| Title | సరసుడవని (ప్రతి) | sarasuDavani (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సరసుడవని నమ్మితిరా జాలమేర కరుణాకర నన్ గలియర ధీర | sarasuDavani nammitirA jAlamEra karuNAkara nan galiyara dhIra |
| చరణం charaNam 1 | మునుపటివలెనే ముదమున నీతో నెనయక నుంటిని యేమిర నేరము | munupaTivalenE mudamuna nItO nenayaka numTini yEmira nEramu |
| చరణం charaNam 2 | విరిశరు బారికి వరద నేతాళర సరసిజాక్షి బల్ చలమిటు బూనెర | viriSaru bAriki varada nEtALara sarasijAkshi bal chalamiTu bUnera |
| చరణం charaNam 3 | బాయక రేపలె బాలగోప రతి జేయక కోపము సేయుట మేర | bAyaka rEpale bAlagOpa rati jEyaka kOpamu sEyuTa mEra |
Tag: Telugu
#135 మధుకర నికర madhukara nikara
| Title | మధుకర నికర | madhukara nikara |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మధుకర నికర సమానవేణి ధీర మదగజ గామిని మరచితివేమొకో సదయుని పాదసేవ చాల నమ్మినదిర | madhukara nikara samAnavENi dhIra madagaja gAmini marachitivEmokO sadayuni pAdasEva chAla namminadira |
| చరణం charaNam 1 | వలచిన దానిపై వంచన లేలర సలలిత గుణసాంద్ర సామి మ్రొక్కేనుర | valachina dAnipai vamchana lElara salalita guNasAmdra sAmi mrokkEnura |
| చరణం charaNam 2 | రతిపతి కేళిని రమణి నొప్పింపర* సతతము నేలుకో సామి వేంకటరమణ | ratipati kELini ramaNi noppimpara satatamu nElukO sAmi vEmkaTaramaNa |
- noppimpakura?
#134 నలినాక్షి సామిని nalinAkshi sAmini
| Title | నలినాక్షి సామిని (ప్రతి) | nalinAkshi sAmini (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | నలినాక్షి సామిని నమ్మరాదే చెలి తలచియు మదిలోన దరుణిరో చాలునే | nalinAkshi sAmini nammarAdE cheli talachiyu madilOna daruNirO chAlunE |
| చరణం charaNam 1 | యే చెలి గూడనని యిందు నమ్మికలిచ్చి ఆ చెలిని కలిసి అలసి యున్నాడట | yE cheli gUDanani yimdu nammikalichchi A chelini kalisi alasi yunnADaTa |
| చరణం charaNam 2 | నాసాటి వనితలు నవ్వగ విడనాడి మోసము చేసెనే ముందు యోచించక | nAsATi vanitalu navvaga viDanADi mOsamu chEsenE mumdu yOchimchaka |
| చరణం charaNam 3 | రమణిరో రేపలె రాజగోపాలుడే సమయమునను యా సఖిని విడననెనే | ramaNirO rEpale rAjagOpAluDE samayamunanu yA sakhini viDananenE |
#133 వేగ రమ్మనవే vEga rammanavE
| Title | వేగ రమ్మనవే | vEga rammanavE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | వేగ రమ్మనవే సామినిందు సఖి | vEga rammanavE sAminimdu sakhi |
| చరణం charaNam 1 | మదనుని బారికి మదినోర్వజాలనే సదయుని కింత దయలేదే వేగమె | madanuni bAriki madinOrvajAlanE sadayuni kimta dayalEdE vEgame |
| చరణం charaNam 2 | అలదాని మాయకు వలచిన సామికి తలపనే మందు తలకెక్కె వేగమే | aladAni mAyaku valachina sAmiki talapanE mamdu talakekke vEgamE |
| చరణం charaNam 3 | వెద్దిర యెవతో విభు నెడబాపెనె నిద్దుర కంటికి రాదుగదే వేగమె | veddira yevatO vibhu neDabApene niddura kamTiki rAdugadE vEgame |
| చరణం charaNam 4 | వన్నెలాడిరొ మైసూరి కృష్ణుని క్రొన్నన విల్తుని కేళికి వేగమే | vannelADiro maisUri kRshNuni kronnana viltuni kELiki vEgamE |
#132 చెలియరో cheliyarO
| Title | చెలియరో (ప్రతి) | cheliyarO (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | మాంజి | mAmji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చెలియరో రావే చెలువుని దేవే వలరాజు బారికీ వనిత నేనోర్వనే | cheliyarO rAvE cheluvuni dEvE valarAju bArikI vanita nEnOrvanE |
| చరణం charaNam 1 | కలువల రాయుని కాక మెండాయనే చిలుకలు గుమిగూడి కలకల గూసెనే | kaluvala rAyuni kAka memDAyanE chilukalu gumigUDi kalakala gUsenE |
| చరణం charaNam 2 | మధుకర నికరము మగువచందుని మ్రోయ మదిరాక్షి వాని బాయ మరపు రాదాయె | madhukara nikaramu maguvachamduni mrOya madirAkshi vAni bAya marapu rAdAye |
| చరణం charaNam 3 | నలినాక్షి శ్రీరేపలె నాగశయనుడే చలము జేయదు సరసుడు రాడే | nalinAkshi SrIrEpale nAgaSayanuDE chalamu jEyadu sarasuDu rADE |
#131 నను బ్రోవరాదా nanu brOvarAdA
| Title | నను బ్రోవరాదా | nanu brOvarAdA |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | మాంజి | mAmji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | నను బ్రోవరాద నా మీద దయలేదా | nanu brOvarAda nA mIda dayalEdA |
| చరణం charaNam 1 | వటపత్ర శాయి నాతో వాదమేల మానుమిక | vaTapatra SAyi nAtO vAdamEla mAnumika |
| చరణం charaNam 2 | సరివారు నవ్వేరని చాల నీతో మొరబెట్టగ వెరవకు మని నన్ను వేగమే కరము బట్టి | sarivAru navvErani chAla nItO morabeTTaga veravaku mani nannu vEgamE karamu baTTi |
#130 మరుని జనక maruni janaka
| Title | మరుని జనక (ప్రతి) | maruni janaka (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మరుని జనక యిది మంచి వేళగాదుర సరసములాడకుర సామి మ్రొక్కేనుర | maruni janaka yidi mamchi vELagAdura sarasamulADakura sAmi mrokkEnura |
| చరణం charaNam 1 | కన్ను లెస్స గీటి కౌగలింప మేటి వని నమ్మియుంటి వదలు తమ్మికంటి | kannu lessa gITi kaugalimpa mETi vani nammiyumTi vadalu tammikamTi |
| చరణం charaNam 2 | నే మగనాలను నేరమెంచుటేలను ప్రేమతోడ ముద్దులను బెట్టుకొనుట చాలును | nE maganAlanu nEramemchuTElanu prEmatODa muddulanu beTTukonuTa chAlunu |
| చరణం charaNam 3 | సామిరేపలెపురి ధామ విను మురహర కాముని కేళిలోను కలియుట మాను | sAmirEpalepuri dhAma vinu murahara kAmuni kELilOnu kaliyuTa mAnu |
#129 వాని యెడబాసి vAni yeDabAsi
| Title | వాని యెడబాసి | vAni yeDabAsi |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వాని యెడబాసి నేనెటులోర్తునే కానిదానితో గూడి కనబడడే చెలి | vAni yeDabAsi nEneTulOrtunE kAnidAnitO gUDi kanabaDaDE cheli |
| చరణం charaNam 1 | చిన్నవయసు నుండి చేరి నాతో తన చిన్నెలు చేసినను చిన్నబుచ్చెనే చెలి | chinnavayasu numDi chEri nAtO tana chinnelu chEsinanu chinnabuchchenE cheli |
| చరణం charaNam 2 | యిచ్చలతో నను నిండు కౌగిలించి మచ్చిక చేసి నను మరచెగదే చెలి | yichchalatO nanu nimDu kaugilimchi machchika chEsi nanu marachegadE cheli |
| చరణం charaNam 3 | ధరనిలయు శ్రీరంగధాముడు ననుగూడి నిరతము బాయనని నన్నేచెగదే చెలి | dharanilayu SrIramgadhAmuDu nanugUDi niratamu bAyanani nannEchegadE cheli |
#128 సుదతిరొ sudatiro
| Title | సుదతిరొ (ప్రతి) | sudatiro (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సుదతిరొ సామిని జూపవె సదయుని రమ్మనె | sudatiro sAmini jUpave sadayuni rammane |
| చరణం charaNam 1 | మదన జనకుడెడబాసీ యేమగువనొ డాసీ మదనుని కేళిని గూడెనె | madana janakuDeDabAsI yEmaguvano DAsI madanuni kELini gUDene |
| చరణం charaNam 2 | నా మీదను నెనరుంచీ ప్రేమతోను మన్నించి భామిని వరు రప్పించవె | nA mIdanu nenarumchI prEmatOnu mannimchi bhAmini varu rappimchave |
| చరణం charaNam 3 | ఆస తోడ మును బాస చేసిన రేపలెవాసుడు మోసము చేసెనే | Asa tODa munu bAsa chEsina rEpalevAsuDu mOsamu chEsenE |
#126 యింతి దుఃఖమెట్లు yimti du@HkhameTlu
| Title | యింతి దుఃఖమెట్లు (ప్రతి) | yimti du@HkhameTlu (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యింతి దుఃఖమెట్లు సయితునే ఓ చెలియ నే | yimti du@hkhameTlu sayitunE O cheliya nE |
| కాంత మందు తలకెక్కి కాంతుడు రాడాయనె | kAmta mamdu talakekki kAmtuDu rADAyane | |
| చరణం charaNam 1 | శుకపికములు గూయ సుదతిరో చంద్రుడు గాయ ప్రకటితముగ మరుడు నాపై బాణంబులు వేయగ | Sukapikamulu gUya sudatirO chamdruDu gAya prakaTitamuga maruDu nApai bANambulu vEyaga |
| చరణం charaNam 2 | ముదముతో మును పాడిన ముచ్చటలేమాయనొ సదయునకు నన్ను విడుట సంతోషము దోచెనో | mudamutO munu pADina muchchaTalEmAyano sadayunaku nannu viDuTa samtOshamu dOchenO |
| చరణం charaNam 3 | వాసిగ శ్రీ రేపలెపురవాసుడు కలయక నన్ను గాసిబెట్ట దలచి సుంత కరుణలేక యుండెనే | vAsiga SrI rEpalepuravAsuDu kalayaka nannu gAsibeTTa dalachi sumta karuNalEka yumDenE |