| Title | కరుణ జూడర (ప్రతి) | karuNa jUDara (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | కరుణ జూడర నన్ను | karuNa jUDara nannu |
| సరసిజాక్ష నిన్ను మది చాల నెరనమ్మినార | sarasijAksha ninnu madi chAla neranamminAra | |
| చరణం charaNam 1 | విరహమనె సాగరము వెలది నెట్లుగడచుదాన కరుణానిధి ప్రేమ నను కాముకేళిగూడి మదిని | virahamane sAgaramu veladi neTlugaDachudAna karuNAnidhi prEma nanu kAmukELigUDi madini |
| చరణం charaNam 2 | వసుధ వెలయు రేపల్లె పురవరగోపాల బాల రార రసికుడ సుందరాకార రాపేల జేసేవేరా | vasudha velayu rEpalle puravaragOpAla bAla rAra rasikuDa sumdarAkAra rApEla jEsEvErA |
Category: Lyrics
#119 చిన్నదానర chinnadAnara
| Title | చిన్నదానర | chinnadAnara |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | చిన్నదానర నే కన్ను దోయి కెంపు దోచె కన్నెలుకేమిరా! నే | chinnadAnara nE kannu dOyi kempu dOche kannelukEmirA! nE |
| చరణం charaNam 1 | మగని మోము జూచి నేను దిగలు చెంది యుండగ పొగరు మాటలాడినన్నగడు జేతువేమిర నే | magani mOmu jUchi nEnu digalu chemdi yumDaga pogaru mATalADinannagaDu jEtuvEmira nE |
| చరణం charaNam 2 | చెక్కు నొక్కి లేత చన్నుముక్కులు నలిపేవుర పుక్కిట విడెమిచ్చి నను స్రుక్కజేతు వేమిర నే | chekku nokki lEta channumukkulu nalipEvura pukkiTa viDemichchi nanu srukkajEtu vEmira nE |
| చరణం charaNam 3 | రత్నపురి నిలయ ప్రయత్నముతో నన్నుగూడి ముత్యసరులిత్తునని ముచ్చటింతు వేమిర నే | ratnapuri nilaya prayatnamutO nannugUDi mutyasarulittunani muchchaTimtu vEmira nE |
#118 సుందరాకారుని sumdarAkAruni
| Title | సుందరాకారుని (ప్రతి) | sumdarAkAruni (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | సుందరాకారుని యిందుదే గదవే పొందుగోరి భ్రమజెందితి ననవే | sumdarAkAruni yimdudE gadavE pomdugOri bhramajemditi nanavE |
| చరణం charaNam 1 | మగువ జేసిన బాస మరువకు మనవె చిగురువిల్తుని బారిజిక్కితి ననవే | maguva jEsina bAsa maruvaku manave chiguruviltuni bArijikkiti nanavE |
| చరణం charaNam 2 | కమలారి వెన్నెలగాయ వేదనచే రమణీ యోర్వదివే రాపేల ననవే | kamalAri vennelagAya vEdanachE ramaNI yOrvadivE rApEla nanavE |
| చరణం charaNam 3 | సుదతుల యెడ కఠిన హృదయము బూన పదపడి యిత్తరి పాడి గాదనవే | sudatula yeDa kaThina hRdayamu bUna padapaDi yittari pADi gAdanavE |
| చరణం charaNam 4 | రామశ్రీ రేపల్లె రాట్టిరీశుని కోమల శ్రీ రాజగోపాలవరునీ | rAmaSrI rEpalle rATTirISuni kOmala SrI rAjagOpAlavarunI |
#117 నీరజాక్షుల మాట nIrajAkshula mATa
| Title | నీరజాక్షుల మాట | nIrajAkshula mATa |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | నీరజాక్షుల మాట నీళ్ళల్లో మూట | nIrajAkshula mATa nILLallO mUTa |
| ఆరూఢిగాచూట అమృతంపుతేట | ArUDhigAchUTa amRtamputETa | |
| చరణం charaNam 1 | మనసు యందొకటి మరి వాక్కు నొకటి తాత్పర్యము నమ్మ తగదు వేరొకటి | manasu yamdokaTi mari vAkku nokaTi tAtparyamu namma tagadu vErokaTi |
| చరణం charaNam 2 | వనితలు గోడబెట్టిన రీతి బొంకు విను మొగవాడు బల్కితె వచ్చు రంకు | vanitalu gODabeTTina rIti bomku vinu mogavADu balkite vachchu ramku |
#116 వెలదిరో నాధుని veladirO nAdhuni
| Title | వెలదిరో నాధుని (ప్రతి) | veladirO nAdhuni (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | శుధ్ధకాంభోజి | SudhdhakAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వెలదిరో నాధుని వేగమె దేవే | veladirO nAdhuni vEgame dEvE |
| జలజాక్షి వానికి శరణని యున్నదని | jalajAkshi vAniki SaraNani yunnadani | |
| చరణం charaNam 1 | మారుడు శరములు మచ్చరించి వేయగ కోరి నమ్మి యుంటిని కోమలాంగుని మదిని | mAruDu Saramulu machcharimchi vEyaga kOri nammi yumTini kOmalAmguni madini |
| చరణం charaNam 2 | చిన్ననాడె వలశున్న దాననని కన్నెరొ విన్నవించి కాముని కేళికిని | chinnanADe valaSunna dAnanani kannero vinnavimchi kAmuni kELikini |
| చరణం charaNam 3 | రాజిల్ల శ్రీ మాణిక్య రాట్కులసింధు ద్విజ రాజవెంకట గోపాలరాయ పృధ్వీశుని | rAjilla SrI mANikya rATkulasimdhu dwija rAjavemkaTa gOpAlarAya pRdhwISuni |
#115 మునుపటి బాసలు munupaTi bAsalu
| Title | మునుపటి బాసలు | munupaTi bAsalu |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | శుద్ధకాంభోజి | SuddhakAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మునుపటి బాసలు మనకేలనే చెలీ కోరిన కోరికల్ కొనసాగగానే నీరజ నయనరో నీ మది నిజముగాదే | munupaTi bAsalu manakElanE chelI kOrina kOrikal konasAgagAnE nIraja nayanarO nI madi nijamugAdE |
| చరణం charaNam 1 | పాన్పుపైని పవళించిన వేళలో మోము మోమున జేర్చి ముద్దుబెట్టి వేడ | pAn&pupaini pavaLimchina vELalO mOmu mOmuna jErchi muddubeTTi vEDa |
| చరణం charaNam 2 | ఆడిన మాటకు అతివరొ వానితో చాడి చెప్పి నను చౌక జేసితివి | ADina mATaku ativaro vAnitO chADi cheppi nanu chauka jEsitivi |
#114 సామీ నిను వేడ sAmI ninu vEDa
| Title | సామీ నిను వేడ (ప్రతి) | sAmI ninu vEDa (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సామీ నిను వేడ బ్రోవవేమి జాలమిదేమి కాముని బారికి నే గాసి నొందజాలననీ | sAmI ninu vEDa brOvavEmi jAlamidEmi kAmuni bAriki nE gAsi nomdajAlananI |
| చరణం charaNam 1 | ఆసతోడ మున్ను నను బాసి యోర్వలేననీ జేసిన బాసలేమి జేసి కోపగించేవు | AsatODa munnu nanu bAsi yOrvalEnanI jEsina bAsalEmi jEsi kOpagimchEvu |
| చరణం charaNam 2 | చిన్ననాడె జేసి యున్న చిన్నెలన్ని దలచుకొనీ వన్నెకాడ విరహము నే నోర్వలేర రార మేర | chinnanADe jEsi yunna chinnelanni dalachukonI vannekADa virahamu nE nOrvalEra rAra mEra |
| చరణం charaNam 3 | సదయుడౌ శ్రీదిన వహి సద్వంశజ పురుషోత్తమ ముదమున నెరనమ్మినార కదశి గౌగలించవేర | sadayuDou SrIdina vahi sadwamSaja purushOttama mudamuna neranamminAra kadaSi gougalimchavEra |
#113 యేరా మోడిసేయ yErA mODisEya
| Title | యేరా మోడిసేయ | yErA mODisEya |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యేరామోడి సేయ మేర మనోహర | yErAmODi sEya mEra manOhara |
| రారా నీకొగి వీరా నన్నేలుకోర | rArA nIkogi vIrA nannElukOra | |
| చరణం charaNam 1 | బాలప్రాయము నుండి బాళి నిను బెంచి మేలుగన నెంచు నన్ను మేలమాడెద వౌర | bAlaprAyamu numDi bALi ninu benchi mElugana nemchu nannu mElamADeda vaura |
| చరణం charaNam 2 | ఏట బెరిగెడు వాని పూట బెంచి తుదిని నోటి మాటలకేను నోచనైతి నా సామి | ETa berigeDu vAni pUTa bemchi tudini nOTi mATalakEnu nOchanaiti nA sAmi |
| చరణం charaNam 3 | నిలయమున నినుగానను నింటగల పనులెల్ల మరచి తల వాకిలిల్లు గలచి యుందుగదరా | nilayamuna ninugAnanu nimTagala panulella marachi tala vAkilillu galachi yumdugadarA |
| చరణం charaNam 4 | కరిగిరి వరదుని మరిదివైన నీకు హరి హరి సుంతైన గరుణలేక నాపైని | karigiri varaduni maridivaina nIku hari hari sumtaina garuNalEka nApaini |
#112 భామిని నీ విందు bhAmini nI vimdu
| Title | భామిని నీ విందు (ప్రతి) | bhAmini nI vimdu (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | పూరి కల్యాణి | pUri kalyANi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | భామిని నీ విందు రాగదె గౌరిశెట్టి శ్రీరామునిందు దోడి తేగదే | bhAmini nI vimdu rAgade gauriSeTTi SrIrAmunimdu dODi tEgadE |
| చరణం charaNam 1 | కామకోటి రూప కరుణాసాగరునీ కాముకేళికిని | kAmakOTi rUpa karuNAsAgarunI kAmukELikini |
| చరణం charaNam 2 | పంచశరుడు యెంచి బాణములు నెద నించెనే మించి యోర్వజాలనే | pamchaSaruDu yemchi bANamulu neda nimchenE mimchi yOrvajAlanE |
| చరణం charaNam 3 | కరుణ విడచి యే తరుణినొ మరుకేళిని గూడెనె సరసుడు నన్వీడెనే | karuNa viDachi yE taruNino marukELini gUDene sarasuDu nanvIDenE |
| చరణం charaNam 4 | భామరొ విను తంగేళ్ళమూడి పురధాముడే సోమసమానుడే | bhAmaro vinu tamgELLamUDi puradhAmuDE sOmasamAnuDE |
#111 ప్రాణనాధా prANanAdhA
| Title | ప్రాణనాధా | prANanAdhA |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | పూరి కల్యాణి | pUri kalyANi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ప్రాణనాధా మనవీ విను బాలు నిటుల జేయకు | prANanAdhA manavI vinu bAlu niTula jEyaku |
| చరణం charaNam 1 | దీనురాలనగుచు నిన్ను వేడెదను తనయునికై నేను | dInurAlanaguchu ninnu vEDedanu tanayunikai nEnu |
| చరణం charaNam 2 | చాన నేను వీని జంపెదను గానలోలు దలచిన | chAna nEnu vIni jampedanu gAnalOlu dalachina |
| చరణం charaNam 3 | మానమెంచడిందుకు నేనేమందు వీని విడువనందు | mAnamemchaDimduku nEnEmamdu vIni viDuvanamdu |
| చరణం charaNam 4 | క్షత్రమలర రక్షింపుము నీవికను పుత్ర భిక్షమిమ్ము | kshatramalara rakshimpumu nIvikanu putra bhikshamimmu |
| చరణం charaNam 5 | గోత్రధరుడు రామానుజపుర వరుని స్తోత్రము సేయు వీని | gOtradharuDu rAmAnujapura varuni stOtramu sEyu vIni |