#130 మరుని జనక maruni janaka

Titleమరుని జనక (ప్రతి)maruni janaka (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మరుని జనక యిది మంచి వేళగాదుర
సరసములాడకుర సామి మ్రొక్కేనుర
maruni janaka yidi mamchi vELagAdura
sarasamulADakura sAmi mrokkEnura
చరణం
charaNam 1
కన్ను లెస్స గీటి కౌగలింప మేటి
వని నమ్మియుంటి వదలు తమ్మికంటి
kannu lessa gITi kaugalimpa mETi
vani nammiyumTi vadalu tammikamTi
చరణం
charaNam 2
నే మగనాలను నేరమెంచుటేలను
ప్రేమతోడ ముద్దులను బెట్టుకొనుట చాలును
nE maganAlanu nEramemchuTElanu
prEmatODa muddulanu beTTukonuTa chAlunu
చరణం
charaNam 3
సామిరేపలెపురి ధామ విను మురహర
కాముని కేళిలోను కలియుట మాను
sAmirEpalepuri dhAma vinu murahara
kAmuni kELilOnu kaliyuTa mAnu

#129 వాని యెడబాసి vAni yeDabAsi

Titleవాని యెడబాసిvAni yeDabAsi
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వాని యెడబాసి నేనెటులోర్తునే
కానిదానితో గూడి కనబడడే చెలి
vAni yeDabAsi nEneTulOrtunE
kAnidAnitO gUDi kanabaDaDE cheli
చరణం
charaNam 1
చిన్నవయసు నుండి చేరి నాతో తన
చిన్నెలు చేసినను చిన్నబుచ్చెనే చెలి
chinnavayasu numDi chEri nAtO tana
chinnelu chEsinanu chinnabuchchenE cheli
చరణం
charaNam 2
యిచ్చలతో నను నిండు కౌగిలించి
మచ్చిక చేసి నను మరచెగదే చెలి
yichchalatO nanu nimDu kaugilimchi
machchika chEsi nanu marachegadE cheli
చరణం
charaNam 3
ధరనిలయు శ్రీరంగధాముడు ననుగూడి
నిరతము బాయనని నన్నేచెగదే చెలి
dharanilayu SrIramgadhAmuDu nanugUDi
niratamu bAyanani nannEchegadE cheli

#128 సుదతిరొ sudatiro

Titleసుదతిరొ (ప్రతి)sudatiro (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సుదతిరొ సామిని జూపవె
సదయుని రమ్మనె
sudatiro sAmini jUpave
sadayuni rammane
చరణం
charaNam 1
మదన జనకుడెడబాసీ యేమగువనొ డాసీ
మదనుని కేళిని గూడెనె
madana janakuDeDabAsI yEmaguvano DAsI
madanuni kELini gUDene
చరణం
charaNam 2
నా మీదను నెనరుంచీ ప్రేమతోను మన్నించి
భామిని వరు రప్పించవె
nA mIdanu nenarumchI prEmatOnu mannimchi
bhAmini varu rappimchave
చరణం
charaNam 3
ఆస తోడ మును బాస చేసిన రేపలెవాసుడు మోసము చేసెనేAsa tODa munu bAsa chEsina rEpalevAsuDu mOsamu chEsenE

#127 మనవలె గాదె manavale gAde

Titleమనవలె గాదెmanavale gAde
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మనవలె గాదె తాళినా లామకే బూనిశే దూరగయే తనవారి
మౌలమిలావే జాన్ బరతు బతాడే డేజమాల్
manavale gAde tALinA lAmakE bUniSE dUragayE tanavAri
maulamilAvE jAn baratu batADE DEjamAl
చరణం
charaNam 1
This didnt sound right. Definitely not a Telugu jAvaLi either. Consulted an expert and here’s a first attempt at better lyrics
మన్‌వా లగాదే తాలి నాలామకే
బూనిశే దూర్ గయే తన్ వారి
మౌల్ మిలావే జాన్వర్ తూ బతాదే దే జమాల్
man^vA lagAdE tAli nAlAmakE
bUniSE dUr gayE tan vAri
moul milAvE jAnvar tU batAdE dE jamAl

Could possibly mean:  O my mind please check/lock the thoughts from straying, I bestow/ my life to go and meet the  Moula, (Lord/Prabhu) you tell me oh  very beautiful, (Meaning of Jamal: बहुत सुंदर रूप, खूबसूरती। 2/. सुंदरता, खूबसूरती।)

#126 యింతి దుఃఖమెట్లు yimti du@HkhameTlu

Titleయింతి దుఃఖమెట్లు (ప్రతి)yimti du@HkhameTlu (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యింతి దుఃఖమెట్లు సయితునే ఓ చెలియ నేyimti du@hkhameTlu sayitunE O cheliya nE
కాంత మందు తలకెక్కి కాంతుడు రాడాయనెkAmta mamdu talakekki kAmtuDu rADAyane
చరణం
charaNam 1
శుకపికములు గూయ సుదతిరో చంద్రుడు గాయ
ప్రకటితముగ మరుడు నాపై బాణంబులు వేయగ
Sukapikamulu gUya sudatirO chamdruDu gAya
prakaTitamuga maruDu nApai bANambulu vEyaga
చరణం
charaNam 2
ముదముతో మును పాడిన ముచ్చటలేమాయనొ
సదయునకు నన్ను విడుట సంతోషము దోచెనో
mudamutO munu pADina muchchaTalEmAyano
sadayunaku nannu viDuTa samtOshamu dOchenO
చరణం
charaNam 3
వాసిగ శ్రీ రేపలెపురవాసుడు కలయక నన్ను
గాసిబెట్ట దలచి సుంత కరుణలేక యుండెనే
vAsiga SrI rEpalepuravAsuDu kalayaka nannu
gAsibeTTa dalachi sumta karuNalEka yumDenE

#125 యెంత పాపము yemta pApamu

Titleయెంత పాపముyemta pApamu
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యెంత పాపమింతినైతినే చెలిyemta pApamimtinaitinE cheli
పంతగించి పోయ్యే సామి బతిమాలిన రాడుగదెpamtagimchi pOyyE sAmi batimAlina rADugade
చరణం
charaNam 1
కృప దొలంగి విభుడు చాల గినిసి వేసిపోయెగా
చపలనేత్ర యెట్లు సయితు సరసుని గురు విరహ తాప
kRpa dolamgi vibhuDu chAla ginisi vEsipOyegA
chapalanEtra yeTlu sayitu sarasuni guru viraha tApa
చరణం
charaNam 2
పలుకు పలుకులకు తేనియ లొలుకు మాటలాడు వాని
వలచి మోసపోయితిని కిసలయపాణి యేమిసేతు
paluku palukulaku tEniya loluku mATalADu vAni
valachi mOsapOyitini kisalayapANi yEmisEtu
చరణం
charaNam 3
దివిజపతి ముఖ వినుత బలదేవ రసికభుజగవరుని
యవిరళ రతిసుఖ సంపదలబ్బునో యిక నబ్బదో చెలి
divijapati mukha vinuta baladEva rasikabhujagavaruni
yaviraLa ratisukha sampadalabbunO yika nabbadO cheli

#124 సామిగ నీమది sAmiga nImadi

Titleసామిగ నీమది (ప్రతి)sAmiga nImadi (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సామిగ నీమది కేమని దోచెర
కాముని కేళిలో గలయగ రావేర
sAmiga nImadi kEmani dOchera
kAmuni kELilO galayaga rAVEra
చరణం
charaNam 1
ఆ సఖి యే బోధ జేసెనుర నీకు
జేసిన బాసలు చెలికాడ మరచి
A sakhi yE bOdha jEsenura nIku
jEsina bAsalu chelikADa marachi
చరణం
charaNam 2
స్నేహము జేసియు చెలిమితో నను
మోహింపగా జేసి మోసమిటుల జేయ
snEhamu jEsiyu chelimitO nanu
mOhimpagA jEsi mOsamiTula jEya
చరణం
charaNam 3
ధరను శ్రీరేపలెపురహరి నీకే
మరులు కొంటినని మన్నన జేయకనే
dharanu SrIrEpalepurahari nIkE
marulu komTinani mannana jEyakanE

#123 యేమిర నాసామి yEmira nAsAmi

Titleయేమిర నాసామిyEmira nAsAmi
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశంకరాభరణంSamkarAbharaNam
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
యేమిర నాసామి నీకిది తగున
కామినుల యెడనిట్టి నీమవు మాటలకును
yEmira nAsAmi nIkidi taguna
kAminula yeDaniTTi nImavu mATalakunu
చరణం
charaNam 1
నిన్న రేయి వచ్చేవనీ నిద్రలేక వేసారితి
వన్నెలాడి నీతో మరి కన్నుసయిగ చేసెనేమొ
ninna rEyi vachchEvanI nidralEka vEsAriti
vannelADi nItO mari kannusayiga chEsenEmo
చరణం
charaNam 2
అతివరో వచ్చేనని ఆనబెట్టి పోతివిర
ప్రాణనాధ నీవే బల్ జాణవే శభాసుర
ativarO vachchEnani AnabeTTi pOtivira
prANanAdha nIvE bal jANavE SabhAsura
చరణం
charaNam 3
తప్పక సురపురి దైవరాయ గోపాల
ఇప్పుడైన గూడమంటె తప్పుమాటలాడెదవే
tappaka surapuri daivarAya gOpAla
ippuDaina gUDamanTe tappumATalADedavE

#122 యేమి సేతునే yEmi sEtunE

Titleయేమి సేతునే (ప్రతి)yEmi sEtunE (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యేమి సేతునే ఓ సఖీ
కామిని మణి గూడి వాడు
కనుల జూడడాయె సఖి
yEmi sEtunE O sakhI
kAmini maNi gUDi vADu
kanula jUDaDAye sakhi
చరణం
charaNam 1
మందగమన వాని మనసు నందు నేమి దోచెనేమొ
ఇందీవరాక్షి బెట్టు మందు తలకెక్కె సఖి
mamdagamana vAni manasu namdu nEmi dOchenEmo
imdIvarAkshi beTTu mamdu talakekke sakhi
చరణం
charaNam 2
నా సరివారిలో నన్ను నగుబాటు జేసి మున్ను
జేసిన బాసలేమి జేసి మరచెనే వో సఖీ
nA sarivArilO nannu nagubATu jEsi munnu
jEsina bAsalEmi jEsi marachenE vO sakhI
చరణం
charaNam 3
మగువరో పురుషుల నమ్మదగదని కొందరు దెల్ప
జగతిని యా మాట నిజము సల్పినాడే వో సఖి నే
maguvarO purushula nammadagadani komdaru delpa
jagatini yA mATa nijamu salpinADE vO sakhi nE
చరణం
charaNam 4
రేపల్లె పురీషుడైన గోపాలుడీ సమయమందు
పాపమంచు మదినెంచక పంతగించెనే యో సఖీ
rEpalle purIshuDaina gOpAluDI samayamamdu
pApamamchu madinemchaka pamtagimchenE yO sakhI

#121 యెట్లు సైతుర yeTlu saitura

Titleయెట్లు సైతురyeTlu saitura
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యెట్లు సైతుర నా సామిyeTlu saitura nA sAmi
చరణం
charaNam 1
పెదవిమీది పంటికాటు యెదటి దాని చంటి పోటు
కదసి కీల్జడ వెన్నున వేటు కనులజూచితే నా సామి
pedavimIdi pamTikATu yedaTi dAni chamTi pOTu
kadasi kIljaDa vennuna vETu kanulajUchitE nA sAmi
చరణం
charaNam 2
భయములేక దానెనశి పగలు రాత్రి యొకటి జేసి
వయసు చెలికి దారబోసి వచ్చి నిలచితే నా సామి
bhayamulEka dAnenaSi pagalu rAtri yokaTi jEsi
vayasu cheliki dArabOsi vachchi nilachitE nA sAmi
చరణం
charaNam 3
ముద్దుసామి వెంకటరాయ వద్దికతో పొందుసేయ
వద్దని నే వాదుసేయ వచ్చి జూచితే నా సామి
muddusAmi vemkaTarAya vaddikatO pomdusEya
vaddani nE vAdusEya vachchi jUchitE nA sAmi