#39 మాయలాడి నా సామికి mAyalADi nA sAmiki

Titleమాయలాడి నా సామికిmAyalADi nA sAmiki
Written By
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
మాయలాడి నా సామికి మందు బెట్టెనే
పొందవలెనని వాని యిందుకు రమ్మని
mAyalADi nA sAmiki mamdu beTTenE
pomdavalenani vAni yimduku rammani
చరణం
charaNam 1
కమ్మని జుంటి తేనె కలిపిన సామికి
కొమ్ముకొమ్మని చాల కొసరి కొసరి
kammani jumTi tEne kalipina sAmiki
kommukommani chAla kosari kosari
చరణం
charaNam 2
రంగవాసుడే రంగుగ గూడి
రంగము నెలకొని రాడాయనే
ramgavAsuDE ramguga gUDi
ramgamu nelakoni rADAyanE

#38 పో పొమ్మనే పొమ్మనే pO pommanE pommanE

Titleపో పొమ్మనే పొమ్మనేpO pommanE pommanE
Written By
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
పో పొమ్మనే పొమ్మనే వాని పొందేల
మనకు అచటికి
పాపపు మోహము పాలు జేసియా
పాపి యిల్లు జేరెనే ప్రొద్దాయనే
pO pommanE pommanE vAni pomdEla
manaku achaTiki
pApapu mOhamu pAlu jEsiyA
pApi yillu jErenE proddAyanE
చరణం
charaNam 1
ఇన్ని దినములు వాడిందు రాకుండినను
చిన్నబుచ్చినాడే నిర్దయుడే
inni dinamulu vADimdu rAkumDinanu
chinnabuchchinADE nirdayuDE
చరణం
charaNam 2
రేయి పగలతని రాక జూచి నా
రాత యనుకుంటినే యేమందునే
rEyi pagalatani rAka jUchi nA
rAta yanukunTinE yEmandunE
చరణం
charaNam 3
శ్రీరంగనాధుని నేరంగుగ గూడి
రంగమున నెలకొననే
SrIramganAdhuni nEramguga gUDi
ramgamuna nelakonanE

#37 మాయలాడి బోధనలచే mAyalADi bOdhanalachE

Titleమాయలాడి బోధనలచేmAyalADi bOdhanalachE
Written By
రాగం rAgaసురటsuraTa
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
మాయలాడి బోధనలచే మయిమరచితివి వేమొ
మాటలాడ రావదేమిరా యో సామి
mAyalADi bOdhanalachE mayimarachitivi vEmo
mATalADa rAvadEmirA yO sAmi
చరణం
charaNam 1
కాయజుబారికి తాళగ లేరా కౌగిటజేర్చి నన్ను
గారవించరా న్యాయమటరా నీకిది తగదుర సరసగుణ
kAyajubAriki tALaga lErA kaugiTajErchi nannu
gAravimcharA nyAyamaTarA nIkidi tagadura sarasaguNa
చరణం
charaNam 2
కలకాలము నన్ను గాసి బెట్టుటకురా
కాంతలనేచుట కార్యము గాదుర
చెలువుడవని నిను నెరనమ్మినందుకిక
kalakAlamu nannu gAsi beTTuTakurA
kAmtalanEchuTa kAryamu gAdura
cheluvuDavani ninu neranamminamdukika
చరణం
charaNam 3
సరివారిలో నను చౌక సేయకురా
చాల నమ్మితి రతికేళి కూడరా
వరదుడ మువ్వపురి నిలయుడ చనువున
sarivArilO nanu chouka sEyakurA
chAla nammiti ratikELi kUDarA
varaduDa muvvapuri nilayuDa chanuvuna
* Recording may be available

#36 ఎందుకు వాడలిగి రాడు emduku vADaligi rADu

Titleఎందుకు వాడలిగి రాడు emduku vADaligi rADu
Written By
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
ఎందుకు వాడలిగి రాడు మందగమన
సుందర వెంకటేశుడు వాడెందుబోయెనో
emduku vADaligi rADu mamdagamana
sumdara vemkaTESuDu vADendubOyenO
చరణం
charaNam 1
చపలనేత్రి యనుచు నన్ను చేరకున్నాడె
అపకారికా చెలికానికి వుపము దెలుపవే
chapalanEtri yanuchu nannu chErakunnADe
apakArikA chelikAniki vupamu delupavE
చరణం
charaNam 2
కుటిలకుంతలి యనుచు నన్ను కూడకున్నాడే
విటునికి మరి బాసలిచ్చి విధము దెలుపవే
kuTilakumtali yanuchu nannu kUDakunnADE
viTuniki mari bAsalichchi vidhamu delupavE

#35 ప్రొద్దాయె యిక proddAye yika

Titleప్రొద్దాయె యికproddAye yika
Written By
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
ప్రొద్దాయె యిక చాలురా నా సామిproddAye yika chAlurA nA sAmi
చరణం
charaNam 1
అత్తరు మెడబూసి అంట వచ్చేవు
అత్తింటి కోడలురా నిజముగ సత్యముగ
attaru meDabUsi amTa vachchEvu
attinTi kODalurA nijamuga satyamuga
చరణం
charaNam 2
పావడ నీ చేతితొ బట్టవచ్చేవు
పోవలె మొక్కెనురా నిజముగ సత్యముగ
pAvaDa nI chEtito baTTavachchEvu
pOvale mokkenurA nijamuga satyamuga
చరణం
charaNam 3
కోపగించకు నాపై బాలచంద్రా సామి
రేపు వస్తానులేరా నిజముగ సత్యముగ
kOpagimchaku nApai bAlachandrA sAmi
rEpu vastAnulErA nijamuga satyamuga

#34 చెలియాకాంతుడు cheliyAkAmtuDu

TitleచెలియాకాంతుడుcheliyAkAmtuDu
Written By
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
చెలియా కాంతుడు నన్నెడబాసి
చాలనన్నిటు చేసెనెగాని
cheliyA kAmtuDu nanneDabAsi
chAlananniTu chEsenegAni
చరణం
charaNam 1
మారుడు నా యురమునను శరము వేయ
మందమగు మారుతము డాయ
విరహము నేనెటు సైతునే సఖియ
ఒంటిగా నె నుండనాయె
mAruDu nA yuramunanu Saramu vEya
mamdamagu mArutamu DAya
virahamu nEneTu saitunE sakhiya
omTigA ne numDanAye
చరణం
charaNam 2
వెన్నెలగాయగ మిగుల తాపమాయనే
అన్నమని సైచదాయనే
కన్నులకు నిదురరాదే వో మగువ
కామిని బోధన లాయెనే
vennelagAyaga migula tApamAyanE
annamani saichadAyanE
kannulaku nidurarAdE vO maguva
kAmini bOdhana lAyenE
చరణం
charaNam 3
మరుని కేళిలో నన్ను గూడెనే
మానినిరో దానితో గూడెనే
ధరగిరి స్వామికి న్యాయమటవే
తాళను వానికి రమ్మనవేవో
maruni kELilO nannu gUDenE
mAninirO dAnitO gUDenE
dharagiri swAmiki nyAyamaTavE
tALanu vAniki rammanavEvO

#33 ఇన్నాళ్ళ వలెగాదె innALLa valegAde

Titleఇన్నాళ్ళ వలెగాదెinnALLa valegAde
Written By
రాగం rAgaపరజు*paraju*
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
ఇన్నాళ్ళ వలెగాదె వాని గుణమెంతని
నె విన్నవిన్తునె ఓ చెలి
innALLa valegAde vAni guNamentani
ne vinnavin&tune O cheli
చరణం
charaNam 1
నన్నెడ బాయడు అన్యుల జూడడు
మన్నన వీడు మానినిమణి రో
వన్నెకాడె యెందున్నడె వాడన్నిట నెరజానుడె
nanneDa bAyaDu anyula jUDaDu
mannana vIDu mAninimaNi rO
vannekADe yendunnaDe vADanniTa nerajAnuDe
చరణం
charaNam 2
తామస మ్యాలనె తాళగ జాలనె
కొమలి నీ మదికోరిన సొమ్ములు
చేకొనవె వేగరావే తోడిత్యావేనా
సామీటు రమ్మనవె
tAmasa myAlane tALaga jAlane
komali nI madikOrina sommulu
chEkonave vEgarAvE tODityAvEnA
sAmITu rammanave
చరణం
charaNam 3
అందముగా రతి పొందుగ నేలిన
అబిర గులాలవుడావతరథా భరచకారి రంగ్ గిరిధర
లాలబహి బృందావనజ **
మునాఖేచర సుభవ రంగ్ గిరిధర **
మీరాకే ప్రభు గిరిధర నాగర చరణ **
కమల భోరింగ్ గిరిధర **
amdamugA rati pomduga nElina
abira gulAlavuDAvatarathA bharachakAri
rang giridhara
lAlabahi bRmdAvanaja **
munAkhEchara subhava rang giridhara **
mIrAkE prabhu giridhara nAgara charaNa **
kamala bhOring giridhara **
** corrections may follow! If anyone knows a correct version of last charaNam, please help

Edit: 4 Jan 2021: We found this jAvaLi in a different book too, and that had better lyrics for the 3rd charaNam. Please see post 189.

#32 బన్సీవాలే bansIwAlE

Titleబన్సీవాలేbansIwAlE
Written By
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
బన్సీవాలేనే మేరా మన మోహలియ్యోరేbansIwAlEnE mErA mana mOhaliyyOrE
చరణం
charaNam 1
సుందర శ్యామల వేంకటరమణుడు
నెనరున నె కలసేన ఓదానగాన
ఓ మత్తగజగమనరో
sundara SyAmala vEnkaTaramaNuDu
nenaruna ne kalasEna OdAnagAna
O mattagajagamanarO

#31 సామి వెళగాదురా sAmi veLagAdurA

Titleసామి వెళగాదురాsAmi veLagAdurA
Written By
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
సామి వెళగాదురా నా సామి వెళగాదురాsAmi veLagAdurA nA sAmi veLagAdurA
చరణం
charaNam 1
ముద్దు పెట్టి వద్దు చాలురా
సద్దు చేయరాదు తాళురా
muddu peTTi vaddu chAlurA
saddu chEyarAdu tALurA
చరణం
charaNam 2
సన్న సైగ చేసె వేలరా
వెన్నుడానె మగని నాలరా
sanna saiga chEse vElarA
vennuDAne magani nAlarA
చరణం
charaNam 3
సామి ధరగిరి నిలయా
సమయముగని కలయ
sAmi dharagiri nilayA
samayamugani kalaya

#30 వేగరమ్మనవె vEgarammanave

Titleవేగరమ్మనవెvEgarammanave
Written By
రాగం rAgaతోడిtODi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
వేగరమ్మనవె వేగమె నా సామి నిందుసఖీvEgarammanave vEgame nA sAmi nimdusakhI
చరణం
charaNam 1
మదనునీ బారికి మది నోర్వజాలనే
సదయుని కింత దయలేదె
madanunI bAriki madi nOrvajAlanE
sadayuni kimta dayalEde
చరణం
charaNam 2
అలదాని మాయకె వలచిన సామికి
తలపనె మందు తలకెక్కె
aladAni mAyake valachina sAmiki
talapane mamdu talakekke
చరణం
charaNam 3
అతివ యెవతొ విభునెడ సాపెనె
నిదుర కంటికి రాదు గదవె
ativa yevato vibhuneDa sApene
nidura kamTiki rAdu gadave
చరణం
charaNam 4
వన్నెలాడిరో మైసూరి కృష్ణుని
క్రొన్న విల్తుని కేళికి
vannelADirO maisUri kRshNuni
kronna viltuni kELiki