#789 మోహనాంగి mOhanAngi

TitleమోహనాంగిmOhanAngi
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaతోడిtODi
తాళం tALa
పల్లవి pallaviమోహనాంగి మదన రేఖ పీల కుంతలాmOhanAngi madana rEkha pIla kuntalA
చరణం
charaNam 1
రావె వేగ కౌగిలీవె రాజ సుందరీrAve vEga kaugilIve rAja sundarI
చరణం
charaNam 2
మోము మోము కదియ జేర్చి ముద్దొసంగవేmOmu mOmu kadiya jErchi muddosangavE
చరణం
charaNam 3
ఏల నాలసించెదవె తాళ జాలనెEla nAlasinchedave tALa jAlane

#788 మోడి జేసే mODi jEsE

Titleమోడి జేసేmODi jEsE
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకమాచ్kamAch
తాళం tALa
Previously Published At719, 707, 676
పల్లవి pallaviమోడి జేసే వేలరా యీడుకాడ
నే పాడి సరస మాడి నీతో ముద్దాడినాను
mODi jEsE vElarA yIDukADa
nE pADi sarasa mADi nItO muddADinAnu
చరణం
charaNam 1
వయ్యారి మాటలతో సయ్యాట లాడుచును
మోహాన రా ప్రియ యన నిన్నే చేయీడ్చితి
vayyAri mATalatO sayyATa lADuchunu
mOhAna rA priya yana ninnE chEyIDchiti
చరణం
charaNam 2
తాళ వశమొ మొర లాలించి నాతొ
సమ కేళిం గలసి దేలించుమ గోరితి
tALa vaSamo mora lAlinchi nAto
sama kELim galasi dElinchuma gOriti

#787 కొమ్మరొ వాని kommaro vAni

Titleకొమ్మరొ వానిkommaro vAni
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకమాచ్kamAch
తాళం tALa
Previously Published At644
పల్లవి pallaviకొమ్మరొ వానికెంత బిగువె
పిలచిన పలుకడు యేమి చేతునే
kommaro vAnikenta biguve
pilachina palukaDu yEmi chEtunE
చరణం
charaNam 1
సదయుడురో దానాడుచు పోట్లాడి తిరిగి
తిరిగి నన్ చూచుచు పొమ్మనే
sadayuDurO dAnADuchu pOTlADi tirigi
tirigi nan chUchuchu pommanE
చరణం
charaNam 2
తాండవ కృష్ణుడు తగిన వల్లభుడు
దారిలో జూచి నన్ తాకి పోయెనే
tAnDava kRshNuDu tagina vallabhuDu
dArilO jUchi nan tAki pOyenE

#786 ఊరకె పక్కకు Urake pakkaku

Titleఊరకె పక్కకుUrake pakkaku
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviఊరకె పక్కకు రమ్మంటె వచ్చునా
ఊరివారి పడుచు
Urake pakkaku rammanTe vachchunA
UrivAri paDuchu
అనుపల్లవి anupallaviఏరా దాని జూచి ఎంతెంతొ ఏచేవు
ఎంచరాని దెల్ల ఎంచితె ఏమౌనో
ErA dAni jUchi entento EchEvu
encharAni della enchite EmaunO
చరణం
charaNam 1
మమత తోను ఆ మగువను చేయి బట్టి
మాటిమాటికి మళ్ళీ వచ్చేవురా
విడరాదు దాశరథి రాముడు మును
విలు ద్రుంచి సీతను పెళ్ళాడ లేదా
mamata tOnu A maguvanu chEyi baTTi
mATimATiki maLLI vachchEvurA
viDarAdu dASarathi rAmuDu munu
vilu drunchi sItanu peLLADa lEdA

#785 సఖియ వినుమా sakhiya vinumA

Titleసఖియ వినుమాsakhiya vinumA
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఇంగ్లీషు మెట్టుinglIshu meTTu
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviసఖియ వినుమా సరిగ చనుమా
సఖుని రమ్మనుమా
sakhiya vinumA sariga chanumA
sakhuni rammanumA
అనుపల్లవి anupallaviసఖుని రమ్మనుమా ఇంత జాలమేలమ్మా
ఇంత జాలమేలమ్మా నే సైపలేనమ్మా
sakhuni rammanumA inta jAlamElammA
inta jAlamElammA nE saipalEnammA
చరణం
charaNam 1
పంచ శరము డెద పొంచి
శరముల మించి వేసె గదే
మించి వేసె గదే సహించ రాదు గదే
సహించ రాదు గదే ప్రేమించడాయె గదే
pancha Saramu Deda ponchi
Saramula minchi vEse gadE
minchi vEse gadE sahincha rAdu gadE
sahincha rAdu gadE prEminchaDAye gadE
చరణం
charaNam 2
సవతి మాటలు చాల విని
నను చౌక జేసె గదే
చౌక జేసె గదే నాపై చలము బూనె గదే
చలము బూనె గదే మోసంబు జేసె గదే
savati mATalu chAla vini
nanu chauka jEse gadE
chauka jEse gadE nApai chalamu bUne gadE
chalamu bUne gadE mOsambu jEse gadE
చరణం
charaNam 3
వసుధ మానేపల్లి పురమున వాసి కెక్కె గదే
వాసి కెక్కె గదే నను బాసి పోయె గదే
బాసి పోయే గదే గోపాల స్వామి గదే
vasudha mAnEpalli puramuna vAsi kekke gadE
vAsi kekke gadE nanu bAsi pOye gadE
bAsi pOyE gadE gOpAla svAmi gadE

#784 రాజహంస rAjahamsa

TitleరాజహంసrAjahamsa
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఇంగ్లీషు మెట్టుinglIshu meTTu
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviరాజహంస యానరా
రారార మా మనోహరా
rAjahamsa yAnarA
rArAra mA manOharA
అనుపల్లవి anupallaviరాజముఖి పిలువనంపె
రాజ సంబంధి యేలరా
రామ నీకై వేచెరా
రారమ్ము వైలంబేలరా
rAjamukhi piluvanampe
rAja sambandhi yElarA
rAma nIkai vEcherA
rArammu vailambElarA
చరణం
charaNam 1
అందరిలో నీవె చాలా
అందగాడని కోరెరా
పొందుమా మా నాతిని
చలమందు నీకది ఏలరా
andarilO nIve chAlA
andagADani kOrerA
pondumA mA nAtini
chalamandu nIkadi ElarA
చరణం
charaNam 2
వసుధలో సద్భక్తులకు
వరములియ్యు మానేపల్లి
వాసుడవై యున్న
శ్రీ గోపాల బాల ఏలరా
vasudhalO sadbhaktulaku
varamuliyyu mAnEpalli
vAsuDavai yunna
SrI gOpAla bAla ElarA

#783 సమయమిదె samayamide

Titleసమయమిదెsamayamide
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALa
పల్లవి pallaviసమయమిదె యనుచు
నిన్ను చాల బ్రతిమాలితిర
సుమ శరుని శరములకు
సొక్కి యుంటినేర రారా
samayamide yanuchu
ninnu chAla bratimAlitira
suma Saruni Saramulaku
sokki yunTinEra rArA
చరణం
charaNam 1
మల్లె పందిరి దరిని జేరి
మలయ మారుతము వీవగ
చల్లగా బిలహరి రాగము
కోర్కె దీర పాడెద రార
malle pandiri darini jEri
malaya mArutamu vIvaga
challagA bilahari rAgamu
kOrke dIra pADeda rAra
చరణం
charaNam 2
విరి పాన్పున జేరి నీతో
విరివిగ చౌశీతి బంధముల్
జూపించి మెప్పించి
కరగించెద కఠిన మనసు
viri pAn&puna jEri nItO
viriviga chauSIti bandhamul
jUpinchi meppinchi
karagincheda kaThina manasu
చరణం
charaNam 3
వాసిగ అభినవ భూతపురి
ఈశ రామశర్మ పోష
దోసిలొగ్గి వేడెద రార
దుఃఖంబును బాపుట కిదె
vAsiga abhinava bhUtapuri
ISa rAmaSarma pOsha
dOsiloggi vEDeda rAra
du@hkhambunu bApuTa kide

#782 అన్యాయముగా anyAyamugA

Titleఅన్యాయముగాanyAyamugA
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviఅన్యాయముగా నే అపవాదు పాలైతి
అతివరో ఏమందునే
anyAyamugA nE apavAdu pAlaiti
ativarO EmandunE
అనుపల్లవి anupallaviమన్నారు రాజ గోపాల స్వామికి నాకు
కన్నెలెల్ల చెలిమి కలదని పలికేరు
mannAru rAja gOpAla svAmiki nAku
kannelella chelimi kaladani palikEru
చరణం
charaNam 1
బోటుల ఎదుటనే పొద్దు వానింటికి పోయి వచ్చినందుకా
ఆటపాటల కొరకు అతని తోడే నేను మాటలాడి నందుకా
ఏటికే ఈ గేలి ఏ పాప మెరుగను
తాటి కింద పాలు త్రావిన చందము
bOTula eduTanE poddu vAninTiki pOyi vachchinandukA
ATapATala koraku atani tODE nEnu mATalADi nandukA
ETikE I gEli E pApa meruganu
tATi kinda pAlu trAvina chandamu

#781 ఏర సామి Era sAmi

Titleఏర సామిEra sAmi
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviఏర సామి సరసకు మరి మరి
పిలిచిన పలుక వేమిరా
Era sAmi sarasaku mari mari
pilichina paluka vEmirA
చరణం
charaNam 1
చిన్న నాడే చెలిమి కోరి యున్న దానరా నాతో
పంతమేల జేసెదవురా నీ
చెంత జేరి యున్నదానరా యేర
మరుబారి కోర్వజాల
మరి మరి వేడితిరా
chinna nADE chelimi kOri yunna dAnarA nAtO
pantamEla jEsedavurA nI
chenta jEri yunnadAnarA yEra
marubAri kOrvajAla
mari mari vEDitirA
చరణం
charaNam 2
కామ శాస్త్ర విభుడవని కలసినానురా నాతో
కయ్యమేల జేసెదవురా యేర
మార్కాపుర వాస నను
కరుణించి బ్రోవరా
kAma SAstra vibhuDavani kalasinAnurA nAtO
kayyamEla jEsedavurA yEra
mArkApura vAsa nanu
karuNinchi brOvarA

#780 తెలిసెనురా నీ telisenurA nI

Titleతెలిసెనురా నీtelisenurA nI
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaసావేరిsAvEri
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviతెలిసెనురా నీ తెరగెల్లను
నేడు చక్క తెలిసెనురా
telisenurA nI teragellanu
nEDu chakka telisenurA
అనుపల్లవి anupallaviఎలిమిని నన్నేలి ప్రాణేశ శ్రీ వెంకటేశ
తలపున నన్నెంచ లేదా తప్పు తంట లెల్ల నేడు
elimini nannEli prANESa SrI venkaTESa
talapuna nannencha lEdA tappu tanTa lella nEDu
చరణం
charaNam 1
మాటల పస దానింట మౌనంబు నా యింటmATala pasa dAninTa maunambu nA yinTa
చరణం
charaNam 2
ఆట పాట దానింట అలుకలు నా యింటATa pATa dAninTa alukalu nA yinTa
చరణం
charaNam 3
జూటు వగలు నా యింట సొగసెల్లను దానింటjUTu vagalu nA yinTa sogasellanu dAninTa
చరణం
charaNam 4
నాటకములు నా యింట నమ్మికెల్ల దానింటnATakamulu nA yinTa nammikella dAninTa