| Title | వగలాడి | vagalADi |
| Written By | తిరుపతి విద్యల నారాయణస్వామి | tirupati vidyala nArAyaNasvAmi |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | వగలాడి బోధనలకు వలచితివో సామి – ఆ | vagalADi bOdhanalaku valachitivO sAmi – A |
| అనుపల్లవి anupallavi | పగటి మోసకత్తె యని పలుమారులు వినివిని ఆ | pagaTi mOsakatte yani palumArulu vinivini A |
| చరణం charaNam 1 | పడక టింటిలో పదుగురనే పదిల పరచి యుండే | paDaka TinTilO paduguranE padila parachi yunDE |
| చరణం charaNam 2 | సరసుని కా చాన పొందు విరస మౌనని యెంచి తిరుపతి పుర వేంకటేశ తెలియక నేడు | sarasuni kA chAna pondu virasa mounani yenchi tirupati pura vEnkaTESa teliyaka nEDu |
Category: Lyrics
#663 కలగన్నటు kalagannaTu
| Title | కలగన్నటు | kalagannaTu |
| Written By | రామనాధపురం శ్రీనివాసయ్యంగార్ | rAmanAdhapuram SrInivAsayyamgAr |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కేదార గౌళ | kEdAra gauLa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కల గన్నటు లాయరా కామజనక | kala gannaTu lAyarA kAmajanaka |
| అనుపల్లవి anupallavi | జల తీరమున నన్ను అలయించి వలపించి గులుకు గొప్పుననంటి పలుకరించు కొన్నది | jala tIramuna nannu alayinchi valapinchi guluku goppunananTi palukarinchu konnadi |
| చరణం charaNam 1 | జలజాక్షి వేసమిడి చెలులతో కూడికొని ఇలుజొచ్చి కలకంఠి వలె పలుకుల నుంచి కలవారలను పలు కలలచే మెప్పించి పలుమారు నను యేచి మనసు దోచిన దెల్ల | jalajAkshi vEsamiDi chelulatO kUDikoni ilujochchi kalakanThi vale palukula nunchi kalavAralanu palu kalalachE meppinchi palumAru nanu yEchi manasu dOchina della |
| చరణం charaNam 2 | నిను పాడమని చాల చనవున బల్కిన తన నాథుని యటు దాపున తొలగించి కనరాని వింతల కాలము గడిపించి నను పాడి పలుమారు మనసు దోచిన దెల్ల | ninu pADamani chAla chanavuna balkina tana nAthuni yaTu dApuna tolaginchi kanarAni vintala kAlamu gaDipinchi nanu pADi palumAru manasu dOchina della |
| చరణం charaNam 3 | వేదాంతమున గల నాదాత్మకుడైన జగ న్నాధ గోప కన్యా వినోద జగన్మోహన కాదా నన్నేలనిక వాదా శ్రీనివాసుడు కాదా జాగు సేయకు రాధా రమణ పొందు | vEdAntamuna gala nAdAtmakuDaina jaga nnAdha gOpa kanyA vinOda jaganmOhana kAdA nannElanika vAdA SrInivAsuDu kAdA jAgu sEyaku rAdhA ramaNa pondu |
#662 సరసము sarasamu
| Title | సరసము | sarasamu |
| Written By | రామనాధపురం శ్రీనివాసయ్యంగార్ | rAmanAdhapuram SrInivAsayyamgAr |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | హిందుస్థానీ కాపీ | hindusthAnI kApI |
| తాళం tALa | దేశాది | dESAdi |
| పల్లవి pallavi | సరసము లాడేటందుకు సమయ మిది గాదురా నా సామి | sarasamu lADETanduku samaya midi gAdurA nA sAmi |
| అనుపల్లవి anupallavi | విరసముతో నా ఇంటి వారలున్నారు విధి తప్పక కనుగొన్న గూడిన వేళ నాతో | virasamutO nA inTi vAralunnAru vidhi tappaka kanugonna gUDina vELa nAtO |
| చరణం charaNam 1 | నిగ నిగ వెన్నెల గాయుచున్నది నిక్కముగా ఇటుల జేసేది నీకు తగదురా ఈ వీధిలో వచ్చువారు న్నట్టున్నది నిను చూస్తే నవ్వి తిట్టుదురు గనుక | niga niga vennela gAyuchunnadi nikkamugA iTula jEsEdi nIku tagadurA I vIdhilO vachchuvAru nnaTTunnadi ninu chUstE navvi tiTTuduru ganuka |
| చరణం charaNam 2 | ఏకాంతముగా జరిగిన సంగతి ఎంతైన బైట పడేది న్యాయమా శ్రీకాంత నీకేల ఇంత దూరము శ్రీనివాసార్చిత బావి నీళ్ళు వెల్లి గొన్నదిరా | EkAntamugA jarigina sangati entaina baiTa paDEdi nyAyamA SrIkAnta nIkEla inta dUramu SrInivAsArchita bAvi nILLu velli gonnadirA |
| AV Link | https://www.youtube.com/watch?v=96T0dEEYTMI |
#661 మరులు కొన్నదిరా marulu konnadirA
| Title | మరులు కొన్నదిరా | marulu konnadirA |
| Written By | రామనాధపురం శ్రీనివాసయ్యంగార్ | rAmanAdhapuram SrInivAsayyamgAr |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 586 | |
| పల్లవి pallavi | మరులు కొన్నదిరా మానినీమణి నీపై | marulu konnadirA mAninImaNi nIpai |
| అనుపల్లవి anupallavi | పరిపరి విధముల పరితపించుచు నీపై | paripari vidhamula paritapinchuchu nIpai |
| చరణం charaNam 1 | ధరలో తనకు నీవే తగిన వల్లభుడని తరుణి మిక్కిలి నిన్ను తలచి తలచి చాలా | dharalO tanaku nIvE tagina vallabhuDani taruNi mikkili ninnu talachi talachi chAlA |
| చరణం charaNam 2 | వనజ నేత్రుడౌ శ్రీనివాస నాయక నిన్ను వల్లగ నీ మాటలు ఎల్లపుడును ఎది | vanaja nEtruDau SrInivAsa nAyaka ninnu vallaga nI mATalu ellapuDunu edi |
#660 నిరుపమాన nirupamAna
| Title | నిరుపమాన | nirupamAna |
| Written By | రామనాధపురం శ్రీనివాసయ్యంగార్ | rAmanAdhapuram SrInivAsayyamgAr |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | నిరుపమాన సామిని నా నిలయమునకు రమ్మనవే | nirupamAna sAmini nA nilayamunaku rammanavE |
| అనుపల్లవి anupallavi | మరపు లేక నా మనవిని మగువ వానితో మనసుంచి తెల్పి | marapu lEka nA manavini maguva vAnitO manasunchi telpi |
| చరణం charaNam 1 | సదయుడగు నా సామికే సరి సాటియు లేదనచు చాల ముదము తోన ముఖ విలాస మును జూచిచ ముందిచ్చటకు | sadayuDagu nA sAmikE sari sATiyu lEdanachu chAla mudamu tOna mukha vilAsa munu jUchicha mundichchaTaku |
| చరణం charaNam 2 | మధురిపుడగు శ్రీనివాసుని మనసు తెలిసి రేపు మాపు నిదర లేక నా మనవిని నిధు వనమును జేయుట కిటు | madhuripuDagu SrInivAsuni manasu telisi rEpu mApu nidara lEka nA manavini nidhu vanamunu jEyuTa kiTu |
#659 వేగ నీవు vEga nIvu
| Title | వేగ నీవు | vEga nIvu |
| Written By | రామనాధపురం శ్రీనివాసయ్యంగార్ | rAmanAdhapuram SrInivAsayyamgAr |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | వేగ నీవు వాని రమ్మనవే ఓ చెలియ | vEga nIvu vAni rammanavE O cheliya |
| అనుపల్లవి anupallavi | నాగరికముగ దెలిపి నా వెతలను దీర్చుటకిటు | nAgarikamuga delipi nA vetalanu dIrchuTakiTu |
| చరణం charaNam 1 | దీన దయాకరుడు నాతో దినే దినే మాటలాడి వీనుల కింపుగ పాడి వినిపించినది ఎటు మరతునే | dIna dayAkaruDu nAtO dinE dinE mATalADi vInula kimpuga pADi vinipinchinadi eTu maratunE |
| చరణం charaNam 2 | అందమైన రతి కేళిలో అమితముగా సుఖ పరచిన మందహాస వదను వినా మరి ఎవరిని దలచలేనే | andamaina rati kELilO amitamugA sukha parachina mandahAsa vadanu vinA mari evarini dalachalEnE |
| చరణం charaNam 3 | గాన రసిక శిఖామణిని గానక అర నిమిష ముండను వానర రక్షకుడౌ శ్రీనివాసునితో వగల దెలిపి | gAna rasika SikhAmaNini gAnaka ara nimisha munDanu vAnara rakshakuDau SrInivAsunitO vagala delipi |
| AV Link | https://www.youtube.com/watch?v=DQq33AtOVz4 |
#658 నీ మాట nI mATa
| Title | నీ మాట | nI mATa |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | పూరి కల్యాణి | pUri kalyANi |
| తాళం tALa | మిశ్ర లఘు | miSra laghu |
| పల్లవి pallavi | నీ మాటా లేమాయెనుర! సామి బల్కర | nI mATA lEmAyenura! sAmi balkara |
| అనుపల్లవి anupallavi | ఏమేమో బోధించి నన్నేమార జేసేవల | EmEmO bOdhinchi nannEmAra jEsEvala |
| చరణం charaNam 1 | చక్కని సామివలె చెక్కిలి నొక్కి రవ మొక్కెర నీ కిచ్చేనని టక్కులచే సొక్కించిన | chakkani sAmivale chekkili nokki rava mokkera nI kichchEnani TakkulachE sokkinchina |
| చరణం charaNam 2 | మాటిమాటికి మరునాటలాడ బిల్చుచు పాటీలు నే పంపేనని తాటోటముతో నీటిన | mATimATiki marunATalADa bilchuchu pATIlu nE pampEnani tATOTamutO nITina |
| చరణం charaNam 3 | జాలము జేసి కలసేలి రతనాల జువికీల జత పంపేనన్న తాలవన లోల అల | jAlamu jEsi kalasEli ratanAla juvikIla jata pampEnanna tAlavana lOla ala |
| AV Link | https://www.youtube.com/watch?v=CCvZqFrlaVs https://www.youtube.com/watch?v=qziLbVQqEes |
#657 మోహమెల్ల mOhamella
| Title | మోహమెల్ల | mOhamella |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | మోహన | mOhana |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మోహమెల్ల దెలిసెను గదరా! మోహనాంగ! వినర | mOhamella delisenu gadarA! mOhanAnga! vinara |
| అనుపల్లవి anupallavi | దాహవంతుని సాటి నా గేహమున కేతెంచిన నీ | dAhavantuni sATi nA gEhamuna kEtenchina nI |
| చరణం charaNam 1 | మదిలో వంచనలనే యెంచి వదనమున మాధుర్య ముంచి సుదతిపై నీ నెనరు నుంచి సదయుని తీరు నటించే నీ | madilO vanchanalanE yenchi vadanamuna mAdhurya munchi sudatipai nI nenaru nunchi sadayuni tIru naTinchE nI |
| చరణం charaNam 2 | పరుపుపై నా కరము బట్టి మరువనని నా శిరము గొట్టి సరసమాడి పూలుబట్టి తరుణి నెంచి తత్తరించే నీ | parupupai nA karamu baTTi maruvanani nA Siramu goTTi sarasamADi pUlubaTTi taruNi nenchi tattarinchE nI |
| చరణం charaNam 3 | తాలవలోల నన్ను లాలనతో నేలు వేళ చాల ప్రేమ తోను లేచి యా బాల నేల బోయిన నీ | tAlavalOla nannu lAlanatO nElu vELa chAla prEma tOnu lEchi yA bAla nEla bOyina nI |
| AV Link | https://www.youtube.com/watch?v=sYR09dYazGA https://www.youtube.com/watch?v=BKMGn0SFPBc |
#656 అపదూరుకు apadUruku
| Title | అపదూరుకు | apadUruku |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | అపదూరుకు లోనైతినే చపల చిత్తము చేతనే | apadUruku lOnaitinE chapala chittamu chEtanE |
| అనుపల్లవి anupallavi | ఏ పాపి నాపై దూరెనోగా ఏ పాపము లేక | E pApi nApai dUrenOgA E pApamu lEka |
| చరణం charaNam 1 | వేడుకలు జూడనే ఈడు చెలుల తోడనే కూడి అతని మేడ కేగితే వాడు నా చెలికాడనే | vEDukalu jUDanE IDu chelula tODanE kUDi atani mEDa kEgitE vADu nA chelikADanE |
| చరణం charaNam 2 | సారెకు నా సామిని దారిని కని నవ్వితే జారిణి యని ఊరి వారలు వేరె పేరిడి నన్ను పిల్చుట | sAreku nA sAmini dArini kani navvitE jAriNi yani Uri vAralu vEre pEriDi nannu pilchuTa |
| చరణం charaNam 3 | చిరుత నాటి యుండిన గురుతుచే గుణవంతుడౌ వరద తాళవనేశుని తోడు సరసమాడుచు కూడితినని | chiruta nATi yunDina gurutuchE guNavantuDau varada tALavanESuni tODu sarasamADuchu kUDitinani |
#655 బలిమి ఏల balimi Ela
| Title | బలిమి ఏల | balimi Ela |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | బలిమి ఏల బాళామణి అలవానితో పలుమారు నీకు | balimi Ela bALAmaNi alavAnitO palumAru nIku |
| చరణం charaNam 1 | వాని పిలిచి బల్కేటి హీనత లెల్లను అలివేణు లెరిగిన మన మానములు పోనే | vAni pilichi balkETi hInata lellanu alivENu lerigina mana mAnamulu pOnE |
| చరణం charaNam 2 | ఏమోయని వేమరు నిన్నే నే మానితే నీవు మన నేమ మెరుగక అతి ప్రేమగా మా దొర వినుచు | EmOyani vEmaru ninnE nE mAnitE nIvu mana nEma merugaka ati prEmagA mA dora vinuchu |
| చరణం charaNam 3 | తాళవన లోలుని ఏ వేళ తలచుచు వ్యాకుల పడనేల పలు వాలాయము గాను | tALavana lOluni E vELa talachuchu vyAkula paDanEla palu vAlAyamu gAnu |