| Title | నిన్నెడబాసిన | ninneDabAsina |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | ధృవ | dhRva |
| పల్లవి pallavi | నిన్నెడబాసిన మొదలు కనులకు నిదుర రాదె చెలి | ninneDabAsina modalu kanulaku nidura rAde cheli |
| చరణం charaNam 1 | రేయి పగలు రెప్పపాటు లేక పలుమారు నీ పేరు బిలుచుచును కనులనీరు కడవలై పారెనయ్యో అన్నము కూడ సహించలేదె | rEyi pagalu reppapATu lEka palumAru nI pEru biluchuchunu kanulanIru kaDavalai pArenayyO annamu kUDa sahinchalEde |
| చరణం charaNam 2 | సుదతిరొ యిప్పుడు యీ సుందరాంగుడె నను నిక్కముగాను వీక్షించుచును గాఢాలింగనముతో నను గూడుచును అయ్యో సంతోష సముద్రమున నీదుచును | sudatiro yippuDu yI sundarAmguDe nanu nikkamugAnu vIkshinchuchunu gADhAlinganamutO nanu gUDuchunu ayyO santOsha samudramuna nIduchunu |
Category: Lyrics
#19 మానభిమానము mAnabhimAnamu
| Title | మానభిమానము | mAnabhimAnamu |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మానభిమానము లాతనిదే చెలి | mAnabhimAnamu lAtanidE cheli |
| చరణం charaNam 1 | మునుపటి నెనరైన తన మది నెంచక ననబోణి రాడాయనే ఆయనె చెలి | munupaTi nenaraina tana madi nenchaka nanabONi rADAyanE Ayane cheli |
| చరణం charaNam 2 | తరుణీ బోధన విని తానిందు రాడాయ తరుణయు లేదాయనే ఆయనెచెలి | taruNI bOdhana vini tAnindu rADAya taruNayu lEdAyanE Ayanecheli |
| చరణం charaNam 3 | వనితరొ గోపాలుడు నన్నేలుట తనదె భారమననె అననె చెలి | vanitaro gOpAluDu nannEluTa tanade bhAramanane anane cheli |
#18 సామిగ నాతొ sAmiga nAto
| Title | సామిగ నాతొ | sAmiga nAto |
| Written By | ||
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామిగ నాతొ మాట్లాడవెందుకురా అరమరయిక న్యాలరా | sAmiga nAto mATlADavemdukurA aramarayika nyAlarA |
| చరణం charaNam 1 | చిరుతప్రాయము నాడు జేసిన చెలిమిని మరచుట తగునటరా | chirutaprAyamu nADu jEsina chelimini marachuTa tagunaTarA |
| చరణం charaNam 2 | సొగసుగ నిన్ను జూచి సోలి వచ్చిన దాని అగడేల చేసేవురా | sogasuga ninnu jUchi sOli vachchina dAni agaDEla chEsEvurA |
| చరణం charaNam 3 | వరభీమేశుని వలచిన దానరా సరసతొ నన్ను గూడి యేలరా | varabhImESuni valachina dAnarA sarasato nannu gUDi yElarA |
#17 యేలర నాపై yElara nApai
| Title | యేలర నాపై | yElara nApai |
| Written By | ||
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | యేలర నాపై చాలుర మోహము బాలామణితో యేమో బాసలు చేసితివట | yElara nApai chAlura mOhamu bAlAmaNitO yEmO bAsalu chEsitivaTa |
| చరణం charaNam 1 | ఆపెను గూడి రతి అనుభవించితి వేమొ మాపటి వేళలొ రావు జేసేవట | Apenu gUDi rati anubhavinchiti vEmo mApaTi vELalo rAvu jEsEvaTa |
| చరణం charaNam 2 | అలరె బోణితొ నీవు అలగినదేమొ చెలికాడ నను గూడి బలిమి జేసేవట | alare bONito nIvu alaginadEmo chelikADa nanu gUDi balimi jEsEvaTa |
| చరణం charaNam 3 | హితవుతొ పార్థసారథి ననుగూడితే అతివలు చూచితె అపరాధమగునేమొ | hitavuto pArthasArathi nanugUDitE ativalu chUchite aparAdhamagunEmo |
#16 వాడెటు బల్కెను vADeTu balkenu
| Title | వాడెటు బల్కెను | vADeTu balkenu |
| Written By | ||
| రాగం rAga | ఉసేని | usEni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వాడెటు బల్కెను దెల్పవే వాడెటు బల్కెను దెల్పవే బోటిరో బూటక మ్యాలనె | vADeTu balkenu delpavE vADeTu balkenu delpavE bOTirO bUTaka myAlane |
| చరణం charaNam 1 | కొమ్మరొ నే నంపిన కమ్మను వాడె కొనెనా నొక చెలి చే కిమ్మనెనా | kommaro nE nampina kammanu vADe konenA noka cheli chE kimmanenA |
| చరణం charaNam 2 | ఇంతిరో నే నంపిన పూబంతులు వాడెకొనెనా ఒక రమణీ కిమ్మనెనా | intirO nE nampina pUbamtulu vADekonenA oka ramaNI kimmanenA |
| చరణం charaNam 3 | బాలరో ధర్మపురి పాలుడు యేలననేనా యేలనెనా వాని చెలి పో పొమ్మనెనా | bAlarO dharmapuri pAluDu yElananEnA yElanenA vAni cheli pO pommanenA |
#15 చిన్నదానరా chinnadAnarA
| Title | చిన్నదానరా | chinnadAnarA |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | చిన్నదానరా నే కన్నుదోయి కింపుదోచె కన్నెలు వేరేమి రా నే | chinnadAnarA nE kannudOyi kimpudOche kannelu vErEmi rA nE |
| చరణం charaNam 1 | మగని మోము జూచి చాల దిగులు జెందియున్న నాపై పొగరు మాటలాడి నన్ను అగడు సేతురేమిరా | magani mOmu jUchi chAla digulu jendiyunna nApai pogaru mATalADi nannu agaDu sEturEmirA |
| చరణం charaNam 2 | చెక్కు నొక్కి ముదమున చను ముక్కు నులిమి కావరమున గ్రక్కున నను కౌగలిడిచి పక్క జేర్తురేమిరా నె | chekku nokki mudamuna chanu mukku nulimi kAvaramuna grakkuna nanu kougaliDichi pakka jErturEmirA ne |
| చరణం charaNam 3 | రత్నపురి నిలయుడు ప్రయత్నముతో నన్ను గూడి రత్నసరాలిచ్చెనని రవ్వ సేర్తురేమిరా నె | ratnapuri nilayuDu prayatnamutO nannu gUDi ratnasarAlichchenani ravva sErturEmirA ne |
#14 మానిని మనసు యేల mAnini manasu yEla
| Title | మానిని మనసు యేల | mAnini manasu yEla |
| Written By | ||
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | మానిని మనసు యాల గరుగదే మనసు నిమిషమైన తాళదె | mAnini manasu yAla garugadE manasu nimishamaina tALade |
| చరణం charaNam 1 | సుదతి రో నీకెదురు చూచి నిదురల్యాక యుంటినె | sudati rO nIkeduru chUchi niduralyAka yunTine |
| చరణం charaNam 2 | సరసకు రమ్మని వేడితె తిరిగి చూడన్యాలనె | sarasaku rammani vEDite tirigi chUDanyAlane |
| చరణం charaNam 3 | ధర్మపురీశుని గూడిన మర్మము మరుపాయనె | dharmapurISuni gUDina marmamu marupAyane |
#13 నా పయి ప్రేమలేని nA payi prEmalEni
| Title | నా పయి ప్రేమలేని | nA payi prEmalEni |
| Written By | ||
| రాగం rAga | ఇందుస్తాని | industAni |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | నా పయి ప్రేమలేని జాడ నాడే తెలిసెను పో పోరా | nA payi prEmalEni jADa nADE telisenu pO pOrA |
| చరణం charaNam 1 | పాపి సవతి మాయలలో జిక్కి గోపాలుని కొన గోరంతయిన | pApi savati mAyalalO jikki gOpAluni kona gOrantayina |
| చరణం charaNam 2 | యెందాక జూచిన యీ మొగజాతి యింతుల నేలేదాకా యీ ప్రీతి సందేహమా | yendAka jUchina yI mogajAti yintula nElEdAkA yI prIti sandEhamA |
| చరణం charaNam 3 | మాట ప్రఖ్యాత సరసుల లక్షణ మాయీనీతి మోహమందు గనుసమిందు యే వేళ్ళ బుధ్ధులు | mATa prakhyAta sarasula lakshaNa mAyInIti mOhamandu ganusamindu yE vELLa budhdhulu |
| చరణం charaNam 4 | నీ యందు యెలగలిగెనో యిక యేమలరు స్నేహము చేసినదే బలు పొందు | nI yandu yelagaligenO yika yEmalaru snEhamu chEsinadE balu pondu |
#12 తలచిన తాళగ talachina tALaga
| Title | తలచిన తాళగ | talachina tALaga |
| Written By | ||
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | తలచిన తాళగలేనే వోచెలియ | talachina tALagalEnE vOcheliya |
| చరణం charaNam 1 | కస్తూరి విడమిచ్చి కనికర గతి జూపి కుస్తరించి నన్ను కొసవేడిన | kastUri viDamichchi kanikara gati jUpi kustarinchi nannu kosavEDina |
| చరణం charaNam 2 | కనుర చెక్కుల మోవి చనుల కంఠము చల మున ముక్కు నాభి చుంబనము జేసినవాని | kanura chekkula mOvi chanula kanThamu chala muna mukku nAbhi chumbanamu jEsinavAni |
#11 చాలే చాలే chAlE chAlE
| Title | చాలే చాలే | chAlE chAlE |
| Written By | ||
| రాగం rAga | కన్నడ | kannaDa |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | చాలే చాలే అలవానితొ పొందిక చాలె చాలె యీ లాభము యిక | chAlE chAlE alavAnito pondika chAle chAle yI lAbhamu yika |
| చరణం charaNam 1 | కలకంఠిరో భూతలమందునయె కల్లలు బల్కెడి వారితొ చెలిమి యిక | kalakanThirO bhUtalamandunaye kallalu balkeDi vArito chelimi yika |
| చరణం charaNam 2 | విరిబోణిరో పోకిరి కుక్కలకేమె మారుని సరియని కోరి చేరుటయిక | viribONirO pOkiri kukkalakEme mAruni sariyani kOri chEruTayika |
| చరణం charaNam 3 | అలివేణిరొ ఆ నలినాక్షికి యెమో కాళ్ళకు మ్రొక్కేటి వారితో స్నేహము యిక | alivENiro A nalinAkshiki yemO kALLaku mrokkETi vAritO snEhamu yika |
| చరణం charaNam 4 | ధర యందున శ్రీ పరవాసుని యేమొ సరి సరి జెప్పను యెవ్వరి తరమే యిక | dhara yanduna SrI paravAsuni yEmo sari sari jeppanu yevvari taramE yika |