| Title | మోహమెల్ల | mOhamella |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | మోహన | mOhana |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మోహమెల్ల దెలిసెను గదరా! మోహనాంగ! వినర | mOhamella delisenu gadarA! mOhanAnga! vinara |
| అనుపల్లవి anupallavi | దాహవంతుని సాటి నా గేహమున కేతెంచిన నీ | dAhavantuni sATi nA gEhamuna kEtenchina nI |
| చరణం charaNam 1 | మదిలో వంచనలనే యెంచి వదనమున మాధుర్య ముంచి సుదతిపై నీ నెనరు నుంచి సదయుని తీరు నటించే నీ | madilO vanchanalanE yenchi vadanamuna mAdhurya munchi sudatipai nI nenaru nunchi sadayuni tIru naTinchE nI |
| చరణం charaNam 2 | పరుపుపై నా కరము బట్టి మరువనని నా శిరము గొట్టి సరసమాడి పూలుబట్టి తరుణి నెంచి తత్తరించే నీ | parupupai nA karamu baTTi maruvanani nA Siramu goTTi sarasamADi pUlubaTTi taruNi nenchi tattarinchE nI |
| చరణం charaNam 3 | తాలవలోల నన్ను లాలనతో నేలు వేళ చాల ప్రేమ తోను లేచి యా బాల నేల బోయిన నీ | tAlavalOla nannu lAlanatO nElu vELa chAla prEma tOnu lEchi yA bAla nEla bOyina nI |
| AV Link | https://www.youtube.com/watch?v=sYR09dYazGA https://www.youtube.com/watch?v=BKMGn0SFPBc |
Tag: Telugu
#656 అపదూరుకు apadUruku
| Title | అపదూరుకు | apadUruku |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | అపదూరుకు లోనైతినే చపల చిత్తము చేతనే | apadUruku lOnaitinE chapala chittamu chEtanE |
| అనుపల్లవి anupallavi | ఏ పాపి నాపై దూరెనోగా ఏ పాపము లేక | E pApi nApai dUrenOgA E pApamu lEka |
| చరణం charaNam 1 | వేడుకలు జూడనే ఈడు చెలుల తోడనే కూడి అతని మేడ కేగితే వాడు నా చెలికాడనే | vEDukalu jUDanE IDu chelula tODanE kUDi atani mEDa kEgitE vADu nA chelikADanE |
| చరణం charaNam 2 | సారెకు నా సామిని దారిని కని నవ్వితే జారిణి యని ఊరి వారలు వేరె పేరిడి నన్ను పిల్చుట | sAreku nA sAmini dArini kani navvitE jAriNi yani Uri vAralu vEre pEriDi nannu pilchuTa |
| చరణం charaNam 3 | చిరుత నాటి యుండిన గురుతుచే గుణవంతుడౌ వరద తాళవనేశుని తోడు సరసమాడుచు కూడితినని | chiruta nATi yunDina gurutuchE guNavantuDau varada tALavanESuni tODu sarasamADuchu kUDitinani |
#655 బలిమి ఏల balimi Ela
| Title | బలిమి ఏల | balimi Ela |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | బలిమి ఏల బాళామణి అలవానితో పలుమారు నీకు | balimi Ela bALAmaNi alavAnitO palumAru nIku |
| చరణం charaNam 1 | వాని పిలిచి బల్కేటి హీనత లెల్లను అలివేణు లెరిగిన మన మానములు పోనే | vAni pilichi balkETi hInata lellanu alivENu lerigina mana mAnamulu pOnE |
| చరణం charaNam 2 | ఏమోయని వేమరు నిన్నే నే మానితే నీవు మన నేమ మెరుగక అతి ప్రేమగా మా దొర వినుచు | EmOyani vEmaru ninnE nE mAnitE nIvu mana nEma merugaka ati prEmagA mA dora vinuchu |
| చరణం charaNam 3 | తాళవన లోలుని ఏ వేళ తలచుచు వ్యాకుల పడనేల పలు వాలాయము గాను | tALavana lOluni E vELa talachuchu vyAkula paDanEla palu vAlAyamu gAnu |
#654 తారుమారు tArumAru
| Title | తారుమారు | tArumAru |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | నాటకురంజి | nATakuranji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | తారుమారు లాడేవేమే బజారి | tArumAru lADEvEmE bajAri |
| అనుపల్లవి anupallavi | నేరమెంచకనే కౌగలించ మంటే | nEramenchakanE kaugalincha manTE |
| చరణం charaNam 1 | అంబుజాక్షిరో నే సంబ్రముగ నీదు బింబాధర చుంబనంబు లివ్వమంటే | anbujAkshirO nE sambramuga nIdu bimbAdhara chumbanambu livvamanTE |
| చరణం charaNam 2 | మోడి సేయక నాతోడ బల్కి కడు వేడుకన్ కర్పూర విడెమివ్వమంటే | mODi sEyaka nAtODa balki kaDu vEDukan karpUra viDemivvamanTE |
| చరణం charaNam 3 | ప్రీతి మీరగనే సాదరంబుతో నీదు లేత గుబ్బల నాచేతి కివ్వమంటే | prIti mIraganE sAdarambutO nIdu lEta gubbala nAchEti kivvamanTE |
| చరణం charaNam 4 | తాళలేనే బాలికామణి నీ తాళవనేశుని యేలుకోమంటే | tALalEnE bAlikAmaNi nI tALavanESuni yElukOmanTE |
#653 పారిపోవలెరా pAripOvalerA
| Title | పారిపోవలెరా | pAripOvalerA |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | బిలహరి | bilahari |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 89 | |
| పల్లవి pallavi | పారిపోవలెరా నీరజాప్తుడు వెడలెరా | pAripOvalerA nIrajAptuDu veDalerA |
| అనుపల్లవి anupallavi | నారీమణులు దారిని గని దూరేరు గనుక | nArImaNulu dArini gani dUrEru ganuka |
| చరణం charaNam 1 | దూరిపోయిన క్రూరుడౌ మగడూరు జేరి యేమారడించెనే ఆ రీతుల విచారించు కొర కేరా నేనిపుడే | dUripOyina krUruDau magaDUru jEri yEmAraDinchenE A rItula vichArinchu kora kE rA nEnipuDE |
| చరణం charaNam 2 | భావమా గుణ భావముల్ తెలిసే విధమనే పాలిడించును కేళితో నీకే దయనుచు కేరా నేనిపుడే | bhAvamA guNa bhAvamul telisE vidhamanE pAliDinchunu kELitO nIkE dayanuchu kErA nEnipuDE |
#652 తెలిసె వగలెల్ల telise vagalella
| Title | తెలిసె వగలెల్ల | telise vagalella |
| Written By | పట్టాభిరామయ్య?? | paTTAbhirAmayya?? |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | బిలహరి | bilahari |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 267 | |
| పల్లవి pallavi | తెలిసె వగలెల్ల బాగాయెరా బల్కేవు ఏలాగు సహింతురా | telise vagalella bAgAyerA balkEvu ElAgu sahinturA |
| చరణం charaNam 1 | నన్నే నిరాకరించి ఏవేళ సవతితో ఉల్లాస సల్లాప మోహమాట పాట చాలు | nannE nirAkarinchi EvELa savatitO ullAsa sallApa mOhamATa pATa chAlu |
| చరణం charaNam 2 | శుకముల రవముల పికముల కలకల రవములనే తాళ శ్యామరాజ ఈ పలుకు | Sukamula ravamula pikamula kalakala ravamulanE tALa SyAmarAja I paluku |
#651 ఏమి మాయము Emi mAyamu
| Title | ఏమి మాయము | Emi mAyamu |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఏమి మాయము జేసి పోతివి శ్యామ సుందరాంగ నాతో | Emi mAyamu jEsi pOtivi SyAma sundarAnga nAtO |
| అనుపల్లవి anupallavi | నా మనో భావంబులెల్ల వేమారు నే వెరిగియు నాయెడ | nA manO bhAvambulella vEmAru nE verigiyu nAyeDa |
| చరణం charaNam 1 | నీరు దాగిపుడే పారి వచ్చేనని తీరుగ తీరున జోరుగ బల్కేవే సారి నోరూరగ దారి జూచెటటు క్రూర వేరె మీరిపోయె కొన | nIru dAgipuDE pAri vachchEnani tIruga tIruna jOruga balkEvE sAri nOrUraga dAri jUcheTaTu krUra vEre mIripOye kona |
| చరణం charaNam 2 | మంగళ స్నానము రంగుగ జేసే ఉప్పొంగుచు నీ మృదు అంగ సంగముతో కౌగలించేనని వంగి వంగి శ్రీ మంగళాంగుడౌ తాళవనేశుని | mangaLa snAnamu ranguga jEsE upponguchu nI mRdu anga sangamamutO kaugalinchEnani vangi vangi SrI mangaLAnguDau tALavanESuni |
#650 ఏమి సేయుదు Emi sEyudu
| Title | ఏమి సేయుదు | Emi sEyudu |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏమి సేయుదునటే ఏణాక్షి | Emi sEyudunaTE ENAkshi |
| అనుపల్లవి anupallavi | నోము ఫలమేమొ నాసామి కేసతి నానామ మంటే కాకనే మేమన్నదో గాన | nOmu phalamEmo nAsAmi kEsati nAnAma manTE kAkanE mEmannadO gAna |
| చరణం charaNam 1 | సరసుడు నన్నే సదా సరసమాడే సైకల సారసాక్షి విని దూరనేమో గాన | sarasuDu nannE sadA sarasamADE saikala sArasAkshi vini dUranEmO gAna |
| చరణం charaNam 2 | మేడపై మేమిర్వురు జోడు గూడే కడు వేడుకెల్ల నాచేడె చెరిచెనే | mEDapai mEmirvuru jODu gUDE kaDu vEDukella nAchEDe cherichenE |
| చరణం charaNam 3 | మొలక నవ్వుతోను మై పులకరించేలిన తాళవనీశుని చాలించెనే సవతి | molaka navvutOnu mai pulakarinchElina tALavanISuni chAlinchenE savati |
15 May 2021: Minor correction
#649 రారా నమ్మినారా rArA namminArA
| Title | రారా నమ్మినారా | rArA namminArA |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | రారా నమ్మినారా నా చై కోరాదటరా సామిగ | rArA namminArA nA chai kOrAdaTarA sAmiga |
| అనుపల్లవి anupallavi | సారెకు నేనీ రాక నే గోరుచు వేసారి తిటు | sAreku nEnI rAka nE gOruchu vEsAri tiTu |
| చరణం charaNam 1 | నీరజ వైరి తన క్రూర కిరణాలతో బీరుచు నాపై వెన్నెల బోరున గాచెరా ప్రియ | nIraja vairi tana krUra kiraNAlatO bIruchu nApai vennela bOruna gAcherA priya |
| చరణం charaNam 2 | సామి నేనీ తీరున కామియై యుండ పెను పామువలె కాముండిటు వేమారు శరముల్వేసె | sAmi nEnI tIruna kAmiyai yunDa penu pAmuvale kAmunDiTu vEmAru SaramulvEse |
| చరణం charaNam 3 | బాల నే తాళనురా తాలవనేశ మరుకేళి సుఖ లీలలో నన్నేలి రతి తేలించుమీ | bAla nE tALanurA tAlavanESa marukELi sukha lIlalO nannEli rati tElinchumI |
#648 కోపమెటుల kOpameTula
| Title | కోపమెటుల | kOpameTula |
| Written By | పట్టాభిరామయ్య?? | paTTAbhirAmayya?? |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 253 | |
| పల్లవి pallavi | కోపమెటుల రాక యుండునురా కోమలాంగ నీపై | kOpameTula rAka yunDunurA kOmalAnga nIpai |
| అనుపల్లవి anupallavi | పాపి యింటనే కాపురమై నీ రూపము కంటికి జూపక యుండిన | pApi yinTanE kApuramai nI rUpamu kanTiki jUpaka yunDina |
| చరణం charaNam 1 | నిన్నటి రాత్రి నిన్నిటు రమ్మని విన్నప మిచ్చి మా కన్యను బంపితే చిన్ననాటి నా నేస్తము నెంచకా చిన్నది మెచ్చన నన్న మాటలు విన | ninnaTi rAtri ninniTu rammani vinnapa michchi mA kanyanu bampitE chinnanATi nA nEstamu nenchakA chinnadi mechchana nanna mATalu vina |
| చరణం charaNam 2 | కాసుకు కాని యా దాసితోను పరిహాస మాడుచు నుల్లాసమై పయ్యెద దీసి తిన్నగ మూసి ముద్దిడు నీ సరసంబులు మోసము నేలిన | kAsuku kAni yA dAsitOnu parihAsa mADuchu nullAsamai payyeda dIsi tinnaga mUsi muddiDu nI sarasambulu mOsamu nElina |
| చరణం charaNam 3 | వేమరు వేడిన నీ మనసంత యా రామపాల్ జేసి విరాముడై వేడ్కతో కాముకేళి యా లేమ గూడిన చామ భూపాల నే నీ మమతలు విన | vEmaru vEDina nI manasanta yA rAmapAl jEsi virAmuDai vEDkatO kAmukELi yA lEma gUDina chAma bhUpAla nE nI mamatalu vina |
| Audio Link | https://www.youtube.com/watch?v=YVryeUtO9R8 |