#147 ఈ విరహమెటులోర్తునే I virahameTulOrtunE

Titleఈ విరహమెటులోర్తునేI virahameTulOrtunE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
ఈ విరహమెటులోర్తునే చెలియాI virahameTulOrtunE cheliyA
చరణం
charaNam 1
నేనేమి సేతు నా మనోహరుండు రాడటే
నా సామి కేమిఠారి దూరి చెప్పెనో చెలియా
nEnEmi sEtu nA manOharumDu rADaTE
nA sAmi kEmiThAri dUri cheppenO cheliyA
చరణం
charaNam 2
యెందాక సయితు వానిబాసి
యీ సుమశరుని చిగురాకు బాకుచే
కుచంబు దాకునే చెలియా
yemdAka sayitu vAnibAsi
yI sumaSaruni chigurAku bAkuchE
kuchambu dAkunE cheliyA
చరణం
charaNam 3
రతికేళి వేళ నేల సోమరాళగామినీ
నే తాళజాల బాలచంద్ర సామిని బాశీ
ratikELi vELa nEla sOmarALagAminI
nE tALajAla bAlachamdra sAmini bASI

#146 తాళజాలనే tALajAlanE

Titleతాళజాలనే (ప్రతి)tALajAlanE (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
తాళజాలనే యిక తాళజాలనేtALajAlanE yika tALajAlanE
చరణం
charaNam 1
బాల కాముకేళి గూడవే
చాల కఠినమేల విడవే
bAla kAmukELi gUDavE
chAla kaThinamEla viDavE
చరణం
charaNam 2
కన్నె మరులు కొన్నవాడను
మన్ననతో నిన్ను వీడను
kanne marulu konnavADanu
mannanatO ninnu vIDanu
చరణం
charaNam 3
యింతి నీకు యంత రోసమే
వంత బెట్టవద్దు దోసమే
yimti nIku yamta rOsamE
vamta beTTavaddu dOsamE
చరణం
charaNam 4
మందయాన యేమిసేతునే
మగువా వలపునెట్లు దాతునే
mamdayAna yEmisEtunE
maguvA valapuneTlu dAtunE
చరణం
charaNam 5
రేపలే పురీశు సాక్షిగా
బాపవేల బాధ వేవేగ
rEpalE purISu sAkshigA
bApavEla bAdha vEvEga

#145 వేళగాదుర vELagAdura

TitleవేళగాదురvELagAdura
Written By
BookprAchIna-navIna
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
వేళగాదుర నా సామీ వేళ గాదురvELagAdura nA sAmI vELa gAdura
చరణం
charaNam 1
ముద్దుబెట్ట వద్దు చాలుర
సద్దు సేయరాదు తాళర
muddubeTTa vaddu chAlura
saddu sEyarAdu tALara
చరణం
charaNam 2
సన్నసయిగ జేసే వేళరా
వెన్నుడనే మగనాలర
sannasayiga jEsE vELarA
vennuDanE maganAlara
చరణం
charaNam 3
సామి ధరగిరి నిలయా
సమయము గాని కలియా
sAmi dharagiri nilayA
samayamu gAni kaliyA

#144 తెలియనైతినె teliyanaitine

Titleతెలియనైతినె (ప్రతి)teliyanaitine (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహంసధ్వనిhamsadhwani
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
తెలియనైతినె జలజాక్షి మరిteliyanaitine jalajAkshi mari
పలువిధముల పలుకరించినెpaluvidhamula palukarimchine
చరణం
charaNam 1
అందరాని పండ్ల గాసజెందిన
పొందుగాను వృధాపోవునని నే
amdarAni pamDla gAsajemdina
pomdugAnu vRdhApOvunani nE
చరణం
charaNam 2
స్త్రీలమనసు నమ్మజెల్లదనుచు
చాలగాను విని సరసిజాక్షి నే
strIlamanasu nammajelladanuchu
chAlagAnu vini sarasijAkshi nE
చరణం
charaNam 3
మటుమాయచే నిటుజేయవని
కటకటమది గరగించి నే
maTumAyachE niTujEyavani
kaTakaTamadi garagimchi nE
చరణం
charaNam 4
వాసిగ రేపలె వాసుని నను
గాసిబెట్టు మది గరుగ దాని నే
vAsiga rEpale vAsuni nanu
gAsibeTTu madi garuga dAni nE

#143 నను గన్నతల్లి nanu gannatalli

Titleనను గన్నతల్లిnanu gannatalli
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహంసధ్వనిhamsadhwani
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
నను గన్నతల్లి నా భాగ్యమా
నారాయణీ ధర్మాంబికే
nanu gannatalli nA bhAgyamA
nArAyaNI dharmAmbikE
కనకాంగి రమాపతి సోదరీ
కరుణించవే కాత్యాయనీ
kanakAmgi ramApati sOdarI
karuNimchavE kAtyAyanI
చరణం
charaNam 1
కావు కావుమని నే మొరబెట్టగా
కరుగదేమి మది కమలలోచనీ
నీవు బ్రోవకున్న నెవరు బ్రోతురే
స్థావరంబొసగు త్యాగరాజనుత
kAvu kAvumani nE morabeTTagA
karugadEmi madi kamalalOchanI
nIvu brOvakunna nevaru brOturE
sthAvarambosagu tyAgarAjanuta

Not a jAvaLi. Multiple performances available on youtube and elsewhere. However, many sites seem to claim this to be in a different rAga or taLa. Found an interesting post at http://guruguha.org/blog/2016/10/29/true-identity-raga-tyagarajas-nannu-kanna-talli/

#142 సారసముఖిరో sArasamukhirO

Titleసారసముఖిరో (ప్రతి)sArasamukhirO (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సారసముఖిరో నా సామిని దేవే
సామిని దేవే నా సామిని దేవే
sArasamukhirO nA sAmini dEvE
sAmini dEvE nA sAmini dEvE
చరణం
charaNam 1
మానశీరాకారుడే సుదతిని గూడెనె
మానిని దయలేక మది నను వీడే
mAnaSIrAkAruDE sudatini gUDene
mAnini dayalEka madi nanu vIDE
చరణం
charaNam 2
కాంతుడు నను యేకాంతమునందున
కంతుని కేళిగూడ ఘనుడిటురాడే
kAmtuDu nanu yEkAmtamunamduna
kamtuni kELigUDa ghanuDiTurADE
చరణం
charaNam 3
వనిత శ్రీరేపలెవాసుడు తన మది
ఘనమనుకొని నను గాసిలజేసె
vanita SrIrEpalevAsuDu tana madi
ghanamanukoni nanu gAsilajEse

#140 మరచేవారెవరె marachEvArevare

Titleమరచేవారెవరె (ప్రతి)marachEvArevare (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
మరచేవారెవరె సామినిmarachEvArevare sAmini
చరణం
charaNam 1
పురుషుల నమ్మగ పొలతిరో వద్దని
తరుణులు జెప్పిన కరిని వానిదలచి
purushula nammaga polatirO vaddani
taruNulu jeppina karini vAnidalachi
చరణం
charaNam 2
చిత్రముగా రతి జేసిన వేళలో
మైత్రిని మనమున మానవతి దలచి
chitramugA rati jEsina vELalO
maitrini manamuna mAnavati dalachi
చరణం
charaNam 3
వనిత రేపలెపుర వాసుని చరితలు
విని బహు మదమున వివరించు చెలులలో
vanita rEpalepura vAsuni charitalu
vini bahu madamuna vivarimchu chelulalO

#139 దెలిపే వారెవరే delipE vArevarE

Titleదెలిపే వారెవరేdelipE vArevarE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
దెలిపే వారెవరే సామికిdelipE vArevarE sAmiki
చరణం
charaNam 1
కాముని బారికి సోకువలేనే
కూరిమి దానితో గూడి యుండెటివేళ
kAmuni bAriki sOkuvalEnE
kUrimi dAnitO gUDi yumDeTivELa
చరణం
charaNam 2
మాలిమితో నన్నేలిన బాలగోపాలునికీ
జాలము తగదని
mAlimitO nannElina bAlagOpAlunikI
jAlamu tagadani
చరణం
charaNam 3
సారెకు దానితో సరసములాడుట
మేరగాదని నా మేలు వానితొ నేడు
sAreku dAnitO sarasamulADuTa
mEragAdani nA mElu vAnito nEDu
చరణం
charaNam 4
వేమరు సురపురి వేణుగోపాలుని
కాముని కేళికి కలయ రమ్మనుమని
vEmaru surapuri vENugOpAluni
kAmuni kELiki kalaya rammanumani

#138 యాలరాడేమే చెలి yAlarADEmE cheli

Titleయాలరాడేమే చెలి (ప్రతి)yAlarADEmE cheli (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహగ్bEhag
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యాలరాడేమే చెలి తాళలేనె చేడెరో నావాడేyAlarADEmE cheli tALalEne chEDerO nAvADE
చరణం
charaNam 1
బాలరో మును బాయనని బాస జేసినే
యిపుడేలా బాసెనే
bAlarO munu bAyanani bAsa jEsinE
yipuDElA bAsenE
చరణం
charaNam 2
పంతగించి నాయడ బల్ పగగ నెంచెనె
యిది యెంత వంచనె
pamtagimchi nAyaDa bal pagaga nemchene
yidi yemta vamchane
చరణం
charaNam 3
ముదితరొ వాని రాకకు నే
నెదురు చూడగ నన్ను దయజూచెగా
muditaro vAni rAkaku nE
neduru chUDaga nannu dayajUchegA
చరణం
charaNam 4
భామరొ రేపల్లెపుర గోపాలధరుడే
యిక సామి గూడడె
bhAmaro rEpallepura gOpAladharuDE
yika sAmi gUDaDe

#137 సామి రాడేమందునే sAmi rADEmamdunE

ఈ జావళి ఇంతకుముందు ప్రచురించబడినది. This jAvaLi appeared in an earlier post too.

Titleసామి రాడేమందునేsAmi rADEmamdunE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహగ్bEhag
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
సామి రాడేమందునే చానరో తోడితేవే
నిమిషము తామసింపనే
sAmi rADEmamdunE chAnarO tODitEvE
nimishamu tAmasimpanE
చరణం
charaNam 1
కోమలాంగి వానిబాసి యెటుల సయితునే
యీ వలపెటుల దాతునే
kOmalAmgi vAnibAsi yeTula sayitunE
yI valapeTula dAtunE
చరణం
charaNam 2
యిందుముఖీ వానికెంతటి మందుబెట్టెనో
యెంతటి మాయజేసెనో
yimdumukhI vAnikemtaTi mamdubeTTenO
yemtaTi mAyajEsenO
చరణం
charaNam 3
ముందు నను గూడిన బాలచంద్రకాంతుడే
వాడతి సుందరాంగుడే
mumdu nanu gUDina bAlachamdrakAmtuDE
vADati sumdarAmguDE