#545 కొమ్మా గాకిది kommA gAkidi

Titleకొమ్మా గాకిదిkommA gAkidi
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaయమునా కల్యాణిyamunA kalyANi
తాళం tALaత్రస్య గతిtrasya gati
పల్లవి pallaviకొమ్మా గాకిది మేలి బంగారు బొమ్మా యౌరరా యీ ముద్దు
గుమ్మ సొగసు వర్ణింప నా తరమ్మా హా
kommA gAkidi mEli bangAru bommA yaurarA yI muddu
gumma sogasu varNimpa nA tarammA hA
చరణం
charaNam 1
చూపా పువ్విలు కాని క్రొవ్వాడి తూపా
తమి ద్రుల్లెడు బేడిస చేపా
దీని చూచి శక్యము ధైర్యమాప హా
chUpA puvvillu kAni krovvADi tUpA
tami drulleDu bEDisa chEpA
dIni chUchi Sakyamu dhairyamApa hA
చరణం
charaNam 2
కరుణా మౌని మానసంబుల కైన
మురులా తమ్మి ముసురు కొన్న భ్రమరులా
కారా వేల్పులైన గింకరులా హా
karuNA mouni mAnasambula kaina
murulA tammi musuru konna bhramarulA
kArA vElpulaina ginkarulA hA

#544 సరసకు రావేమిరా sarasaku rAvEmirA

Titleసరసకు రావేమిరాsarasaku rAvEmirA
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaకాఫీkAfI
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసరసకు రావేమిరా శ్రీకృష్ణ
సరసకు రమ్మని నిరతము నిన్ను నే
పరిపరి విధముల స్మరణ జేసిన గాని
sarasaku rAvEmirA SrIkRshNa
sarasaku rammani niratamu ninnu nE
paripari vidhamula smaraNa jEsina gAni
చరణం
charaNam 1
మదన బాధలతో నే మది నిల్ప లేనురా
నిదుర లేక నిను ఎదురు జూచితిరా
మధురమైన నీ మృదువైన పలుకులు
హృదయమందు నను బాధ జేసిన గాని
madana bAdhalatO nE madi nilpa lEnurA
nidura lEka ninu eduru jUchitirA
madhuramaina nI mRduvaina palukulu
hRdayamandu nanu bAdha jEsina gAni
చరణం
charaNam 2
శృంగారమైన నీ అంగ సంగమునకు
ముంగురులను దూపి నిలచి యుంటినిరా
మంగళ రూప నీ మోము జూపక ఆ
రంగైన మేడలో రంజిల్లు కృష్ణ
SRngAramaina nI anga sangamunaku
mungurulanu dUpi nilachi yunTinirA
mangaLa rUpa nI mOmu jUpaka A
rangaina mEDalO ranjillu kRshNa

#543 ఏమి సేతురా Emi sEturA

Titleఏమి సేతురాEmi sEturA
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaఅమీరు కల్యాణిamIru kalyANi
తాళం tALaఅద్దాaddA
పల్లవి pallaviఏమి సేతురా నా మనోభవాEmi sEturA nA manObhavA
చరణం
charaNam 1
ఏమో కాని నిన్ను నే మఱుతునన్న
నా మనము నందు నాటి యుంటివిరా
EmO kAni ninnu nE ma~rutunanna
nA manamu nandu nATi yunTivirA
చరణం
charaNam 2
మలయ సమీరము వడ గాలియై తోచె
చలువల పన్నీరు చిలువల విసమయ్యె
malaya samIramu vaDa gAliyai tOche
chaluvala pannIru chiluvala visamayye
చరణం
charaNam 3
మారుని శరముల బారికి బాల్పడ
గూరిచి నా విధి క్రూరత సూపెరా
mAruni Saramula bAriki bAlpaDa
gUrichi nA vidhi krUrata sUperA
చరణం
charaNam 4
మహిత భుజంగ మాన్య కవిపాలా
మహిమ తెలిసెరా మాటలాడ రారా
mahita bhujanga mAnya kavipAlA
mahima teliserA mATalADa rArA

#542 సరస కత్తెయని sarasa katteyani

Titleసరస కత్తెయనిsarasa katteyani
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఅటaTa
పల్లవి pallaviసరస కత్తెయని సకియ వలలో
బడ సామి నేనేమందురా
sarasa katteyani sakiya valalO
baDa sAmi nEnEmandurA
చరణం
charaNam 1
విరి బంతులచే ముంచి విసము లోన నుంచి
మురిపించి తేనెతో మోచేయి నాకించు
viri bantulachE munchi visamu lOna nunchi
muripinchi tEnetO mOchEyi nAkinchu
చరణం
charaNam 2
మందుల మారి యా మాయలాడి దాని
పొందు పాయ వేమిరా
యందఱి విన హరి యల్లరి వాడనె
సుందరాంగి వలపు సూది మొన కొలుపు
mandula mAri yA mAyalADi dAni
pondu pAya vEmirA
yanda~ri vina hari yallari vADane
sundarAngi valapu sUdi mona kolupu
చరణం
charaNam 3
పాటలాధరికి నేపాటి ప్రేమ కలదొ
మాటికి లంచమురా
కూటమిక నీకు గూడదు చూడుమా
రాట బెట్టి బల్పోరాటము నొనరించు
pATalAdhariki nEpATi prEma kalado
mATiki lanchamurA
kUTamika nIku gUDadu chUDumA
rATa beTTi balpOrATamu nonarinchu
చరణం
charaNam 4
మాటికి మాటికి నిన్ను మమత జూపుమన్న
నేటికి దయ రాదురా
మాటికి శ్రీ వెలయు మంత్రిప్రగడ రాజ
కోటి భుజంగ రాయని బోటి గుణ మడుగు
mATiki mATiki ninnu mamata jUpumanna
nETiki daya rAdurA
mATiki SrI velayu mantripragaDa rAja
kOTi bhujanga rAyani bOTi guNa maDugu

#541 ఏమిరా మనోహరా EmirA manOharA

Titleఏమిరా మనోహరాEmirA manOharA
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaహిందుస్థానీ తోడిhindusthAnI tODi
తాళం tALaఅద్దాaddA
పల్లవి pallaviఏమిరా మనోహరా నాకేమి తోచదాయరా
కాము బారి ద్రోచి నన్నే భామ గూడి నావురా
EmirA manOharA nAkEmi tOchadAyarA
kAmu bAri drOchi nannE bhAma gUDi nAvurA
చరణం
charaNam 1
పండు వెన్నెలలు వేసగి యెండలయి మండెరా
బొండు మల్లె పాన్పు నిప్పుల గుండముగ నుండెరా
panDu vennelalu vEsagi yenDalayi manDerA
bonDu malle pAn&pu nippula gunDamuga nunDerA
చరణం
charaNam 2
నిన్ను గూడు వేడుక మును నన్నె యెఱుగ నైతిరా
నిన్ను గాన లేక పిదప నన్న మెఱుగ నైతిరా
ninnu gUDu vEDuka munu nanne ye~ruga naitirA
ninnu gAna lEka pidapa nanna me~ruga naitirA
చరణం
charaNam 3
సుందరి బ్రతిమాలితి నీదు పొందు నాకు గూర్పరా
యందమయిన యిరవు మనకు బొందు పఱచి నానురా
sundari bratimAliti nIdu pondu nAku gUrparA
yandamayina yiravu manaku bondu pa~rachi nAnurA
చరణం
charaNam 4
అల్లదె పూబందిటికి మెల్ల నన్ను జేర్పరా
చల్లగా భుజంగ రావు సరసు బ్రోచు వల్లభా
allade pUbandiTiki mella nannu jErparA
challagA bhujanga rAvu sarasu brOchu vallabhA

#540 ఏరా మోసపోయెద ErA mOsapOyeda

Titleఏరా మోసపోయెదErA mOsapOyeda
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏరా మోసపోయెద వింత లోనేErA mOsapOyeda vinta lOnE
చరణం
charaNam 1
దారి తప్పితివో దాని యిలు కాదురా
యోర వాకిటి నాకె యుంచి పరుండురా
dAri tappitivO dAni yilu kAdurA
yOra vAkiTi nAke yunchi parunDurA
చరణం
charaNam 2
దరి జేరి నా మేను తడవి చూచెదవు
మరియాద దక్కదు మఱి కోపవతి యాపె
dari jEri nA mEnu taDavi chUchedavu
mariyAda dakkadu ma~ri kOpavati yApe
చరణం
charaNam 3
ప్రొద్దైన జూడవు పోకెల్లు పోయెదు
ముద్దులు కుడిచెదు మోమాట ముంచదు
proddaina jUDavu pOkellu pOyedu
muddulu kuDichedu mOmATa munchadu
చరణం
charaNam 4
నను జేర రాకురా నను నంట బోకురా
ఘనత భుజంగ రావు కవి నుతి వినబోరా
nanu jEra rAkurA nanu nanTa bOkurA
ghanata bhujanga rAVu kavi nuti vinabOrA

#539 మాయ చేసినాడే mAya chEsinADE

Titleమాయ చేసినాడేmAya chEsinADE
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaహిందుస్థాని కాఫీhindusthAni kAfI
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమాయ చేసినాడే చెలి మాయ చేసినాడేmAya chEsinADE cheli mAya chEsinADE
చరణం
charaNam 1
వేయ సాగె సుమ సాయకు డమ్ముల
డాయ వెతలు పిక దీయవె యని వాడు
vEya sAge suma sAyaku Dammula
DAya vetalu pika dIyave yani vADu
చరణం
charaNam 2
మారుని పోర మై జారిన చెమటల
నారుప వీవన తేర బొమ్మని వాడు
mAruni pOra mai jArina chemaTala
nArupa vIvana tEra bommani vADu
చరణం
charaNam 3
చానరొ నిముసము జామయి తోచెనే
కానుక దేబోదు గాదనకని వాడు
chAnaro nimusamu jAmayi tOchenE
kAnuka dEbOdu gAdanakani vADu
చరణం
charaNam 4
ధరను భుజంగ రావు దాసుని బ్రోచిన
సరసుని మాటలు వరములౌ బలె వాడె
dharanu bhujanga rAvu dAsuni brOchina
sarasuni mATalu varamulau bale vADe

#538 ఏమి సేతు Emi sEtu

Titleఏమి సేతుEmi sEtu
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఏమి సేతు నెటుల సైతు నా మనోహరా
కాము విరి శరమిటు నను గాసి చేసెరా
Emi sEtu neTula saitu nA manOharA
kAmu viri SaramiTu nanu gAsi chEserA
చరణం
charaNam 1
నీ మనసు నన్ను జూచి నీఱు కాదేరా
కోమలుల నేచ నింత కోరికేలరా
nI manasu nannu jUchi nI~ru kAdErA
kOmalula nEcha ninta kOrikElarA
చరణం
charaNam 2
కరము యౌవనంబిదె నీకు గట్ట మిచ్చెద
విరివిగా నధరా మృతమున విందు చేసెద
karamu yauvanambide nIku gaTTa michcheda
virivigA nadharA mRtamuna vindu chEseda
చరణం
charaNam 3
ఆ రమణి వలె నిను నే నాదరించెద
కరుణ జేసి కఱవు తీర గౌగలింపరా
A ramaNi vale ninu nE nAdarincheda
karuNa jEsi ka~ravu tIra gaugalimparA
చరణం
charaNam 4
సారెకు భుజంగ రావు సన్నుతించెరా
మార జనక నా మీద మనసు నిల్పరా
sAreku bhujanga rAvu sannutincherA
mAra janaka nA mIda manasu nilparA

#537 రేపనెద వేమిరా rEpaneda vEmirA

Titleరేపనెద వేమిరాrEpaneda vEmirA
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఏకEka
పల్లవి pallaviరేపనెద వేమిరా సామి
నా లోపమేమో తెల్పరా
rEpaneda vEmirA sAmi
nA lOpamEmO telparA
చరణం
charaNam 1
ఈ పూటకైన నే మోపలేరా సామి
రేపు మాపటికె పోపో దాని జేర
I pUTakaina nE mOpalErA sAmi
rEpu mApaTike pOpO dAni jEra
చరణం
charaNam 2
ఒక్క నాడుండిన మొక్క మొలచెదో
యక్కడ నీకున్న మక్కువ తెలిసెలే
okka nADunDina mokka molachedO
yakkaDa nIkunna makkuva teliselE
చరణం
charaNam 3
పొందు కోరెద నీవా సుందరి గూడిన
యంద మంటునని యాస జేసి యిక
pondu kOreda nIvA sundari gUDina
yanda manTunani yAsa jEsi yika
చరణం
charaNam 4
అందము కాదు గోవింద భుజంగ రావు
వందనంబుల నందుకొను మిక
andamu kAdu gOvinda bhujanga rAvu
vandanambula nandukonu mika

#536 రావటరా rAvaTarA

TitleరావటరాrAvaTarA
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaహిందుస్థానీ కాఫీhindusthAnI kAfI
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviరావటరా రాతిరి యింటికిrAvaTarA rAtiri yinTiki
చరణం
charaNam 1
భూ వలయమునను బూబోడులు లేరా
యే వనిత కైన నీవిద్ది కలదా
bhU valayamunanu bUbODulu lErA
yE vanita kaina nIviddi kaladA
చరణం
charaNam 2
అవసర పడి నీపయి నాస చేసితి నని
చవుకగా జూడగా నవునట రాయేరా
avasara paDi nIpayi nAsa chEsiti nani
chavukagA jUDagA navunaTa rAyErA
చరణం
charaNam 3
చలువ పన్నీటితో జలక మాడింతు
నన్గలసి యీ వేళ నా కలవర ముడుపరా
chaluva pannITitO jalaka mADintu
nan&galasi yI vELa nA kalavara muDuparA
చరణం
charaNam 4
ఘనత భుజంగ రాయ కవి పోషకుడవని
వినతుల జేసెద వేగ రారా యిక
ghanata bhujanga rAya kavi pOshakuDavani
vinatula jEseda vEga rArA yika