| Title | యో చెలి | yO cheli |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | జుల్వా | julvA |
| పల్లవి pallavi | యో చెలి యో చెలి యో చెలి యో చెలీ యీ చలంబేల జేసెద | yO cheli yO cheli yO cheli yO chelI yI chalambEla jEseda |
| చరణం charaNam 1 | పంతగించి సామి నను పగగ నెంచెనే కంతుని కేళిలోన వాని కలియ జేయవే చెలి | pamtagimchi sAmi nanu pagaga nemchenE kamtuni kELilOna vAni kaliya jEyavE cheli |
| చరణం charaNam 2 | యింతి బోధనలు విని యేమరకను దానిగూడి కాంతుడు యిందువచ్చి నాపై కరుణ జూడడే చెలి | yimti bOdhanalu vini yEmarakanu dAnigUDi kAmtuDu yimduvachchi nApai karuNa jUDaDE cheli |
| చరణం charaNam 3 | సారసాక్షి సామిగూర్చితే రమణిరో వినుము శృంగారపు సొమ్ములిచ్చెదను కరుణ నేలవే చెలి | sArasAkshi sAmigUrchitE ramaNirO vinumu SRmgArapu sommulichchedanu karuNa nElavE cheli |
| చరణం charaNam 4 | ధరణి నరసాపుర విహారుని ఉరగరచిత భూషణునీ తరుణి యెడల కరుణ నుంచి దయను గూడమనవె చెలి | dharaNi narasApura vihAruni uragarachita bhUshaNunI taruNi yeDala karuNa numchi dayanu gUDamanave cheli |
Tag: Telugu
#224 సరసుడ sarasuDa
| Title | సరసుడ | sarasuDa |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | శ్రీ | SrI |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సరసుడ నీ పొందు చాలునులేరా విరిబోణిని మది వీడకుండుమురా | sarasuDa nI pomdu chAlunulErA viribONini madi vIDakumDumurA |
| చరణం charaNam 1 | గొప్ప కన్నుల నిద్దుర గప్పియున్నదిర అప్పుడతివేణితో నప్పళించెనే రా | goppa kannula niddura gappiyunnadira appuDativENitO nappaLinchenE rA |
| చరణం charaNam 2 | ఘనతగు నీ మేన గంధమలదెనురా అనయము నీ శిఖ యలరు లే వీర | ghanatagu nI mEna gandhamaladenurA anayamu nI Sikha yalaru lE vIra |
| చరణం charaNam 3 | ఆ సఖి గూడిన యంకములివిరా రసికుడ యిచటికి రారాదు పోపోరా | A sakhi gUDina yamkamulivirA rasikuDa yichaTiki rArAdu pOpOrA |
| చరణం charaNam 4 | ధరణి శ్రీ రేపలె పురవర వినరా కరుణాకర చిహ్నగనుగొంటి గదర | dharaNi SrI rEpale puravara vinarA karuNAkara chihnaganugomTi gadara |
#223 సరసుని sarasuni
| Title | సరసుని | sarasuni |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | శహన | Sahana |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | సరసుని తోడితేవే చానా నా మాటవిని మరుబారి కోర్వలేను మగువ చలము మాను | sarasuni tODitEvE chAnA nA mATavini marubAri kOrvalEnu maguva chalamu mAnu |
| చరణం charaNam 1 | గండుకోవెలలు గూయ కమలాలు శాకసేయ మెండు తుమ్మెదలు మ్రోయ గుండె ఝల్‌ఝల్‌మనెనే | ganDukOvelalu gUya kamalAlu SAkasEya menDu tummedalu mrOya gunDe jhal^jhal^manenE |
| చరణం charaNam 2 | ఆసతోడుత మునుజేసిన బాసలను బాసి యుండిన నినుబాసి యోర్వలేదను | AsatODuta munujEsina bAsalanu bAsi yumDina ninubAsi yOrvalEdanu |
| చరణం charaNam 3 | మదిరాక్షి వానిని నెమ్మదిలో దలచిన సుంత ముదము ఘటించెనని ముదిత వచించెనని | madirAkshi vAnini nemmadilO dalachina sumta mudamu ghaTimchenani mudita vachimchenani |
| చరణం charaNam 4 | వామాక్షి వినవే రావు వంశోదధిసోముడైన కామితమిచ్చెడు గంగాధర రామరాజ | vAmAkshi vinavE rAvu vamSOdadhisOmuDaina kAmitamichcheDu gamgAdhara rAmarAja |
#222 భామిని bhAmini
| Title | భామిని | bhAmini |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కాంభోది | kAmbhOdi |
| తాళం tALa | జుల్వా | julvA |
| పల్లవి pallavi | భామిని నా సామినిందు ప్రేమతో రమ్మనవే | bhAmini nA sAminimdu prEmatO rammanavE |
| కాముని విరిశరములకును కలికి తాళననవే | kAmuni viriSaramulakunu kaliki tALananavE | |
| చరణం charaNam 1 | పవనుడు చెలరేగి చాలబాధ నొందజేసెనే యువిదరొ నాధుడు రాకయున్న విధము దోచెనే | pavanuDu chelarEgi chAlabAdha nomdajEsenE yuvidaro nAdhuDu rAkayunna vidhamu dOchenE |
| చరణం charaNam 2 | అలుకజేసియే తరుణినొ యాదరించిగూడెనె పలువిధముల నెనరులేక పడతిరో నను వీడెనే | alukajEsiyE taruNino yAdarimchigUDene paluvidhamula nenarulEka paDatirO nanu vIDenE |
| చరణం charaNam 3 | నాగభూషణావనుడిటు నలువురిలో మిగులా వోగుజేయదలచి యా యువతి వలలో దగుల | nAgabhUshaNAvanuDiTu naluvurilO migulA vOgujEyadalachi yA yuvati valalO dagula |
#221 చాలునె చాలునె chAlune chAlune
| Title | చాలునె చాలునె | chAlune chAlune |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చాలునె చాలునె మోహము బాలరో మున్జేసిన బాసలేమాయనే | chAlune chAlune mOhamu bAlarO mun&jEsina bAsalEmAyanE |
| చరణం charaNam 1 | విడదికి రమ్మని వెలదిని బంపిన పడతిరో రాకను పంతము లేలనే | viDadiki rammani veladini bampina paDatirO rAkanu pamtamu lElanE |
| చరణం charaNam 2 | స్నేహమే స్థిరమని చెలియ నే నమ్మియు మోహము నే జెందిన మోసము లాయనే | snEhamE sthiramani cheliya nE nammiyu mOhamu nE jemdina mOsamu lAyanE |
| చరణం charaNam 3 | ప్రేమరహితులకు ప్రీతియు గల్గునె భామిని యీ చెలిమి బాగాయనే చెలి | prEmarahitulaku prItiyu galgune bhAmini yI chelimi bAgAyanE cheli |
| చరణం charaNam 4 | రసికుడౌ రేపలె రాజగోపాలుని వసుధలో నింత వంచన జేసితౌ | rasikuDou rEpale rAjagOpAluni vasudhalO nimta vamchana jEsitau |
#220 వేగమె నాధుని vEgame nAdhuni
| Title | వేగమె నాధుని | vEgame nAdhuni |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | వేగమె నాధుని దేవేమనంటునే చెలి జాగేలను మరుబారికి చాన నిలువజాలనే | vEgame nAdhuni dEvEmananTunE cheli jAgElanu marubAriki chAna niluvajAlanE |
| చరణం charaNam 1 | తుమ్మెదలును రొదలు సేయ తుహినాంశుడు మరిగాయ కమ్మవిల్తుడు శరమువేయ ఘనముగాను వాయువేయ | tummedalunu rodalu sEya tuhinAmSuDu marigAya kammaviltuDu SaramuvEya ghanamugAnu vAyuvEya |
| చరణం charaNam 2 | చిన్ననాటనుండి విభుడెన్నడు దయ విడనాడి కన్నెలతో చెలిమి జేసియున్న వాడుకాడే చెలి | chinnanATanumDi vibhuDennaDu daya viDanADi kannelatO chelimi jEsiyunna vADukADE cheli |
| చరణం charaNam 3 | వారిజాక్షి వల్లూరి వంశాబ్ధి సోముడైన సారెకు శ్రీ పురుషోత్తమ సన్నుత గుణశాలి నిటు | vArijAkshi vallUri vamSAbdhi sOmuDaina sAreku SrI purushOttama sannuta guNaSAli niTu |
#219 సరసిజముఖి sarasijamukhi
| Title | సరసిజముఖి | sarasijamukhi |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కమాచి | kamAchi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సరసిజముఖిరో నా సామినిందు తోడితేవే | sarasijamukhirO nA sAminindu tODitEvE |
| చరణం charaNam 1 | అరమరేల ప్రాణేశుని చరణంబులు నెరనమ్మితి మరుకేళికి సరగున యిటు సజలజశరుడు నేడు పూని చాల బాణములేయగాను తలచి తాళలేకయున్న కలికిన నిను బలు విధముల కలిపిన శ్రీ కమలాక్షుని | aramarEla prANESuni charaNambulu neranammiti marukELiki saraguna yiTu sajalajaSaruDu nEDu pUni chAla bANamulEyagAnu talachi tALalEkayunna kalikina ninu balu vidhamula kalipina SrI kamalAkshuni |
| చరణం charaNam 2 | సుందరాంగి మున్ను నను సుందరాకారుడు జూచి మందగమన నాదు మనము నందున నే పొందుగ భ్రమ జెందితినని చెలువుడనియె | sumdarAmgi munnu nanu sumdarAkAruDu jUchi mamdagamana nAdu manamu namduna nE pomduga bhrama jemditinani cheluvuDaniye |
| చరణం charaNam 3 | స్థిరతరమతి శ్రీ గౌరీశెట్టి శ్రీరామాఖ్యుని కరుణజూచి రమ్మనె మందరధరుని వరసుందర తర గాత్రుని సరసుని యిటు | sthirataramati SrI gourISeTTi SrIrAmAkhyuni karuNajUchi rammane mamdaradharuni varasumdara tara gAtruni sarasuni yiTu |
#218 చెలువుడ cheluvuDa
| Title | చెలువుడ | cheluvuDa |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చెలువుడ నాపై కోపమా ఆ చెలి నీపై మోహమ సామి | cheluvuDa nApai kOpamA A cheli nIpai mOhama sAmi |
| చరణం charaNam 1 | మొలకప్రాయమున మచ్చిక జేసి యా వెలదిని గూడుట విహితమనెర | molakaprAyamuna machchika jEsi yA veladini gUDuTa vihitamanera |
| చరణం charaNam 2 | కులుకులాడి నీకేమి బోధించెర పలుకవదేలను బాసలేమాయెర | kulukulADi nIkEmi bOdhimchera palukavadElanu bAsalEmAyera |
#217 మగనాల maganAla
| Title | మగనాల | maganAla |
| Written By | వల్లభ రాయలు / వల్లభామాత్యుడు | vallabha rAyalu / vallabhAmAtyuDu |
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మగనాల తాళరనే | maganAla tALaranE |
| చరణం charaNam 1 | పదుగురిలో నను మదనుని కేళికి గదియ రమ్మనెదవు పదరా నే | padugurilO nanu madanuni kELiki gadiya rammanedavu padarA nE |
| చరణం charaNam 2 | వడ్డారమున నీ వడ్డము జేసిన చెడ్డది మా యత్త చెడ్డదిరా నే | vaDDAramuna nI vaDDamu jEsina cheDDadi mA yatta cheDDadirA nE |
| చరణం charaNam 3 | వల్లభుడొచ్చు శ్రీ వల్లభరాయ నీ పిల్ల చేష్టలిందు చెల్లవురా నే | vallabhuDochchu SrI vallabharAya nI pilla chEshTalimdu chellavurA nE |
29 Sep 2025: Written By added today as vallabha rAyalu / vallabhAmAtyuDu – found it in Section 4.1.2 of the Thesis
#216 మగవారిని magavArini
| Title | మగవారిని | magavArini |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మగవారిని నమ్మరాదే చెలి మనసిచ్చి మాటాడరు | magavArini nammarAdE cheli manasichchi mATADaru |
| చరణం charaNam 1 | వద్దనున్నసేపు వగలమాటల తీపు వద్దలేని మాపు ఓరగంటి చూపు | vaddanunnasEpu vagalamATala tIpu vaddalEni mApu OraganTi chUpu |
| చరణం charaNam 2 | బాసలెన్నోజేసి బలిమితోనే డాసి కోపరించి చూచి గాసి జేతురె బాసి | bAsalennOjEsi balimitOnE DAsi kOparimchi chUchi gAsi jEture bAsi |
| చరణం charaNam 3 | కోపమెంతో చాలా కోమలశీలా రాపుజేసే వేలా రాజగోప బాల | kOpamemtO chAlA kOmalaSIlA rApujEsE vElA rAjagOpa bAla |