| Title | యీశ్వరాజ్ఞ (ప్రతి) | yISwarAjna (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యీశ్వరాజ్ఞ యేమొ తెలియదు అది యెవరెరుంగుదురు | yISwarAjna yEmo teliyadu adi yevarerumguduru |
| చరణం charaNam 1 | శాశ్వతైశ్వర్యమొసగి సదా నను బ్రోచునొకో విశ్వాసము లేక నన్ను విడచునొ దయజూచునో పర ||మే|| | SASwataiSwaryamosagi sadA nanu brOchunokO viSWAsamu lEka nannu viDachuno dayajUchunO para ||mE|| |
| చరణం charaNam 2 | దారాపుత్రాదుల యెడ ధైర్యమిచ్చి యేలునొకో సారహీనమైన యీ సంసారాబ్ధిని ద్రోయునో జగ | dArAputrAdula yeDa dhairyamichchi yElunokO sArahInamaina yI samsArAbdhini drOyunO jaga |
| చరణం charaNam 3 | జ్ఞానాజ్ఞానముల రెంటి క్రమమెరుగంగ దెలుపునొకో మానహీనమైన యట్టి దుర్మదము గలుగజేయునోగో | jnAnAjnAnamula renTi kramamerugamga delupunokO mAnahInamaina yaTTi durmadamu galugajEyunOgO |
| చరణం charaNam 4 | మాయను తొలిగించియు సన్మానము దయచేయునొకొ యే యుపాయమునైనను నన్నేలక విడనాడునొ కా | mAyanu toligimchiyu sanmAnamu dayachEyunoko yE yupAyamunainanu nannElaka viDanADuno kA |
| చరణం charaNam 5 | సమశీల వ్రతము నడువ సద్గుణములు గలుగజేయునో యముని బారికిని ద్రోచి నాకతి శ్రమ కలిగించునో | samaSIla vratamu naDuva sadguNamulu galugajEyunO yamuni bArikini drOchi nAkati Srama kaligimchunO |
| చరణం charaNam 6 | రాగద్వేషాది రహిత రంజకము గలుగ జేయునో భోగమోహపాశములను బుధ్దిని బంధించునో లోక | rAgadwEshAdi rahita ramjakamu galuga jEyunO bhOgamOhapASamulanu budhdini bamdhimchunO lOka |
| చరణం charaNam 7 | కొండగుంటూరి సత్కుల కోవిదుడౌ నాగభూషణు దండజేరి నిండుమది నఖండ విభవమొసగునో విశ్వ | komDagumTUri satkula kOviduDau nAgabhUshaNu damDajEri nimDumadi nakhamDa vibhavamosagunO viSwa |
Tag: Telugu
#235 యీశ్వరాజ్ఞ yISwarAjna
| Title | యీశ్వరాజ్ఞ | yISwarAjna |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యీశ్వరాజ్ఞ యేమొ తెలియదు అది యెవరెరుగుదురు | yISwarAjna yEmo teliyadu adi yevareruguduru |
| చరణం charaNam 1 | శాశ్వతైశ్వర్యమిచ్చి సదా నను బ్రోచునొకో సకల బాధలను బెట్టి సంకటపడజూచునో జగ | SASwataiSwaryamichchi sadA nanu brOchunokO sakala bAdhalanu beTTi samkaTapaDajUchunO jaga |
| చరణం charaNam 2 | యెందున కొరలేని బ్రహ్మానందమొసగి గాచునో యెప్పటికీలాగున నన్ను హింసపరచి వేచునోపర | yemduna koralEni brahmAnamdamosagi gAchunO yeppaTikIlAguna nannu himsaparachi vEchunOpara |
| చరణం charaNam 3 | నందనునిగ భావించి నను గారవించునో నలువురిలోపల మిక్కిలి నగుబాటుగ జేసునో | namdanuniga bhAvimchi nanu gAravimchunO naluvurilOpala mikkili nagubATuga jEsunO |
| చరణం charaNam 4 | వెరవకుమని యభయమిచ్చి వేగమే రక్షించునో వీడధముడు దుష్టుడనుచు విడువక శిక్షించునో | veravakumani yabhayamichchi vEgamE rakshimchunO vIDadhamuDu dushTuDanuchu viDuvaka SikshimchunO |
| చరణం charaNam 5 | నిరతము నన్నాదాయపరునిగా నొనరించునో నిర్దయపరుడై నన్ను నీచమతుల జేర్చునో | niratamu nannAdAyaparunigA nonarimchunO nirdayaparuDai nannu nIchamatula jErchunO |
| చరణం charaNam 6 | ధరణిలోన నన్ను భగవద్దాసకోటి జేర్చునొ దారాపుత్రాదుల వల తగులుకొనగ గూర్చునో | dharaNilOna nannu bhagavaddAsakOTi jErchuno dArAputrAdula vala tagulukonaga gUrchunO |
| చరణం charaNam 7 | కూరిమితో సుదర్శనమొసగి గొబ్బున నను గారవించునో కొరమాలిన మానవులను కొనియాడగజేసునో ||జగదేశ్వరాజ్ఞ|| | kUrimitO sudarSanamosagi gobbuna nanu gAravimchunO koramAlina mAnavulanu koniyADagajEsunO ||jagadESwarAjna|| |
#234 పరమేశ రార paramESa rAra
| Title | పరమేశ రార (ప్రతి) | paramESa rAra (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | పరమేశ రార పాలింపవేర | paramESa rAra pAlimpavEra |
| కరుణాద్రభావ కరుణించు దేవదేవ | karuNAdrabhAva karuNimchu dEvadEva | |
| చరణం charaNam 1 | కమనీయరూప కంజాక్షరోప విమల ప్రదీప విశ్వాత్మ రూప భూప | kamanIyarUpa kamjAksharOpa vimala pradIpa viSWAtma rUpa bhUpa |
| చరణం charaNam 2 | సురుచిరగాత్ర సుందరీ కళత్ర పరమచారిత్ర పద్మభవ స్తోత్ర పాత్ర | suruchiragAtra sumdarI kaLatra paramachAritra padmabhava stOtra pAtra |
| చరణం charaNam 3 | ధరణి ముట్లూరిధామ పోషసూరి స్మరభస్మధారి మాయాపహారి కోరి | dharaNi muTlUridhAma pOshasUri smarabhasmadhAri mAyApahAri kOri |
| చరణం charaNam 4 | రామలింగేశా రహితా విపాశ కామాదినాశ గౌరీశ వ్యోమకేశ | rAmalingESA rahitA vipASa kAmAdinASa gourISa vyOmakESa |
| చరణం charaNam 5 | శర్వ నాగభూష సన్నుత వేష ఆర్య వరభూష యమిత ప్రతోష భాష | Sarva nAgabhUsha sannuta vEsha Arya varabhUsha yamita pratOsha bhAsha |
#233 సుడిగాలి suDigAli
| Title | సుడిగాలి | suDigAli |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | సుడిగాలి రక్కసుడు వచ్చెనొక్క కడు వేగమొప్పగను ధూళిగప్ప గొప్ప | suDigAli rakkasuDu vachchenokka kaDu vEgamoppaganu dhULigappa goppa |
| చరణం charaNam 1 | యొండొరుల గానకుండగ బిరాన అండంబు బ్రద్దలైపోవా ప్రొద్ద పెద్ద | yomDorula gAnakumDaga birAna amDambu braddalaipOvA prodda pedda |
| చరణం charaNam 2 | గోకులమందంద వ్యాకులము జెంద మూకలైన బిడ్డలిక నేడ్వ చెడ్డదొడ్డ | gOkulamamdamda vyAkulamu jemda mUkalaina biDDalika nEDva cheDDadoDDa |
| చరణం charaNam 3 | జనులంత సుదర్శనధరుని యెద గొనియాడ నెల్లగోసమితి తల్లడిల్ల | janulamta sudarSanadharuni yeda goniyADa nellagOsamiti tallaDilla |
#232 కర్మసంచయ karmasamchaya
| Title | కర్మసంచయ (ప్రతి) | karmasamchaya (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేగడ | bEgaDa |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | కర్మసంచయ ధూమిజకుఠారీ మాహేశ్వరీ శ్రీ కాళి శాంభవి దుర్గ కౌమారి మర్మమేలను రావె శ్రీ గౌరీ యే నిను దలంప నిర్మలాంగివి గదవె త్రిపురారీ మనోహారి | karmasamchaya dhUmijakuThArI mAhESwarI SrI kALi SAmbhavi durga koumAri marmamElanu rAve SrI gourI yE ninu dalampa nirmalAmgivi gadave tripurArI manOhAri |
| చరణం charaNam 1 | శీతశైలకుమారి సుకుమారీ నతపతసౌరి శ్రీకరంబుగ నిన్ను మదిగోరి పాతకుడనన నిగమసంచారీ యేల బ్రోవవు పావనిగాదా మనోజారీ కవిజనాధారి | SItaSailakumAri sukumArI natapatasauri SrIkarambuga ninnu madigOri pAtakuDanana nigamasamchArI yEla brOvavu pAvanigAdA manOjArI kavijanAdhAri |
| చరణం charaNam 2 | నీలకంధరు రాణి కల్యాణి నను బ్రోవు జలధరవేణి యంబుజపాణి శార్వాణి జాలమేలను రావె శుభవాణి మౌని సంత్రాణి చాలనమ్మితి నిన్ను నెదబూని శైకతత్రోణి | nIlakamdharu rANi kalyANi nanu brOvu jaladharavENi yambujapANi SArvANi jAlamElanu rAve SubhavANi mauni samtrANi chAlanammiti ninnu nedabUni SaikatatrONi |
| చరణం charaNam 3 | నాగభూషణ సుకవి పరిపాలా కరుణాలవాల నాగకంకణలోల శ్రీ బాలా జాగుసేయుట నీకు యిది మేలా యేవగనైన శాంభవీ దయజూడుమీవేళా యికను చలమేలా | nAgabhUshaNa sukavi paripAlA karuNAlavAla nAgakamkaNalOla SrI bAlA jAgusEyuTa nIku yidi mElA yEvaganaina SAmbhavI dayajUDumIvELA yikanu chalamElA |
#231 ధర్మ సంవర్ధని dharma samvardhani
| Title | ధర్మ సంవర్ధని | dharma samvardhani |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేగడ | bEgaDa |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | ధర్మ సంవర్ధని మాయమ్మా నమ్మితి నేనీ దాసుడను నను బ్రోవవలెనమ్మా చర్మవసనుని రాణియౌ కొమ్మా ముఖ్యముగా నీ చరణమేగతి వేరు లేదమ్మా బంగరుబొమ్మా | dharma samvardhani mAyammA nammiti nEnI dAsuDanu nanu brOvavalenammA charmavasanuni rANiyou kommA mukhyamugA nI charaNamEgati vEru lEdammA bangarubommA |
| చరణం charaNam 1 | తల్లి గర్భమునందు పడి పొరలీ తల్లడిల్లి యెన్ని జన్మములెత్తితినొ తొల్లి యిక యెన్ని జన్మములున్నవో మల్లీ యేవగనైన అన్ని భయములు తీర్పవే తల్లి కల్పకవల్లి | talli garbhamunandu paDi poralI tallaDilli yenni janmamulettitino tolli yika yenni janmamulunnavO mallI yEvaganaina anni bhayamulu tIrpavE talli kalpakavalli |
| చరణం charaNam 2 | తప్పులెంచుట యేమొ యిటు గలదా నా వెతలెల్ల దలచి జూచుట నీకు దయరాద యిప్పుడును నా మొరలు వినలేదా వూరకుంటే నీ గొప్పతనమున కేమి మర్యాదా పావనివి గాదా | tappulenchuTa yEmO yiTu galadA nA vetalella dalachi jUchuTa nIku dayarAda yippuDunu nA moralu vinalEdA vUrakumTE nI goppatanamuna kEmi maryAdA pAvanivi gAdA |
| చరణం charaNam 3 | శ్రీ రమేశుని తోడ నటియించి అందు భ్రమయించి శీఘ్రముగ మహిషాసురుని ద్రుంచి దీనరక్షక నీదు దయయుంచి యేవగనైనా దనరక నీదు కృపయుంచి బ్రోవ రక్షించి | SrI ramESuni tODa naTiyimchi amdu bhramayimchi SIghramuga mahishAsuruni drumchi dInarakshaka nIdu dayayumchi yEvaganainA danaraka nIdu kRpayumchi brOva rakshimchi |
#230 కరుణించవే karuNimchavE
| Title | కరుణించవే (ప్రతి) | karuNimchavE (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హంసధ్వని | hamsadhwani |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | కరుణించవే కాత్యాయనీ పరమేశురాణి పరమ కల్యాణి | karuNimchavE kAtyAyanI paramESurANi parama kalyANi |
| చరణం charaNam 1 | సురుచిరగాత్రి సుజన పవిత్రి పరమ చారిత్రి పద్మసమనేత్రి | suruchiragAtri sujana pavitri parama chAritri padmasamanEtri |
| చరణం charaNam 2 | నారదాది ఋషి నతసత్యభాషి ధీర మృదువేషి దేవమౌని తోషి సారసాక్షి బాల సఖియ బ్రోవవేల శీరమ్య రేపలెపుర సదనీ | nAradAdi Rshi natasatyabhAshi dhIra mRduvEshi dEvamouni tOshi sArasAkshi bAla sakhiya brOvavEla SIramya rEpalepura sadanI |
| చరణం charaNam 3 | జాలమేల హిమశైలజా పరమశీల కరుణాలవాల గానలోల బాలచంద్ర భూష భవ్య నాగభూష పాలితామరా జాలనీ వేళ | jAlamEla himaSailajA paramaSIla karuNAlavAla gAnalOla bAlachamdra bhUsha bhavya nAgabhUsha pAlitAmarA jAlanI vELa |
#229 కరుణించరా karuNimcharA
| Title | కరుణించరా | karuNimcharA |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హంసధ్వని | hamsadhwani |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | కరుణించరా కరుణానిధే సరివారిలోన చౌక సేయకుర | karuNimcharA karuNAnidhE sarivArilOna chouka sEyakura |
| చరణం charaNam 1 | కరిరక్షక నీ కంట జూడు నను పరులెవ్వరోయని యెంచకుర | karirakshaka nI kamTa jUDu nanu parulevvarOyani yemchakura |
| చరణం charaNam 2 | మును ప్రహ్లాదుని భక్తి జూచి తని కనికరంబుతోను కాపాడలేదా నను బ్రోచుటకు న్యాయమేమి లేదా ఘనుడౌ శ్రీ వేంకటేశాయన | munu prahlAduni bhakti jUchi tani kanikarambutOnu kApADalEdA nanu brOchuTaku nyAyamEmi lEdA ghanuDau SrI vEmkaTESAyana |
#228 భామ రావే bhAma rAvE
| Title | భామ రావే (ప్రతి) | bhAma rAvE (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | భామ రావే భయము నీకేలే కాముని కేళికి కరుణ జూచి యిటు | bhAma rAvE bhayamu nIkElE kAmuni kELiki karuNa jUchi yiTu |
| చరణం charaNam 1 | యింత నాపై పంతమిదేలే కంతుని బారికి గాసిజెందితిని | yimta nApai pamtamidElE kamtuni bAriki gAsijemditini |
| చరణం charaNam 2 | చిన్ననాడె నీ చిన్నెలు జూచి కన్నెరో నిను వలచియున్న వాడనిక | chinnanADe nI chinnelu jUchi kannerO ninu valachiyunna vADanika |
| చరణం charaNam 3 | ఆసతో మున్ను జేసిన బాసలు మోసములాయెనే వో సఖి వినవే | AsatO munnu jEsina bAsalu mOsamulAyenE vO sakhi vinavE |
| చరణం charaNam 4 | యింత నిర్దయ నీకేల గల్గెనే దంతి గమన నీ దయను విడువకను | yimta nirdaya nIkEla galgenE damti gamana nI dayanu viDuvakanu |
| చరణం charaNam 5 | సుందరివని భ్రమ జెందితినిపుడే పొందుగోరి నాయందు నెపముంచక | sumdarivani bhrama jemditinipuDE pomdugOri nAyamdu nepamumchaka |
| చరణం charaNam 6 | చిత్రబంధముల చేతను రతి జేయ స్తోత్రము జేసితి తోయజముఖి యిటు | chitrabandhamula chEtanu rati jEya stOtramu jEsiti tOyajamukhi yiTu |
| చరణం charaNam 7 | వాదము సేయక వదనము జూపవే నీదు చెలిమియును నిక్కము నమ్మితి | vAdamu sEyaka vadanamu jUpavE nIdu chelimiyunu nikkamu nammiti |
| చరణం charaNam 8 | యెప్పుడు మదిలో నేమరకను నే తప్పక దలచితి నిప్పుడు దయతో | yeppuDu madilO nEmarakanu nE tappaka dalachiti nippuDu dayatO |
| చరణం charaNam 9 | అరమరలేలనె అతివరొ వినవే కరుణ జూచి యిక కఠినము సేయక | aramaralElane ativaro vinavE karuNa jUchi yika kaThinamu sEyaka |
| చరణం charaNam 10 | నాగభూషణుని వేగమె బ్రోచిన భోగిశయనుడను భోగించుటకును | nAgabhUshaNuni vEgame brOchina bhOgiSayanuDanu bhOgimchuTakunu |
#226 యేర సామి yEra sAmi
| Title | యేర సామి | yEra sAmi |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ధన్యాసి | dhanyAsi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యేరసామి నీ మనసేల గరుగదేర ధీర | yErasAmi nI manasEla garugadEra dhIra |
| చరణం charaNam 1 | సారసాక్షి నిన్ను మది చాల కోరియున్నదిర | sArasAkshi ninnu madi chAla kOriyunnadira |
| చరణం charaNam 2 | నిన్ను నమ్మియున్నదాని నన్నదేల జేసేవుర | ninnu nammiyunnadAni nannadEla jEsEvura |
| చరణం charaNam 3 | ధరణి నరసాపుర విహారా తరుణి గరుణ నేలవేరా | dharaNi narasApura vihArA taruNi garuNa nElavErA |