#329 నీతోటి మాటలు nItOTi mATalu

First jAvaLi from a book by SrI dAsu SrIrAmulu from a book published in 1893. Some of these were reprinted in 1991 again.

In some cases, like this one, rAga or tALa were noted differently in the books. Sometimes, a jAvaLi in one book was marked as padam, or, vice versa too.

Titleనీతోటి మాటలుnItOTi mATalu
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaహిందుస్థాని కాఫి (1893)
కాఫి (1991)
hindusthAni kAfi(1893)
kAfi (1991)
తాళం tALaమధ్యాది (1893)
ఆది (1991)
madhyAdi (1893)
Adi (1991)
పల్లవి pallaviనీతోటి మాటలు నాకేలరా సామీ
నాతోటి మాటలు నీకేలరా
నే తాళ దానితో ఖాతాలు నీకేల
ప్రీతిగల నాతియని పోతివి రాతిరి
nItOTi mATalu nAkElarA sAmI
nAtOTi mATalu nIkElarA
nE tALa dAnitO khAtAlu nIkEla
prItigala nAtiyani pOtivi rAtiri
1పరువటరా నాతో పనులేరా సామీ
పరువటరా నాతో పనులేమిరా
విరిజాజి బంతులు విసరకురా సామి
సరసము విరసమౌ చాలుర చాలుర
paruvaTarA nAtO panulErA sAmI
paruvaTarA nAtO panulEmirA
virijAji bantulu visarakurA sAmi
sarasamu virasamau chAlura chAlura
2ఒయ్యార మిదియేమి యూరుకోరా సామి
ఒయ్యార మిదియేమి యూరుకోరా
ఉయ్యల మంచము నూచకురా యది
కయ్యాల గయ్యాళి అయ్యయ్యో అయ్యయ్యో
oyyAra midiyEmi yUrukOrA sAmi
oyyAra midiyEmi yUrukOrA
uyyala manchamu nUchakurA yadi
kayyAla gayyALi ayyayyO ayyayyO
3వేసమా వల్లూరి వేణుగోపాల సామి
వేసమా వల్లూరి వేణుగోపాల
దాసు శ్రీరాముని భాసుర వాక్యము
చేసెరా వేయివేలు సబాసు సబాసు
vEsamA vallUri vENugOpAla sAmi
vEsamA vallUri vENugOpAla
dAsu SrIrAmuni bhAsura vAkyamu
chEserA vEyivElu sabAsu sabAsu

#328 చాలులే chAlulE

TitleచాలులేchAlulE
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఅటaTa
1చాలులే చాల్చాలులే నా
జోలి నీకిక యేలరా నా
జోలి నీకిక యేలరా
గోలసరి నే బోలరా
chAlulE chAlchAlulE nA
jOli nIkika yElarA nA
jOli nIkika yElarA
gOlasari nE bOlarA
2యెన్ని బాసలు చేసితివి
భళి యేమిరా నీ సంగతి
కన్ను సైగలు చేయగా నా
కన్నులారగ జూచితి
yenni bAsalu chEsitivi
bhaLi yEmirA nI samgati
kannu saigalu chEyagA nA
kannulAraga jUchiti
This is the last jAvaLi from the dvibhAshyam pullakavi collection. These were probably never published as a book yet, my mother had made a copy from hand-written notes at the poet’s house.

#327 నాటికి నేడా nATiki nEDA

Titleనాటికి నేడాnATiki nEDA
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaకన్నడkannaDa
తాళం tALaఅటaTa
పల్లవి pallaviనాటికి నేడా నీదు సందర్శనము
కూటమి గోరిన నా తోటి గూడెదనని
nATiki nEDA nIdu samdarSanamu
kUTami gOrina nA tOTi gUDedanani
చరణం
charaNam 1
సరిలేర నీపై తగు మురిపెము తీర్పక
విరహాగ్ని ముంపగ తరము గాదు సామి
sarilEra nIpai tagu muripemu tIrpaka
virahAgni mumpaga taramu gAdu sAmi
చరణం
charaNam 2
అల్లన ద్విభాషికుల పుల్లకవీంద్ర పాల
నల్లని గోపబాల చల్లగ జాలమేల
allana dvibhAshikula pullakavIndra pAla
nallani gOpabAla challaga jAlamEla

#326 నా ప్రియా nA priyA

Titleనా ప్రియాnA priyA
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAga??????
తాళం tALa??????
పల్లవి pallaviనా ప్రియా మరుకేళి నేలవేలరావే
nA priyA marukELi nElavElarAvE
అనుపల్లవి anupallaviయేలవేలరా జాలమికేలరా
చాలరా తాళ యీవేళ అవురవుర
మరుకేళీ నేలుము
yElavElarA jAlamikElarA
chAlarA tALa yIvELa avuravura
marukELI nElumu
చరణం
charaNam 1
కమ్మని మోవిచ్చి కౌగలింపుమురా
యిమ్ముగ రమ్ము వేగమ్ము ముద్దిమ్ము మరుకేళినేలు
kammani mOvichchi kaugalimpumurA
yimmuga rammu vEgammu muddimmu marukELinElu
చరణం
charaNam 2
కారణమేమో గారడి సేయుట
నేరములేంతే నేరితరము మరుకేళీనేలు
kAraNamEmO gAraDi sEyuTa
nEramulEmtE nEritaramu marukELInElu
చరణం
charaNam 3
సూర్యతేజ నిన్ జూచినది మొదలు
కార్యము నీదేయని కాచి యుంటిరా
మరుకేళీ నేలవేలరా
sUryatEja nin jUchinadi modalu
kAryamu nIdEyani kAchi yunTirA
marukELI nElavElarA
చరణం
charaNam 4
అల్లన ద్విభాషి పుల్లకవి వరద
మొల్లని యుల్లాసమెల్ల రంజిల్ల మరుకేళినేలము
allana dvibhAshi pullakavi varada
mollani yullAsamella ramjilla marukELinElamu

#325 విరిబోణి viribONi

TitleవిరిబోణిviribONi
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaబిళహరిbiLahari
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవిరిబోణి వగల్ చూడరాviribONi vagal chUDarA
అనుపల్లవి
anupallavi
పాణులు పల్లవ రాగశ్రేణికలురా
శృంగార వేణిరా
దృక్కులు మరుబాణము లౌరౌరా
pANulu pallava rAgaSrENikalurA
SRngAra vENirA
dRkkulu marubANamu lauraurA
చరణం
charaNam 1
సుందరా నీ పొందుకై నీవందారిలోపల
చాలా అందగాడవందిరా అది
బందరు వగలాడిరా
sundarA nI pondukai nIvamdArilOpala
chAlA andagADavandirA adi
bandaru vagalADirA
చరణం
charaNam 2
సల్లలిత శ్రీ ద్విభాషి పుల్లకవి
వల్లభుని యెల్లా సన్మానించిన శ్రీ
మల్లు దొరరాయ
sallalita SrI dvibhAshi pullakavi
vallabhuni yellA sanmAninchina SrI
mallu dorarAya

#324 హా సఖా hA sakhA

Titleహా సఖాhA sakhA
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaహిందుస్థానీ తోడిhindusthAnI tODi
తాళం tALaఅటaTa
పల్లవి pallaviహా సఖా నిను యే సఖీమణి గాసి మందు రాసెరా
రాసెరా విడదీసెరా శహబాసురా యెంతజేసెరా
hA sakhA ninu yE sakhImaNi gAsi mandu rAserA
rAserA viDadIserA SahabAsurA yemtajEserA
చరణం
charaNam 1
హాయిగా నిను డాయవచ్చిన దాయగా
కడుమాయగా ఆయెగా
కడుమాయగా యిది నాయమా నా నాయకా
hAyigA ninu DAyavachchina dAyagA
kaDumAyagA AyegA
kaDumAyagA yidi nAyamA nA nAyakA
చరణం
charaNam 2
వంచల నను కించ పరచుట మంచి గాదని
యెంచెరా దయయుంచి మది మరలించరా
vamchala nanu kimcha parachuTa manchi gAdani
yemcherA dayayunchi madi maralimcharA
చరణం
charaNam 3
నెమ్మదిని నిను నమ్మి యుంటిర
కమ్మ విల్తుని కేళికే
కమ్మ విల్తుని కేళికీ సరసమ్ము గలనీ పాలికీ
nemmadini ninu nammi yumTira
kamma viltuni kELikE
kamma viltuni kELikI sarasammu galanI pAlikI
చరణం
charaNam 4
వాసిగా ద్విభాషి పుల్లకవీశ సన్నుత వేగరా
యీశ సన్నుత వేగరార దయా సుధారస సాగరా
vAsigA dvibhAshi pullakavISa sannuta vEgarA
yISa sannuta vEgarAra dayA sudhArasa sAgarA

#323 మానినీ మణిరో mAninI maNirO

Titleమానినీ మణిరోmAninI maNirO
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaదర్బారుdarbAru
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమానినీ మణిరో వాని మనసు కరుగదాయనే
మనసు కరుగదాయెనా మనవి వినడాయెనే
mAninI maNirO vAni manasu karugadAyanE
manasu karugadAyenA manavi vinaDAyenE
చరణం
charaNam 1
అత్తరు పన్నీరు గంధమలది రారమ్మంటినే
అలది రారమ్మంటినే నా యనుగుకాడవంటినే
attaru pannIru gandhamaladi rArammanTinE
aladi rArammanTinE nA yanugukADavanTinE
చరణం
charaNam 2
కావిమోవి దొండపండు కాన్కగైకొమ్మంటినే
కాన్కగైకొమ్మంటినే బిగికౌగిలి యిమ్మంటినే
kAvimOvi donDapanDu kAn&kagaikommanTinE
kAn&kagaikommanTinE bigikaugili yimmanTinE
చరణం
charaNam 3
వింతగ చన్గవ పూల బంతులాడమంటినే
బంతులాడమంటినే నే నీకింత గూడదంటినే
vintaga chan&gava pUla bantulADamanTinE
bantulADamanTinE nE nIkinta gUDadanTinE
చరణం
charaNam 4
కోరి పిలువగానే శుక్రవారమన్నట్లాయనే
శుక్రవారమన్నట్లాయనే సరివారిలో నగుబాట్లాయనే
kOri piluvagAnE SukravAramannaTlAyanE
SukravAramannaTlAyanE sarivArilO nagubATlAyanE
చరణం
charaNam 5
పొడిమాటలచే కోర్కెదీరిపోవునే ఎవ్వరికైన
పోవునె యెవ్వరికైన ఆ భోగ దేవేంద్రునికైన
poDimATalachE kOrkedIripOvunE evvarikaina
pOvune yevvarikaina A bhOga dEvEndrunikaina
చరణం
charaNam 6
భువిలోన ద్విభాషి పుల్లకవి రాజవరదుడె
కవి రాజవరదుడే నన గవయదగు గోపాలుడే
bhuvilOna dvibhAshi pullakavi rAjavaraduDe
kavi rAjavaraduDE nana gavayadagu gOpAluDE

#322 మహరాజును maharAjunu

TitleమహరాజునుmaharAjunu
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaఅఠాణాaThANA
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమహరాజును జూచితివా సఖీ యీ ||maharAjunu jUchitivA sakhI yI ||
అనుపల్లవి anupallaviమహిళా సరసీరుహ బాణుడే యీ ||mahiLA sarasIruha bANuDE yI ||
చరణం
charaNam 1
సఖి కబ్బెనెకో మహిమలకు మదనుడు గదే
సుఖ రహి గదే యహహ యీతని సరి సరసులీ
మహిని లేరనుటె నిజము
sakhi kabbenekO mahimalaku madanuDu gadE
sukha rahi gadE yahaha yItani sari sarasulI
mahini lEranuTe nijamu
చరణం
charaNam 2
నవనీతము కన్నను మార్గవ మీ
నవ మోహనుడెందము నెంచినచో
యివిద వానిని గంటివే వినియుంటివే
నవరసాయుత పల్లవీ మన నయన
జలరుహ చంద్రుడే
navanItamu kannanu mArgava mI
nava mOhanuDendamu nenchinachO
yivida vAnini ganTivE viniyunTivE
navarasAyuta pallavI mana nayana
jalaruha chandruDE
చరణం
charaNam 3
రమణీయ మనోరమణీగన చిత్తము
తత్తరమె తను కించుగదే
కమల శరసౌందర్యుడే గుణధుర్యుడే
రమణులను దనియింప నింతటి
రసికుడీ యిల గలడటే
ramaNIya manOramaNIgana chittamu
tattarame tanu kinchugadE
kamala SarasaundaryuDE guNadhuryuDE
ramaNulanu daniyimpa nimtaTi
rasikuDI yila galaDaTE
చరణం
charaNam 4
గడు సుందరము గడు సుందరమున్గములే
ప్రియుడు న్గమలాత్మజుడే
తొడవు లీతని గుణములు రిపురణములు
కుడి యెడమ లేదడుగు నర్ధులకిడు
నెడల తడవుడిగి యిడు
gaDu sundaramu gaDu sundaramun&gamulE
priyuDu n&gamalAtmajuDE
toDavu lItani guNamulu ripuraNamulu
kuDi yeDama lEdaDugu nardhulakiDu
neDala taDavuDigi yiDu
చరణం
charaNam 5
సుకరమ్ముగ కీర్తికలా లాస
ద్విభాషి కులీనుడు
పుల్లకవి వినుతుడే సకల సుకళాలోలుడే గోపాలుడే మకుట మానిత రావు వంశకుమార
సూర్య రాయవరుడౌ
sukarammuga kIrtikalA lAsa
dvibhAshi kulInuDu
pullakavi vinutuDE sakala sukaLAlOluDE gOpAluDE makuTa mAnita rAvu vamSakumAra
sUrya rAyavaruDau

#321 వగలాడి హొయల్ vagalADi hoyal

Titleవగలాడి హొయల్vagalADi hoyal
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaదర్బారుdarbAru
తాళం tALaఅటaTa
పల్లవి pallaviవగలాడి హొయల్ జూడరాvagalADi hoyal jUDarA
చరణం
charaNam 1
తొగలరాయు గేరుమోము
మిగుల మించు మీరు గోము
సుగుణ గుణవంతారాలు యిది
నిగురు గమ్మిన నిప్పురా
togalarAyu gErumOmu
migula minchu mIru gOmu
suguNa guNavantArAlu yidi
niguru gammina nippurA
చరణం
charaNam 2
సుందరి నిను కోరి భువి
నందరి లోపల చాల
అందగాడవందిరా యది
బందరు హొయలాడిరా
sundari ninu kOri bhuvi
nandari lOpala chAla
andagADavandirA yadi
bandaru hoyalADirA
చరణం
charaNam 3
చిలకల కొలికిరా ముద్దు
గులుకు పలుకులెల్ల తేనె
లొలుకు వలపుల కలకిర యది
తళుకు మన్మధ ములికిర
chilakala kolikirA muddu
guluku palukulella tEne
loluku valapula kalakira yadi
taLuku manmadha mulikira
చరణం
charaNam 4
సల్లలిత శ్రీ ద్విభాషి
పుల్లకవి పల్లవుని
యొల్ల సన్మానించి యేలు
నల్లని శ్రీకృష్ణ
sallalita SrI dvibhAshi
pullakavi pallavuni
yolla sanmAninchi yElu
nallani SrIkRshNa

#320 నేరమా సామీ nEramA sAmI

Titleనేరమా సామీnEramA sAmI
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAga??????
తాళం tALa??????
పల్లవి pallaviనేరమా సామీ నాపై నేరమా
కోరితిర నిను పాడిగ పర
సారసాక్షులు గూడగ
nEramA sAmI nApai nEramA
kOritira ninu pADiga para
sArasAkshulu gUDaga
చరణం
charaNam 1
దారిగాదని నుడివి నిను నాయాధారమని కడు వేడగా నా
వాదమా సామీ నాతో వాదమా
చేదుయయ్యెనే బెల్లము మర్యాద
వాయునే యుల్లము
యేది యున్నను తెల్లము నీ
మీది తమితో నుండి గదనా
dArigAdani nuDivi ninu nAyAdhAramani kaDu vEDagA nA
vAdamA sAmI nAtO vAdamA
chEduyayyenE bellamu maryAda
vAyunE yullamu
yEdi yunnanu tellamu nI
mIdi tamitO nunDi gadanA
చరణం
charaNam 2
యొల్లవా సౌందర్య గణిగా పల్లవా
చెల్లునే సరసునకిది నా
వల్లభుడ నీవని మది
నుల్లసింపుచు నుంటి వేగమె
పల్లవాగ్రణి రమ్ముకేళికి
yollavA saundarya gaNigA pallavA
chellunE sarasunakidi nA
vallabhuDa nIvani madi
nullasimpuchu nunTi vEgame
pallavAgraNi rammukELiki
చరణం
charaNam 3
రోషమా విటరాయ నీకిది వేషమా
నా దోషమేమియు లేదురా మృదు
భాషణ ప్రియ శ్రీధరా
భూషితాగమవాసి యగు ద్వి
భాషి పుల్లకవీశనుత నా
rOshamA viTarAya nIkidi vEshamA
nA dOshamEmiyu lEdurA mRdu
bhAshaNa priya SrIdharA
bhUshitAgamavAsi yagu dvi
bhAshi pullakavISanuta nA