| Title | యింతలో (ప్రతి) | yimtalO (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | యింతలో మరచితి వేమిరా సామి | yimtalO marachiti vEmirA sAmi |
| కంతుకేళిలోనం గారవించుట | kamtukELilOnam gAravimchuTa | |
| చరణం charaNam 1 | దారిజూచి నన్ను దలచి చెలిని నా పేరనె బిలుచుదును సారెకు గాకున్న చాల సొమ్మసిల్లె | dArijUchi nannu dalachi chelini nA pErane biluchudunu sAreku gAkunna chAla sommasille |
| చరణం charaNam 2 | కన్నె నిన్ను బాసి ఘడియై గాకను సన్నుతాంగి యనుచు కన్నీరు నించుచు కడుబాధ నొందిన | kanne ninnu bAsi ghaDiyai gAkanu sannutAmgi yanuchu kannIru nimchuchu kaDubAdha nomdina |
| చరణం charaNam 3 | ప్రేమతో ముద్దులు బెట్టుచు నన్ను కామించి శ్రీ రేపలె ధామ కౌగిలించి దయతోడ నెనసిన | prEmatO muddulu beTTuchu nannu kAmimchi SrI rEpale dhAma kaugilimchi dayatODa nenasina |
Tag: Telugu
#178 సామిని దేగదే sAmini dEgadE
| Title | సామిని దేగదే (ప్రతి) | sAmini dEgadE (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామిని దేగదే చానరో వేగమే | sAmini dEgadE chAnarO vEgamE |
| చరణం charaNam 1 | కామజనకుడే కామిని యింటను ఘనమని యుండెనో వో చెలి | kAmajanakuDE kAmini yimTanu ghanamani yumDenO vO cheli |
| చరణం charaNam 2 | జగతిని పురుషుల సఖియరో నమ్మగ తగదని దెల్పిరే వో చెలి | jagatini purushula sakhiyarO nammaga tagadani delpirE vO cheli |
| చరణం charaNam 3 | పడతి రేపలె గోపాలుడు మది నను బాగని మరచెనె వో చెలి | paDati rEpale gOpAluDu madi nanu bAgani marachene vO cheli |
#177 మానాభిమానము mAnAbhimAnamu
This jAvaLi was published earlier too – from a different book. Lyrics have minor differences
| Title | మానాభిమానము | mAnAbhimAnamu |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మానాభిమానము లాతనిదే చెలి | mAnAbhimAnamu lAtanidE cheli |
| చరణం charaNam 1 | మునుపటి నెనరైన తన మది నెంచక ననబోడి రాడాయనే ఆయనె చెలి | munupaTi nenaraina tana madi nemchaka nanabODi rADAyanE Ayane cheli |
| చరణం charaNam 2 | తరుణి బోధన విని తానిందు రాడాయె కరుణయు లేదాయెనె ఆయనె చెలి | taruNi bOdhana vini tAnimdu rADAye karuNayu lEdAyene Ayane cheli |
| చరణం charaNam 3 | వనితరొ గోపాలుడు నన్నేలుట తనదె భారమనెనే అనెనె చెలి | vanitaro gOpAluDu nannEluTa tanade bhAramanenE anene cheli |
#176 రారా మేర rArA mEra
| Title | రారా మేర (ప్రతి) | rArA mEra (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రారా మేర నేరము లేలర | rArA mEra nEramu lElara |
| మారునికేళికి మదనజనక యిటు | mArunikELiki madanajanaka yiTu | |
| చరణం charaNam 1 | కూరిమితో దానిగూడిటు రాకను సారెకు నన్నేచ సరసుడ చాలుర | kUrimitO dAnigUDiTu rAkanu sAreku nannEcha sarasuDa chAlura |
| చరణం charaNam 2 | యెంతసేపు నేనిటు తాళుదుర దంతము జేసేవా పడతి బోధనేర | yemtasEpu nEniTu tALudura damtamu jEsEvA paDati bOdhanEra |
| చరణం charaNam 3 | స్థిరముగ రేపలెపుర మందిర నీ కరుణ గోరితిర కఠినము లేలర | sthiramuga rEpalepura mamdira nI karuNa gOritira kaThinamu lElara |
#174 రామరో rAmarO
| Title | రామరో (ప్రతి) | rAmarO (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కమాచి | kamAchi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రామరో సామి నిటు రమ్మనవే ఓ | rAmarO sAmi niTu rammanavE O |
| కామించి గూడుటకు కలకంఠి సమయము | kAminchi gUDuTaku kalakamThi samayamu | |
| చరణం charaNam 1 | సరసిజలోచనుడు సమయమెరుగక నను మరుకేళి గూడుమనెనే ఓ | sarasijalOchanuDu samayamerugaka nanu marukELi gUDumanenE O |
| చరణం charaNam 2 | వదలక ఈ రేయి వరునితో గూడుటకు సదయుడై తామెచ్చునే ఓ | vadalaka I rEyi varunitO gUDuTaku sadayuDai tAmechchunE O |
| చరణం charaNam 3 | వనిత రేపలె పురవాసుడు నను జూచి కనికరముంచుమనెనే ఓ | vanita rEpale puravAsuDu nanu jUchi kanikaramumchumanenE O |
#173 రమణిరో ramaNirO
| Title | రమణిరో | ramaNirO |
| Written By | తిరుమల దేవరాయలు | tirumala dEvarAyalu |
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కమాచి | kamAchi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రమణిరో సామి రాతి రేమనెనే ఓ | ramaNirO sAmi rAti rEmanenE O |
| చరణం charaNam 1 | కమల నయనరొ నా కాంతుడు జూచి తా సుముఖుడై వరియించెనే ఓ | kamala nayanaro nA kAmtuDu jUchi tA sumukhuDai variyimchenE O |
| చరణం charaNam 2 | కర్పూర వీటికాగంధ పుష్పాదుల నర్పణశాయ గైకొనెనే ఓ | karpUra vITikAgandha pushpAdula narpaNaSAya gaikonenE O |
| చరణం charaNam 3 | తిరుమల దేవరాయ కరివీరకాదీయ కరుణతో జూచి గైకొనెనే ఓ | tirumala dEvarAya karivIrakAdIya karuNatO jUchi gaikonenE O |
01 Oct 2025: Added “Written By” as tirumala dEvarAyalu – as found in the Thesis Section 4.1.2
#172 నిలువదె niluvade
| Title | నిలువదె (ప్రతి) | niluvade (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | నిలువదె నా మది కలకంఠి వాని రూపు కనుల జూడగనె | niluvade nA madi kalakamThi vAni rUpu kanula jUDagane |
| చరణం charaNam 1 | రతి సల్పుదును నను హితవుతో పలుమారు బతిమాలినది నాదు భావమ్ము దలచగ | rati salpudunu nanu hitavutO palumAru batimAlinadi nAdu bhAvammu dalachaga |
| చరణం charaNam 2 | రహిబుట్టగ తోడి రాగము వాని సాహాయము చే బాడినది సరసిజాక్షి దెల్పగనే | rahibuTTaga tODi rAgamu vAni sAhAyamu chE bADinadi sarasijAkshi delpaganE |
| చరణం charaNam 3 | రామ రేపలె పుర రాజగోపాలునితో కాముని కేళిలొ కలియుటెన్నటికొ | rAma rEpale pura rAjagOpAlunitO kAmuni kELilo kaliyuTennaTiko |
#171 మరపురాదే marapurAdE
| Title | మరపురాదే | marapurAdE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మరపురాదే చెలి వరగోపాలుని హొయలు కాంత వినవె | marapurAdE cheli varagOpAluni hoyalu kAmta vinave |
| చరణం charaNam 1 | చంద్రకాంతపు మేడలో కాంతుడు నను యేకాంతమాడినది | chandrakAmtapu mEDalO kAmtuDu nanu yEkAmtamADinadi |
| చరణం charaNam 2 | యిద్దరము నిల్వుటద్దము లోపల ముద్దుబెట్టి రతి సుద్దులాడినది | yiddaramu nilvuTaddamu lOpala muddubeTTi rati suddulADinadi |
| చరణం charaNam 3 | ఆసిగ నుపరతి జేసెడు వేళ నాయాసపు చెమటలు దీసి వేసినది | Asiga nuparati jEseDu vELa nAyAsapu chemaTalu dIsi vEsinadi |
#170 సామి నిటు sAmi niTu
| Title | సామి నిటు (ప్రతి) | sAmi niTu (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామి నిటు రమ్మనవే సఖి | sAmi niTu rammanavE sakhi |
| చరణం charaNam 1 | భామామణి నేనేమని దెల్పుదు కామినితొ యీ రేయి కాముకేళి గూడెనది | bhAmAmaNi nEnEmani delpudu kAminito yI rEyi kAmukELi gUDenadi |
| చరణం charaNam 2 | సుందరి జేసిన క్రిందటి చానెలు డెందమందు నుంచక నా పొందు గోరకున్నాడట | sumdari jEsina krindaTi chAnelu Demdamandu numchaka nA pomdu gOrakunnADaTa |
| చరణం charaNam 3 | స్థిరముగ రేపలె పురవరునితో నిక స్మరుకేళి గూడుట చాలు చాలు పోపోవే | sthiramuga rEpale puravarunitO nika smarukELi gUDuTa chAlu chAlu pOpOvE |
#168 మరచెనే నన్ marachenE nan
| Title | మరచెనే నన్ (ప్రతి) | marachenE nan (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మరచెనే నన్ మదిని విభుడిటు | marachenE nan madini vibhuDiTu |
| చరణం charaNam 1 | స్థిరమని తాను జేసిన బాసలు సరసుడు తామది కరుణచే దలచక | sthiramani tAnu jEsina bAsalu sarasuDu tAmadi karuNachE dalachaka |
| చరణం charaNam 2 | యింతిని గూడిన సంతసము చేతను పంతమొనర్చియు భామరొ నన్నిటు | yimtini gUDina samtasamu chEtanu pamtamonarchiyu bhAmaro nanniTu |
| చరణం charaNam 3 | సతతము విరహము సయిపక గనుగొని హితవుతో రతికిని నుతి జేయు సామిటు | satatamu virahamu sayipaka ganugoni hitavutO ratikini nuti jEyu sAmiTu |
| చరణం charaNam 4 | ధరణి శ్రీ రేపలె పురవరుడిటు నను సరగున గూడక జాలము జేసిటు | dharaNi SrI rEpale puravaruDiTu nanu saraguna gUDaka jAlamu jEsiTu |