| Title | భామరో సామినీ | bhAmarO sAminI |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | భామరో సామినీ బాసి యుండలేనూ | bhAmarO sAminI bAsi yunDalEnU |
| చరణం charaNam 1 | యేమని దెల్పుదూ యే చోట నున్నాడో మమతెందు బోయనో మనుపరో సామికి | yEmani delpudU yE chOTa nunnADO mamatendu bOyanO manuparO sAmiki |
| చరణం charaNam 2 | సదయుని ప్రేమా సతమని యుంటినె సుదతుల పాలాయ చెలియరో నేడూ | sadayuni prEmA satamani yunTine sudatula pAlAya cheliyarO nEDU |
| చరణం charaNam 3 | మాటలు మధురము మంగళపురి వాసునికి యేటి ప్రేమలే యిది యేమని జెపుదు | mATalu madhuramu mangaLapuri vAsuniki yETi prEmalE yidi yEmani jepudu |
Tag: Telugu
#750 సామి యిందు sAmi yindu
| Title | సామి యిందు | sAmi yindu |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 400 | |
| పల్లవి pallavi | సామి యిందు రాడాయ సకియరొ తోడి త్యావే | sAmi yindu rADAya sakiyaro tODi tyAvE |
| చరణం charaNam 1 | మోహమెటు దాతునె ముదితారో యీ వ్యాళ మోహనాంగుడు రాడె మరచెనెమొ చెలియ | mOhameTu dAtune muditArO yI vyALa mOhanAnguDu rADe marachenemo cheliya |
| చరణం charaNam 2 | వలచిన వ్యాళలో వెలదిరో నన్ను తలచక యున్నాడు తరుణిరొ నేడు | valachina vyALalO veladirO nannu talachaka yunnADu taruNiro nEDu |
| చరణం charaNam 3 | మగువరొ నేడు మంగళ పురీశునికి తగునె యీ నడత తలచక యున్నాడు | maguvaro nEDu mangaLa purISuniki tagune yI naData talachaka yunnADu |
#749 సరగున నిటురారా saraguna niTurArA
| Title | సరగున నిటురారా | saraguna niTurArA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | యమన్ | yaman |
| తాళం tALa | తిశ్ర లఘువు | tiSra laghuvu |
| Previously Posted At | 444 | |
| పల్లవి pallavi | సరగున నిటురారా మరియాదటరా వినురా మరుని బారి కోర్వలేక మరులైతిరా సామి నీకు సరివారలు నవ్వగ జేయుట న్యాయము గాదుర నే నెఱనమ్మిన దాననురా | saraguna niTurArA mariyAdaTarA vinurA maruni bAri kOrvalEka marulaitirA sAmi nIku sarivAralu navvaga jEyuTa nyAyamu gAdura nE ne~ranammina dAnanurA |
| చరణం charaNam 1 | బాస లొసగి ఇటు నను నెడబాయ నగునా నను నెడబాయ నగునా మోస మెందుకు చేసేవురా మది నెంచర యీ తనువే నీ సొమ్ముగ చేకొనరా | bAsa losagi iTu nanu neDabAya nagunA nanu neDabAya nagunA mOsa menduku chEsEvurA madi nenchara yI tanuvE nI sommuga chEkonarA |
| చరణం charaNam 2 | ప్రాణ నాథ రాజగోపాల చలమా రాజగోపాల మాన మెంచ వదేమిర నా యెడ నేరము లేమిర నే నిను జూడక తాళనురా | prANa nAtha rAjagOpAla chalamA rAjagOpAla mAna mencha vadEmira nA yeDa nEramu lEmira nE ninu jUDaka tALanurA |
#748 సరిగ కొంగు sariga kongu
| Title | సరిగ కొంగు | sariga kongu |
| Written By | ఘనం కృష్ణ అయ్యర్ | ghanam kRshNa ayyar |
| Book | https://karnatik.com/c18059.shtml | |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సరిగ కొంగు ముసుగు దానితో వాడు సైగ జేసినది కంటివేమో | sariga kongu musugu dAnitO vADu saiga jEsinadi kanTivEmO |
| చరణం charaNam 1 | తిరిగి తిరిగి జూచుకొని సొగసుగ దేవుడైన మన్నారు రంగడు | tirigi tirigi jUchukoni sogasuga dEvuDaina mannAru rangaDu |
| Audio Links | https://soundcloud.com/gnanaprasuna-vudali/sariga-kongu-musugudani-sung https://www.youtube.com/watch?v=J_XUkpfoUtE |
#747 సొగసు కాడా sogasu kADA
| Title | సొగసు కాడా | sogasu kADA |
| Written By | చత్రపురి | chatrapuri |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 96 | |
| పల్లవి pallavi | సొగసు కాడా నీ వగలు మాని రారా | sogasu kADA nI vagalu mAni rArA |
| చరణం charaNam 1 | తగదురా యిటు సేయా పగతి జాణారాయా | tagadurA yiTu sEyA pagati jANArAyA |
| చరణం charaNam 2 | తుమ్మెద లొక్కాసారి ఝుమ్మ ఝుమ్మని మ్రోయా సమ్మ దూడయి మరూడమ్ములు నేయ తాళా | tummeda lokkAsAri jhumma jhummani mrOyA samma dUDayi marUDammulu nEya tALA |
| చరణం charaNam 3 | చక్కగా కౌగాలించి చెక్కిలీ ముద్దూలిడి చక్కెరా కెమ్మోవి నొక్క నివ్వరా నేడు | chakkagA kaugAlinchi chekkilI muddUliDi chakkerA kemmOvi nokka nivvarA nEDu |
#746 మై డియర్ కమ్ my dear come
| Title | మై డియర్ కమ్ | my dear come |
| Written By | కరూర్ శివరామయ్య | karUr SivarAmayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | మై డియర్ కమ్ వరువాయ్ యీ వేళ | my dear come varuvAy yI vELa |
| చరణం charaNam 1 | నిన్ను జూచి చాల దివస ఆయెతె నీ నా మనసు యింపైన కాల హరణ మింక బెల తింగళు బసల్ల వాయితె కులుకు తళుకు గల కమ్ బిరాన వెల్ ఐ షల్ సింగ్ శివరాముని సాంగ్స్ | ninnu jUchi chAla divasa Ayete nI nA manasu yimpaina kAla haraNa minka bela tingaLu basalla vAyite kuluku taLuku gala kam&^ birAna well I shall sing SivarAmuni songs |
చతుర్భాషా జావళి chaturbhAshA jAvaLi – words from Telugu, Tamil, Kannada, and English appear in the lyrics. ఈ జావళిలో తెలుగు, తమిళం, కన్నడ, మరియు ఆంగ్ల భాషా పదాలు ఉన్నాయి.
#745 వలపు తాళ valapu tALa
| Title | వలపు తాళ | valapu tALa |
| Written By | స్వాతి తిరునాళ్ | svAti tirunAL |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | అఠాణ | aTHANa |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | వలపు తాళ వశమా నా సామికి చలము సేయ న్యాయమా | valapu tALa vaSamA nA sAmiki chalamu sEya nyAyamA |
| అనుపల్లవి anupallavi | అలరు విల్తుని సమానుడౌ శ్రీ పద్మనాభుడు నెలత ఇపుడు నిన్ను నిరాకరించెనే | alaru viltuni samAnuDau SrI padmanAbhuDu nelata ipuDu ninnu nirAkarinchenE |
| చరణం charaNam 1 | చిరుత ప్రాయము నాడే చిగురు బోణి వాని కరుణా సాగరుడని కలికి చాల నమ్మితి మరుని బాణము చాత మగువ నా మనసెంతో పరవశ మాయెనే భాగ్య మిటు లాయెనే | chiruta prAyamu nADE chiguru bONi vAni karuNA sAgaruDani kaliki chAla nammiti maruni bANamu chAta maguva nA manasentO paravaSa mAyenE bhAgya miTu lAyenE |
| చరణం charaNam 2 | ఇలను నా ప్రాణేశు డే మానినితో గూడి జలజాక్షి మితి మీరి సరసా లాడు చున్నాడో పలుమారు నను జూచి పలుకు లాడిన దెల్ల తెలియ వచ్చెనే ఓ చెలియరో ఈ వేళ | ilanu nA prANESu DE mAninitO gUDi jalajAkshi miti mIri sarasA lADu chunnADO palumAru nanu jUchi paluku lADina della teliya vachchenE O cheliyarO I vELa |
| చరణం charaNam 3 | సోమ కిరణము చాత సొగసైన నిన్నటి రేయి రామ రామ నాకు రమణి యుగ మాయెనే కామకేళిలో నన్ను కలసి యుండిన విభుడు నా మీద నున్న నెనరు నాతి మరచె నేమో | sOma kiraNamu chAta sogasaina ninnaTi rEyi rAma rAma nAku ramaNi yuga mAyenE kAmakELilO nannu kalasi yunDina vibhuDu nA mIda nunna nenaru nAti marache nEmO |
#744 ఇంత మోడి inta mODi
| Title | ఇంత మోడి | inta mODi |
| Written By | స్వాతి తిరునాళ్ | svAti tirunAL |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | ఇంత మోడి యాలర నా సామి నన్నేలుకోర వేగమే | inta mODi yAlara nA sAmi nannElukOra vEgamE |
| అనుపల్లవి anupallavi | పంతమా నాపై శ్రీ పద్మనాభ సామి | pantamA nApai SrI padmanAbha sAmi |
| చరణం charaNam 1 | అలిగి యుండుటకు అయ్యో ఏమి కారణ మయ్యలూ నా మీదరా తలిరుబోణులు నీకేమి బోధించిరో తాళరాదు విరహ మీవేళ సామి | aligi yunDuTaku ayyO Emi kAraNa mayyalU nA mIdarA talirubONulu nIkEmi bOdhinchirO tALarAdu viraha mIvELa sAmi |
| చరణం charaNam 2 | క్షణము యుగ మాయెనే నాపై నీకు కరుణ లేక పోయెనే పణతు లందరు నన్ను జూచి నవ్వేరు ప్రాణ నాథుడ నిన్నే నమ్మినాను | kshaNamu yuga mAyenE nApai nIku karuNa lEka pOyenE paNatu landaru nannu jUchi navvEru prANa nAthuDa ninnE namminAnu |
| చరణం charaNam 3 | సోము డనల మాయెనే నీతో గూడి సురత సుఖము లేని కాముని కన్న చక్కని పద్మనాభ కౌగిలించి కలయరా నాసామి | sOmu Danala mAyenE nItO gUDi surata sukhamu lEni kAmuni kanna chakkani padmanAbha kaugilinchi kalayarA nAsAmi |
#743 సారమైన sAramaina
| Title | సారమైన | sAramaina |
| Written By | స్వాతి తిరునాళ్ | svAti tirunAL |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | బిహాగ్ | bihAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Published At | 713 | |
| పల్లవి pallavi | సారమైన మాటలంత చాలు చాలురా సామి | sAramaina mATalanta chAlu chAlurA sAmi |
| అనుపల్లవి anupallavi | సారసాక్ష మీకెంతో సంతోషము మేలు మేలు | sArasAksha mIkentO santOshamu mElu mElu |
| చరణం charaNam 1 | సోము డుదయ మాయెనే మీ సుదతికి మహా భయ మాయెనే కామ కోటి సుందరా మా భాగ్య మిటు లాయెనే | sOmu Dudaya mAyenE mI sudatiki mahA bhaya mAyenE kAma kOTi sundarA mA bhAgya miTu lAyenE |
| చరణం charaNam 2 | మరునాథుని శర భంగము గావోదూ నీకు మాయందు దయ కానరాద విరహమైన వారధిలో మునికాయుందానన్నతో | marunAthuni Sara bhangamu gAvOdU nIku mAyandu daya kAnarAda virahamaina vAradhilO munikAyundAnannatO |
| చరణం charaNam 3 | మనవి వినర సామి నిన్ను నమ్మియున్నాను మరేమి ఘనుడైన శేషునిపై వెలయు శ్రీ పద్మనాభ | manavi vinara sAmi ninnu nammiyunnAnu marEmi ghanuDaina SEshunipai velayu SrI padmanAbha |
#740 నిన్ను బాసి ninnu bAsi
| Title | నిన్ను బాసి | ninnu bAsi |
| Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
| Book | జావళి రవళి | jAvaLi ravaLi |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Published At | 381 | |
| పల్లవి pallavi | నిన్ను బాసి నిమిషమైన నేనెంటు జీవింతును రామ | ninnu bAsi nimishamaina nEnenTu jIvintunu rAma |
| చరణం charaNam 1 | నన్ను విడచుట న్యాయమా నీకు నా పాలి దేవ వాసుదేవ | nannu viDachuTa nyAyamA nIku nA pAli dEva vAsudEva |
| చరణం charaNam 2 | నీ మనసు కరగదేమిరా నీ పాదములనే నమ్మితిని | nI manasu karagadEmirA nI pAdamulanE nammitini |
| చరణం charaNam 3 | కన్న తండ్రి నాపై కరుణ జూపురా నిన్నే కోరియున్న వాడనురా | kanna tanDri nApai karuNa jUpurA ninnE kOriyunna vADanurA |