#125 యెంత పాపము yemta pApamu

Titleయెంత పాపముyemta pApamu
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యెంత పాపమింతినైతినే చెలిyemta pApamimtinaitinE cheli
పంతగించి పోయ్యే సామి బతిమాలిన రాడుగదెpamtagimchi pOyyE sAmi batimAlina rADugade
చరణం
charaNam 1
కృప దొలంగి విభుడు చాల గినిసి వేసిపోయెగా
చపలనేత్ర యెట్లు సయితు సరసుని గురు విరహ తాప
kRpa dolamgi vibhuDu chAla ginisi vEsipOyegA
chapalanEtra yeTlu sayitu sarasuni guru viraha tApa
చరణం
charaNam 2
పలుకు పలుకులకు తేనియ లొలుకు మాటలాడు వాని
వలచి మోసపోయితిని కిసలయపాణి యేమిసేతు
paluku palukulaku tEniya loluku mATalADu vAni
valachi mOsapOyitini kisalayapANi yEmisEtu
చరణం
charaNam 3
దివిజపతి ముఖ వినుత బలదేవ రసికభుజగవరుని
యవిరళ రతిసుఖ సంపదలబ్బునో యిక నబ్బదో చెలి
divijapati mukha vinuta baladEva rasikabhujagavaruni
yaviraLa ratisukha sampadalabbunO yika nabbadO cheli

#124 సామిగ నీమది sAmiga nImadi

Titleసామిగ నీమది (ప్రతి)sAmiga nImadi (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సామిగ నీమది కేమని దోచెర
కాముని కేళిలో గలయగ రావేర
sAmiga nImadi kEmani dOchera
kAmuni kELilO galayaga rAVEra
చరణం
charaNam 1
ఆ సఖి యే బోధ జేసెనుర నీకు
జేసిన బాసలు చెలికాడ మరచి
A sakhi yE bOdha jEsenura nIku
jEsina bAsalu chelikADa marachi
చరణం
charaNam 2
స్నేహము జేసియు చెలిమితో నను
మోహింపగా జేసి మోసమిటుల జేయ
snEhamu jEsiyu chelimitO nanu
mOhimpagA jEsi mOsamiTula jEya
చరణం
charaNam 3
ధరను శ్రీరేపలెపురహరి నీకే
మరులు కొంటినని మన్నన జేయకనే
dharanu SrIrEpalepurahari nIkE
marulu komTinani mannana jEyakanE

#123 యేమిర నాసామి yEmira nAsAmi

Titleయేమిర నాసామిyEmira nAsAmi
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశంకరాభరణంSamkarAbharaNam
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
యేమిర నాసామి నీకిది తగున
కామినుల యెడనిట్టి నీమవు మాటలకును
yEmira nAsAmi nIkidi taguna
kAminula yeDaniTTi nImavu mATalakunu
చరణం
charaNam 1
నిన్న రేయి వచ్చేవనీ నిద్రలేక వేసారితి
వన్నెలాడి నీతో మరి కన్నుసయిగ చేసెనేమొ
ninna rEyi vachchEvanI nidralEka vEsAriti
vannelADi nItO mari kannusayiga chEsenEmo
చరణం
charaNam 2
అతివరో వచ్చేనని ఆనబెట్టి పోతివిర
ప్రాణనాధ నీవే బల్ జాణవే శభాసుర
ativarO vachchEnani AnabeTTi pOtivira
prANanAdha nIvE bal jANavE SabhAsura
చరణం
charaNam 3
తప్పక సురపురి దైవరాయ గోపాల
ఇప్పుడైన గూడమంటె తప్పుమాటలాడెదవే
tappaka surapuri daivarAya gOpAla
ippuDaina gUDamanTe tappumATalADedavE

#122 యేమి సేతునే yEmi sEtunE

Titleయేమి సేతునే (ప్రతి)yEmi sEtunE (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యేమి సేతునే ఓ సఖీ
కామిని మణి గూడి వాడు
కనుల జూడడాయె సఖి
yEmi sEtunE O sakhI
kAmini maNi gUDi vADu
kanula jUDaDAye sakhi
చరణం
charaNam 1
మందగమన వాని మనసు నందు నేమి దోచెనేమొ
ఇందీవరాక్షి బెట్టు మందు తలకెక్కె సఖి
mamdagamana vAni manasu namdu nEmi dOchenEmo
imdIvarAkshi beTTu mamdu talakekke sakhi
చరణం
charaNam 2
నా సరివారిలో నన్ను నగుబాటు జేసి మున్ను
జేసిన బాసలేమి జేసి మరచెనే వో సఖీ
nA sarivArilO nannu nagubATu jEsi munnu
jEsina bAsalEmi jEsi marachenE vO sakhI
చరణం
charaNam 3
మగువరో పురుషుల నమ్మదగదని కొందరు దెల్ప
జగతిని యా మాట నిజము సల్పినాడే వో సఖి నే
maguvarO purushula nammadagadani komdaru delpa
jagatini yA mATa nijamu salpinADE vO sakhi nE
చరణం
charaNam 4
రేపల్లె పురీషుడైన గోపాలుడీ సమయమందు
పాపమంచు మదినెంచక పంతగించెనే యో సఖీ
rEpalle purIshuDaina gOpAluDI samayamamdu
pApamamchu madinemchaka pamtagimchenE yO sakhI

#121 యెట్లు సైతుర yeTlu saitura

Titleయెట్లు సైతురyeTlu saitura
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యెట్లు సైతుర నా సామిyeTlu saitura nA sAmi
చరణం
charaNam 1
పెదవిమీది పంటికాటు యెదటి దాని చంటి పోటు
కదసి కీల్జడ వెన్నున వేటు కనులజూచితే నా సామి
pedavimIdi pamTikATu yedaTi dAni chamTi pOTu
kadasi kIljaDa vennuna vETu kanulajUchitE nA sAmi
చరణం
charaNam 2
భయములేక దానెనశి పగలు రాత్రి యొకటి జేసి
వయసు చెలికి దారబోసి వచ్చి నిలచితే నా సామి
bhayamulEka dAnenaSi pagalu rAtri yokaTi jEsi
vayasu cheliki dArabOsi vachchi nilachitE nA sAmi
చరణం
charaNam 3
ముద్దుసామి వెంకటరాయ వద్దికతో పొందుసేయ
వద్దని నే వాదుసేయ వచ్చి జూచితే నా సామి
muddusAmi vemkaTarAya vaddikatO pomdusEya
vaddani nE vAdusEya vachchi jUchitE nA sAmi

#120 కరుణ జూడర karuNa jUDara

Titleకరుణ జూడర (ప్రతి)karuNa jUDara (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
కరుణ జూడర నన్నుkaruNa jUDara nannu
సరసిజాక్ష నిన్ను మది చాల నెరనమ్మినారsarasijAksha ninnu madi chAla neranamminAra
చరణం
charaNam 1
విరహమనె సాగరము వెలది నెట్లుగడచుదాన
కరుణానిధి ప్రేమ నను కాముకేళిగూడి మదిని
virahamane sAgaramu veladi neTlugaDachudAna
karuNAnidhi prEma nanu kAmukELigUDi madini
చరణం
charaNam 2
వసుధ వెలయు రేపల్లె పురవరగోపాల బాల రార
రసికుడ సుందరాకార రాపేల జేసేవేరా
vasudha velayu rEpalle puravaragOpAla bAla rAra
rasikuDa sumdarAkAra rApEla jEsEvErA

#119 చిన్నదానర chinnadAnara

Titleచిన్నదానరchinnadAnara
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
చిన్నదానర నే
కన్ను దోయి కెంపు దోచె కన్నెలుకేమిరా! నే
chinnadAnara nE
kannu dOyi kempu dOche kannelukEmirA! nE
చరణం
charaNam 1
మగని మోము జూచి నేను దిగలు చెంది యుండగ
పొగరు మాటలాడినన్నగడు జేతువేమిర నే
magani mOmu jUchi nEnu digalu chemdi yumDaga
pogaru mATalADinannagaDu jEtuvEmira nE
చరణం
charaNam 2
చెక్కు నొక్కి లేత చన్నుముక్కులు నలిపేవుర
పుక్కిట విడెమిచ్చి నను స్రుక్కజేతు వేమిర నే
chekku nokki lEta channumukkulu nalipEvura
pukkiTa viDemichchi nanu srukkajEtu vEmira nE
చరణం
charaNam 3
రత్నపురి నిలయ ప్రయత్నముతో నన్నుగూడి
ముత్యసరులిత్తునని ముచ్చటింతు వేమిర నే
ratnapuri nilaya prayatnamutO nannugUDi
mutyasarulittunani muchchaTimtu vEmira nE

#118 సుందరాకారుని sumdarAkAruni

Titleసుందరాకారుని (ప్రతి)sumdarAkAruni (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
సుందరాకారుని యిందుదే గదవే
పొందుగోరి భ్రమజెందితి ననవే
sumdarAkAruni yimdudE gadavE
pomdugOri bhramajemditi nanavE
చరణం
charaNam 1
మగువ జేసిన బాస మరువకు మనవె
చిగురువిల్తుని బారిజిక్కితి ననవే
maguva jEsina bAsa maruvaku manave
chiguruviltuni bArijikkiti nanavE
చరణం
charaNam 2
కమలారి వెన్నెలగాయ వేదనచే
రమణీ యోర్వదివే రాపేల ననవే
kamalAri vennelagAya vEdanachE
ramaNI yOrvadivE rApEla nanavE
చరణం
charaNam 3
సుదతుల యెడ కఠిన హృదయము బూన
పదపడి యిత్తరి పాడి గాదనవే
sudatula yeDa kaThina hRdayamu bUna
padapaDi yittari pADi gAdanavE
చరణం
charaNam 4
రామశ్రీ రేపల్లె రాట్టిరీశుని
కోమల శ్రీ రాజగోపాలవరునీ
rAmaSrI rEpalle rATTirISuni
kOmala SrI rAjagOpAlavarunI

#116 వెలదిరో నాధుని veladirO nAdhuni

Titleవెలదిరో నాధుని (ప్రతి)veladirO nAdhuni (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశుధ్ధకాంభోజిSudhdhakAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వెలదిరో నాధుని వేగమె దేవేveladirO nAdhuni vEgame dEvE
జలజాక్షి వానికి శరణని యున్నదనిjalajAkshi vAniki SaraNani yunnadani
చరణం
charaNam 1
మారుడు శరములు మచ్చరించి వేయగ
కోరి నమ్మి యుంటిని కోమలాంగుని మదిని
mAruDu Saramulu machcharimchi vEyaga
kOri nammi yumTini kOmalAmguni madini
చరణం
charaNam 2
చిన్ననాడె వలశున్న దాననని
కన్నెరొ విన్నవించి కాముని కేళికిని
chinnanADe valaSunna dAnanani
kannero vinnavimchi kAmuni kELikini
చరణం
charaNam 3
రాజిల్ల శ్రీ మాణిక్య రాట్కులసింధు
ద్విజ రాజవెంకట గోపాలరాయ పృధ్వీశుని
rAjilla SrI mANikya rATkulasimdhu
dwija rAjavemkaTa gOpAlarAya pRdhwISuni

#115 మునుపటి బాసలు munupaTi bAsalu

Titleమునుపటి బాసలుmunupaTi bAsalu
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశుద్ధకాంభోజిSuddhakAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మునుపటి బాసలు మనకేలనే చెలీ కోరిన కోరికల్
కొనసాగగానే నీరజ నయనరో నీ మది నిజముగాదే
munupaTi bAsalu manakElanE chelI kOrina kOrikal
konasAgagAnE nIraja nayanarO nI madi nijamugAdE
చరణం
charaNam 1
పాన్పుపైని పవళించిన వేళలో
మోము మోమున జేర్చి ముద్దుబెట్టి వేడ
pAn&pupaini pavaLimchina vELalO
mOmu mOmuna jErchi muddubeTTi vEDa
చరణం
charaNam 2
ఆడిన మాటకు అతివరొ వానితో
చాడి చెప్పి నను చౌక జేసితివి
ADina mATaku ativaro vAnitO
chADi cheppi nanu chauka jEsitivi