| Title | రమ్మనవే | rammanavE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రమ్మనవే సామిని రమణీమణిరో నను వలచిన యిటు | rammanavE sAmini ramaNImaNirO nanu valachina yiTu |
| చరణం charaNam 1 | ఆదరమున నపరాధము నెంచుట వాదు జేయుట మరియాదగాదు | Adaramuna naparAdhamu nemchuTa vAdu jEyuTa mariyAdagAdu |
| చరణం charaNam 2 | సారెకు నా సరివారిలో నన్నిటు దూరుట నతనికి మేరగాదు | sAreku nA sarivArilO nanniTu dUruTa nataniki mEragAdu |
Tag: Telugu
#156 యెందుకె సామిని yemduke sAmini
| Title | యెందుకె సామిని (ప్రతి) | yemduke sAmini (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | మిశ్రమ | miSrama |
| పల్లవి pallavi | యెందుకె సామిని యేమరి కోరుట సుందరి నాధునితో పొలదుట వలదిక | yemduke sAmini yEmari kOruTa sumdari nAdhunitO poladuTa valadika |
| చరణం charaNam 1 | ఆసతో మున్జేసిన బాసలు మరచియు నోసఖి ప్రేమను బాసియున్నాడట | AsatO mun&jEsina bAsalu marachiyu nOsakhi prEmanu bAsiyunnADaTa |
| చరణం charaNam 2 | నా సరివారిని నాధుడు గనుగొని ఆ సఖి కూడనని బాసలు జేసెనట | nA sarivArini nAdhuDu ganugoni A sakhi kUDanani bAsalu jEsenaTa |
| చరణం charaNam 3 | వసుధ రేపలెపురవాసుడు దానితో కుసుమ శరుకేళిని గూడి యున్నాడట | vasudha rEpalepuravAsuDu dAnitO kusuma SarukELini gUDi yunnADaTa |
#155 ఏలర నాపై Elara nApai
| Title | ఏలర నాపై | Elara nApai |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | మిశ్రమ | miSrama |
| పల్లవి pallavi | ఏలర నాపై బాలుర మోహము బాలమణితో యేమో బాసలుజేసితవట | Elara nApai bAlura mOhamu bAlamaNitO yEmO bAsalujEsitavaTa |
| చరణం charaNam 1 | ఆమెను గూడి రతి అనుభవించితివేమొ మాపటి వేళలో రాపు జేసేవట | Amenu gUDi rati anubhavinchitivEmo mApaTi vELalO rApu jEsEvaTa |
| చరణం charaNam 2 | అలరుబోణి నీతో అలగినదేమో చెలికాడ ననుగూడి బలిమిజేసేవట | alarubONi nItO alaginadEmO chelikADa nanugUDi balimijEsEvaTa |
| చరణం charaNam 3 | హితవుతో పార్థసారథి ననుగూడితె అతివలు జూచితె అపరాధమగునేమొ | hitavutO pArthasArathi nanugUDite ativalu jUchite aparAdhamagunEmo |
#154 సామిని దలచకె sAmini dalachake
| Title | సామిని దలచకె (ప్రతి) | sAmini dalachake (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | సామిని దలచకె సఖి కామిని పతి నిటు ఘనమానసమున | sAmini dalachake sakhi kAmini pati niTu ghanamAnasamuna |
| చరణం charaNam 1 | భామిని జేసిన బాసలు మరువక కామించి యెన్ని దినములు గడపి వేసారితినే | bhAmini jEsina bAsalu maruvaka kAminchi yenni dinamulu gaDapi vEsAritinE |
| చరణం charaNam 2 | సదయుని రాక కెదురెదురే నే జూచి మదనుని బారికిని మగువరోలోనైతినే | sadayuni rAka keduredurE nE jUchi madanuni bArikini maguvarOlOnaitinE |
| చరణం charaNam 3 | యే సఖి గూడెనొ వేడుకచే రేయి నాసరివారిలోన నన్నిటుల జేసెనే | yE sakhi gUDeno vEDukachE rEyi nAsarivArilOna nanniTula jEsenE |
| చరణం charaNam 4 | విటులతో కలిసే విధములు మరి చూచి కటకటాయని నే మది కరగి చింతించితినే | viTulatO kalisE vidhamulu mari chUchi kaTakaTAyani nE madi karagi chimtimchitinE |
| చరణం charaNam 5 | పొలతిరో శ్రీ రేపలె పురవరునితో నే కలసి సుఖించుటకు రుణము కలికిరో లేదాయెనే | polatirO SrI rEpale puravarunitO nE kalasi sukhinchuTaku ruNamu kalikirO lEdAyenE |
#153 యేమని సహింతునే yEmani sahintunE
| Title | యేమని సహింతునే | yEmani sahintunE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | యేమని సహింతునే నేనే కాముని విరిశరముల బారికి | yEmani sahintunE nEnE kAmuni viriSaramula bAriki |
| చరణం charaNam 1 | సామి రాడాయనె నిముసమేడాయనె నా మనవి తెలియబలికె ప్రేమసఖి లేదాయనె | sAmi rADAyane nimusamEDAyane nA manavi teliyabalike prEmasakhi lEdAyane |
| చరణం charaNam 2 | బాలరో యీ చలమేలనె వానికి యే లలనామణి బోధించెనో నేమొ నను మరచెనే | bAlarO yI chalamElane vAniki yE lalanAmaNi bOdhinchenO nEmo nanu marachenE |
| చరణం charaNam 3 | భామరొ కాముని కేళి నన్నేలిన సామి ధరగిరి నిలయునిపై ప్రేమ యెటుల మరతునే | bhAmaro kAmuni kELi nannElina sAmi dharagiri nilayunipai prEma yeTula maratunE |
#152 తరుణిరో సామి taruNirO sAmi
| Title | తరుణిరో సామి (ప్రతి) | taruNirO sAmi (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | తరుణిరో సామి యిటు దయవీడెనే | taruNirO sAmi yiTu dayavIDenE |
| చరణం charaNam 1 | మరుపాయ మునుపటి మక్కువ నాధునికే సరసిజాక్షి జెప్పెనేమొ సరసుడు నాపైని చలము బూనెనె చెలి | marupAya munupaTi makkuva nAdhunikE sarasijAkshi jeppenEmo sarasuDu nApaini chalamu bUnene cheli |
| చరణం charaNam 2 | మగువరొ చెలియచే మరి రాయబారము తగునని బంపినను తరలాక్షి మనమున దలచ దాయెనే | maguvaro cheliyachE mari rAyabAramu tagunani bampinanu taralAkshi manamuna dalacha dAyenE |
| చరణం charaNam 3 | వనిత శ్రీ కూల్లిపర వంశజుడు శ్రీరాములు ఘన మరుబారికి గలయ ద్రోచినం గలయడాయెనే | vanita SrI kUllipara vamSajuDu SrIrAmulu ghana marubAriki galaya drOchinam galayaDAyenE |
#151 ఘనరాయ ghanarAya
| Title | ఘనరాయ | ghanarAya |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఘనరాయ రాయుని బిల్వబోనె యనెనె చెలి | ghanarAya rAyuni bilvabOne yanene cheli |
| చరణం charaNam 1 | అబలనైనను నాపై అలుక బూనకు మంటి హై సోమ జాహోన్మేయని యా దర్బాల యించి యాజ్ మేలాయనెనె | abalanainanu nApai aluka bUnaku mamTi hai sOma jAhOnmEyani yA darbAla yinchi yaaz mElAyanene |
| చరణం charaNam 2 | తగదు చైబట్టుట మగనాలనే నంటె అగజారి చుంబిణీ వోనై యాతో కంజార్ దేఖో యనెనె చెలీ | tagadu chaibaTTuTa maganAlanE nanTe agajAri chumbiNI vOnai yAtO kamjAr dEkhO yanene chelI |
| చరణం charaNam 3 | అత్తమామలు వింటే రిత్తకాపురమవునంటే అత్త గిత్త కుచ్చు నై కర్తె గిర్తె తు క్యావు యిదరానెనె | attamAmalu vinTE rittakApuramavunanTE atta gitta kuchchu nai karte girte tu kyAvu yidarAnene |
| చరణం charaNam 4 | సరస గోపాలనాడు సంగతి చాలించుమంటే అంగుబడ్డ సమయమందు చెంగులు వదలదీసి వాడేమో జేసెనె | sarasa gOpAlanADu samgati chAlinchumanTE angubaDDa samayamamdu chengulu vadaladIsi vADEmO jEsene |
#150 నాధుని మనమున nAdhuni manamuna
| Title | నాధుని మనమున (ప్రతి) | nAdhuni manamuna (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ధన్యాశి | dhanyASi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | నాధుని మనమున నమ్మగరాదె బాధకు తాళనె భామిని వాడె | nAdhuni manamuna nammagarAde bAdhaku tALane bhAmini vADe |
| చరణం charaNam 1 | బాసలు నిజమని మోసము నే పోతి నా సఖుడిటు జేయ న్యాయమె నాతి | bAsalu nijamani mOsamu nE pOti nA sakhuDiTu jEya nyAyame nAti |
| చరణం charaNam 2 | యేమని మదిలోన యెంచెనోగాని కామిని గూడెనె కాంతరో పూని | yEmani madilOna yemchenOgAni kAmini gUDene kAmtarO pUni |
| చరణం charaNam 3 | కమ్మవిల్తుడు పువ్వుటమ్ముల నేయ కొమ్మరో కోరిక కొనసాగదాయ | kammaviltuDu puvvuTammula nEya kommarO kOrika konasAgadAya |
| చరణం charaNam 4 | సరసులకీ లక్షణమునె గాన మరుకేళి గూడి నన్ మరచెనే చాన | sarasulakI lakshaNamune gAna marukELi gUDi nan marachenE chAna |
| చరణం charaNam 5 | ధరణి శ్రీ రేపలె పురవరు నందు మరులు మించెనిక మగువ యేమందు | dharaNi SrI rEpale puravaru namdu marulu mimchenika maguva yEmandu |
#149 నా సామియని nA sAmiyani
| Title | నా సామియని | nA sAmiyani |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ధన్యాశి | dhanyASi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | నా సామియని బిలచినా వేగరాడే ఓ సఖి నీవైన యిక తోడి తేవే | nA sAmiyani bilachinA vEgarADE O sakhi nIvaina yika tODi tEvE |
| చరణం charaNam 1 | మ్రొక్కి వేడిన జూచి మోమటు జేసెనె చక్కెర విలుకాడు శరముల నేసెనె | mrokki vEDina jUchi mOmaTu jEsene chakkera vilukADu Saramula nEsene |
| చరణం charaNam 2 | సరసుడు లేని యీ జన్మమదేలనే పురుషులతో గూడే పొందిక చాలునే | sarasuDu lEni yI janmamadElanE purushulatO gUDE pomdika chAlunE |
| చరణం charaNam 3 | నెలతవాని బాసి నే తాళలేను చెలువుని పై బాళీ చే సొక్కె మేను | nelatavAni bAsi nE tALalEnu cheluvuni pai bALI chE sokke mEnu |
| చరణం charaNam 4 | వలప నెడెటువంటి వస్తువో గాన కలనైన మరువ నా కనుల నా చాన | valapa neDeTuvamTi vastuvO gAna kalanaina maruva nA kanula nA chAna |
#148 చలమూనెనె chalamUnene
| Title | చలమూనెనె (ప్రతి) | chalamUnene (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | చలమూనెనె చెలియా నా విభుడు | chalamUnene cheliyA nA vibhuDu |
| చరణం charaNam 1 | మది అలరువిలతు ములుకులకు నులికెనె చెలియా నా | madi alaruvilatu mulukulaku nulikene cheliyA nA |
| చరణం charaNam 2 | యీ వింత యేమో తెలియదు నన్నేమరి మదిని వరభావజా శరీరుడనన్ బ్రోవక చెలియా నా | yI vimta yEmO teliyadu nannEmari madini varabhAvajA SarIruDanan brOvaka cheliyA nA |
| చరణం charaNam 3 | వాడెంతగా నన్బాయనని బాస బలికీ యా చేడె తోడగూడి నేడు వీడెనే చెలియా | vADemtagA nan&bAyanani bAsa balikI yA chEDe tODagUDi nEDu vIDenE cheliyA |
| చరణం charaNam 4 | యీ ధారుణిలో రేపలె పురనాధుని సముఖమున వాదభేద మోదమునం గాదనె చెలియా | yI dhAruNilO rEpale puranAdhuni samukhamuna vAdabhEda mOdamunam gAdane cheliyA |