#185 పోపొమ్మనే pOpommanE

Titleపోపొమ్మనేpOpommanE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
పోపొమ్మనే పొమ్మనే
వాని పొందేలనే మనకు అచటికి
pOpommanE pommanE
vAni pomdElanE manaku achaTiki
చరణం
charaNam 1
పాపపు మోహము పాలుజేసి యా
పాపిల్లు జేరెనే ప్రొద్దాయనె
pApapu mOhamu pAlujEsi yA
pApillu jErenE proddAyane
చరణం
charaNam 2
యిన్ని దినములు వాడెందు రాకుండినన్
చిన్నబుచ్చినాడే నిర్దయుడే
yinni dinamulu vADendu rAkunDinan
chinnabuchchinADE nirdayuDE
చరణం
charaNam 3
రేయి పగలతని రాక జూచి నా రాత
యనుకొంటినె యేమందునె
rEyi pagalatani rAka jUchi nA rAta
yanukomTine yEmandune
చరణం
charaNam 4
రంగనాథుడునే రంగుగ గూడి
రంగము నెలకొననే అంతటనే
ranganAthuDunE ramguga gUDi
ramgamu nelakonanE amtaTanE

#184 వానిటు రమ్మని vAniTu rammani

Titleవానిటు రమ్మని (ప్రతి)vAniTu rammani (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహుసేనిhusEni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వానిటు రమ్మని దెల్పవే
వానిటు రమ్మని దెల్పవే
వరదుని నను కల్పవే
vAniTu rammani delpavE
vAniTu rammani delpavE
varaduni nanu kalpavE
చరణం
charaNam 1
మానిని కుసుమమాలను బంపిన
పూనుకొనెనా పూనుకొనెనా
పూజీడికిమ్మనెనా
mAnini kusumamAlanu bampina
pUnukonenA pUnukonenA
pUjIDikimmanenA
చరణం
charaNam 2
చలువ పన్నీరును సరసున కంపిన
అలదుకొనెనా
అలదుకొనెనా ఆ వెలదికిమ్మనెనా
chaluva pannIrunu sarasuna kampina
aladukonenA
aladukonenA A veladikimmanenA
చరణం
charaNam 3
యువిదరొ వానికి యుత్తరమంపిన
చదువుకొనెనా చదువుకొనెనా
యాధూర్తకిమ్మనెనా
yuvidaro vAniki yuttaramampina
chaduvukonenA chaduvukonenA
yAdhUrtakimmanenA

#183 వాడెటు బల్కెనో vADeTu balkenO

Titleవాడెటు బల్కెనోvADeTu balkenO
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహుసేనిhusEni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వాడెటు బల్కెనో దెల్పవే
వాడెటు బల్కెనో దెల్పవే
బోటిరో బూటక మేలనే
vADeTu balkenO delpavE
vADeTu balkenO delpavE
bOTirO bUTaka mElanE
చరణం
charaNam 1
కొమ్మరో నేనంపిన కమ్మను వాడే కొనెనా వాడే కొనెనా ఒక
చెలి చేతికిమ్మనెనా
kommarO nEnampina kammanu vADE konenA vADE konenA oka
cheli chEtikimmanenA
చరణం
charaNam 2
ఇంతిరొ నేనంపిన పూబంతుల వాడే కొనెనా వాడే కొనెనా
ఒక రమణి కిమ్మనెనా
imtiro nEnampina pUbantula vADE konenA vADE konenA oka ramaNi kimmanenA
చరణం
charaNam 3
బాలరో ధర్మపురి పాలుడు
యేలెనెననెనా యేలెనెననెనా వాని
చెలి పోపొమ్మనెనా
bAlarO dharmapuri pAluDu
yElenenanenA yElenenanenA vAni
cheli pOpommanenA

#182 కామిని వాని kAmini vAni

Titleకామిని వాని (ప్రతి)kAmini vAni (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
కామిని వానితోడ గరుణ యుంచు మనవేkAmini vAnitODa garuNa yumchu manavE
సామి ప్రేమ నిక్కమని చాల నమ్మియుంటినే వోsAmi prEma nikkamani chAla nammiyumTinE vO
చరణం
charaNam 1
నెలత నన్ను విడచి దాని పలుకులు విని బూరుగ చెంత
వలచి నిలుచు చిలుక సామెత వలెను జేయవలదనవే
nelata nannu viDachi dAni palukulu vini bUruga chemta
valachi niluchu chiluka sAmeta valenu jEyavaladanavE
చరణం
charaNam 2
చిగురు విల్తుడు ములుకు లేయ
తెగువ శాయ వలదాయ
పగవారిలో నగడు శేయ
భామ యెటుల తాళుదునే
chiguru viltuDu muluku lEya
teguva SAya valadAya
pagavArilO nagaDu SEya
bhAma yeTula tALudunE
చరణం
charaNam 3
సుదతి శ్రీ రావు వంశజ సూర్య నృపతి
మదిగోరి ముదితా యిటులున్న దాని
మోసబుచ్చుట పాయమేవో
sudati SrI rAvu vamSaja sUrya nRpati
madigOri muditA yiTulunna dAni
mOsabuchchuTa pAyamEvO

#181 మానిని వాని mAnini vAni

Titleమానిని వానిmAnini vAni
Written By
BookprAchIna-navIna
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
మానిని వాని జోలి దానను నే గానేmAnini vAni jOli dAnanu nE gAnE
కాని దాని మాట విని కరుణ మరచియుండెనే వోkAni dAni mATa vini karuNa marachiyumDenE vO
చరణం
charaNam 1
కలికిరొ నను బాయనని పలికినదేమాయెనే
అల చెలితో కలిశి రావే అయిదార్నెల లాయెనే వో
kalikiro nanu bAyanani palikinadEmAyenE
ala chelitO kaliSi rAvE ayidArnela lAyenE vO
చరణం
charaNam 2
బోటిరొ నను వీడనని బూటకములు జేసెనే
మాట దప్పియున్న వాని మోముజూడ రాదే వో
bOTiro nanu vIDanani bUTakamulu jEsenE
mATa dappiyunna vAni mOmujUDa rAdE vO
చరణం
charaNam 3
సన్నుతాంగి చాల వలసి యిన్ని దినములుంటినే
నిన్ను గూడి వెంకటేశుడన్న మాట వింటినే వో
sannutAmgi chAla valasi yinni dinamulumTinE
ninnu gUDi vemkaTESuDanna mATa vimTinE vO

#180 యింతలో yimtalO

Titleయింతలో (ప్రతి)yimtalO (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
యింతలో మరచితి వేమిరా సామిyimtalO marachiti vEmirA sAmi
కంతుకేళిలోనం గారవించుటkamtukELilOnam gAravimchuTa
చరణం
charaNam 1
దారిజూచి నన్ను దలచి చెలిని నా
పేరనె బిలుచుదును
సారెకు గాకున్న చాల సొమ్మసిల్లె
dArijUchi nannu dalachi chelini nA
pErane biluchudunu
sAreku gAkunna chAla sommasille
చరణం
charaNam 2
కన్నె నిన్ను బాసి ఘడియై గాకను సన్నుతాంగి యనుచు కన్నీరు నించుచు
కడుబాధ నొందిన
kanne ninnu bAsi ghaDiyai gAkanu sannutAmgi yanuchu kannIru nimchuchu
kaDubAdha nomdina
చరణం
charaNam 3
ప్రేమతో ముద్దులు బెట్టుచు నన్ను
కామించి శ్రీ రేపలె ధామ కౌగిలించి దయతోడ నెనసిన
prEmatO muddulu beTTuchu nannu
kAmimchi SrI rEpale dhAma kaugilimchi dayatODa nenasina

#179 దిగెన్ digen

Titleదిగెన్digen
Written By
BookprAchIna-navIna
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
దిగెన్ అంజనమైకుసవారి రే దిగెన్ యేజీ ??
కాహూకుమారో గేదిగెన్
digen anjanamaikusavAri rE digen yEjI??
kAhUkumArO gEdigen
చరణం
charaNam 1
బక్రో బనేగి బేజినే కకశీ యాజ్
నయనో బనే సాగవాయే జాని
bakrO banEgi bEjinE kakaSI yAj
nayanO banE sAgavAyE jAni
చరణం
charaNam 2
నరగున దానే గగనేసి ఛూటే
గేసూచెరజ్ఞిక?? మా యేజీకా
naraguna dAnE gaganEsi ChUTE
gEsUcherajnika?? mA yEjIkA
check English sound
Not too happy with this text. Here is our first attempt to improve the same
దిగేన్ అంజన్ మైకు సవారి రే
దిగేన్ యేజీ దిగేన్
కాహూ కు మారోగే దిగేన్
digEn anjan maiku sawAri rE
digEn yEjI digEn
kAhU ku mArOgE digEn
బకరో బనేగీ బేజినే కాక్ శ్రీ యాజ్
నయనో బనేసా గవాయే జాని
bakarO banEgI bEjinE kAk SrI yAj
nayanO banEsA gavAyE jAni
నర గున దానే గగన్ సే ఛూటే
గేసూఁ చేరంజీ కా మాయీజీ కా
nara guna dAnE gagan sE ChUTE
gEsU@m chEramjI kA mAyIjI kA
Notes: बक रो = Male Goat; काक =  Crow; दिगें = give or Digen as in dik/disha  ke indra;  गेसूं = lock of hair; चेरंजी = Cudpah Nut or చారపప్పు/ or simply chiranjeevi which is another name for Hanuman

#178 సామిని దేగదే sAmini dEgadE

Titleసామిని దేగదే (ప్రతి)sAmini dEgadE (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సామిని దేగదే చానరో వేగమేsAmini dEgadE chAnarO vEgamE
చరణం
charaNam 1
కామజనకుడే కామిని యింటను ఘనమని యుండెనో వో చెలిkAmajanakuDE kAmini yimTanu ghanamani yumDenO vO cheli
చరణం
charaNam 2
జగతిని పురుషుల సఖియరో నమ్మగ
తగదని దెల్పిరే వో చెలి
jagatini purushula sakhiyarO nammaga
tagadani delpirE vO cheli
చరణం
charaNam 3
పడతి రేపలె గోపాలుడు మది నను
బాగని మరచెనె వో చెలి
paDati rEpale gOpAluDu madi nanu
bAgani marachene vO cheli

#177 మానాభిమానము mAnAbhimAnamu

This jAvaLi was published earlier too – from a different book. Lyrics have minor differences

TitleమానాభిమానముmAnAbhimAnamu
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మానాభిమానము లాతనిదే చెలిmAnAbhimAnamu lAtanidE cheli
చరణం
charaNam 1
మునుపటి నెనరైన తన మది నెంచక
ననబోడి రాడాయనే ఆయనె చెలి
munupaTi nenaraina tana madi nemchaka
nanabODi rADAyanE Ayane cheli
చరణం
charaNam 2
తరుణి బోధన విని తానిందు రాడాయె
కరుణయు లేదాయెనె ఆయనె చెలి
taruNi bOdhana vini tAnimdu rADAye
karuNayu lEdAyene Ayane cheli
చరణం
charaNam 3
వనితరొ గోపాలుడు నన్నేలుట
తనదె భారమనెనే అనెనె చెలి
vanitaro gOpAluDu nannEluTa
tanade bhAramanenE anene cheli

#176 రారా మేర rArA mEra

Titleరారా మేర (ప్రతి)rArA mEra (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
రారా మేర నేరము లేలరrArA mEra nEramu lElara
మారునికేళికి మదనజనక యిటుmArunikELiki madanajanaka yiTu
చరణం
charaNam 1
కూరిమితో దానిగూడిటు రాకను
సారెకు నన్నేచ సరసుడ చాలుర
kUrimitO dAnigUDiTu rAkanu
sAreku nannEcha sarasuDa chAlura
చరణం
charaNam 2
యెంతసేపు నేనిటు తాళుదుర
దంతము జేసేవా పడతి బోధనేర
yemtasEpu nEniTu tALudura
damtamu jEsEvA paDati bOdhanEra
చరణం
charaNam 3
స్థిరముగ రేపలెపుర మందిర నీ
కరుణ గోరితిర కఠినము లేలర
sthiramuga rEpalepura mamdira nI
karuNa gOritira kaThinamu lElara