| Title | మోహనాకార యని | mOhanAkAra yani |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | దేశి తోడి | dESi tODi |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | మోహనాకార యని మనవి జేసిన రాడే | mOhanAkAra yani manavi jEsina rADE |
| అనుపల్లవి anupallavi | మోహమెటు దీరును మగువ నే తాళాను | mOhameTu dIrunu maguva nE tALAnu |
| చరణం charaNam 1 | మనవి జేసుకు పోతె మోమోర జేసేను మన్నాన జేసేది మగువరొ తగునా | manavi jEsuku pOte mOmOra jEsEnu mannAna jEsEdi maguvaro tagunA |
| చరణం charaNam 2 | నా సామినీ బాసీ నే తాళలేను నా సరివారిలో నను చౌక జేసెను | nA sAminI bAsI nE tALalEnu nA sarivArilO nanu chauka jEsenu |
| చరణం charaNam 3 | రాతిరి నను గూడీ రాడాయ నేడు నాతిని జేరి నను మరచె నేడు | rAtiri nanu gUDI rADAya nEDu nAtini jEri nanu marache nEDu |
| చరణం charaNam 4 | సరసూడు లేని ఈ సొగసేలనె మనకు ఓర్వజాలను సామి ఇందు రాడాయనె | sarasUDu lEni I sogasElane manaku OrvajAlanu sAmi indu rADAyane |
| చరణం charaNam 5 | కాయజు కేళిలో కలియుట సమయము మాయకాడె వాడు మంగళపురి వాసుడు | kAyaju kELilO kaliyuTa samayamu mAyakADe vADu mangaLapuri vAsuDu |
Tag: Telugu
#760 పిలచితె ప్రేమ pilachite prEma
| Title | పిలచితె ప్రేమ | pilachite prEma |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | దేశి కాపి | dESi kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | పిలచితె ప్రేమ లేదాయ పొలతిరో నేడు | pilachite prEma lEdAya polatirO nEDu |
| చరణం charaNam 1 | మార మోహనాంగునికి మనసిందు లేదాయ గారడము జేసుట ఘనమేమే సామికీ | mAra mOhanAnguniki manasindu lEdAya gAraDamu jEsuTa ghanamEmE sAmikI |
| చరణం charaNam 2 | కలికిరో నా సామి కలసిట్లు జేసితె పలచన గాదటె పణతుల లోను | kalikirO nA sAmi kalasiTlu jEsite palachana gAdaTe paNatula lOnu |
| చరణం charaNam 3 | మరచినాడె ఈ వ్యాళ మంగళపురి వాసుడు పరమాప్త మని యుంటినె ప్రాణేశుని నేను | marachinADe I vyALa mangaLapuri vAsuDu paramApta mani yunTine prANESuni nEnu |
#759 పిలచితె నేను pilachite nEnu
| Title | పిలచితె నేను | pilachite nEnu |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | పూర్వీ కల్యాణి | pUrvI kalyANi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Published At | 392 | |
| పల్లవి pallavi | పిలచితె నేను బల్కవేమి దేమిరా | pilachite nEnu balkavEmi dEmirA |
| అనుపల్లవి anupallavi | కాని దాని మాట వినీ కరుణ మరచె దేమిరా | kAni dAni mATa vinI karuNa marache dEmirA |
| చరణం charaNam 1 | మంచి వాడవని నేను మరులైతిని గదరా కొంచ కాడ అవులేరా కోర్కె దీరదాయా | manchi vADavani nEnu marulaitini gadarA koncha kADa avulErA kOrke dIradAyA |
| చరణం charaNam 2 | మనసు తెలియకను మగువ పొందు జేరితివి కనికర మింతైన లేక కలసిట్లు జేసితివి | manasu teliyakanu maguva pondu jEritivi kanikara mintaina lEka kalasiTlu jEsitivi |
| చరణం charaNam 3 | మారుని బారికి మనసు సైరిసదాయ మరచేది న్యాయమా మంగళపురి శ్రీనివాస | mAruni bAriki manasu sairisadAya marachEdi nyAyamA mangaLapuri SrInivAsa |
#758 చాలుర నీ పొందు chAlura nI pondu
| Title | చాలుర నీ పొందు | chAlura nI pondu |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | మాయామాళవ గౌళ | mAyAmALava gauLa |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | చాలుర నీ పొందు సరసిజ నయన చాలు చాలు యింక సామిగ వినరా | chAlura nI pondu sarasija nayana chAlu chAlu yinka sAmiga vinarA |
| చరణం charaNam 1 | వేడుకొని అది వేగామె పిలచితె మోది జేసి యిందు మోహనాంగిని గూడితివి | vEDukoni adi vEgAme pilachite mOdi jEsi yindu mOhanAngini gUDitivi |
| చరణం charaNam 2 | యంతని వినవింతు పంతము యాలరా కాంతుడ నీ పొందు చింతకు లోనైతి | yantani vinavintu pantamu yAlarA kAntuDa nI pondu chintaku lOnaiti |
| చరణం charaNam 3 | ముచ్చు వగలు దాచు మంగళపురి వాస మోసము జేసుట మేరగాదు పోరా | muchchu vagalu dAchu mangaLapuri vAsa mOsamu jEsuTa mEragAdu pOrA |
#757 చిత్తము రాదె chittamu rAde
| Title | చిత్తము రాదె | chittamu rAde |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఏక | Eka |
| Previously Posted At | 387 | |
| పల్లవి pallavi | చిత్తము రాదె యాలనె నాపైన | chittamu rAde yAlane nApaina |
| చరణం charaNam 1 | అంతరంగము తోను కాంతుడు నను గూడి పంతము యాలనే చెంత రాడాయనే | antarangamu tOnu kAntuDu nanu gUDi pantamu yAlanE chenta rADAyanE |
| చరణం charaNam 2 | సరసుడు రాడాయ సకియరొ యేమి సేతు మరచినాడె నన్ను మగువరో యీ వేళ | sarasuDu rADAya sakiyaro yEmi sEtu marachinADe nannu maguvarO yI vELa |
| చరణం charaNam 3 | కాముని బారికి కలికి నే నోర్వను మమతెందు బోయనో మంగళపురి వాసునికి | kAmuni bAriki kaliki nE nOrvanu mamatendu bOyanO mangaLapuri vAsuniki |
#756 వాని పొందు vAni pondu
| Title | వాని పొందు | vAni pondu |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | దేశి కాపి | dESi kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వాని పొందు చాలునే వనజాక్షిరో నేడు | vAni pondu chAlunE vanajAkshirO nEDu |
| చరణం charaNam 1 | సరసుడనుచు నేను సరస మాడితి గాని సారసాక్షుల తోను సరసము పెంచను | sarasuDanuchu nEnu sarasa mADiti gAni sArasAkshula tOnu sarasamu penchanu |
| చరణం charaNam 2 | సదయు డనుచు నేను సకియ కోరితి గాని సుదతుల పాలాయ చెలియ నేనేమి సేతు | sadayu Danuchu nEnu sakiya kOriti gAni sudatula pAlAya cheliya nEnEmi sEtu |
| చరణం charaNam 3 | ప్రేమ మరచె నేడు మంగళపురి వాసుడు ఆ మగువ పొందు జేరీ మమతలు మరచెను | prEma marache nEDu mangaLapuri vAsuDu A maguva pondu jErI mamatalu marachenu |
#755 సామిగా నాపై sAmigA nApai
| Title | సామిగా నాపై | sAmigA nApai |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | దేశి కాపి | dESi kApi |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | సామిగా నాపై చాలుర మోహము | sAmigA nApai chAlura mOhamu |
| చరణం charaNam 1 | మట్టు దెలిసెను లేరా మాయకాడ అవురా మాటలు చాలుర మొగవాడ వైతివి | maTTu delisenu lErA mAyakADa avurA mATalu chAlura mogavADa vaitivi |
| చరణం charaNam 2 | మాయదారికి నీవు మరులైతి వేమిరా ఆయలేర దెలిశా అవుర బాగాయ | mAyadAriki nIvu marulaiti vEmirA AyalEra deliSA avura bAgAya |
| చరణం charaNam 3 | మంగళపురి వాస మమతెందు బోయర మంగళాంగిని గూడిన మోహమెటు బోయర | mangaLapuri vAsa mamatendu bOyara mangaLAngini gUDina mOhameTu bOyara |
#754 మొగవారిని నమ్మరాదె mogavArini nammarAde
| Title | మొగవారిని నమ్మరాదె | mogavArini nammarAde |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | పూర్వీ కల్యాణి | pUrvI kalyANi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మొగవారిని నమ్మరాదె మగువ సామి రాడాయ | mogavArini nammarAde maguva sAmi rADAya |
| చరణం charaNam 1 | కులుకుచూ నాతోను కలసి మెలసి యుండిన పలుకు లెందు బోయనో పణతిరో నేడు | kulukuchU nAtOnu kalasi melasi yunDina paluku lendu bOyanO paNatirO nEDu |
| చరణం charaNam 2 | వెలదిరో అలనాడు వుపరతి వ్యాళలో అలసి కౌగిలించిన అక్కరెందు బోయనో | veladirO alanADu vuparati vyALalO alasi kaugilinchina akkarendu bOyanO |
| చరణం charaNam 3 | వర మంగళపురీశుని వలపెందుంచి నాడో మరియాదె వానికి మమతెందు బోయనో | vara mangaLapurISuni valapendunchi nADO mariyAde vAniki mamatendu bOyanO |
#753 మాట్లాడరా సామి mATlADarA sAmi
| Title | మాట్లాడరా సామి | mATlADarA sAmi |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | దేశి తోడి | dESi tODi |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | మాట్లాడరా సామి మనసు నిల్వదురా | mATlADarA sAmi manasu nilvadurA |
| అనుపల్లవి anupallavi | కుటిలాము మానరా నే కోరి యున్నానురా | kuTilAmu mAnarA nE kOri yunnAnurA |
| చరణం charaNam 1 | కోరిన వ్యాళలో కోర్కె లీడేరదాయె కరుణ ఇంతైన నాపై తమకు లేదాయగా | kOrina vyALalO kOrke lIDEradAye karuNa intaina nApai tamaku lEdAyagA |
| చరణం charaNam 2 | నా సామి నను నీవు నెడబాయకురా కుసుమ శరములకు కరగి యున్నానురా | nA sAmi nanu nIvu neDabAyakurA kusuma Saramulaku karagi yunnAnurA |
| చరణం charaNam 3 | మంగళపురి వాస మనసు దెలిసి నేడు శృంగార సేకర సొంపుతో నేలరా | mangaLapuri vAsa manasu delisi nEDu SRngAra sEkara somputO nElarA |
#752 తెలిసెను యిపుడు telisenu yipuDu
| Title | తెలిసెను యిపుడు | telisenu yipuDu |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ఖరహరప్రియ | kharaharapriya |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Published At | 401 | |
| పల్లవి pallavi | తెలిసెను యిపుడు లేరా కులుకులాడి పొద్దు | telisenu yipuDu lErA kulukulADi poddu |
| చరణం charaNam 1 | మాట జూడబోతే మధురము మనసులో మత్సరము ఇదేటి ప్రేమ సామి నీకు ఇది మొగవారికి తగును | mATa jUDabOtE madhuramu manasulO matsaramu idETi prEma sAmi nIku idi mogavAriki tagunu |
| చరణం charaNam 2 | ప్రీతి అందె వుంచి దాని ప్రేమతో నేలినా రీతి తెలిసి వచ్చెను ఖ్యాతి పొగడేరు సకులు | prIti ande vunchi dAni prEmatO nElinA rIti telisi vachchenu khyAti pogaDEru sakulu |
| చరణం charaNam 3 | సరస మంగళపురి వాస సురత సుక మెందుబోయా మరచిందు వచ్చితి వీరా మగువ దండించును పోరా | sarasa mangaLapuri vAsa surata suka mendubOyA marachindu vachchiti vIrA maguva danDinchunu pOrA |