| Title | నా నొసటనే | nA nosaTanE |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | ఖమాచి (1893) ఖమాస్ (1991) | khamAchi (1893) khamAs (1991) |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | నా నొసటనే పొడిచెనా యేమిరా నానావర వర్ణినులకు నావలె కామము లేదా | nA nosaTanE poDichenA yEmirA nAnAvara varNinulaku nAvale kAmamu lEdA |
| చరణం charaNam 1 | పరశివు నౌదల గంగా భామలేదా పరమేష్ఠి ముఖమున సరస్వతి నివసించగ లేదా | paraSivu naudala gangA bhAmalEdA paramEshThi mukhamuna sarasvati nivasimchaga lEdA |
| చరణం charaNam 2 | దామోదరు రొమ్మున లేదా యిందిర కామాక్షీ హరునర్ధాంగమున బెనంగనలేదా | dAmOdaru rommuna lEdA yindira kAmAkshI harunardhAngamuna benamganalEdA |
| చరణం charaNam 3 | నా వేణుగోపాల నన్నేలరా శ్రీ విలసిత శ్రీదాసు శ్రీరామకవి వరదా | nA vENugOpAla nannElarA SrI vilasita SrIdAsu SrIrAmakavi varadA |
#344 పాటబాడెద pATabADeda
| Title | పాటబాడెద | pATabADeda |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఆది (1893) రూపక (1991) | Adi (1893) rUpaka (1991) |
| పల్లవి pallavi | పాటబాడెద రార సామి పరమానందమురా నాసామి బ్రహ్మానందమురా | pATabADeda rAra sAmi paramAnandamurA nA sAmi brahmAnandamurA |
| చరణం charaNam 1 | మదనజనక నీ దయ మదినిగోరి యున్నదాన ముదము మీర ముచ్చటాడి ముద్దుబెట్టరా నా సామి ముద్దుబెట్టరా నా సామి | madanajanaka nI daya madinigOri yunnadAna mudamu mIra muchchaTADi muddubeTTarA nA sAmi muddubeTTarA nA sAmi |
| చరణం charaNam 2 | వలపు నిలుపలేనురా వగలుమాని యేలుకోరా కళలు దేర నొక్కసారి కౌగలించరా నా సామి కౌగలించరా నా సామి | valapu nilupalEnurA vagalumAni yElukOrA kaLalu dEra nokkasAri kaugalimcharA nA sAmi kaugalimcharA nA sAmi |
| చరణం charaNam 3 | వనజ నయన నిశ్చలా వరద వేణుగోపబాలా ఘనుడ దాసు రామపాలా కాంక్ష దీర్చరా నా సామి కాంక్ష దీర్చరా నా సామి | vanaja nayana niSchalA varada vENugOpabAlA ghanuDa dAsu rAmapAlA kAmksha dIrcharA nA sAmi kAmksha dIrcharA nA sAmi |
#343 ఏమనెనే కోమలీ EmanenE kOmalI
| Title | ఏమనెనే కోమలీ | EmanenE kOmalI |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | ఫరుజు | faruju |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | యేమనేనే కోమలి తెలుపవే నీతో యేమనెనే కోమలి | yEmanEnE kOmali telupavE nItO yEmanenE kOmali |
| చరణం charaNam 1 | అంగజుబారికి నిలువదరమటే మంగళవార్తలు మరియేమే నీతో | angajubAriki niluvadaramaTE mangaLavArtalu mariyEmE nItO |
| చరణం charaNam 2 | మోహపయోధిలో మునిగితి నికనే యూహలు సేయుదు నొకసారి నీతో | mOhapayOdhilO munigiti nikanE yUhalu sEyudu nokasAri nItO |
| చరణం charaNam 3 | దాసు శ్రీరామ కవిగీతసుధా ధారుడైన హరి దయచేసి నీతో | dAsu SrIrAma kavigItasudhA dhAruDaina hari dayachEsi nItO |
#342 ఆ నలినముఖి A nalinamukhi
| Title | ఆ నలినముఖి | A nalinamukhi |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | జంఝూటి | jamjhUTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఆ నలినముఖీ అందమదేమీ దానికే నీకును తగు తగు సామీ | A nalinamukhI andamadEmI dAnikE nIkunu tagu tagu sAmI |
| చరణం charaNam 1 | మందుల మారుల మాట పసగడి బందములాయె భళీభళీ సామీ | mandula mArula mATa pasagaDi bandamulAye bhaLIbhaLI sAmI |
| చరణం charaNam 2 | తంతరగత్తెల తక్కులు మిగుల సంతసమాయె సరీసరీ సామీ | tantaragattela takkulu migula santasamAye sarIsarI sAmI |
| చరణం charaNam 3 | దాసు కులాంచిత రామకవి సదా ధ్యానము జేసె హరీహరీ సామీ | dAsu kulAmchita rAmakavi sadA dhyAnamu jEse harIharI sAmI |
#341 తగుతగులేర tagutagulEra
| Title | తగుతగులేర | tagutagulEra |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | హిందుస్థానీ కాఫీ | hindusthAnI kAfI |
| తాళం tALa | రూపక (1893) రూపక / త్ర్యస్యగతి (1991) | rUpaka (1893) rUpaka/ tryasyagati (1991) |
| పల్లవి pallavi | తగుతగులేర చిన్నదాన తాళజాలరా నాతో పసంతమేలరా యింతైన నిల్వలేనురా | tagutagulEra chinnadAna tALajAlarA nAtO pasantamElarA yimtaina nilvalEnurA |
| చరణం charaNam 1 | నను గరుణింపవేర న్యాయమరసి చూడరా నా మీద కోపమేలరా నీకేల రవ్వమానరా | nanu garuNimpavEra nyAyamarasi chUDarA nA mIda kOpamElarA nIkEla ravvamAnarA |
| చరణం charaNam 2 | కోమలమగు నాదు వయసు కొనవెన్నెలాయెరా నా గుట్టు బయలు బట్టేరా నా కోరికె లీడేర్చరా | kOmalamagu nAdu vayasu konavennelAyerA nA guTTu bayalu baTTErA nA kOrike lIDErcharA |
| చరణం charaNam 3 | వేసకాడ ముద్దుసామి వేణుగోపబాలకా శ్రీ దాసురామపాలకా నా పాలిపంచ సాయకా | vEsakADa muddusAmi vENugOpabAlakA SrI dAsurAmapAlakA nA pAlipamcha sAyakA |
#340 చల్లకు వచ్చి challaku vachchi
ఇది పాత పుస్తకంలో జావళి గానూ, కొత్త పుస్తకంలో పదం గానూ చెప్పబడినది. This was mentioned as a jAvaLi in the old book, and as a Padam in the new book.
| Title | చల్లకు వచ్చి | challaku vachchi |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | బేగడా | bEgaDA |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | చల్లకు వచ్చి ముంత దాచ నేలనే ఓ మధురవాణీ | challaku vachchi munta dAcha nElanE O madhuravANI |
| అనుపల్లవి anupallavi | ముల్లెకు మోసము లేదు ముద్దుబెట్టి పొమ్మనే | mulleku mOsamu lEdu muddubeTTi pommanE |
| చరణం charaNam 1 | వల్లభ నీ వంటి వాని వలచి వచ్చిన వనితనే చెల్లదురా తగదు తగదని చెయ్యి బట్టి రమ్మనె | vallabha nI vanTi vAni valachi vachchina vanitanE chelladurA tagadu tagadani cheyyi baTTi rammane |
| చరణం charaNam 2 | వానికెదురెదురె చూచుచు వాకిట నే నిలచితినే చాన యేమొకాని యన్నపానమునే మానితినే | vAnikeduredure chUchuchu vAkiTa nE nilachitinE chAna yEmokAni yannapAnamunE mAnitinE |
| చరణం charaNam 3 | వెసట జెందితి గదవె వేణుగోపాలుని దేవె దాసు రామకవి హృదయ నివాసుని దయ చేయమనే | vesaTa jenditi gadave vENugOpAluni dEve dAsu rAmakavi hRdaya nivAsuni daya chEyamanE |
#339 ముంజేతి కంకణ mumjEti kamkaNa
ఇది పాత పుస్తకంలో జావళి గానూ, కొత్త పుస్తకంలో పదం గానూ చెప్పబడినది. This was mentioned as a jAvaLi in the old book, and as a Padam in the new book.
| Title | ముంజేతి కంకణ | munjEti kamkaNa |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | సావేరి | sAvEri |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ముంజేతి కంకణమ్మున కద్దమేలనే రంజిల్లు వాని గుణము రమణి మనమెరుగమే | munjEti kamkaNammuna kaddamElanE ramjillu vAni guNamu ramaNi manamerugamE |
| చరణం charaNam 1 | కమ్మదనము మాటలనె కడుపులో నొక విధమె కొమ్మవాని వలపు నిక్కము గాదే నమ్మరాదె | kammadanamu mATalane kaDupulO noka vidhame kommavAni valapu nikkamu gAdE nammarAde |
| చరణం charaNam 2 | మాటలను తేటలను మనవద్దనే చెలియ మాపటిపకలా మగువతోడ తగవదేడ | mATalanu tETalanu manavaddanE cheliya mApaTipakalA maguvatODa tagavadEDa |
| చరణం charaNam 3 | భాసురాంగి నిన్ను మాయ జేసె నేనేమి సేతు దాసురామ కవి మనో నివాసుడాయే మోసమాయె | bhAsurAmgi ninnu mAya jEse nEnEmi sEtu dAsurAma kavi manO nivAsuDAyE mOsamAye |
#338 నిలునిలు nilunilu
| Title | నిలునిలు | nilunilu |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | ఖమాసు | khamAsu |
| తాళం tALa | చాపు (1893) ఆది (1991) | chApu (1893) Adi (1991) |
| పల్లవి pallavi | నిలునిలు మటుండుమీ నాసామీ నీవు నా దరి రాకుమీ నాసామీ | nilunilu maTunDumI nAsAmI nIvu nA dari rAkumI nAsAmI |
| చరణం charaNam 1 | ఆ మాయలాడి యేమి బోధించెర సామి నాకు దెల్పర సంశయమేలర | A mAyalADi yEmi bOdhinchera sAmi nAku delpara samSayamElara |
| చరణం charaNam 2 | సన్నుతాంగిని గూడి నా సాటి వారిలో నన్ను రద్ది జేయుట న్యాయము గాదుర | sannutAmgini gUDi nA sATi vArilO nannu raddi jEyuTa nyAyamu gAdura |
| చరణం charaNam 3 | వెసగాడవుగద వేణుగోపాల సామి దాసు శ్రీరామకవి ధన్యుని జేయర | vesagADavugada vENugOpAla sAmi dAsu SrIrAmakavi dhanyuni jEyara |
#337 రమణిరో ramaNirO
| Title | రమణిరో | ramaNirO |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | కానడా | kAnaDA |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | రమణిరో సముఖాన రాయబార మేటికే నిమిషమైన తాళలేనె నేనే వాని రమ్మందునె | ramaNirO samukhAna rAyabAra mETikE nimishamaina tALalEne nEnE vAni rammandune |
| చరణం charaNam 1 | కడువేడుక వాని మేన గంధమును బూసి యాకు మడుపిచ్చి తడవేటికి మాపటికి రమ్మందునె | kaDuvEDuka vAni mEna gandhamunu bUsi yAku maDupichchi taDavETiki mApaTiki rammandune |
| చరణం charaNam 2 | కోరివాని జేరి పంనీరు పైజల్లి నను వేరుసేయ మేరగాదు వేవేగ రమ్మందునె | kOrivAni jEri pam^nIru paijalli nanu vErusEya mEragAdu vEvEga rammandune |
| చరణం charaNam 3 | భాసురాంగ వేణుగోపాల యింత పంతమేల దాసురామకవి సంనుతి జేసె నికరమ్మందునే | bhAsurAnga vENugOpAla yinta pantamEla dAsurAmakavi sam^nuti jEse nikarammandunE |
#336 మాటాడి పొమ్మనవె mATADi pommanave
| Title | మాటాడి పొమ్మనవె | mATADi pommanave |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 | |
| రాగం rAga | హిందుస్థానీ కాఫీ | hindusthAnI kAfI |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మాటాడి పొమ్మనవె మంజులవాణి వానినొక | mATADi pommanave manjulavANi vAninoka |
| అనుపల్లవి anupallavi | నీటి మూట తోటి సాటి బూటకము లేటికి మంచి | nITi mUTa tOTi sATi bUTakamu lETiki manchi |
| చరణం charaNam 1 | రద్ది యేల వద్దనుచు కొద్దిగాను బుధ్ధి చెప్పి ముద్దియ మోమున మోముడి ముద్దులు గుల్కు యొద్ద జేరియొక | raddi yEla vaddanuchu koddigAnu budhdhi cheppi muddiya mOmuna mOmuDi muddulu gulku yodda jEriyoka |
| చరణం charaNam 2 | చిన్నవాడే నన్ను గూడె వన్నెకాడే వాడనుచు కన్నె మిన్న నిన్నే కోరి యున్నదిర యిక వన్నె మీర నొక | chinnavADE nannu gUDe vannekADE vADanuchu kanne minna ninnE kOri yunnadira yika vanne mIra noka |
| చరణం charaNam 3 | భాసురాంగ గోపాలుని బాసలచే మోసపోతి దోసమేమి చేసితినో దాసురామ కవితా సుధా సురుచి | bhAsurAm^ga gOpAluni bAsalachE mOsapOti dOsamEmi chEsitinO dAsurAma kavitA sudhA suruchi |