#140 మరచేవారెవరె marachEvArevare

Titleమరచేవారెవరె (ప్రతి)marachEvArevare (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
మరచేవారెవరె సామినిmarachEvArevare sAmini
చరణం
charaNam 1
పురుషుల నమ్మగ పొలతిరో వద్దని
తరుణులు జెప్పిన కరిని వానిదలచి
purushula nammaga polatirO vaddani
taruNulu jeppina karini vAnidalachi
చరణం
charaNam 2
చిత్రముగా రతి జేసిన వేళలో
మైత్రిని మనమున మానవతి దలచి
chitramugA rati jEsina vELalO
maitrini manamuna mAnavati dalachi
చరణం
charaNam 3
వనిత రేపలెపుర వాసుని చరితలు
విని బహు మదమున వివరించు చెలులలో
vanita rEpalepura vAsuni charitalu
vini bahu madamuna vivarimchu chelulalO

#139 దెలిపే వారెవరే delipE vArevarE

Titleదెలిపే వారెవరేdelipE vArevarE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
దెలిపే వారెవరే సామికిdelipE vArevarE sAmiki
చరణం
charaNam 1
కాముని బారికి సోకువలేనే
కూరిమి దానితో గూడి యుండెటివేళ
kAmuni bAriki sOkuvalEnE
kUrimi dAnitO gUDi yumDeTivELa
చరణం
charaNam 2
మాలిమితో నన్నేలిన బాలగోపాలునికీ
జాలము తగదని
mAlimitO nannElina bAlagOpAlunikI
jAlamu tagadani
చరణం
charaNam 3
సారెకు దానితో సరసములాడుట
మేరగాదని నా మేలు వానితొ నేడు
sAreku dAnitO sarasamulADuTa
mEragAdani nA mElu vAnito nEDu
చరణం
charaNam 4
వేమరు సురపురి వేణుగోపాలుని
కాముని కేళికి కలయ రమ్మనుమని
vEmaru surapuri vENugOpAluni
kAmuni kELiki kalaya rammanumani

#138 యాలరాడేమే చెలి yAlarADEmE cheli

Titleయాలరాడేమే చెలి (ప్రతి)yAlarADEmE cheli (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహగ్bEhag
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యాలరాడేమే చెలి తాళలేనె చేడెరో నావాడేyAlarADEmE cheli tALalEne chEDerO nAvADE
చరణం
charaNam 1
బాలరో మును బాయనని బాస జేసినే
యిపుడేలా బాసెనే
bAlarO munu bAyanani bAsa jEsinE
yipuDElA bAsenE
చరణం
charaNam 2
పంతగించి నాయడ బల్ పగగ నెంచెనె
యిది యెంత వంచనె
pamtagimchi nAyaDa bal pagaga nemchene
yidi yemta vamchane
చరణం
charaNam 3
ముదితరొ వాని రాకకు నే
నెదురు చూడగ నన్ను దయజూచెగా
muditaro vAni rAkaku nE
neduru chUDaga nannu dayajUchegA
చరణం
charaNam 4
భామరొ రేపల్లెపుర గోపాలధరుడే
యిక సామి గూడడె
bhAmaro rEpallepura gOpAladharuDE
yika sAmi gUDaDe

#137 సామి రాడేమందునే sAmi rADEmamdunE

ఈ జావళి ఇంతకుముందు ప్రచురించబడినది. This jAvaLi appeared in an earlier post too.

Titleసామి రాడేమందునేsAmi rADEmamdunE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహగ్bEhag
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
సామి రాడేమందునే చానరో తోడితేవే
నిమిషము తామసింపనే
sAmi rADEmamdunE chAnarO tODitEvE
nimishamu tAmasimpanE
చరణం
charaNam 1
కోమలాంగి వానిబాసి యెటుల సయితునే
యీ వలపెటుల దాతునే
kOmalAmgi vAnibAsi yeTula sayitunE
yI valapeTula dAtunE
చరణం
charaNam 2
యిందుముఖీ వానికెంతటి మందుబెట్టెనో
యెంతటి మాయజేసెనో
yimdumukhI vAnikemtaTi mamdubeTTenO
yemtaTi mAyajEsenO
చరణం
charaNam 3
ముందు నను గూడిన బాలచంద్రకాంతుడే
వాడతి సుందరాంగుడే
mumdu nanu gUDina bAlachamdrakAmtuDE
vADati sumdarAmguDE

#136 సరసుడవని sarasuDavani

Titleసరసుడవని (ప్రతి)sarasuDavani (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సరసుడవని నమ్మితిరా జాలమేర
కరుణాకర నన్ గలియర ధీర
sarasuDavani nammitirA jAlamEra
karuNAkara nan galiyara dhIra
చరణం
charaNam 1
మునుపటివలెనే ముదమున నీతో
నెనయక నుంటిని యేమిర నేరము
munupaTivalenE mudamuna nItO
nenayaka numTini yEmira nEramu
చరణం
charaNam 2
విరిశరు బారికి వరద నేతాళర
సరసిజాక్షి బల్ చలమిటు బూనెర
viriSaru bAriki varada nEtALara
sarasijAkshi bal chalamiTu bUnera
చరణం
charaNam 3
బాయక రేపలె బాలగోప రతి
జేయక కోపము సేయుట మేర
bAyaka rEpale bAlagOpa rati
jEyaka kOpamu sEyuTa mEra

#135 మధుకర నికర madhukara nikara

Titleమధుకర నికరmadhukara nikara
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మధుకర నికర సమానవేణి ధీర
మదగజ గామిని మరచితివేమొకో
సదయుని పాదసేవ చాల నమ్మినదిర
madhukara nikara samAnavENi dhIra
madagaja gAmini marachitivEmokO
sadayuni pAdasEva chAla namminadira
చరణం
charaNam 1
వలచిన దానిపై వంచన లేలర
సలలిత గుణసాంద్ర సామి మ్రొక్కేనుర
valachina dAnipai vamchana lElara
salalita guNasAmdra sAmi mrokkEnura
చరణం
charaNam 2
రతిపతి కేళిని రమణి నొప్పింపర*
సతతము నేలుకో సామి వేంకటరమణ
ratipati kELini ramaNi noppimpara
satatamu nElukO sAmi vEmkaTaramaNa
  • noppimpakura?

#134 నలినాక్షి సామిని nalinAkshi sAmini

Titleనలినాక్షి సామిని (ప్రతి)nalinAkshi sAmini (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
నలినాక్షి సామిని నమ్మరాదే చెలి
తలచియు మదిలోన దరుణిరో చాలునే
nalinAkshi sAmini nammarAdE cheli
talachiyu madilOna daruNirO chAlunE
చరణం
charaNam 1
యే చెలి గూడనని యిందు నమ్మికలిచ్చి
ఆ చెలిని కలిసి అలసి యున్నాడట
yE cheli gUDanani yimdu nammikalichchi
A chelini kalisi alasi yunnADaTa
చరణం
charaNam 2
నాసాటి వనితలు నవ్వగ విడనాడి
మోసము చేసెనే ముందు యోచించక
nAsATi vanitalu navvaga viDanADi
mOsamu chEsenE mumdu yOchimchaka
చరణం
charaNam 3
రమణిరో రేపలె రాజగోపాలుడే
సమయమునను యా సఖిని విడననెనే
ramaNirO rEpale rAjagOpAluDE
samayamunanu yA sakhini viDananenE

#133 వేగ రమ్మనవే vEga rammanavE

Titleవేగ రమ్మనవేvEga rammanavE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
వేగ రమ్మనవే సామినిందు సఖిvEga rammanavE sAminimdu sakhi
చరణం
charaNam 1
మదనుని బారికి మదినోర్వజాలనే
సదయుని కింత దయలేదే వేగమె
madanuni bAriki madinOrvajAlanE
sadayuni kimta dayalEdE vEgame
చరణం
charaNam 2
అలదాని మాయకు వలచిన సామికి
తలపనే మందు తలకెక్కె వేగమే
aladAni mAyaku valachina sAmiki
talapanE mamdu talakekke vEgamE
చరణం
charaNam 3
వెద్దిర యెవతో విభు నెడబాపెనె
నిద్దుర కంటికి రాదుగదే వేగమె
veddira yevatO vibhu neDabApene
niddura kamTiki rAdugadE vEgame
చరణం
charaNam 4
వన్నెలాడిరొ మైసూరి కృష్ణుని
క్రొన్నన విల్తుని కేళికి వేగమే
vannelADiro maisUri kRshNuni
kronnana viltuni kELiki vEgamE

#132 చెలియరో cheliyarO

Titleచెలియరో (ప్రతి)cheliyarO (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaమాంజిmAmji
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
చెలియరో రావే చెలువుని దేవే
వలరాజు బారికీ వనిత నేనోర్వనే
cheliyarO rAvE cheluvuni dEvE
valarAju bArikI vanita nEnOrvanE
చరణం
charaNam 1
కలువల రాయుని కాక మెండాయనే
చిలుకలు గుమిగూడి కలకల గూసెనే
kaluvala rAyuni kAka memDAyanE
chilukalu gumigUDi kalakala gUsenE
చరణం
charaNam 2
మధుకర నికరము మగువచందుని మ్రోయ
మదిరాక్షి వాని బాయ మరపు రాదాయె
madhukara nikaramu maguvachamduni mrOya
madirAkshi vAni bAya marapu rAdAye
చరణం
charaNam 3
నలినాక్షి శ్రీరేపలె నాగశయనుడే
చలము జేయదు సరసుడు రాడే
nalinAkshi SrIrEpale nAgaSayanuDE
chalamu jEyadu sarasuDu rADE

#131 నను బ్రోవరాదా nanu brOvarAdA

Titleనను బ్రోవరాదాnanu brOvarAdA
Written By
BookprAchIna-navIna
రాగం rAgaమాంజిmAmji
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
నను బ్రోవరాద నా మీద దయలేదాnanu brOvarAda nA mIda dayalEdA
చరణం
charaNam 1
వటపత్ర శాయి నాతో వాదమేల మానుమికvaTapatra SAyi nAtO vAdamEla mAnumika
చరణం
charaNam 2
సరివారు నవ్వేరని చాల నీతో మొరబెట్టగ
వెరవకు మని నన్ను వేగమే కరము బట్టి
sarivAru navvErani chAla nItO morabeTTaga
veravaku mani nannu vEgamE karamu baTTi