#49 ఝూలత రాధే jhUlata rAdhE

Titleఝూలత రాధేjhUlata rAdhE
Written By
రాగం rAgaకాపిkApi
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
ఝూలత రాధే సంగ గిరిధరjhUlata rAdhE samga giridhara
చరణం
charaNam 1
అబిరగులాలవుడా వతరధా
భరచకారీరంగ్ గిరిధర
abiragulAlavuDA vataradhA
bharachakArIramg giridhara
చరణం
charaNam 2
లాల బహి బృందావన జమునా
ఖేచర సూభవరంగ్ గిరిధర
lAla bahi bRmdAvana jamunA
khEchara sUbhavaramg giridhara
చరణం
charaNam 3
మీరాకే ప్రభు గిరిధర నాగర
చరణకమల భోరంగ్ గిరిధర
mIrAkE prabhu giridhara nAgara
charaNakamala bhOramg giridhara
** More likely to be a Mira Bhajan, than a Javali. Publishing merely because a Javali book had this. Textual corrections may be needed.

First attempt at correction:

ఝూలత్ రాధా సంగ్ గిరిధర కేjhUlat rAdhA sang giridhara kE
అబిర గులాల్ ఉడావత్ రాధా
భరి పిచకారీ రంగ్
abira gulAl uDAvat rAdhA
bhari pichakArI ramg
లాల్ భయీ బృందావన్ జహూనా
కేసర చూవత్ రంగ్ గిరిధర్ కే
lAl bhayI bRndAvan jahUnA
kEsara chUvat ramg giridhar kE
మీరాకే ప్రభు గిరిధర నాగర
చరణకమల భోరంగ్ గిరిధర
mIrAkE prabhu giridhara nAgara
charaNakamala bhOramg giridhara

An audio link: https://www.youtube.com/watch?v=jkgS9iE94Wc by Veena Sahastrabuddhe

#48 తుమబిన tumabina

Titleతుమబినtumabina
Written By
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
తుమబిన మేరీ కౌనకబరలే
శావలి యా గిరధారీరే
tumabina mErI kounakabaralE
SAvali yA giradhArIrE
చరణం
charaNam 1
భారసభామొ ద్రౌపతి ఠారీరాకోలా జహమారీరే
ప్రభూజీ రాకోలా జహమారీరే
bhArasabhAmo draupati ThArIrAkOlA jahamArIrE
prabhUjI rAkOlA jahamArIrE
చరణం
charaNam 2
మీరాకే ప్రభు గిరిధర నాగర
చరణ కమల బలహారీరే
భల భల చరణ కమల బలహారీరే
mIrAkE prabhu giridhara nAgara
charaNa kamala balahArIrE
bhala bhala charaNa kamala balahArIrE
** More likely to be a Mira Bhajan than a Javali. Publishing merely because a Javali book had this. Textual corrections may be needed.

First attempt at correction of lyrics.

తుమ బిన్ మోరీ కౌన్ ఖబర్ లే
సావలియా గిరిధారీ
tuma bin&^ mOrI koun khabar lE
sAvaliyA giridhArI
భర్ సభా మే ద్రౌపది ఠారి
రాఖో లాజ్ హమారీ రే
ప్రభుజీ రాఖో లాజ్ హమారీ రే
bhar sabhA mE droupadi ThAri
rAkhO lAj hamArI rE
prabhujI rAkhO lAj hamArI rE
మీరా కే ప్రభు గిరిధర నాగర
చరణ కమల బలిహారీరే
భల భల చరణ కమల బలిహారీరే
mIrA kE prabhu giridhara nAgara
charaNa kamala balihArIrE
bhala bhala charaNa kamala balihArIrE

Audio Link: https://www.youtube.com/watch?v=oHpOPQ39-9I by T.N Seshagopalan (One of many)

#47 కాసాని చెలి kAsAni cheli

Titleకాసాని చెలిkAsAni cheli
Written By
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
కాసాని చెలినే గాదటరా నీ
బాసలెల్ల యే మాయనురా
kAsAni chelinE gAdaTarA nI
bAsalella yE mAyanurA
చరణం
charaNam 1
సారెకు నా సరివారి యెదుట నిన్ను
రారా రాయని బిలచి
sAreku nA sarivAri yeduTa ninnu
rArA rAyani bilachi
చరణం
charaNam 2
ఆ సతులతో బరియాసము సలుపక
రోసముతో యోరోరి యని బిలిచిన
A satulatO bariyAsamu salupaka
rOsamutO yOrOri yani bilichina
చరణం
charaNam 3
రేపగలని భేదములెంచక
నీపైగొని ఉపరతులను సలుపక
rEpagalani bhEdamulemchaka
nIpaigoni uparatulanu salupaka
చరణం
charaNam 4
ధర్మపురిని నెలకొన్న శ్రీపరవాసు
నిర్మలమగు వేంకటేశుని సాక్షిగ
dharmapurini nelakonna SrIparavAsu
nirmalamagu vEmkaTESuni sAkshiga

#46 మనకేలానె manakElAne

TitleమనకేలానెmanakElAne
Written By
రాగం rAgaకాపిkApi
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
మనకేలానె లేని పోని మాటలు మనకేలానేmanakElAne lEni pOni mATalu manakElAnE
చరణం
charaNam 1
కనికరమున తా వినయము నెంచక
మనసున ప్రియింప
kanikaramuna tA vinayamu nemchaka
manasuna priyimpa
చరణం
charaNam 2
కాముని కేళిలొ సోమజ చంద్రుని
తలచినదేయల
kAmuni kELilo sOmaja chamdruni
talachinadEyala
చరణం
charaNam 3
వేమరొ సురపురి వేణుగోపాలుని
కలసినదేయల
vEmaro surapuri vENugOpAluni
kalasinadEyala

#45 ఎటువలె యెటువలె eTuvale yeTuvale

Titleఎటువలె యెటువలెeTuvale yeTuvale
Written By
రాగం rAgaతోడిtODi
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
ఎటువలె యెటువలె సైచుదు నే విరహముeTuvale yeTuvale saichudu nE virahamu
చరణం
charaNam 1
ఇంతిరో విరహము యెంతని యోర్తునె
కాంతునీ బారికి కలయ రమ్మనుమనె
imtirO virahamu yemtani yOrtune
kAmtunI bAriki kalaya rammanumane
చరణం
charaNam 2
కుటిలాలకి నీ కోపము మానవే
విటకానిని నా విడిదిగి తేగదే
kuTilAlaki nI kOpamu mAnavE
viTakAnini nA viDidigi tEgadE
చరణం
charaNam 3
వేమరో సురపురి వేణుగోపాలుని
కాముని కేళికి కలవర మందితి
vEmarO surapuri vENugOpAluni
kAmuni kELiki kalavara mamditi

#44 సామికి తెలిపే sAmiki telipE

Titleసామికి తెలిపేsAmiki telipE
Written By
రాగం rAgaదేశీయ తోడిdESIya tODi
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
సామికి తెలిపేవారెవరే
కాముని బారికి వోరుపలేనే
sAmiki telipEvArevarE
kAmuni bAriki vOrupalEnE
చరణం
charaNam 1
కూరిమి దానితో గూడి యుండేటి వేళ నా
మాలిమితో నన్నేలిన బాలా గోపాలునకు యీ జాలము తగదని తగదని నా
kUrimi dAnitO gUDi yumDETi vELa nA
mAlimitO nannElina bAlA gOpAlunaku yI jAlamu tagadani tagadani nA
చరణం
charaNam 2
సారెకు దానితో సరసము లాడుట
మేరగాదని నా మేలువానితో నేడునా
sAreku dAnitO sarasamu lADuTa
mEragAdani nA mEluvAnitO nEDunA
చరణం
charaNam 3
వేమరొ సురపురి వేణు గోపాలుని
కామునికేళికి కలయ రమ్మనుమని నా
vEmaro surapuri vENu gOpAluni
kAmunikELiki kalaya rammanumani nA

#43 వాని యెడబాసి vAni yeDabAsi

Titleవాని యెడబాసిvAni yeDabAsi
Written By
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వాని యెడబాసి నేనెటు లోర్తునే చెలి
కాని వారితో గూడి కనబడడె చెలి
vAni yeDabAsi nEneTu lOrtunE cheli
kAni vAritO gUDi kanabaDaDe cheli
చరణం
charaNam 1
ఇచ్చలతో నన్ను నిండు కౌగలించి
మచ్చిక చేసినది మరచెగదే చెలి
ichchalatO nannu nimDu kaugalimchi
machchika chEsinadi marachegadE cheli
చరణం
charaNam 2
చిన్న వయసు నుండి జేరి నాతో తన
చిన్నెలు జూపినను చిన్నబుచ్చెనే చెలి
chinna vayasu numDi jEri nAtO tana
chinnelu jUpinanu chinnabuchchenE cheli
చరణం
charaNam 3
ధరవెలయు శ్రీరంగధాముడు ననుగూడి
నిరతము బాయనని ఆనబెట్టెనే చెలి
dharavelayu SrIramgadhAmuDu nanugUDi
niratamu bAyanani AnabeTTenE cheli

#42 పంతము శాయకు pamtamu SAyaku

Titleపంతము శాయకుpamtamu SAyaku
Written By
రాగం rAgaఇందుస్తానిindustAni
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
పంతము శాయకు పణతిరో నాపై
ఎంతయు జెప్పిన వినవేమో మాయ
pamtamu SAyaku paNatirO nApai
emtayu jeppina vinavEmO mAya
చరణం
charaNam 1
కాంతామణి నీ చెంతను జేరితి
సంతరించుమని జాలగ వేడితి
kAmtAmaNi nI chemtanu jEriti
samtarimchumani jAlaga vEDiti
చరణం
charaNam 2
** ఇత్తని లేవు నక్కిత్తనై కోపమో
పత్తి యెరియుదెన్ పాపమో ఖర్మమో
ittani lEvu nakkittanai kOpamO
patti yeriyuden pApamO kharmamO*
చరణం
charaNam 3
** మయ్యల్ మీరుదే మయిలే కుయిలే
మల్లిగై ముల్లిగై మాదళం పూవే
mayyal mIrudE mayilE kuyilE
malligai mulligai mAdaLam pUvE*
చరణం
charaNam 4
చయ్యన జేర్చుము నీ పుణ్యముండును
అన్యుల మాట విని అలసట బెట్టకు
chayyana jErchumu nI puNyamunDunu
anyula mATa vini alasaTa beTTaku
చరణం
charaNam 5
దిక్కు నీవని దిక్కు జేరితిని
దక్కితి నని నీకు చాలగ మ్రొక్కితి
** అక్కరుడోయన్నై యాదరిత్తుక్కొళ్ళుం
** పక్కత్తీల్ పార్తెన్ పరన్ దోడాడే
** అల్లుం పగలుం పున్నై నంబిక్కొండిరుండేన్
** నంబుగల్ శెయ్యాదె మాదళం బూవే
dikku nIvani dikku jEritini
dakkiti nani nIku chAlaga mrokkiti
** akkaruDOyannai yAdarittukkoLLum
** pakkattIl pArten paran dODADE
** allum pagalum punnai nambikkonDirunDEn
** nambugal SeyyAde mAdaLam bUvE
చరణం
charaNam 6
చల్లగ నాతో పలికిన చాలును
సల్లాపము నాతో సలిపిన చాలును
challaga nAtO palikina chAlunu
sallApamu nAtO salipina chAlunu
చరణం
charaNam 7
వాసిగ తిరువల్లిక్కేణిలొ నెలకొన్న
పార్థసారథి దయ దప్పి యుండేను
** ఆశైయుడనె శ్రీనివాసన్తె యాళుమే
** మోశంశెయ్యాదె పెణ్మానే కణ్మానే
vAsiga tiruvallikkENilo nelakonna
pArthasArathi daya dappi yumDEnu
** ASaiyuDane SrInivAsan&te yALumE
** mOSamSeyyAde peNmAnE kaNmAnE
** Some corrections may be needed for the Tamil language lines marked

25 Nov 2025 – adding “pantamu SAyaku” here, so that this jAvaLi can be searched with either spelling

#41 చక్కని సామి chakkani sAmi

Titleచక్కని సామిchakkani sAmi
Written By
రాగం rAgaకన్నడkannaDa
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
చక్కని సామి మాటాడవదేలరా
చలమిటు నాతో సేయకురా
chakkani sAmi mATADavadElarA
chalamiTu nAtO sEyakurA
చరణం
charaNam 1
కలకాలము కలసిన స్నేహము
చెలువుడ మరచుట తగున్యేలరా
kalakAlamu kalasina snEhamu
cheluvuDa marachuTa tagunyElarA
చరణం
charaNam 2
ఏల నా సవతి నీకేమి బోధించెరా
ఎందుకు నాపై కోపమేలరా
Ela nA savati nIkEmi bOdhimcherA
emduku nApai kOpamElarA
చరణం
charaNam 3
రారా నన్నిటు రాపు జేసేవురా
రచ్చకు మదినే నోర్వనురా
rArA nanniTu rApu jEsEvurA
rachchaku madinE nOrvanurA
చరణం
charaNam 4
ఏలిన ప్రీతి నిదేమాయనురా
యెంతని నేనిను వేడుదురా
Elina prIti nidEmAyanurA
yemtani nEninu vEDudurA
చరణం
charaNam 5
సారోదారుడు సదయ భీమేశ
సరసతో నను గూడరా
sArOdAruDu sadaya bhImESa
sarasatO nanu gUDarA

#40 పిల్ల మనసు pilla manasu

Titleపిల్ల మనసుpilla manasu
Written By
రాగం rAgaకాంభోదిkAmbhOdi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
పిల్ల మనసు గిల్లరాకుడా నల్లని సామి చిన్నpilla manasu gillarAkuDA nallani sAmi chinna
చరణం
charaNam 1
భూపల్ల మగసిగపించి చూడగ
పిల్లల జల్ల చెల్లరాయ వల్లగాదు మళ్ళిపోర
bhUpalla magasigapimchi chUDaga
pillala jalla chellarAya vallagAdu maLLipOra
చరణం
charaNam 2
ఇందురమ్మని చంద్రహారములివ్వ వచ్చేవు
సాటి యారండ్లు జూచితే
నిందెలకు మూలమౌ యెందు దాచుకొందు సామిని
imdurammani chamdrahAramulivva vachchEvu
sATi yAramDlu jUchitE
nimdelaku mUlamou yemdu dAchukomdu sAmini
చరణం
charaNam 3
చంటిపై చెయివేసి మోవిపంట నొక్కేవు
మా యింటి మగని తమ్ముడె తో
కంట కాముడెంతో సూరుడంట రంట దంటకాదు
chamTipai cheyivEsi mOvipamTa nokkEvu
mA yimTi magani tammuDe tO
kamTa kAmuDemtO sUruDamTa ramTa damTakAdu
చరణం
charaNam 4
వీర రాఘవ పోతులూరి వీర రాఘవులు
మోరు దా శ్రీ మోతుకూరు హాస
మందహాస చిద్విలాస చెన్నకేశవా
vIra rAghava pOtulUri vIra rAghavulu
mOru dA SrI mOtukUru hAsa
mamdahAsa chidwilAsa chennakESavA