#167 యెటువలె yeTuvale

TitleయెటువలెyeTuvale
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఅటaTa
Previously Published At45
పల్లవి
pallavi
యెటువలె సైసుదునే విరహముyeTuvale saisudunE virahamu
చరణం
charaNam 1
యింతిరొ విరహము యెంతని యోర్తునె
కాంతుని బారికి కలియ రమ్మనుమనె
yimtiro virahamu yemtani yOrtune
kAmtuni bAriki kaliya rammanumane
చరణం
charaNam 2
కుటిలాలక నీ కోపము మానవే
విటకానిని నా విడదికి తేగదె
kuTilAlaka nI kOpamu mAnavE
viTakAnini nA viDadiki tEgade
చరణం
charaNam 3
వేమరుసురపురి వేణుగోపాలుని
కాముని కేళికి కలవరమందితి
vEmarusurapuri vENugOpAluni
kAmuni kELiki kalavaramanditi

#166 యిక మది yika madi

Titleయిక మది (ప్రతి)yika madi (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
యిక మది తాళర సామి
మకరాంకుని శరమరయగ దాకెను
yika madi tALara sAmi
makarAmkuni Saramarayaga dAkenu
చరణం
charaNam 1
సతతము కరుణాజతమతివైనను
హితము సేయకను యిటులుండగ మది
satatamu karuNAjatamativainanu
hitamu sEyakanu yiTulumDaga madi
చరణం
charaNam 2
సుందరి యిడు యా మందుల చేతను
పొందు గోరచట భోగించగ మది
sumdari yiDu yA mamdula chEtanu
pondu gOrachaTa bhOgimchaga madi
చరణం
charaNam 3
సరవితో రేపలె పురవరమారుని
దురమొనచి నీ కరుణ బూను మది
saravitO rEpale puravaramAruni
duramonachi nI karuNa bUnu madi

#165 మమతలు mamatalu

Titleమమతలుmamatalu
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మమతలు మానర సామిmamatalu mAnara sAmi
అతి చతురతములు యితర సతుల తగుati chaturatamulu yitara satula tagu
చరణం
charaNam 1
సరసమునను సుమశరు సరి వినుత మా
వర కరుణను సురకిరణం మనమువే
sarasamunanu sumaSaru sari vinuta mA
vara karuNanu surakiraNam manamuvE
చరణం
charaNam 2
సతివ్రతమున సురపతి రతి దనుపరహితకరమున మారుతి మనమువే sativratamuna surapati rati danuparahitakaramuna mAruti manamuvE
చరణం
charaNam 3
వదనమునను మధు నొదిరెదవే
మృదు పదముల మ్రొక్కెద మదన గోప యిం
vadanamunanu madhu nodiredavE
mRdu padamula mrokkeda madana gOpa yim

#164 సరసీరుహ sarasIruha

Titleసరసీరుహ (ప్రతి)sarasIruha (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaమాంజిmAmji
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
సరసీరుహ లోచన రావే వో
కరుణాకరునింకరుదేమి రమ్మనే
sarasIruha lOchana rAvE vO
karuNAkarunimkarudEmi rammanE
చరణం
charaNam 1
విరిబోణిరొ నా విభునకు వేగమే
శరణనుచు మరుడేయు శరముల
దురుకు కును మది గరగెనను మీ
viribONiro nA vibhunaku vEgamE
SaraNanuchu maruDEyu Saramula
duruku kunu madi garagenanu mI
చరణం
charaNam 2
కనకాంగిరోయీ కఠినము లేలనె
జనపతిగనుగొనక నిల్వను
కనికరము చేత నిటు దెల్పవే
kanakAmgirOyI kaThinamu lElane
janapatiganugonaka nilvanu
kanikaramu chEta niTu delpavE
చరణం
charaNam 3
పరదేవుని రేపలెపురవాసుని
కరుణతో స్మరుకేళికిని వేసరక దేగదే సరసీజానన
paradEvuni rEpalepuravAsuni
karuNatO smarukELikini vEsaraka dEgadE sarasIjAnana

#163 మరుబారికి marubAriki

TitleమరుబారికిmarubAriki
Written By
BookprAchIna-navIna
రాగం rAgaమాంజిmAnji
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
మరుబారికి తాళగలేనె యీmarubAriki tALagalEne yI
స్మరమోహన సుందరు బాసి యేమె యీsmaramOhana sumdaru bAsi yEme yI
చరణం
charaNam 1
తమి నాటిన చిత్తము నెంచుచు యీ
శ్రమ నెంతయు నా కమలాగ్రణితో
సమయమరసిటు దెల్పవే కృప సల్పవే
కామినీమణి సామిలేక యామినీ నేనేమిసేయుదు
tami nATina chittamu nemchuchu yI
Srama nemtayu nA kamalAgraNitO
samayamarasiTu delpavE kRpa salpavE
kAminImaNi sAmilEka yAminI nEnEmisEyudu
చరణం
charaNam 2
మదిరాక్షిరో శ్రీ హృదయేశుడు నా
సదనంబునకేగుదు రాయని యే
సుదతి బోధన జేసెనో మది రోసెనో
సదయుడయిన నన్ గదయున రేనిదుర లేకే నెదురు జూచితి
madirAkshirO SrI hRdayESuDu nA
sadanambunakEgudu rAyani yE
sudati bOdhana jEsenO madi rOsenO
sadayuDayina nan gadayuna rEnidura lEkE neduru jUchiti
చరణం
charaNam 3
మలయాద్రి తటి నిలయా నిలుచే
కలకాలము నీ గతి జెందితినే
దలచి నను కృప లాదటే బల్‌వాదటే
బాలరో గోపాలచంద్రుని కేళిలోనే వాలలాడితి
malayAdri taTi nilayA niluchE
kalakAlamu nI gati jemditinE
dalachi nanu kRpa lAdaTE bal^vAdaTE
bAlarO gOpAlachamdruni kELilOnE vAlalADiti

#162 నేనేమి సేతునే nEnEmi sEtunE

Titleనేనేమి సేతునే (ప్రతి)nEnEmi sEtunE (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
నేనేమి సేతునే మానినీnEnEmi sEtunE mAninI
చరణం
charaNam 1
సామి యింటికి రాగ సరసము లేకను భామిని పొమ్మంటినేsAmi yinTiki rAga sarasamu lEkanu
bhAmini pommanTinE
చరణం
charaNam 2
ఒప్పగు తెలివి యొకరి సొత్తు గాదని జెప్పుట నిజమాయెoppagu telivi yokari sottu gAdani jeppuTa nijamAye
చరణం
charaNam 3
మలయానిలము డాయ
చలువరేడుగాయ మైసెగ దోచెనే
malayAnilamu DAya
chaluvarEDugAya maisega dOchenE
చరణం
charaNam 4
సుందరి రేపలె కందర్పజనకునితో
పొందగనైతినే పొందగనైతినే
sundari rEpale kamdarpajanakunitO
pomdaganaitinE pomdaganaitinE

#161 పోపోవే చెలియా pOpOvE cheliyA

Titleపోపోవే చెలియాpOpOvE cheliyA
Written By
BookprAchIna-navIna
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
పోపోవే చెలియా రాప్యాలేpOpOvE cheliyA rApyAlE
చరణం
charaNam 1
అక్కర వేళలో దక్కిన విటులకెక్కడి మమతakkara vELalO dakkina viTulakekkaDi mamata
చరణం
charaNam 2
జారల సమరతి తీరిన వెనుకను దూరేది మరియాదjArala samarati tIrina venukanu dUrEdi mariyAda
చరణం
charaNam 3
వాసిగ నను శ్రీనివాసుడు గూడి
మోసము జేసేనే మోసము జేసేనే
vAsiga nanu SrInivAsuDu gUDi
mOsamu jEsEnE mOsamu jEsEnE
Duplicate of #22?

#160 కమలాకర kamalAkara

Titleకమలాకర (ప్రతి)kamalAkara (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకన్నడkannaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
కమలాకర కన్నెనుర తాళనుర ఓkamalAkara kannenura tALanura O
సమరతి గూడెటి సరళి తెలియదు ఓsamarati gUDeTi saraLi teliyadu O
చరణం
charaNam 1
నాధుని జూచిన ఖేదము నొందక
మోదముచే తను మ్రొక్కిన విడువవు ఓ
nAdhuni jUchina khEdamu nondaka
mOdamuchE tanu mrokkina viDuvavu O
చరణం
charaNam 2
చక్కని సామి మోవి నొక్కుచు గోటను
చెక్కులు స్తనములు జీరిన వేసారితినీ
chakkani sAmi mOvi nokkuchu gOTanu
chekkulu stanamulu jIrina vEsAritinI
చరణం
charaNam 3
సరవితో రేపలె పురవర ముత్యపు
సరములిచ్చెదనని సరసములాడెదవు ఓ
saravitO rEpale puravara mutyapu
saramulichchedanani sarasamulADedavu O

#159 చాలే చాలే chAlE chAlE

This jAvaLi has been published before too. ఈ జావళి ఇంతకుముందు ప్రచురింపబడినది.

Titleచాలే చాలేchAlE chAlE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకన్నడkannaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
చాలే చాలే అలవాని పొందిక చాలే చాలే
యీ లాభము యిక
chAlE chAlE alavAni pomdika chAlE chAlE
yI lAbhamu yika
చరణం
charaNam 1
కలకంఠిరో భూతలమందున యే
కల్లలు బల్కెడు వారితో చెలిమిక
kalakanThirO bhUtalamanduna yE
kallalu balkeDu vAritO chelimika
చరణం
charaNam 2
విరిబోణిరో పోకిరి కుక్కలకేమె
మారుని సరియని కోరి చేరుట యిక
viribONirO pOkiri kukkalakEme
mAruni sariyani kOri chEruTa yika
చరణం
charaNam 3
అలివేణిరో యా నలినాక్షికి యేమొ
కాళ్ళకు మ్రొక్కెడు వారితో స్నేహము
alivENirO yA nalinAkshiki yEmo
kALLaku mrokkeDu vAritO snEhamu
చరణం
charaNam 4
ధరయందున శ్రీ పరవాసునియేమొ
సరిజెప్పను యెవ్వరితరమే యిక
dharayamduna SrI paravAsuniyEmo
sarijeppanu yevvaritaramE yika

#158 యెందుకురా yemdukurA

Titleయెందుకురా (ప్రతి)yemdukurA (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
యెందుకురా కోపముyendukurA kOpamu
మకరాంకుని శరమరయదాకెmakarAmkuni SaramarayadAke
చరణం
charaNam 1
గ్రక్కున నను నీ యక్కున జేర్చగ
చక్కని మోవిని నొక్కితినని
grakkuna nanu nI yakkuna jErchaga
chakkani mOvini nokkitinani
చరణం
charaNam 2
సరగున నను రతి సల్పగ దలచిన
గురుకుచములచే గ్రుమ్మితినని
saraguna nanu rati salpaga dalachina
gurukuchamulachE grummitinani
చరణం
charaNam 3
ధర రేపలెపురవర మందిర మరు
దుర మొనరింపక తొలగి చనెద
dhara rEpalepuravara mandira maru
dura monarimpaka tolagi chaneda