1279 తాళజాలనే ఓ చెలియ tALajAlanE O cheliya

Titleతాళజాలనే ఓ చెలియtALajAlanE O cheliya
Written By
Book
రాగం rAgaఆహిరిAhiri
తాళం tALaఅటaTa
పల్లవి pallaviతాళజాలనే ఓ చెలియ నే తాళజాలనేtALajAlanE O cheliya nE tALajAlanE
అనుపల్లవి anupallaviబాలరో మువ్వ గోపాలుడ నే గానbAlarO muvva gOpAluDa nE gAna
చరణం
charaNam 1
నేరమెంచకుమీ యిందరి లోన
సారెకు నెంచకుమీ యీ వేళ నన్ను
నీరసించకుమీ కౌగిట నన్ను వేరు సేయకుమీ
వారిజాక్షిరో నీపై వలచి యున్న నన్ను
మేరదలయించ మెలత నినుబాడి
nEramenchakumI yindari lOna
sAreku nenchakumI yI vELa nannu
nIrasinchakumI kaugiTa nannu vEru sEyakumI
vArijAkshirO nIpai valachi yunna nannu
mEradalayincha melata ninubADi
చరణం
charaNam 2
వద్దికి దావే వేడుక మీర
ముద్దు చేటివే కౌగిట నుండి సద్దులాడవే
ముద్దుగుమ్మ నీ మోవి తేనె లీయవే
ప్రొద్దుపోయె చలమేటికే జాగు చేయకే
vaddiki dAvE vEDuka mIra
muddu chETivE kaugiTa nunDi saddulADavE
muddugumma nI mOvi tEne lIyavE
proddupOye chalamETikE jAgu chEyakE
చరణం
charaNam 3
భామలెందైన నెంతైన మది
ప్రేమ లేక యుందురా యిట్లు
రామ యికనైన మువ్వ గోపాల రమ్మని నన్ను
కాముకేళి గూడి గలసి యేలు మీవేళ
bhAmalendaina nentaina madi
prEma lEka yundurA yiTlu
rAma yikanaina muvva gOpAla rammani nannu
kAmukELi gUDi galasi yElu mIvELa

1278 వేళ గాదుర గడియ vELa gAdura gaDiya

Titleవేళ గాదుర గడియvELa gAdura gaDiya
Written By????
Book
రాగం rAgaమోహనmOhana
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviవేళ గాదుర గడియ తాళుర సామిvELa gAdura gaDiya tALura sAmi
అనుపల్లవి anupallaviచాలు చాలు పది వేలకైన నిదిchAlu chAlu padi vElakaina nidi
చరణం
charaNam 1
పూరక నా పైని నేరమెంచక
పొలరుచు మా బావ గారున్నారోయి
కూరిమి నా తోడికోడలీ పడకింటి
చేరిక యందుండ మేర గాదోయి
pUraka nA paini nEramenchaka
polaruchu mA bAva gArunnArOyi
kUrimi nA tODikODalI paDakinTi
chErika yandunDa mEra gAdOyi
చరణం
charaNam 2
ఒద్దికతో మన మిద్దరము కూడి
సుద్దులాడుట కిది ప్రొద్దు కాదోయి
పద్దు మీరగ నాపవ వారి వద్దనేయీ
సుద్ది విన్నంత కొద్ది కాదోయి
oddikatO mana middaramu kUDi
suddulADuTa kidi proddu kAdOyi
paddu mIraga nApava vAri vaddanEyI
suddi vinnanta koddi kAdOyi
చరణం
charaNam 3
నిరతము శ్రీనాదపురి నిలయుడైన
మురళి గాన లోల మువ్వ గోపాల
యర విరుల పాన్పు పైని మరు కేళి నన్ను గూడి
తిరుగ పొరుగింట తిరుగు కాదోయి
niratamu SrInAdapuri nilayuDaina
muraLi gAna lOla muvva gOpAla
yara virula pAn&pu paini maru kELi nannu gUDi
tiruga poruginTa tirugu kAdOyi

1273 ముక్కు పచ్చలారని mukku pacchalArani

Titleముక్కు పచ్చలారనిmukku pacchalArani
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaయదుకుల కాంభోజిyadukula kAmbhOji
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviముక్కు పచ్చలారని చిన్నదాన
నన్నెక్కడి కంపెదరే సిగ్గాయె నన్నెక్కడి కంపెదరే
mukku pacchalArani chinnadAna
nannekkaDi kampedarE siggAye nannekkaDi kampedarE
అనుపల్లవి anupallaviనిక్కము రేయెల్ల నిదుర బోయెనమ్మా
తక్కిన పనులేమి నే నెరుగ నోయమ్మా
nikkamu rEyella nidura bOyenammA
takkina panulEmi nE neruga nOyammA
చరణం
charaNam 1
వంచిన నా చేయి మంచి గంధము లోన
ముంచి యెత్తెద రేలనే సిగ్గాయె నన్నెక్కడి కంపెదరే
మంచిదేరమ్మ మగవారి చేయిబట్టు
మంచు దెల్పెదరు నాకలవాటు లేదమ్మా
vanchina nA chEyi manchi gandhamu lOna
munchi yetteda rElanE siggAye nannekkaDi kampedarE
manchidEramma magavAri chEyibaTTu
manchu delpedaru nAkalavATu lEdammA
చరణం
charaNam 2
అందముగా నున్న మాకీనెదీసి నే
నంటరాయ నేరనే
అందగాని నోటి కంటీయమని యెద
రిందరిలో మనసెట్టు లొప్పునోయమ్మా
andamugA nunna mAkInedIsi nE
nanTarAya nEranE
andagAni nOTi kanTIyamani yeda
rindarilO manaseTTu loppunOyammA
చరణం
charaNam 3
ఈ పను లాపను లేల చెప్పెదరు
నేనేపని కోపలేనే
ప్రాపై దాసు శ్రీరాము నేలిన వేణు
గోపాల దేవుని గూడి యుండెదనమ్మా
I panu lApanu lEla cheppedaru
nEnEpani kOpalEnE
prApai dAsu SrIrAmu nElina vENu
gOpAla dEvuni gUDi yunDedanammA

1272 నేనెరుగనా nEneruganA

TitleనేనెరుగనాnEneruganA
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaదర్బారుdarbAru
తాళం tALaజంపెjampe
పల్లవి pallaviనేనెరుగనా నీజాడ నాసామి నేనెరుగనాnEneruganA nIjADa nAsAmi nEneruganA
అనుపల్లవి anupallaviమాను నీ వగలెల్ల మా వద్దనా సామిmAnu nI vagalella mA vaddanA sAmi
చరణం
charaNam 1
మరుపెన్నటికి రాని మంచి మాటలె చెప్పి
అర చేత వైకుంఠ మట్టె చూపి
పరిపూర్ణ దయ గలిగి పనులెల్ల కానిచ్చి
సరసుడవు నీ వింద్రజాలములు జేసేవు
marupennaTiki rAni manchi mATale cheppi
ara chEta vaikunTha maTTe chUpi
paripUrNa daya galigi panulella kAnicchi
sarasuDavu nI vindrajAlamulu jEsEvu
చరణం
charaNam 2
ముద్దు నా సామి నీ మురిపంపు సుద్దులివి
ముత్యాలు పది వేలు మూట గట్టు
బద్దులాడను పంచ బాణుడాన నీ వలపు
మిద్దెపై నిడు పరుగు మీసాలపై తేనె
muddu nA sAmi nI muripampu suddulivi
mutyAlu padi vElu mUTa gaTTu
baddulADanu pancha bANuDAna nI valapu
middepai niDu parugu mIsAlapai tEne
చరణం
charaNam 3
కనికరము పూజ్య మాకాశ పుష్పము నిజము
వినవోయి మగవారి వింతలెల్ల
ఘన దాసు శ్రీరామ కవి కీర్తనంబులే
విన వేడుకాయె నీ పని పదిల మాయెనిక
kanikaramu pUjya mAkASa pushpamu nijamu
vinavOyi magavAri vintalella
ghana dAsu SrIrAma kavi kIrtanambulE
vina vEDukAye nI pani padila mAyenika

1271 అప్పటి మాటలకు appaTi mATalaku

Titleఅప్పటి మాటలకుappaTi mATalaku
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaతోడిtODi
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviఅప్పటి మాటలకు దుప్పటిచ్చె గాని
అప్పటి గప్ప నిచ్చెనటే చెలి
appaTi mATalaku duppaTicche gAni
appaTi gappa nicchenaTE cheli
అనుపల్లవి anupallaviతప్ప నేనితరుల దరి జేరనని యెన్నో
చెప్పిన తలచు కొంటినే ఓ చెలి
tappa nEnitarula dari jEranani yennO
cheppina talachu konTinE O cheli
చరణం
charaNam 1
తొలినాటి వగలేయా మలునాటి వగలు మా
చెలిమి కాకియు కోవెల చందమాయెనే
tolinATi vagalEyA malunATi vagalu mA
chelimi kAkiyu kOvela chandamAyenE
చరణం
charaNam 2
పడతి మగవారు బారు పడకింట మితిమీరు
గడప దాటిన వెనుక కారు మనవారు
బడి బడి నాడు వారు బ్రతిమాలి పాదముల
బడి వేడుకొన్న గాని పలుకే మేల్మి బంగారు
paDati magavAru bAru paDakinTa mitimIru
gaDapa dATina venuka kAru manavAru
baDi baDi nADu vAru bratimAli pAdamula
baDi vEDukonna gAni palukE mElmi bangAru
చరణం
charaNam 3
కాసు వీసములిచ్చి గోస గూసల మసి
బూసి నేరేడు గాయ జేసెనే చెలి
వేసాల మారి మా వేణుగోపాల మూర్తి
దాసు శ్రీరామ కవి డాసి యేలుచుండెనే ఓ చెలి
kAsu vIsamulicchi gOsa gUsala masi
bUsi nErEDu gAya jEsenE cheli
vEsAla mAri mA vENugOpAla mUrti
dAsu SrIrAma kavi DAsi yEluchunDenE O cheli

1270 ముద్దుముద్దుగ muddumudduga

Titleముద్దుముద్దుగmuddumudduga
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaఅఠాణaThANa
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviముద్దు ముద్దుగ పిలవనా నా సామిని
ముదుగు ముదుగుగ పిలవనా నా సామిని
muddu mudduga pilavanA nA sAmini
mudugu muduguga pilavanA nA sAmini
అనుపల్లవి anupallaviముద్దు ముద్దుగ పిలువ చులక సేయునేమో
ముదుగు ముదుగుగ పిలువ బాగని తోచేనే
muddu mudduga piluva chulaka sEyunEmO
mudugu muduguga piluva bAgani tOchEnE
చరణం
charaNam 1
పాటలు పాడుదునా మంచి ఆటలు ఆడుదునా
వాటమైన గుబ్బ పోటు జూపింతునా
గోటి కొన చెక్కిలి మీటుదునా
pATalu pADudunA manchi ATalu ADudunA
vATamaina gubba pOTu jUpintunA
gOTi kona chekkili mITudunA
చరణం
charaNam 2
ఆకు మడుపు లిత్తునా మంచి తావి
అత్తరు పైబూతునా
తేకువతో జడ త్రిప్పి కొట్టుదునా
మోక మావి చిగురు మోవి గరతునా
Aku maDupu littunA manchi tAvi
attaru paibUtunA
tEkuvatO jaDa trippi koTTudunA
mOka mAvi chiguru mOvi garatunA
చరణం
charaNam 3
కోపగించకు మందునా యేర వేణు
గ్గోపాల రమ్మందునా
శ్రీపూర్ణమగు దాసు శ్రీరాము మనసున
ప్రాపై నివసించి పాలించమందునా
kOpaginchaku mandunA yEra vENu
ggOpAla rammandunA
SrIpUrNamagu dAsu SrIrAmu manasuna
prApai nivasinchi pAlinchamandunA

1269 కామాంధకారము kAmAndhakAramu

TitleకామాంధకారముkAmAndhakAramu
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviకామాంధకారము కప్పెనా నీవింత
కనుగానక యుంటివి
kAmAndhakAramu kappenA nIvinta
kanugAnaka yunTivi
అనుపల్లవి anupallaviఏమిరా తెలియదా ఇది కాదని నీకు
నీ ముద్దు కోమలి నివసించిన ఇల్లు
EmirA teliyadA idi kAdani nIku
nI muddu kOmali nivasinchina illu
చరణం
charaNam 1
పంజరమున చిలుక పగిది నేనుండగ
పరులకు పని ఏమిరా
సంజ చీకటి దారి జాడ తెలియ లేక
కంజాత నయన ఇక్కడ వచ్చితివా లేక
panjaramuna chiluka pagidi nEnunDaga
parulaku pani EmirA
sanja chIkaTi dAri jADa teliya lEka
kanjAta nayana ikkaDa vacchitivA lEka
చరణం
charaNam 2
వగకాడ నీవంటి వానికి నావంటి
మగువ పొందది ఏలరా
మొగలి పూజిదుమబో ముల్లా కంటిన యట్లు
తగని ఈ నా యిల్లు దారి దాకెనా లేక
vagakADa nIvanTi vAniki nAvanTi
maguva pondadi ElarA
mogali pUjidumabO mullA kanTina yaTlu
tagani I nA yillu dAri dAkenA lEka
చరణం
charaNam 3
భ్రమ లేల నిన్నటి రాతిరి గలసిన
భామ ఇల్లిది గాదురా
రమణీయ దాసు శ్రీరామ కవీంద్రుని
అమల చిత్తాంబుజ మనుకొంటివా లేక
bhrama lEla ninnaTi rAtiri galasina
bhAma illidi gAdurA
ramaNIya dAsu SrIrAma kavIndruni
amala chittAmbuja manukonTivA lEka

1268 వలచితిరా నిను valachitirA ninu

Titleవలచితిరా నినుvalachitirA ninu
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaదర్బారుdarbAru
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviవలచితిరా నిను వదలను సామీ
జలజాక్ష నీ దర్శనమే పది వేలు
valachitirA ninu vadalanu sAmI
jalajAksha nI darSanamE padi vElu
చరణం
charaNam 1
ఇచ్చిన సరే ఇవ్వకున్న సరే
వచ్చి నాతో నొక ముచ్చటాడిన చాలు
icchina sarE ivvakunna sarE
vacchi nAtO noka mucchaTADina chAlu
చరణం
charaNam 2
నీళ్ళనే ముంచు పాలనే ముంచు
కాళ్ళకు మ్రొక్కెద కరుణించరా
nILLanE munchu pAlanE munchu
kALLaku mrokkeda karuNincharA
చరణం
charaNam 3
వేణుగోపాలా వేడితి చాలా
రాణించు దాసు శ్రీరాము నుల్లము వలె
vENugOpAlA vEDiti chAlA
rANinchu dAsu SrIrAmu nullamu vale

1267 వట్టు బెట్టెద vaTTu beTTeda

Titleవట్టు బెట్టెదvaTTu beTTeda
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaఆనంద భైరవిAnanda bhairavi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviవట్టు బెట్టెద నా చై పట్ట రాకురా సామిvaTTu beTTeda nA chai paTTa rAkurA sAmi
అనుపల్లవి anupallaviగట్టిగ పది వేల కరకు వరాల మూట
గట్టి నా కట్టెదుట బెట్టి మాటాడర
gaTTiga padi vEla karaku varAla mUTa
gaTTi nA kaTTeduTa beTTi mATADara
చరణం
charaNam 1
గారాన నొక యమ్మ కని పెంచిన బిడ్డ
యూరకే వచ్చునా తేరా సరిగ చీర
gArAna noka yamma kani penchina biDDa
yUrakE vacchunA tErA sariga chIra
చరణం
charaNam 2
వలచి వచ్చిన వారు ఇలువ బెట్టక పోరు
అలరింతు తేరా మంచి ఆణి ముత్యాల పేరు
valachi vacchina vAru iluva beTTaka pOru
alarintu tErA manchi ANi mutyAla pEru
చరణం
charaNam 3
భాసుర వేణుగోపాల జేజేల మిన్న
దాసు శ్రీరామ కవి డాసి ఏలక యున్న
bhAsura vENugOpAla jEjEla minna
dAsu SrIrAma kavi DAsi Elaka yunna

1266 మగువ నేనెంత maguva nEnenta

Titleమగువ నేనెంతmaguva nEnenta
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893 dAsu1893
రాగం rAgaతోడిtODi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviమగువ నేనెంత మంద బుద్ధినైతి
మగని తూలనాడితి మోసపోయితి
maguva nEnenta manda buddhinaiti
magani tUlanADiti mOsapOyiti
అనుపల్లవి anupallaviతెగువ తొల్లి యిల్లు తిరిగి చూచుచున్న
నగధర నినుజూచి నగరా పొమ్మంటి
teguva tolli yillu tirigi chUchuchunna
nagadhara ninujUchi nagarA pommanTi
చరణం
charaNam 1
బెట్టు విడచి మ్రొక్కు బెట్టు వచ్చిన నన్ను
బట్టకురా నీ బవిసి దెలిసె నంటి
beTTu viDachi mrokku beTTu vacchina nannu
baTTakurA nI bavisi delise nanTi
చరణం
charaNam 2
వాసిగా నా తోడ యూసు లాడెదనన్న
దాసు శ్రీరామకవి డాసి ఏలుకొమ్మంటి
vAsigA nA tODa yUsu lADedananna
dAsu SrIrAmakavi DAsi ElukommanTi