| Title | mOha mATalADi | మోహ మాటలాడి |
| Written By | chitravINa N ravikiraN | చిత్రవీణ N రవికిరణ్ |
| Book | ||
| రాగం rAga | vasanta | వసంత |
| తాళం tALa | Adi | ఆది |
| పల్లవి pallavi | mOhamATalADi nannu nIvu mOsa sEyuTa mEra gAdurA | మోహమాటలాడి నన్ను నీవు మోస సేయుట మేర గాదురా |
| అనుపల్లవి anupallavi | snEhamu mAyamA nIkidi nyAyamA | స్నేహము మాయమా నీకిది న్యాయమా |
| చరణం charaNam 1 | ninnu nE dalachi anniyu marachi yunnadi telisi kannu saiga jEsi | నిన్ను నే దలచి అన్నియు మరచి యున్నది తెలిసి కన్ను సైగ జేసి |
| చరణం charaNam 2 | kanna talli tanDri anna tammula vinnapamu nirAgakinchina nAtO | కన్న తల్లి తండ్రి అన్న తమ్ముల విన్నపము నిరాకరించిన నాతో |
| చరణం charaNam 3 | pannaga Sayana ravi SaSi jana sannuta kuvalaya daLa nayana | పన్నగ శయన రవి శశి జన సన్నుత కువలయ దళ నయన |
Tag: Telugu
#801 వగల వయ్యారి vagala vayyAri
| Title | వగల వయ్యారి | vagala vayyAri |
| Written By | పట్రాయని సీతారామశాస్త్రి | paTrAyani sItArAmaSAstri |
| Book | Bunch of jAvaLis | |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వగల వయ్యారి అదిరా ఆ చిన్నారి వగల వయ్యారి అదిరా | vagala vayyAri adirA A chinnAri vagala vayyAri adirA |
| అనుపల్లవి anupallavi | సొగసరి జవరాలు తగినింటి మగనాలు మురిపాల హొయల మైమరపించు ప్రియురాలు | sogasari javarAlu tagininTi maganAlu muripAla hoyala maimarapinchu priyurAlu |
| చరణం charaNam 1 | అత్తా మామల వదిన బావా మరదుల మగని చిత్త మెరిగిన నెరజాణ యదిరా సరస సరాగాల చనవైన నయగారాల హితులు సన్నిహితు లోహోయని మెచ్చే | attA mAmala vadina bAvA maradula magani chitta merigina nerajANa yadirA sarasa sarAgAla chanavaina nayagArAla hitulu sannihitu lOhOyani mechchE |
| చరణం charaNam 2 | ఇంపైన మాటల సొంపైన పాటల తీరైన నడతల తీయని వలపుల నెనరైన పెనిమిటి మనసు దోచి తనువు నెమ్మనము తనివోవజేసే | impaina mATala sompaina pATala tIraina naDatala tIyani valapula nenaraina penimiTi manasu dOchi tanuvu nemmanamu tanivOvajEsE |
#800 మోసపోతినే mOsapOtinE
| Title | మోసపోతినే | mOsapOtinE |
| Written By | కవి రంగదాస | kavi rangadAsa |
| Book | ||
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మోసపోతినే చెలియా మోసపోతినే మోహనాంగుని చేరి నే వాని మాట నమ్మి నే | mOsapOtinE cheliyA mOsapOtinE mOhanAnguni chEri nE vAni mATa nammi nE |
| అనుపల్లవి anupallavi | ఆశలు పెట్టి నాపై దోసమెంచెనే | ASalu peTTi nApai dOsamenchenE |
| చరణం charaNam 1 | వద్దంటే నాతో కూడి ముద్దు ముద్దుగా మాటలాడి నిద్దుర పోయే వేళ సద్దు లేక పోయినాడె | vaddanTE nAtO kUDi muddu muddugA mATalADi niddura pOyE vELa saddu lEka pOyinADe |
| Audio Link | https://www.youtube.com/watch?v=46jNyT4utHU | |
#798 పోకిరి తనములు pOkiri tanamulu
| Title | పోకిరి తనములు | pOkiri tanamulu |
| Written By | భీమేశదాస | bhImESadAsa |
| Book | ||
| రాగం rAga | రాగమాలిక | rAgamAlika |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | రాగం: శంకరాభరణం పోకిరి తనములు బాగ తెలియ వచ్చె ప్రక్క ఇంటికి పోపోరా మాయింటికి రాకరాక పోపోరా | rAga: SankarAbharaNam pOkiri tanamulu bAga teliya vachche prakka inTiki pOpOrA mAyinTiki rAkarAka pOpOrA |
| గోపాలు గుడికి నే గుంపు తోను పోతే వీపు వెనక బట్టి అధరము కొరికేవు కోపము బట్టు నా కొంగుని పట్టక మాపటి వేళకు మావారు వచ్చేరు ప్రక్క ఇంటికి పోపోరా | gOpAlu guDiki nE gumpu tOnu pOtE vIpu venaka baTTi adharamu korikEvu kOpamu baTTu nA konguni paTTaka mApaTi vELaku mAvAru vachchEru prakka inTiki pOpOrA | |
| రాగ: మోహన నిన్న దాని ఇంట నీవు జేసిన సైగల పంగేలు జూచెర లలనామణీ నిన్ను కన్నులెర్రగ జేసి ఖండిత మాడగ నిన్నది పదమంటి బతిమాలినది తనకె?? ప్రక్క ఇంటికి పోపోరా | rAga: mOhana ninna dAni inTa nIvu jEsina saigala pangElu jUchera lalanAmaNI ninnu kannulerraga jEsi khanDita mADaga ninnadi padamanTi batimAlinadi tanake?? prakka inTiki pOpOrA | |
| రాగ: ఆనందభైరవి సరసము జేసేవు సొగసుగాడ నీవు పరులు జూచెరె నిన్ను పంతము జేసేరు మరుని కేళిలో నన్ను మమతతో గూడిన గురువర భీమేశ విఠలుడు ఈ వేళ ప్రక్క ఇంటికి పోపోరా | rAga: Anandabhairavi sarasamu jEsEvu sogasugADa nIvu parulu jUchere ninnu pantamu jEsEru maruni kELilO nannu mamatatO gUDina guruvara bhImESa viThaluDu I vELa prakka inTiki pOpOra | |
| Audio/ Video Link | https://www.youtube.com/watch?v=EXYfEubs-os |
#795 ఇన్నాళ్ళవలె innALLavale
| Title | ఇన్నాళ్ళవలె | innALLavale |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | ఇన్నాళ్ళవలె గాదమ్మ మా గోపాలుడు ఎన్నెన్నొ నేర్చినాడమ్మా | innALLavale gAdamma mA gOpAluDu ennenno nErchinADammA |
| చరణం charaNam 1 | నన్ను కనుల మూసి నా చెంతనుండి సన్నుతాంగి మోసి చప్పరించెనె | nannu kanula mUsi nA chentanunDi sannutAngi mOsi chapparinchene |
| చరణం charaNam 2 | పదరాకనూ వాగు గోపాలుడు నను జూడ మదిరాక్షిరొ దాని మమత జేర్చుకొనెనె | padarAkanU vAgu gOpAluDu nanu jUDa madirAkshiro dAni mamata jErchukonene |
| చరణం charaNam 3 | కొదమ గుబ్బల పైని కోకాడు దలగింప కదిలి నే నడిగితె తుద నన్ను గూడెనె | kodama gubbala paini kOkADu dalagimpa kadili nE naDigite tuda nannu gUDene |
#794 యేమొ చెలియా yEmo cheliyA
| Title | యేమొ చెలియా | yEmo cheliyA |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కమాస్ | kamAs |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | యేమొ చెలియా మోసమాయె యేమి చేతునే ఓ చెలియా నేనేమి చేతునే చెలియా నేనేమి చేతునే | yEmo cheliyA mOsamAye yEmi chEtunE O cheliyA nEnEmi chEtunE cheliyA nEnEmi chEtunE |
| చరణం charaNam 1 | ప్రేమ పాత్రుడైన సామి యిక యేమొ దయలేక సుందరాంగుడైన నా సఖుడెందుకో రాడాయెనయ్యో | prEma pAtruDaina sAmi yika yEmo dayalEka sundarAnguDaina nA sakhuDendukO rADAyenayyO |
| చరణం charaNam 2 | గరపురీశుడైన (?) సామి కరుణ తోనె నాదు కరము బట్టి సరస మాడి మరులు చేసి పోయెనయ్యో | garapurISuDaina (?) sAmi karuNa tOne nAdu karamu baTTi sarasa mADi marulu chEsi pOyenayyO |
#793 మగడొచ్చి magaDochchi
| Title | మగడొచ్చి | magaDochchi |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | మగడొచ్చి పిలచేడు పోయి వత్తుర ప్రీతి మరువ కుండుర నా సామి | magaDochchi pilachEDu pOyi vattura prIti maruva kunDura nA sAmi |
| చరణం charaNam 1 | పగవారు జూచిన పలు విధముల నన్ను నగుబాటు జేతురు వగపూల బాలను నా | pagavAru jUchina palu vidhamula nannu nagubATu jEturu vagapUla bAlanu nA |
| చరణం charaNam 2 | సరసాన నీ వదనము అర నిమిష మైనను దర్శించకుంటె భరియింప ప్రాణముల్ | sarasAna nI vadanamu ara nimisha mainanu darSinchakunTe bhariyimpa prANamul |
| చరణం charaNam 3 | సరగూన వచ్చి నీ పరితాప మార్చెద నెరదాత వైనట్టి వరద వేణుగోపాల | saragUna vachci nI paritApa mArcheda neradAta vainaTTi varada vENugOpAla |
#792 నా హృదయ nA hRdaya
| Title | నా హృదయ | nA hrudaya |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | నా హృదయ ఫలకమున యా నాతి రూపు రేఖా విలాసములు నాటి పోయెగా | nA hRdaya phalakamuna yA nAti rUpu rEkhA vilAsamulu nATi pOyegA |
| చరణం charaNam 1 | చీమ చిటుకుమన్న మరల చెలియ వచ్చెనని యెంతొ యేమేమో తీరుల నెంచు చుంటినిగా | chIma chiTukumanna marala cheliya vachchenani yento yEmEmO tIrula nenchu chunTinigA |
| చరణం charaNam 2 | ఆ హొయలును ఆ నడలు ఆ పలుకులు ఆ కులుకులు ఆహా నా మదికి మరపు రాక యుండెగా | A hoyalunu A naDalu A palukulu A kulukulu AhA nA madiki marapu rAka yunDegA |
#791 చెఱగు మాసె che~ragu mAse
| Title | చెరగు మాసె | cheragu mAse |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | చెఱగు మాసె నేమి సేతురా దరి జేరనైన వీలు గాదురా కొఱమాలిన దైవమక్కట నెలకు సరిగ మూడు నాళ్ళు చెలితనము చూడరాదు | che~ragu mAse nEmi sEturA dari jEranaina vIlu gAdurA ko~ramAlina daivamakkaTa nelaku sariga mUDu nALLu chelitanamu chUDarAdu |
| చరణం charaNam 1 | మురిపెము గల మొదటి రతిలో ముచ్చటైన దీర లేదు మరి యొక తరి కూడుదమని మురియుచుండ నింతలోనె | muripemu gala modaTi ratilO muchchaTaina dIra lEdu mari yoka tari kUDudamani muriyuchunDa nintalOne |
| చరణం charaNam 2 | మృదుల హృదయ నౌపురీశ మదిని చింత యింతగాదు మరిచెద రెండ్నాళ్ళకు నీ ముదము తీర కలియు దాన | mRdula hRdaya naupurISa madini chinta yintagAdu maricheda renDnALLaku nI mudamu tIra kaliyu dAna |
#790 శివ దీక్షా Siva dIkshA
| Title | శివ దీక్షా | Siva dIkshA |
| Written By | ఘనం శీనయ్య | ghanam SInayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కురంజి | |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | శివ దీక్షా పరురాలనురా యేర | Siva dIkshA parurAlanurA yEra |
| అనుపల్లవి anupallavi | శీలమంతైనన్ విడువ జాలనురా నే శీలమంతైనన్ విడువ జాలనురా | SIlamantainan viDuva jAlanurA nE SIlamantainan viDuva jAlanurA |
| చరణం charaNam 1 | శివశివ గురునాజ్ఞ మీరనురా నే శ్రీ వైష్ణవుడంటె చేరనురా | SivaSiva gurunAjna mIranurA nE SrI vaishNavuDanTe chEranurA |
| చరణం charaNam 2 | వడిగ వచ్చి మఠము చొరవకురా శివార్చన వేళ తలుపు తెరవకురా మడుగు దాన్ని శరగు ముట్టకురా మాటిమాటికి నోరు మూయకురా | vaDiga vachchi maThamu choravakurA SivArchana vELa talupu teravakurA maDugu dAnni Saragu muTTakurA mATimATiki nOru mUyakurA |
| Dance video at | https://www.youtube.com/watch?v=uu_sxwbrbnk |
Edited on 10 Dec 2025 : https://guruguha.org/tag/siva-deeksha/ says this jAvaLi was composed by Ghanam Seenayya. Adi tALa also mentioned there. Added dance video link. The mentioned page has a few audio recordings too
Edited on 11 Dec 2025 – found 2 more ‘complete’ lyrics at https://www.octavesonline.com/post/shiva-diksaparu-p-lyrics and https://www.rasikas.org/forums/viewtopic.php?p=363055#p363055
| Title | శివ దీక్షా | Siva deekshA |
| Written By | ఘనం శీనయ్య | ghanam SInayya |
| Book | ||
| రాగం rAga | కురంజి | kuranji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | శివ దీక్షా పరురాలనురా నే శీలమెంతైన విడువజాలనురా | Siva dIkshA parurAlanurA nE SIlamentaina viDuvajAlanurA |
| అనుపల్లవి anupallavi | శివశివా గురునాజ్ఞ మీరనురా నే శ్రీ వైష్ణవుడంటే చేరనురా | SivaSivA gurunAjna mIranurA nE SrI vaishNavuDanTE chEranurA |
| చరణం charaNam 1 | వడిగ వచ్చి మఠము జొరవకురా శివార్చన వేళ తలుపు దెరవకురా మడుగు కావి చెరగు దియ్యకురా నన్ను మాటి మాటికి నోరుముయ్యకురా (*OR* మాటిమాటికి నీవు నోరు మూయకురా) | vaDiga vacchi maThamu joravakurA SivArchana vELa talupu deravakurA maDugu kAvi cheragu diyyakurA nannu mATi mATiki nOrumuyyakurA (*OR* mATimATiki nIvu nOru mUyakurA) |
| చరణం charaNam 2 | పంచాక్షరీ జప శీలనురా కూకి పలుకులు నే విన జాలనురా కొంచెపు వగలు నే నెంచనురా నీకె మ్రొక్కెదు రుద్రాక్ష సరులు తెంచకురా | panchAksharI japa SIlanurA kUki palukulu nE vina jAlanurA konchepu vagalu nE nencanurA nIke mrokkedu rudrAksha sarulu tenchakurA |
| చరణం charaNam 3 | అబ్బ (అజ్జ?) జూచి చన్ను లదమకురా నా సజ్జను గొలుసు బట్టి గదియకు రా బుజ్జగించకు పసిగోలనురా నా కెమ్మోవి నొక్కకు భక్తురాలనురా | abba (ajja?) jUci channu ladamakurA nA sajjanu golusu baTTi gadiyaku rA bujjaginchaku pasigOlanurA nA kemmOvi nokkaku bhakturAlanurA |
| చరణం charaNam 4 | మోము మోమును బట్టి జేర్చకురా నీ నామము తోడ బూతి గూర్చకురా వేమరు తొడ భిక్ష వేడకురా పోపోరా మన్నారు రంగమల్లాడకురా | mOmu mOmunu baTTi jErchakurA nI nAmamu tODa bUti gUrchakurA vEmaru toDa bhiksha vEDakurA pOpOrA mannAru rangamallADakurA |