#190 చాలు చాలిక chAlu chAlika

Titleచాలు చాలిక (ప్రతి)chAlu chAlika (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
చాలు చాలిక పోరా నా సామి నీ జాడలు
జక్కగ గానవచ్చెరా
chAlu chAlika pOrA nA sAmi nI jADalu
jakkaga gAnavachcherA
చరణం
charaNam 1
కేళిజేసేదందు కేరడమిందు
బాళి చూపేదందు బాసలిందు చాలులేరా సరసుడౌర
యిది మేలవుర యెంతో వింతలాయర
kELijEsEdamdu kEraDamimdu
bALi chUpEdamdu bAsalimdu chAlulErA sarasuDaura
yidi mElavura yemtO vimtalAyara
చరణం
charaNam 2
దయనేలెదందు తామసమిందు
బయలు నాటలందు భయమిందు
దయలేదా నా తోడ వాదా
చలమిడరాదా ఓ నయగుణ విశారదా
dayanEledamdu tAmasamimdu
bayalu nATalamdu bhayamimdu
dayalEdA nA tODa vAdA
chalamiDarAdA O nayaguNa viSAradA
చరణం
charaNam 3
ఘన పాటలందు కయ్యము నిందు
మనవి జేసే దందు మాదీవిందు
వినుము సూర్యభూపతివర్య
సురగిరి ధైర్య శ్రీ
ఘన సమౌదార్య చాలు చాలిక పోరా
ghana pATalamdu kayyamu nimdu
manavi jEsE damdu mAdIvimdu
vinumu sUryabhUpativarya
suragiri dhairya SrI
ghana samoudArya chAlu chAlika pOrA

#189 యిన్నాళ్ళవలె yinnALLavale

Titleయిన్నాళ్ళవలెyinnALLavale
Written By
BookprAchIna-navIna
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
యిన్నాళ్ళ వలెగాదె వాని గుణమెంతని నే
విన్నవింతునే ఓ చెలియ
yinnALLa valegAde vAni guNamentani nE
vinnavimtunE O cheliya
చరణం
charaNam 1
నన్నెడబాయడు అన్యుల జూడడు మన్నన వీడడు
మానిని మణిరో
వన్నెకాడే వాడెందున్నాడే వాడన్నిట నెరజాణుడే
nanneDabAyaDu anyula jUDaDu mannana vIDaDu
mAnini maNirO
vannekADE vADemdunnADE vADanniTa nerajANuDE
చరణం
charaNam 2
తామస మేలనె తాళగజాలనె
కోమలి నీ మది కోరిన సొమ్ములు
చేకొనవే వేగరావే
వేగ తోడి తేవే నా సామినిటు రమ్మనవే
tAmasa mElane tALagajAlane
kOmali nI madi kOrina sommulu
chEkonavE vEgarAvE
vEga tODi tEvE nA sAminiTu rammanavE
చరణం
charaNam 3
ఆందముగా రతి ముందుగ నేలిన
సుందర శ్యామల వేంకటరమణుడు
నెనరున కలిశిన నేదానగాన
ఓ మదగజగమనరో
AmdamugA rati mumduga nElina
sumdara SyAmala vEmkaTaramaNuDu
nenaruna kaliSina nEdAnagAna
O madagajagamanarO

#188 బాగాయెనిక bAgAyenika

Titleబాగాయెనిక (ప్రతి)bAgAyenika (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
బాగాయెనిక చాలుర సామిbAgAyenika chAlura sAmi
చరణం
charaNam 1
నాయక యొక్క ముద్దు నాకిడుమనిన రోసి
యా యువిదను జూచితి యా యువిదను జూచితి
nAyaka yokka muddu nAkiDumanina rOsi
yA yuvidanu jUchiti yA yuvidanu jUchiti
చరణం
charaNam 2
యింటికి రమ్మనియెనని నగసరి దా
నింటికేగ జూచితి యింటికేగ జూచితి
yimTiki rammaniyenani nagasari dA
nimTikEga jUchiti yimTikEga jUchiti
చరణం
charaNam 3
యిసుమంత ననుగూడి యింటికి బొమ్మని యా
కుసుమ గంధిని గూడితి ఆ కుసుమగంధిని గూడితి
yisumamta nanugUDi yimTiki bommani yA
kusuma gamdhini gUDiti A kusumagamdhini gUDiti
చరణం
charaNam 4
సుస్థిర రావుకుల సూర్యభూపతి వర
స్వస్థత జెందితిర స్వస్థత జెందితిర
susthira rAvukula sUryabhUpati vara
swasthata jemditira swasthata jemditira

#187 ప్రొద్దాయె proddAye

Titleప్రొద్దాయెproddAye
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
ప్రొద్దాయె నికజాలుర సామి యికproddAye nikajAlura sAmi yika
చరణం
charaNam 1
అత్తరు మెడబూసి అడ్డగించేవు సామి
అత్తింటి కోడాలురా నిజముగ
అత్తింటి కోడాలురా
attaru meDabUsi aDDagimchEvu sAmi
attimTi kODAlurA nijamuga
attimTi kODAlurA
చరణం
charaNam 2
పావడ నీ చేతితో బట్ట వచ్చేవురా
పోవలెను మ్రొక్కేనుర నిజముగ
pAvaDa nI chEtitO baTTa vachchEvurA
pOvalenu mrokkEnura nijamuga
చరణం
charaNam 3
కోపగించకు నాపై బాలచంద్రసామి
రేపు వస్తానులేర నిజముగ
kOpaginchaku nApai bAlachandrasAmi
rEpu vastAnulEra nijamuga

#186 యేమందునె yEmandune

Titleయేమందునె (ప్రతి)yEmandune (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
యేమందునె చెలియా నా సామిని యేమరదే మనసికyEmandune cheliyA nA sAmini yEmaradE manasika
చరణం
charaNam 1
నామనవాలించి నాధుడు గృపతో
భామిని యేలినది దలచి యిక
nAmanavAlinchi nAdhuDu gRpatO
bhAmini yElinadi dalachi yika
చరణం
charaNam 2
గుబ్బలు చెణకుచు గోరి నా యధరము
గొబ్బున పంట నొక్కిన యది దలచి
gubbalu cheNakuchu gOri nA yadharamu
gobbuna pamTa nokkina yadi dalachi
చరణం
charaNam 3
కేళీగృహమున కీరవాణి రతి
కేళిగూడిన హొయలు దలచి యిక
kELIgRhamuna kIravANi rati
kELigUDina hoyalu dalachi yika
చరణం
charaNam 4
రావు కులజ సూర్యరాయ మహీపతి
భావము నెంచిన నే తాళుదునే
rAvu kulaja sUryarAya mahIpati
bhAvamu nemchina nE tALudunE

#185 పోపొమ్మనే pOpommanE

Titleపోపొమ్మనేpOpommanE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
పోపొమ్మనే పొమ్మనే
వాని పొందేలనే మనకు అచటికి
pOpommanE pommanE
vAni pomdElanE manaku achaTiki
చరణం
charaNam 1
పాపపు మోహము పాలుజేసి యా
పాపిల్లు జేరెనే ప్రొద్దాయనె
pApapu mOhamu pAlujEsi yA
pApillu jErenE proddAyane
చరణం
charaNam 2
యిన్ని దినములు వాడెందు రాకుండినన్
చిన్నబుచ్చినాడే నిర్దయుడే
yinni dinamulu vADendu rAkunDinan
chinnabuchchinADE nirdayuDE
చరణం
charaNam 3
రేయి పగలతని రాక జూచి నా రాత
యనుకొంటినె యేమందునె
rEyi pagalatani rAka jUchi nA rAta
yanukomTine yEmandune
చరణం
charaNam 4
రంగనాథుడునే రంగుగ గూడి
రంగము నెలకొననే అంతటనే
ranganAthuDunE ramguga gUDi
ramgamu nelakonanE amtaTanE

#184 వానిటు రమ్మని vAniTu rammani

Titleవానిటు రమ్మని (ప్రతి)vAniTu rammani (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహుసేనిhusEni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వానిటు రమ్మని దెల్పవే
వానిటు రమ్మని దెల్పవే
వరదుని నను కల్పవే
vAniTu rammani delpavE
vAniTu rammani delpavE
varaduni nanu kalpavE
చరణం
charaNam 1
మానిని కుసుమమాలను బంపిన
పూనుకొనెనా పూనుకొనెనా
పూజీడికిమ్మనెనా
mAnini kusumamAlanu bampina
pUnukonenA pUnukonenA
pUjIDikimmanenA
చరణం
charaNam 2
చలువ పన్నీరును సరసున కంపిన
అలదుకొనెనా
అలదుకొనెనా ఆ వెలదికిమ్మనెనా
chaluva pannIrunu sarasuna kampina
aladukonenA
aladukonenA A veladikimmanenA
చరణం
charaNam 3
యువిదరొ వానికి యుత్తరమంపిన
చదువుకొనెనా చదువుకొనెనా
యాధూర్తకిమ్మనెనా
yuvidaro vAniki yuttaramampina
chaduvukonenA chaduvukonenA
yAdhUrtakimmanenA

#183 వాడెటు బల్కెనో vADeTu balkenO

Titleవాడెటు బల్కెనోvADeTu balkenO
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహుసేనిhusEni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వాడెటు బల్కెనో దెల్పవే
వాడెటు బల్కెనో దెల్పవే
బోటిరో బూటక మేలనే
vADeTu balkenO delpavE
vADeTu balkenO delpavE
bOTirO bUTaka mElanE
చరణం
charaNam 1
కొమ్మరో నేనంపిన కమ్మను వాడే కొనెనా వాడే కొనెనా ఒక
చెలి చేతికిమ్మనెనా
kommarO nEnampina kammanu vADE konenA vADE konenA oka
cheli chEtikimmanenA
చరణం
charaNam 2
ఇంతిరొ నేనంపిన పూబంతుల వాడే కొనెనా వాడే కొనెనా
ఒక రమణి కిమ్మనెనా
imtiro nEnampina pUbantula vADE konenA vADE konenA oka ramaNi kimmanenA
చరణం
charaNam 3
బాలరో ధర్మపురి పాలుడు
యేలెనెననెనా యేలెనెననెనా వాని
చెలి పోపొమ్మనెనా
bAlarO dharmapuri pAluDu
yElenenanenA yElenenanenA vAni
cheli pOpommanenA

#182 కామిని వాని kAmini vAni

Titleకామిని వాని (ప్రతి)kAmini vAni (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
కామిని వానితోడ గరుణ యుంచు మనవేkAmini vAnitODa garuNa yumchu manavE
సామి ప్రేమ నిక్కమని చాల నమ్మియుంటినే వోsAmi prEma nikkamani chAla nammiyumTinE vO
చరణం
charaNam 1
నెలత నన్ను విడచి దాని పలుకులు విని బూరుగ చెంత
వలచి నిలుచు చిలుక సామెత వలెను జేయవలదనవే
nelata nannu viDachi dAni palukulu vini bUruga chemta
valachi niluchu chiluka sAmeta valenu jEyavaladanavE
చరణం
charaNam 2
చిగురు విల్తుడు ములుకు లేయ
తెగువ శాయ వలదాయ
పగవారిలో నగడు శేయ
భామ యెటుల తాళుదునే
chiguru viltuDu muluku lEya
teguva SAya valadAya
pagavArilO nagaDu SEya
bhAma yeTula tALudunE
చరణం
charaNam 3
సుదతి శ్రీ రావు వంశజ సూర్య నృపతి
మదిగోరి ముదితా యిటులున్న దాని
మోసబుచ్చుట పాయమేవో
sudati SrI rAvu vamSaja sUrya nRpati
madigOri muditA yiTulunna dAni
mOsabuchchuTa pAyamEvO

#181 మానిని వాని mAnini vAni

Titleమానిని వానిmAnini vAni
Written By
BookprAchIna-navIna
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
మానిని వాని జోలి దానను నే గానేmAnini vAni jOli dAnanu nE gAnE
కాని దాని మాట విని కరుణ మరచియుండెనే వోkAni dAni mATa vini karuNa marachiyumDenE vO
చరణం
charaNam 1
కలికిరొ నను బాయనని పలికినదేమాయెనే
అల చెలితో కలిశి రావే అయిదార్నెల లాయెనే వో
kalikiro nanu bAyanani palikinadEmAyenE
ala chelitO kaliSi rAvE ayidArnela lAyenE vO
చరణం
charaNam 2
బోటిరొ నను వీడనని బూటకములు జేసెనే
మాట దప్పియున్న వాని మోముజూడ రాదే వో
bOTiro nanu vIDanani bUTakamulu jEsenE
mATa dappiyunna vAni mOmujUDa rAdE vO
చరణం
charaNam 3
సన్నుతాంగి చాల వలసి యిన్ని దినములుంటినే
నిన్ను గూడి వెంకటేశుడన్న మాట వింటినే వో
sannutAmgi chAla valasi yinni dinamulumTinE
ninnu gUDi vemkaTESuDanna mATa vimTinE vO