| Title | మొట్టమొదట | moTTamodaTa |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మొట్టమొదలు నట్టనడుము తుట్టతుదయు నెరుగనే యిట్టె వచ్చి విభుడు రాత్రి యేమి పనులు జేసెనో | moTTamodalu naTTanaDumu tuTTatudayu neruganE yiTTe vachchi vibhuDu rAtri yEmi panulu jEsenO |
| చరణం charaNam 1 | మోము మోము గదియ విభుడు ముద్దు పెట్టినంతలో భామ యేమొ కాని నేను పరవశమై యుంటినే | mOmu mOmu gadiya vibhuDu muddu peTTinamtalO bhAma yEmo kAni nEnu paravaSamai yunTinE |
| చరణం charaNam 2 | అట్టె విభుడు చన్నుదోయి బట్టి వచ్చినంతనే యెట్టి మాయయేమొ నాదు హృదయమైక్య మాయెనే | aTTe vibhuDu channudOyi baTTi vachchinamtanE yeTTi mAyayEmo nAdu hRdayamaikya mAyenE |
| చరణం charaNam 3 | భాసుర శ్రీ వేణుగోప బాలుడంతటి నంతనే దాసురామదాస చిత్త వాసి యనుకొంటినే | bhAsura SrI vENugOpa bAluDamtaTi nantanE dAsurAmadAsa chitta vAsi yanukonTinE |
#354 మనసిచ్చి నాతో manasichchi nAtO
| Title | మనసిచ్చి నాతో | manasichchi nAtO |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మనసిచ్చి నాతో మాటాడవేమిరా | manasichchi nAtO mATADavEmirA |
| చరణం charaNam 1 | మనవి వినరాదా మమత యింత లేదా మునుపటి చెల్మి కాదా మోదము కాదా | manavi vinarAdA mamata yinta lEdA munupaTi chelmi kAdA mOdamu kAdA |
| చరణం charaNam 2 | విను నేను బాలా విడనాడుట మేలా చనువుంచుమీ చాలా జాలమిదేలా | vinu nEnu bAlA viDanADuTa mElA chanuvunchumI chAlA jAlamidElA |
| చరణం charaNam 3 | వరదాసు శ్రీరామా వన సుగుణ ధామా శరణు నన్నేలు ప్రేమ శ్యామాభిరామా | varadAsu SrIrAmA vana suguNa dhAmA SaraNu nannElu prEma SyAmAbhirAmA |
#353 కోపమా సామి kOpamA sAmi
| Title | కోపమా సామి | kOpamA sAmi |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | హిందుస్థాని కాఫీ కాఫి | hindusthAni kAfI kAfi |
| తాళం tALa | అట చాపు | aTa chApu |
| పల్లవి pallavi | కోపమా సామి యేమిర కోపమా అపరాదుర మోహము పరితాపమొందెర దేహము నను రాపుజేయుట ద్రోహము నీ రూపమైన జూపనేమిర | kOpamA sAmi yEmira kOpamA aparAdura mOhamu paritApamomdera dEhamu nanu rApujEyuTa drOhamu nI rUpamaina jUpanEmira |
| చరణం charaNam 1 | వాదమా సామి నాతో వాదమా లేదురా బలవంతము యిది కాదురా యొక పంతము సరికాదురా యత్యంతము నీమీది తమి చేసేది తోచదు | vAdamA sAmi nAtO vAdamA lEdurA balavantamu yidi kAdurA yoka pantamu sarikAdurA yatyantamu nImIdi tami chEsEdi tOchadu |
| చరణం charaNam 2 | వీడరా మోడి నాపై వీడరా ఆడుదానర దోసము కాపాడరా పరిహాసము నను గూడని నా వేసము మాటాడనైన గూడదటరా | vIDarA mODi nApai vIDarA ADudAnara dOsamu kApADarA parihAsamu nanu gUDani nA vEsamu mATADanaina gUDadaTarA |
| చరణం charaNam 3 | దోసమా సామి నాపై దాసు రామ కవీంద్రుడు కృతి జేసె మృదు గుణ సాంద్రుడు పైగాసె వెన్నెల చంద్రుడు సేబాసురా యెంత మోసమాయెరా | dOsamA sAmi nApai dAsu rAma kavIndruDu kRti jEse mRdu guNa sAndruDu paigAse vennela chandruDu sEbAsurA yenta mOsamAyerA |
#352 వనితరో vanitarO
ఈ రచన పాత ప్రచురణలో పదము గానూ, కొత్త ప్రచురణలో జావళి గానూ చెప్పబడినది. This was mentioned as a padamu in the old publication, and as a jAvaLi in the new publication.
| Title | వనితరో | vanitarO |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | వనితరో యీ వన్నెలేలనే యీ వేళ నాకు తనువేలా తరుణలేలా ధనమేలా ధామమేలా | vanitarO yI vannelElanE yI vELa nAku tanuvElA taruNalElA dhanamElA dhAmamElA |
| చరణం charaNam 1 | ఆకులేలా పోకలేలా అన్నమేలా పానమేలా శ్రీకరుండు రాకయుండి ఆకలుడిగి యున్నవేళ | AkulElA pOkalElA annamElA pAnamElA SrIkarunDu rAkayunDi AkaluDigi yunnavELa |
| చరణం charaNam 2 | సొగసేలా సొమ్ములేలా అగరేలా గంధమేలా మగనికి దయలేక మేను సగమై యున్నట్టి వేళ | sogasElA sommulElA agarElA gandhamElA maganiki dayalEka mEnu sagamai yunnaTTi vELa |
| చరణం charaNam 3 | భాసురాంగీ తోటలేలా పాటలేలా ఆటలేలా దాసురామ పాలుబాసి ఆసలుడిగి యున్నవేళ | bhAsurAngI tOTalElA pATalElA ATalElA dAsurAma pAlubAsi AsaluDigi yunnavELa |
| AV Link | https://www.youtube.com/watch?v=sj8oQYpSKPU |
#351 పోవోయి పోవోయి pOvOyi pOvOyi
ఈ రచన పాత ప్రచురణలో శృంగార పద్యము గానూ, కొత్త ప్రచురణలో జావళి గానూ చెప్పబడినది. This was mentioned as a ‘SRngAra padyamu’ in the old publication and as a jAvaLi in the new publication.
| Title | పోవోయి పోవోయి | pOvOyi pOvOyi |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | కాఫి | kAfi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | పోవోయి పోవోయి పొలతులతో నింత పోటాపోటీ లేమోయి వావిని ఈవాడ వనితలెల్లను నీకు వావారే వావారే వదిన మరదళ్ళైరి | pOvOyi pOvOyi polatulatO ninta pOTApOTI lEmOyi vAvini IvADa vanitalellanu nIku vAvArE vAvArE vadina maradaLLairi |
| చరణం charaNam 1 | తల తడిపి తగని బాసలు జేసిన నమ్మదగిన కాలము గాదురా చెలువుడా మనయూరి వెలయాండ్రతో నీకు భళిభళి భాళిభళి బహరీ ఖాతాలాయె | tala taDipi tagani bAsalu jEsina nammadagina kAlamu gAdurA cheluvuDA manayUri velayAnDratO nIku bhaLibhaLi bhALIbhaLi baharI khAtAlAye |
| చరణం charaNam 2 | వేషభాషలే చూపి విషమ చక్కె జేసి విడుతురోయి పురుషులు హాషామాషీ చెలియల సయ్యాటలు నీకు భేషు భేషు భేషు విజయ బిరుదములాయె | vEshabhAshalE chUpi vishama chakke jEsi viDuturOyi purushulu hAshAmAshI cheliyala sayyATalu nIku bhEshu bhEshu bhEshu vijaya birudamulAye |
| చరణం charaNam 3 | బహురూపధర తోట్ల వల్లూరి వేణుగోపాలా యెంత జాణవు రహిమించు దాసుశ్రీరాముని పలుకులు అహ పహ్య అహహ హాయ మృత బిందువులాయె | bahurUpadhara tOTla vallUri vENugOpAlA yenta jANavu rahiminchu dAsuSrIrAmuni palukulu aha pahya ahaha hAya mRta binduvulAye |
#350 వద్దు వద్దుర vaddu vaddura
| Title | వద్దు వద్దుర | vaddu vaddura |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | వద్దు వద్దుర యిక వదలరా సామి ప్రొద్దు బోయెర నీ పుణ్యము పోపోర | vaddu vaddura yika vadalarA sAmi proddu bOyera nI puNyamu pOpOra |
| చరణం charaNam 1 | కోపగించు మగని కోత కోర్వను సామి రేపు వచ్చెద చాలసేపాయె పోపోర | kOpaginchu magani kOta kOrvanu sAmi rEpu vachcheda chAlasEpAye pOpOra |
| చరణం charaNam 2 | కంటిగించకు నేగానా నీదానా సామీ యింటికి పోవలె యిప్పుడే పోపోర | kanTiginchaku nEgAnA nIdAnA sAmI yimTiki pOvale yippuDE pOpOra |
| చరణం charaNam 3 | వినుము నా మనవి వేణుగోపాలా ఘనదాసు శ్రీరామ కవిపాల పోపోర | vinumu nA manavi vENugOpAlA ghanadAsu SrIrAma kavipAla pOpOra |
#349 వగకాడ vagakADa
| Title | వగకాడ | vagakADa |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | ఖమాచి (1893) ఖమాస్ (1991) | khamAchi (1893) khamAs (1991) |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వగకాడా తగదిక రారా మగువలె నేచుట మంచిది నటరా | vagakADA tagadika rArA maguvale nEchuTa manchidi naTarA |
| చరణం charaNam 1 | కృపలేదా సామి నామీద ఉపరతి సుఖమున నోలలాడించెద ఓ | kRpalEdA sAmi nAmIda uparati sukhamuna nOlalADimcheda O |
| చరణం charaNam 2 | వినవేరా వేణుగోపాల మనసున నీకుగల మర్మము దెలుపర ఓ | vinavErA vENugOpAla manasuna nIkugala marmamu delupara O |
| చరణం charaNam 3 | పసిబాలా తాళగజాలర రసక దాసు శ్రీరామునేలుకోరా ఓ | pasibAlA tALagajAlara rasaka dAsu SrIrAmunElukOrA O |
#348 దయలేక dayalEka
| Title | దయలేక | dayalEka |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | హిందుస్థాని కాఫీ (1893) కాఫి (1991) | hindusthAni kAfI (1893) kAfi (1991) |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | దయలేక నీవు రాకయున్న తాళజాలరా | dayalEka nIvu rAkayunna tALajAlarA |
| చరణం charaNam 1 | నిన్న రేయి కన్నులారా నిదుర లేదురా వన్నెకాడ నిదురాక కాచి యుంటిరా | ninna rEyi kannulArA nidura lEdurA vannekADa nidurAka kAchi yunTirA |
| చరణం charaNam 2 | ఉత్త మాట గాదు నిన్నె గుత్తగుంటిరా చిత్తగించు నాదు మనవి చిన్నదానరా | utta mATa gAdu ninne guttagunTirA chittaginchu nAdu manavi chinnadAnarA |
| చరణం charaNam 3 | శ్రీ సఖా నే జేసుకొన్న దోసమేమిరా వాసి మీర దాసురామ దాసునేలరా | SrI sakhA nE jEsukonna dOsamEmirA vAsi mIra dAsurAma dAsunElarA |
#347 భామినిరొ రాగదె bhAminiro rAgade
| Title | భామినిరొ రాగదె | bhAminiro rAgade |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | హిందుస్థాని కాఫీ (1893) కాఫి (1991) | hindusthAni kAfI (1893) kAfi (1991) |
| తాళం tALa | చాపు (1893) ఆది (1991) | chApu (1893) Adi (1991) |
| పల్లవి pallavi | భామినిరొ రాగదె సామినీ తేవే కాముని బారికి తాళుదునే తాళుదునె నేనెటు తాళుదునే ఆ కామునీ బారికి తాళుదునే | bhAminiro rAgade sAminI tEvE kAmuni bAriki tALudunE tALudune nEneTu tALudunE A kAmunI bAriki tALudunE |
| చరణం charaNam 1 | మొన్నా నిన్నా కూడిన చెలిపై మోహము నిండారగను నన్ను మరచెద గదవే మదవతీ వెన్నెల కాకకు తాళుదునే తాళుదునె నేనెటు తాళుదునె ఆ వెన్నెల కాకకు తాళుదునె | monnA ninnA kUDina chelipai mOhamu ninDAraganu nannu maracheda gadavE madavatI vennela kAkaku tALudunE tALudune nEneTu tALudune A vennela kAkaku tALudune |
| చరణం charaNam 2 | చెల్లంబో నా సాటి చెలులలో చిన్నతనం బాయెనుగా మొల్ల విరుల మీది మెల్లని యీ చల్లగాలికి తాళుదునే తాళుదునె నేనెటు తాళుదునే యీ చల్లగాలికి తాళుదునే | chellambO nA sATi chelulalO chinnatanam bAyenugA molla virula mIdi mellani yI challagAliki tALudunE tALudune nEneTu tALudunE yI challagAliki tALudunE |
| చరణం charaNam 3 | ప్రేమమీర దాసు కులజుడౌ రామకవిం బ్రోచుచును సామజవర వరదుండలిగెనే ఆమని ఢాకకు తాళుదునే | prEmamIra dAsu kulajuDau rAmakavim brOchuchunu sAmajavara varadumDaligenE Amani DhAkaku tALudunE |
#346 ఏమని తెల్పుదునే Emani telpudunE
| Title | ఏమని తెల్పుదునే | Emani telpudunE |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | యేమని దెల్పుదునే కోమలి నా భాగ్య మేమని తెల్పుదునే నా ముద్దుసామికి నా మీది ప్రేమనే | yEmani delpudunE kOmali nA bhAgya mEmani telpudunE nA muddusAmiki nA mIdi prEmanE |
| చరణం charaNam 1 | చెక్కిలి ముద్దాడెనె చక్కని నా సామి చెక్కిలి ముద్దాడెనె నిక్కముగ నిన్న రేయి పక్కనే పవ్వళించి చక్కని కెమ్మోవి నొక్కెనే అక్కనే | chekkili muddADene chakkani nA sAmi chekkili muddADene nikkamuga ninna rEyi pakkanE pavvaLimchi chakkani kemmOvi nokkenE akkanE |
| చరణం charaNam 2 | బాళిచే నన్నేలనే కేళిలో నా సామి బాళిచే నన్నేలెనే వేళగదే రారమ్మని విలువగల సొమ్ములిచ్చి చాలగా లాలించి సోలెనే బాలెనే | bALichE nannElanE kELilO nA sAmi bALichE nannElenE vELagadE rArammani viluvagala sommulichchi chAlagA lAlimchi sOlenE bAlenE |
| చరణం charaNam 3 | నా సాటి లేరనెనే వేణుగోపాలుడు నా సాటి లేరనెనే ఆసదీర్చి దాసు రామదాస చిత్త వాసుడాయె పూసెనే గంధము చేసెనే బాసనే | nA sATi lEranenE vENugOpAluDu nA sATi lEranenE AsadIrchi dAsu rAmadAsa chitta vAsuDAye pUsenE gandhamu chEsenE bAsanE |