| Title | వాని నెడబాసి | vAni neDabAsi |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | వాని నెడవాసి నేనెటులోర్తునే చెలి | vAni neDavAsi nEneTulOrtunE cheli |
| కాని వారితో గూడి కనబడడే చెలి | kAni vAritO gUDi kanabaDaDE cheli | |
| చరణం charaNam 1 | నిశ్చలముగ నన్ను నిండు కౌగలించి మచ్చిక చేసేది మఱచె గదే చెలి | niSchalamuga nannu ninDu kaugalinchi machchika chEsEdi ma~rache gadE cheli |
| చరణం charaNam 2 | ధర వెలయు శ్రీ రంగధాముడు నను గూడి నిరతము బాయనని ఏచెగదే చెలి | dhara velayu SrI rangadhAmuDu nanu gUDi niratamu bAyanani EchegadE cheli |
#481 నీ మోహమిదేనా nI mOhamidEnA
| Title | నీ మోహమిదేనా | nI mOhamidEnA |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగు | byAgu |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 8 | |
| పల్లవి pallavi | నీ మోహమిదేనా నెల కొక్కసారి ఇందు వచ్చి నిలుచుట గాన | nI mOhamidEnA nela kokkasAri indu vachchi niluchuTa gAna |
| చరణం charaNam 1 | తీఱని మమత మదికి తెలిసెను నాడీ ఏ తీరున నే నడచుకొన్న ఎప్పటి జాడే | tI~rani mamata madiki telisenu nADI E tIruna nE naDachukonna eppaTi jADE |
| చరణం charaNam 2 | ఆయెలేర ఏమి ఇక ఆయెనిందాక ఏమేమో బొంకితివి నాతో ఎంచ పరాక | AyelEra Emi ika AyenindAka EmEmO bonkitivi nAtO encha parAka |
| చరణం charaNam 3 | ఇకనైన కరుణించి మా యిల్లు చూడరాదా మకరాంక జనకుడైన గోపాల ఈ వేళ | ikanaina karuNinchi mA yillu chUDarAdA makarAnka janakuDaina gOpAla I vELa |
#480 రమ్మనవె rammanave
| Title | రమ్మనవె | rammanave |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously posted at | 9, 157 | |
| పల్లవి pallavi | రమ్మనవె సామిని రమణిరొ తను వలచితినిటు | rammanave sAmini ramaNiro tanu valachitiniTu |
| చరణం charaNam 1 | సారెకు నా సరివారిలో నన్నిటు దూఱుట తనకిది మేర గాదిటు | sAreku nA sarivArilO nanniTu dU~ruTa tanakidi mEra gAdiTu |
| చరణం charaNam 2 | ఆదరమున అపరాధము లెంచక వాదు చేసేది మరియాద గాదిటు | Adaramuna aparAdhamu lenchaka vAdu chEsEdi mariyAda gAdiTu |
| చరణం charaNam 3 | వాసిగ మారు గురి చేసి చా భీమేశుడు నన్నిటు గాసి చేసెనిక | vAsiga maaru guri chEsi chA bhImESuDu nanniTu gAsi chEsenika |
#479 వలచితె valachite
| Title | వలచితె | valachite |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | మిశ్ర లఘువు | miSra laghuvu |
| Previously posted at | 23, 201 | |
| పల్లవి pallavi | వలచితె ఇంత చలమేలరా నా సామి | valachite inta chalamElarA nA sAmi |
| చెలువుడ నా మదిని తలచి తలచి నిను | cheluvuDa nA madini talachi talachi ninu | |
| చరణం charaNam 1 | మక్కువతో నా మనసిటు నిలువక మిక్కిలి వేడితే తామసమా ఎక్కువ మమతతో బిలిచిన పలుకవు | makkuvatO nA manasiTu niluvaka mikkili vEDitE tAmasamA ekkuva mamatatO bilichina palukavu |
| చరణం charaNam 2 | వెన్నెల రేయిని వేడిమి తాళర నన్నిటు చుల్కన సేయకురా నిన్నెడబాసి నే నిమిష మోర్వగ జాల | vennela rEyini vEDimi tALara nanniTu chulkana sEyakurA ninneDabAsi nE nimisha mOrvaga jAla |
| చరణం charaNam 3 | వర భీమేశుని నేరము లెంచుచు సారెకు రమ్మన సమ్మతమా మార సుందర నిన్ను మమతతో బిలిచిన | vara bhImESuni nEramu lenchuchu sAreku rammana sammatamA mAra sundara ninnu mamatatO bilichina |
#478 ఏమి సేతు Emi sEtu
| Title | ఏమి సేతు | Emi sEtu |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously posted at | 6, 203 | |
| పల్లవి pallavi | ఏమి సేతు ఎటుల సైతు మరులు తాళ లేనురా సామి ధర్మపురి నివాస సమయము నన్నేలుకోరా | Emi sEtu eTula saitu marulu tALa lEnurA sAmi dharmapuri nivAsa samayamu nannElukOrA |
| చరణం charaNam 1 | పిలువ పిలువ బిగువులు చేసేది మేరగాదురా అలుక నాటి సుఖము కోరి చెలువుడ దయ చేయు మిపుడు | piluva piluva biguvulu chEsEdi mEragAdurA aluka nATi sukhamu kOri cheluvuDa daya chEyu mipuDu |
| చరణం charaNam 2 | మాటిమాటికిని వేడమట్టు విడువ బాగాయె గట్టు విల్తు పోరు ఇపుడు మట్టు మీఱి వచ్చెనయ్యో | mATimATikini vEDamaTTu viDuva bAgAye gaTTu viltu pOru ipuDu maTTu mI~ri vachchenayyO |
| చరణం charaNam 3 | రామ ప్రాణ సఖిని బాసి రాము డెటుల తాళెనో ప్రేమ మీఱ మాటలాడ సామి చేర రారా ఇపుడు | rAma prANa sakhini bAsi rAmu DeTula tALenO prEma mI~ra mATalADa sAmi chEra rArA ipuDu |
#477 శాబాసులే SAbAsulE
| Title | శాబాసులే | SAbAsulE |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | శాబాసులే బాగాయె నీ బుద్ధి బంగారమాయె | SAbAsulE bAgAye nI buddhi bangAramAye |
| చరణం charaNam 1 | ఇందరిలో నా చేయి జార్చినను సందిట జేర్చెదవే సై | indarilO nA chEyi jArchinanu sandiTa jErchedavE sai |
| చరణం charaNam 2 | ఒంటిగా రాగా నను జూచి కళ లంటగ వచ్చెదవే సై | onTigA rAgA nanu jUchi kaLa lanTaga vachchedavE sai |
| చరణం charaNam 3 | చక్కని సోమ భూపాల నీకు మ్రొక్కేనురా చలమేల | chakkani sOma bhUpAla nIku mrokkEnurA chalamEla |
#476 రమ్మనే కొమ్మ నే rammanE komma nE
| Title | రమ్మనే కొమ్మ నే | rammanE komma nE |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రమ్మనే కొమ్మ నే ఈ విరహము తాళజాల ఎమ్మె కాని ఈవేళ | rammanE komma nE I virahamu tALajAla emme kAni IvELa |
| రమ్మనవే మనవి వినవె వరద వేంకట రమణు నిపుడు | rammanavE manavi vinave varada vEnkaTa ramaNu nipuDu | |
| చరణం charaNam 1 | అమరికగా శ్రుతి గూర్చుగొని హౌసుగ తొడ తొడ చేర్చుకొని సమగమ పధనిస రిని రీయని ముచ్చట లొనర వినిపించెద | amarikagA Sruti gUrchugoni hausuga toDa toDa chErchukoni samagama padhanisa rini rIyani muchchaTa lonara vinipincheda |
| చరణం charaNam 2 | పద పద్యంబులచే వానీ పలుమఱు మెప్పించే గాని తధిమి తకిట తక తధణంతక ధిత్తకధికి యని కొనిపించెద | pada padyambulachE vAnI paluma~ru meppinchE gAni tadhimi takiTa taka tadhaNamtaka dhittakadhiki yani konipincheda |
#475 సయ్యాటలకు sayyATalaku
| Title | సయ్యాటలకు | sayyATalaku |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | సయ్యాటలకు తగినదిరా నేడా ఒయ్యారిని దయ చేకొనరా | sayyATalaku taginadirA nEDA oyyArini daya chEkonarA |
| చరణం charaNam 1 | ముద్దు గారురా సుందరి మోమున ముద్దు గాఱురా వయసు మదన తాపమిక సైపదురా | muddu gArurA sundari mOmuna muddu gA~rurA vayasu madana tApamika saipadurA |
| చరణం charaNam 2 | కప్పు రాలురా కొప్పున కలికికి కప్పు రాలురా తనువు చపలాక్షి నిపుడు కనుగొనరా | kappu rAlurA koppuna kalikiki kappu rAlurA tanuvu chapalAkshi nipuDu kanugonarA |
| చరణం charaNam 3 | ధర్మము రారా చెలి మర్మ మెఱుగ ధర్మ పురీశుడ రారా తరుణి నేలనిది సమయమురా నేడా ఒయ్యారిని దయ చేకొనరా | dharmamu rArA cheli marma me~ruga dharma purISuDa rArA taruNi nElanidi samayamurA nEDA oyyArini daya chEkonarA |
#474 అయ్యో విభుడు ayyO vibhuDu
| Title | అయ్యో విభుడు | ayyO vibhuDu |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కేదార గౌళ | kEdAra gauLa |
| తాళం tALa | ఆది | Adi |
| Previously posted at | 62 | |
| పల్లవి pallavi | అయ్యో విభుడు నను మఱచెనే నేనెట్లోర్వ గలనే ఓ లలనా | ayyO vibhuDu nanu ma~rachenE nEneTlOrva galanE O lalanA |
| చరణం charaNam 1 | సయ్యాటలకు రమ్మని సఖులను నే వెయ్యాఱు తడప లంపినను ఆ గయ్యాళి వలలో తగిలి రాడాయె ||నేనెట్లో|| | sayyATalaku rammani sakhulanu nE veyyA~ru taDapa lampinanu A gayyALi valalO tagili rADAye ||nEneTlO|| |
| చరణం charaNam 2 | గరాగరిక గల దొరా దొరని నే బరాతములు పంపిన రాక పరాముఖము సలిపి రాడాయె ||నేనెట్లో|| | garAgarika gala dorA dorani nE barAtamulu pampina rAka parAmukhamu salipi rADAye ||nEneTlO|| |
| చరణం charaNam 3 | తరాతరము లేని యా సవతి నా బరాబరిక నెంచిన గాక నిరాకరించె శ్రీ ధర్మ పురీశుడు ||నేనెట్లో|| | tarAtaramu lEni yA savati nA barAbarika nenchina gAka nirAkarinche SrI dharma purISuDu ||nEneTlO|| |
#473 పోవే పోవే pOvE pOvE
| Title | పోవే పోవే | pOvE pOvE |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | పోవే పోవే పోవే పోవే చెలి ||వేగ|| | pOvE pOvE pOvE pOvE cheli ||vEga|| |
| పోవే వానిటు వేగ తేవే చెలీ | pOvE vAniTu vEga tEvE chelI | |
| చరణం charaNam 1 | మదనుడు పదను శరము లెదనేయ మదన సదన మింక పదనించె గదవే | madanuDu padanu Saramu ledanEya madana sadana minka padaninche gadavE |
| ననబోణి వినవె ఆ వనజ వైరి యిపుడు నను బాధించేది న్యాయ మౌనటవే | nanabONi vinave A vanaja vairi yipuDu nanu bAdhinchEdi nyAya maunaTavE | |
| సరసుడైన ధర్మ పురమున నెలకొన్న పర వాసుదేవుని తేవే చెలి | sarasuDaina dharma puramuna nelakonna para vAsudEvuni tEvE cheli | |