this further