#771 ఏమిరా చలమేలరా EmirA chalamElarA

Titleఏమిరా చలమేలరాEmirA chalamElarA
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaధేనుకdhEnuka
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏమిరా చలమేలరా యింతైన దయ లేదెEmirA chalamElarA yintaina daya lEde
చరణం
charaNam 1
వలపెటు దాతును వోర్వను యీ వ్యాళ
సలసిన రీతి దెలిసి కోరి యున్నానురా
valapeTu dAtunu vOrvanu yI vyALa
salasina rIti delisi kOri yunnAnurA
చరణం
charaNam 2
మోమేల జూడవు మనసిందు లేదాయ
కాముని బారికి కరగి యున్నానురా
mOmEla jUDavu manasindu lEdAya
kAmuni bAriki karagi yunnAnurA
చరణం
charaNam 3
మును నన్నేలిన మంగళ పురి వాస
కనికర మెందు బోయ కోప మెందుకురా
munu nannElina mangaLa puri vAsa
kanikara mendu bOya kOpa mendukurA

#770 పిలచితే రాడాయా pilachitE rADAyA

Titleపిలచితే రాడాయాpilachitE rADAyA
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఖరహరప్రియkharaharapriya
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviపిలచితే రాడాయా చెలియరో నేడూpilachitE rADAyA cheliyarO nEDU
అనుపల్లవి anupallaviవలపెటు దాతునె వోర్వజాలను నేvalapeTu dAtune vOrvajAlanu nE
చరణం
charaNam 1
కలికిరో సామికి కరుణెందు బోయెనె
తలచి తాళగ లేనె తరుణిరొ యీవ్యాళ
kalikirO sAmiki karuNendu bOyene
talachi tALaga lEne taruNiro yIvyALa
చరణం
charaNam 2
సరసుని ప్రేమా సతమని యుంటినె
సరస మింకేటికే చాల మనకేలనె
sarasuni prEmA satamani yunTine
sarasa minkETikE chAla manakElane
చరణం
charaNam 3
మంగళ పురి వాసునికి మాట సైస దాయగా
మంగళాంగి నాపై మోహమెటు బోయెనే
mangaLa puri vAsuniki mATa saisa dAyagA
mangaLAngi nApai mOhameTu bOyenE

#769 ఏమి సేతునమ్మా Emi sEtunammA

Titleఏమి సేతునమ్మాEmi sEtunammA
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaసావేరిsAvEri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏమి సేతునమ్మా నేను సామీ రాడాయనెEmi sEtunammA nEnu sAmI rADAyane
చరణం
charaNam 1
మోహము యెటులా సైతు నేను ముదితారొ నేడు రాడాయ
మోహనాంగి వినవే మనసు నే నిలుపలేను
mOhamu yeTulA saitu nEnu muditAro nEDu rADAya
mOhanAngi vinavE manasu nE nilupalEnu
చరణం
charaNam 2
సరసుడు లేని జన్మ మ్యాలే సరివారలు నవ్వనాయా
మారుని బాధకు వోర్వను నేను మమతలు మరువలేను
sarasuDu lEni janma myAlE sarivAralu navvanAyA
mAruni bAdhaku vOrvanu nEnu mamatalu maruvalEnu
చరణం
charaNam 3
మంగళపురి వాసుడు మరచినాడే నేడు
శృంగారము మనకేలనె సొగసెవ్వరు జూచేరే
mangaLapuri vAsuDu marachinADE nEDu
SRngAramu manakElane sogasevvaru jUchErE

#768 సఖియా తోడి త్యావె sakhiyA tODi tyAve

Titleసఖియా తోడి త్యావెsakhiyA tODi tyAve
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaఏకEka
పల్లవి pallaviసఖియా తోడి త్యావెsakhiyA tODi tyAve
అనుపల్లవి anupallaviసుఖమిందు లేదాయ సుదతిరో యీవ్యాళsukhamindu lEdAya sudatirO yIvyALa
చరణం
charaNam 1
ప్రేమ మరచె నేడు ప్రియమింత లేదాయ
తామస మ్యాలనె తరుణిరో పోవె
prEma marache nEDu priyaminta lEdAya
tAmasa myAlane taruNirO pOve
చరణం
charaNam 2
మనసిందు లేదాయ ముదితారో వానికి
వనజాక్షి సతమ వలపదీ కొన్నాళ్ళు
manasindu lEdAya muditArO vAniki
vanajAkshi satama valapadI konnALLu
చరణం
charaNam 3
కరుణ యింతైన నాపై కడకు లేదాయ
వర మంగళపురి వాసుడు వనితల పాలాయ
karuNa yintaina nApai kaDaku lEdAya
vara mangaLapuri vAsuDu vanitala pAlAya

#767 సామిని రమ్మనవె sAmini rammanave

Titleసామిని రమ్మనవెsAmini rammanave
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసామిని రమ్మనవెsAmini rammanave
చరణం
charaNam 1
సారసాక్షుని సరగున పిలువవె
సరస మాడుటకు సమయము యిది
sArasAkshuni saraguna piluvave
sarasa mADuTaku samayamu yidi
చరణం
charaNam 2
మంద గమనరొ మదనుని కేళికి
సుందరాంగుని సుదతిరొ నేడు
manda gamanaro madanuni kELiki
sundarAnguni sudatiro nEDu
చరణం
charaNam 3
మంగళ పురీశుని మమతలు మరువను
పంకజాక్షిరో ప్రేమతో నేడు
mangaLa purISuni mamatalu maruvanu
pankajAkshirO prEmatO nEDu

#766 ఎందుకు రాడాయ enduku rADAya

Titleఎందుకు రాడాయenduku rADAya
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaదేశి తోడిdESi tODi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఎందుకు రాడాయ యవరే మన్నారుenduku rADAya yavarE mannAru
అనుపల్లవి anupallaviసందేహమేలనే సఖియరో యీ వ్యాళsandEhamElanE sakhiyarO yI vyALa
చరణం
charaNam 1
మందయాన నాపై మత్సర మేలనే
యిందు వచ్చి నేడు పొంద వద్దంటిన
mandayAna nApai matsara mElanE
yindu vachchi nEDu ponda vaddanTina
చరణం
charaNam 2
కలికిరొ యీ వ్యాళ కోరియున్నానే
తొలి జేసిన బాస తెలుసుకో లేడాయ
kalikiro yI vyALa kOriyunnAnE
toli jEsina bAsa telusukO lEDAya
చరణం
charaNam 3
మనసు దెలిసి రాడే మంగళపురి వాసుడు
చిన్ననాటి చెలిమి చైగూడక పోయ
manasu delisi rADE mangaLapuri vAsuDu
chinnanATi chelimi chaigUDaka pOya

#765 కమలాక్షి వేగమె kamalAkshi vEgame

Titleకమలాక్షి వేగమెkamalAkshi vEgame
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఖరహరప్రియkharaharapriya
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviకమలాక్షి వేగమె కాంతుని తోడి త్యావేkamalAkshi vEgame kAntuni tODi tyAvE
చరణం
charaNam 1
మనసు నిలువదాయ మద గజ గామిని
నేనింత సైరిస లేను నారీమణి పిలువవే
manasu niluvadAya mada gaja gAmini
nEninta sairisa lEnu nArImaNi piluvavE
చరణం
charaNam 2
నా ప్రాణనాథుడు నన్నెడబాసె నేడు
నా ప్రాప్తి కేమనవచ్చు నాగావేణి రమ్మనవే
nA prANanAthuDu nanneDabAse nEDu
nA prApti kEmanavachchu nAgAvENi rammanavE
చరణం
charaNam 3
మనసిందు లేదాయ మంగళపురి వాసునికి
నిన్నటి వ్యాళ నుంచి నిదుర కంటికి రాదాయ
manasindu lEdAya mangaLapuri vAsuniki
ninnaTi vyALa nunchi nidura kanTiki rAdAya

#764 సామీ రాడాయనె sAmI rADAyane

Titleసామీ రాడాయనెsAmI rADAyane
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaహరి కాంభోజిhari kAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసామీ రాడాయనెsAmI rADAyane
అనుపల్లవి anupallaviసరసుడు లేని ఈ సొగసెవ్వరు జూచేరేsarasuDu lEni I sogasevvaru jUchErE
చరణం
charaNam 1
సారసాక్షి రమ్మనుచు సరసముతో నన్ను
కరుణతో లాలించి నా కరుణెందు బోయెనో
sArasAkshi rammanuchu sarasamutO nannu
karuNatO lAlinchi nA karuNendu bOyenO
చరణం
charaNam 2
క్షణ మాత్రమైన వుపేక్షణము చాయక నన్ను
క్షణ క్షణము లాలించిన సరసమెందు బోయెనో
kshaNa mAtramaina vupEkshaNamu chAyaka nannu
kshaNa kshaNamu lAlinchina sarasamendu bOyenO
చరణం
charaNam 3
సురత కేళిలో నను సొక్కి సోలించిన
వర మంగళ పురీశుని వలపెందు బోయెనో
surata kELilO nanu sokki sOlinchina
vara mangaLa purISuni valapendu bOyenO

#763 మనసెట్ల సైరింతు manaseTla sairintu

Titleమనసెట్ల సైరింతుmanaseTla sairintu
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమనసెట్ల సైరింతు మద గజ గామినీmanaseTla sairintu mada gaja gAminI
అనుపల్లవి anupallaviపణతిరొ నా సామిని పిలువావె మానినీpaNatiro nA sAmini piluvAve mAninI
చరణం
charaNam 1
విరహ మెచ్చి ప్రాయము వ్యర్థమాయను నేడు
మరుని శరములకు మగువరొ తాళజాలరా
viraha mechchi prAyamu vyarthamAyanu nEDu
maruni Saramulaku maguvaro tALajAlarA
చరణం
charaNam 2
పంచబాణుడు వచ్చె నేడు ప్రాణ నాథుడు రాడాయ
వంచ న్యాలనే సామికి వారిజాక్షి పిలువావె
panchabANuDu vachche nEDu prANa nAthuDu rADAya
vancha nyAlanE sAmiki vArijAkshi piluvAve
చరణం
charaNam 3
మరచి పోయి నాడేమో మంగళపురి వాసుడు
సరస మాడుటకు సఖియరొ తోడి త్యావె
marachi pOyi nADEmO mangaLapuri vAsuDu
sarasa mADuTaku sakhiyaro tODi tyAve

#762 ఎందుకు రాడాయ enduku rADAya

Titleఎందుకు రాడాయenduku rADAya
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaఆదిAdi
Previously Posted At402
పల్లవి pallaviఎందుకు రాడాయ ఎవరేమన్నారుenduku rADAya evarEmannAru
చరణం
charaNam 1
సరసుని ప్రేమ సతమని యుంటినె
కరుణ మరచెనె కలికిరో నేడు
sarasuni prEma satamani yunTine
karuNa marachene kalikirO nEDu
చరణం
charaNam 2
చందన పరిమళ ఆనందముగా యుంటినే
సుందరాంగుడు రాడాయ మందయాన ఈ వ్యాళ
chandana parimaLa AnandamugA yunTinE
sundarAnguDu rADAya mandayAna I vyALa
చరణం
charaNam 3
కోరిన వ్యాళలో కోపము యాలనే
వర మంగళ పురీశుని వేగమె పిలువవె
kOrina vyALalO kOpamu yAlanE
vara mangaLa purISuni vEgame piluvave