#667 ఏ కామిని E kAmini

Titleఏ కామినిE kAmini
Written Byబెంగుళూరు చంద్రశేఖర శాస్త్రిbenguLUru chandraSEkhara SAstri
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaనాటకురంజిnATakuranji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏ కామిని బోధించెనోE kAmini bOdhinchenO
అనుపల్లవి anupallaviఏమి తెలియని నా సామి కిపుడుEmi teliyani nA sAmi kipuDu
చరణం
charaNam 1
పాటలాధరి యేపాటున నున్న నా
మాట లెపుడు జవ దాటని వాని
pATalAdhari yEpATuna nunna nA
mATa lepuDu java dATani vAni
చరణం
charaNam 2
తోయజ ముఖీ నిన్ బాయగలనా
యని రేయి బగలు నెడ బాయని వాని
tOyaja mukhI nin bAyagalanA
yani rEyi bagalu neDa bAyani vAni
చరణం
charaNam 3
ముందు నన్నేలి యానందము జెందిన
సుందరుడౌ బాలచంద్ర నా సామి
mundu nannEli yAnandamu jendina
sundaruDau bAlachandra nA sAmi

#666 ఇటు సాహసములు iTu sAhasamulu

Titleఇటు సాహసములుiTu sAhasamulu
Written Byస్వాతి తిరునాళ్ మహారాజాsvAti tirunAL mahArAjA
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసైంధవిsaindhavi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఇటు సాహసములు ఏల నాపై చక్కని సామిiTu sAhasamulu Ela nApai chakkani sAmi
అనుపల్లవి anupallaviఇట్లు వగలు తాళ నా తరమాiTlu vagalu tALa nA taramA
చరణం
charaNam 1
ఇక చిన్న దాన నేను మగవారిని
ముఖము ఎరుగ నే యున్నాన వగ
కాసారి నీకిది మేరగాదే
వలపు న్యాయ మెరుగు నా సామి
ika chinna dAna nEnu magavArini
mukhamu eruga nE yunnAna vaga
kAsAri nIkidi mEragAdE
valapu nyAya merugu nA sAmi
చరణం
charaNam 2
మనసు రంజితమయ్యే నీకు తగిన
మగువతో ఈ వగలుంచ వలను
వినవయ్యా నాపలుకులు ఈ వేళను
వింతలు చాలు నా సామి
manasu ranjitamayyE nIku tagina
maguvatO I vagaluncha valanu
vinavayyA nApalukulu I vELanu
vintalu chAlu nA sAmi
చరణం
charaNam 3
సరసిజ నేత్రుడ నీ కరుణ
వల్ల చాల యవ్వనము వచ్చె
నాడు మరుకేళి లోనే నిను లాలించుదును
సరస పంకజ నాభ నా సామి
sarasija nEtruDa nI karuNa
valla chAla yavvanamu vachche
nADu marukELi lOnE ninu lAlinchudunu
sarasa pankaja nAbha nA sAmi
My mother remembers slightly different lyrics from her learning as a singer.

#665 పాయరాని pAyarAni

TitleపాయరానిpAyarAni
Written Byతిరుపతి విద్యల నారాయణస్వామిtirupati vidyala nArAyaNasvAmi
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviపాయరాని బాళిచే భామ నంపిన రావుpAyarAni bALichE bhAma nampina rAvu
అనుపల్లవి anupallaviకాయజుని బారికి కరిగి చింత నొంది
బిగి కౌగిట జేర్తువని ప్రీతి యేల తలప వలదే
kAyajuni bAriki karigi chinta nondi
bigi kaugiTa jErtuvani prIti yEla talapa valadE
చరణం
charaNam 1
నాడే నిను కోరిన (చిన) చెలియ నెట్లు సైతురా
ఎన్నడైన నీమాట కెదురాడి యుంటే
సన్నుతాంగ తిరుపతి పుర నివాస వేంకటేశ
nADE ninu kOrina (china) cheliya neTlu saiturA
ennaDaina nImATa kedurADi yunTE
sannutAnga tirupati pura nivAsa vEnkaTESa
Audio Linkhttps://www.youtube.com/watch?v=XW-YowkKes0 (Some differences in lyrics)
https://www.youtube.com/watch?v=a1bMqQMtTQA

#664 వగలాడి vagalADi

TitleవగలాడిvagalADi
Written Byతిరుపతి విద్యల నారాయణస్వామిtirupati vidyala nArAyaNasvAmi
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviవగలాడి బోధనలకు వలచితివో సామి – ఆvagalADi bOdhanalaku valachitivO sAmi – A
అనుపల్లవి anupallaviపగటి మోసకత్తె యని పలుమారులు వినివిని ఆpagaTi mOsakatte yani palumArulu vinivini A
చరణం
charaNam 1
పడక టింటిలో పదుగురనే పదిల పరచి యుండేpaDaka TinTilO paduguranE padila parachi yunDE
చరణం
charaNam 2
సరసుని కా చాన పొందు విరస మౌనని యెంచి
తిరుపతి పుర వేంకటేశ తెలియక నేడు
sarasuni kA chAna pondu virasa mounani yenchi
tirupati pura vEnkaTESa teliyaka nEDu

#663 కలగన్నటు kalagannaTu

Titleకలగన్నటుkalagannaTu
Written Byరామనాధపురం శ్రీనివాసయ్యంగార్rAmanAdhapuram SrInivAsayyamgAr
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaకేదార గౌళkEdAra gauLa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviకల గన్నటు లాయరా కామజనకkala gannaTu lAyarA kAmajanaka
అనుపల్లవి anupallaviజల తీరమున నన్ను అలయించి వలపించి
గులుకు గొప్పుననంటి పలుకరించు కొన్నది
jala tIramuna nannu alayinchi valapinchi
guluku goppunananTi palukarinchu konnadi
చరణం
charaNam 1
జలజాక్షి వేసమిడి చెలులతో కూడికొని
ఇలుజొచ్చి కలకంఠి వలె పలుకుల నుంచి
కలవారలను పలు కలలచే మెప్పించి
పలుమారు నను యేచి మనసు దోచిన దెల్ల
jalajAkshi vEsamiDi chelulatO kUDikoni
ilujochchi kalakanThi vale palukula nunchi
kalavAralanu palu kalalachE meppinchi
palumAru nanu yEchi manasu dOchina della
చరణం
charaNam 2
నిను పాడమని చాల చనవున బల్కిన
తన నాథుని యటు దాపున తొలగించి
కనరాని వింతల కాలము గడిపించి
నను పాడి పలుమారు మనసు దోచిన దెల్ల
ninu pADamani chAla chanavuna balkina
tana nAthuni yaTu dApuna tolaginchi
kanarAni vintala kAlamu gaDipinchi
nanu pADi palumAru manasu dOchina della
చరణం
charaNam 3
వేదాంతమున గల నాదాత్మకుడైన జగ
న్నాధ గోప కన్యా వినోద జగన్మోహన
కాదా నన్నేలనిక వాదా శ్రీనివాసుడు
కాదా జాగు సేయకు రాధా రమణ పొందు
vEdAntamuna gala nAdAtmakuDaina jaga
nnAdha gOpa kanyA vinOda jaganmOhana
kAdA nannElanika vAdA SrInivAsuDu
kAdA jAgu sEyaku rAdhA ramaNa pondu

#662 సరసము sarasamu

Titleసరసముsarasamu
Written Byరామనాధపురం శ్రీనివాసయ్యంగార్rAmanAdhapuram SrInivAsayyamgAr
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaహిందుస్థానీ కాపీhindusthAnI kApI
తాళం tALaదేశాదిdESAdi
పల్లవి pallaviసరసము లాడేటందుకు సమయ మిది గాదురా నా సామిsarasamu lADETanduku samaya midi gAdurA nA sAmi
అనుపల్లవి anupallaviవిరసముతో నా ఇంటి వారలున్నారు
విధి తప్పక కనుగొన్న గూడిన వేళ నాతో
virasamutO nA inTi vAralunnAru
vidhi tappaka kanugonna gUDina vELa nAtO
చరణం
charaNam 1
నిగ నిగ వెన్నెల గాయుచున్నది
నిక్కముగా ఇటుల జేసేది నీకు
తగదురా ఈ వీధిలో వచ్చువారు
న్నట్టున్నది నిను చూస్తే నవ్వి తిట్టుదురు గనుక
niga niga vennela gAyuchunnadi
nikkamugA iTula jEsEdi nIku
tagadurA I vIdhilO vachchuvAru
nnaTTunnadi ninu chUstE navvi tiTTuduru ganuka
చరణం
charaNam 2
ఏకాంతముగా జరిగిన సంగతి
ఎంతైన బైట పడేది న్యాయమా
శ్రీకాంత నీకేల ఇంత దూరము
శ్రీనివాసార్చిత బావి నీళ్ళు వెల్లి గొన్నదిరా
EkAntamugA jarigina sangati
entaina baiTa paDEdi nyAyamA
SrIkAnta nIkEla inta dUramu
SrInivAsArchita bAvi nILLu velli gonnadirA
AV Linkhttps://www.youtube.com/watch?v=96T0dEEYTMI

#661 మరులు కొన్నదిరా marulu konnadirA

Titleమరులు కొన్నదిరాmarulu konnadirA
Written Byరామనాధపురం శ్రీనివాసయ్యంగార్rAmanAdhapuram SrInivAsayyamgAr
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
Previously Posted At586
పల్లవి pallaviమరులు కొన్నదిరా మానినీమణి నీపైmarulu konnadirA mAninImaNi nIpai
అనుపల్లవి anupallaviపరిపరి విధముల పరితపించుచు నీపైparipari vidhamula paritapinchuchu nIpai
చరణం
charaNam 1
ధరలో తనకు నీవే తగిన వల్లభుడని
తరుణి మిక్కిలి నిన్ను తలచి తలచి చాలా
dharalO tanaku nIvE tagina vallabhuDani
taruNi mikkili ninnu talachi talachi chAlA
చరణం
charaNam 2
వనజ నేత్రుడౌ శ్రీనివాస నాయక నిన్ను
వల్లగ నీ మాటలు ఎల్లపుడును ఎది
vanaja nEtruDau SrInivAsa nAyaka ninnu
vallaga nI mATalu ellapuDunu edi

#660 నిరుపమాన nirupamAna

TitleనిరుపమానnirupamAna
Written Byరామనాధపురం శ్రీనివాసయ్యంగార్rAmanAdhapuram SrInivAsayyamgAr
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviనిరుపమాన సామిని నా నిలయమునకు రమ్మనవేnirupamAna sAmini nA nilayamunaku rammanavE
అనుపల్లవి anupallaviమరపు లేక నా మనవిని
మగువ వానితో మనసుంచి తెల్పి
marapu lEka nA manavini
maguva vAnitO manasunchi telpi
చరణం
charaNam 1
సదయుడగు నా సామికే సరి
సాటియు లేదనచు చాల
ముదము తోన ముఖ విలాస
మును జూచిచ ముందిచ్చటకు
sadayuDagu nA sAmikE sari
sATiyu lEdanachu chAla
mudamu tOna mukha vilAsa
munu jUchicha mundichchaTaku
చరణం
charaNam 2
మధురిపుడగు శ్రీనివాసుని
మనసు తెలిసి రేపు మాపు
నిదర లేక నా మనవిని
నిధు వనమును జేయుట కిటు
madhuripuDagu SrInivAsuni
manasu telisi rEpu mApu
nidara lEka nA manavini
nidhu vanamunu jEyuTa kiTu

#659 వేగ నీవు vEga nIvu

Titleవేగ నీవుvEga nIvu
Written Byరామనాధపురం శ్రీనివాసయ్యంగార్rAmanAdhapuram SrInivAsayyamgAr
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviవేగ నీవు వాని రమ్మనవే ఓ చెలియvEga nIvu vAni rammanavE O cheliya
అనుపల్లవి anupallaviనాగరికముగ దెలిపి నా వెతలను దీర్చుటకిటుnAgarikamuga delipi nA vetalanu dIrchuTakiTu
చరణం
charaNam 1
దీన దయాకరుడు నాతో దినే దినే మాటలాడి
వీనుల కింపుగ పాడి వినిపించినది ఎటు మరతునే
dIna dayAkaruDu nAtO dinE dinE mATalADi
vInula kimpuga pADi vinipinchinadi eTu maratunE
చరణం
charaNam 2
అందమైన రతి కేళిలో అమితముగా సుఖ పరచిన
మందహాస వదను వినా మరి ఎవరిని దలచలేనే
andamaina rati kELilO amitamugA sukha parachina
mandahAsa vadanu vinA mari evarini dalachalEnE
చరణం
charaNam 3
గాన రసిక శిఖామణిని గానక అర నిమిష ముండను
వానర రక్షకుడౌ శ్రీనివాసునితో వగల దెలిపి
gAna rasika SikhAmaNini gAnaka ara nimisha munDanu
vAnara rakshakuDau SrInivAsunitO vagala delipi
AV Linkhttps://www.youtube.com/watch?v=DQq33AtOVz4

#658 నీ మాట nI mATa

Titleనీ మాటnI mATa
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaపూరి కల్యాణిpUri kalyANi
తాళం tALaమిశ్ర లఘుmiSra laghu
పల్లవి pallaviనీ మాటా లేమాయెనుర! సామి బల్కరnI mATA lEmAyenura! sAmi balkara
అనుపల్లవి anupallaviఏమేమో బోధించి నన్నేమార జేసేవలEmEmO bOdhinchi nannEmAra jEsEvala
చరణం
charaNam 1
చక్కని సామివలె చెక్కిలి నొక్కి రవ మొక్కెర
నీ కిచ్చేనని టక్కులచే సొక్కించిన
chakkani sAmivale chekkili nokki rava mokkera
nI kichchEnani TakkulachE sokkinchina
చరణం
charaNam 2
మాటిమాటికి మరునాటలాడ బిల్చుచు
పాటీలు నే పంపేనని తాటోటముతో నీటిన
mATimATiki marunATalADa bilchuchu
pATIlu nE pampEnani tATOTamutO nITina
చరణం
charaNam 3
జాలము జేసి కలసేలి రతనాల జువికీల జత
పంపేనన్న తాలవన లోల అల
jAlamu jEsi kalasEli ratanAla juvikIla jata
pampEnanna tAlavana lOla ala
AV Linkhttps://www.youtube.com/watch?v=CCvZqFrlaVs
https://www.youtube.com/watch?v=qziLbVQqEes