#392 పిలచితె నేను pilachite nEnu

Titleపిలచితె నేనుpilachite nEnu
Written ByవెంకటరమణvenkaTaramaNa
Book
రాగం rAgaపూర్వి కల్యాణిpUrvi kalyANi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviపిలచితె నేను పలుక వమదేమిరా
కాని దాని మాట విని కరుణ మరచేవేమిరా
pilachite nEnu paluka vamadEmirA
kAni dAni mATa vini karuNa marachEvEmirA
మంచివాడవని నేను మరులైతిని గదరా
చందకాడ లేరా కోర్కె దీర దాయ
manchivADavani nEnu marulaitini gadarA
chandakADa lErA kOrke dIra dAya
మనసు తెలియకను మగువ పొందు జేరితివి
కనికర మింతైన లేక కలసినట్లు జేసితివి
manasu teliyakanu maguva pondu jEritivi
kanikara mintaina lEka kalasinaTlu jEsitivi
మారుని బారికి మనసు సైరించదాయె
మరచేది న్యాయమా మంగళ పురి నివాసా
mAruni bAriki manasu sairinchadAye
marachEdi nyAyamA mangaLa puri nivAsA

#391 విరహ మగ్గళమాయెరా viraha maggaLamAyerA

Titleవిరహ మగ్గళమాయెరాviraha maggaLamAyerA
Written Byచంద్రశేఖర శాస్త్రిchandraSEkhara SAstri
Book
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవిరహ మగ్గళ మాయెరా ఓరి నా సామిviraha maggaLa mAyerA Ori nA sAmi
అనుపల్లవి anupallaviస్మరుడురమున కేసిన విరిశరములు
కరుణ లేక నన్ను కొరుకుచుండగ నా
smaruDuramuna kEsina viriSaramulu
karuNa lEka nannu korukuchunDaga nA
చరణం
charaNam 1
పాల నీళ్ళంటిని నీడ వెలుగంటిని
పూల నలుగించ తరమా ధర్మమా
బాలచంద్ర ధరునిచే దగ్ధుడైన
ఏలాగో వచ్చి నరులకింత బాధ లిచ్చితె
pAla nILLanTini nIDa veluganTini
pUla nalugincha taramA dharmamA
bAlachandra dharunichE dagdhuDaina
ElAgO vachchi narulakinta bAdha lichchite

#390 సామి నీపై sAmi nIpai

Titleసామి నీపైsAmi nIpai
Written Byరామనాథపురం శ్రీనివాస అయ్యంగార్rAmanAthapuram SrInivAsa ayyangAr
Book
రాగం rAgaనవరత్న జావళిnavaratna jAvaLi
తాళం tALaరూపకrUpaka
** సరసాంగి **
సామి నీపై ఆ సరసాంగియు చాల మరులు గొన్నదిరా
ఆరడము మనసున గల ఆతురత తెలియవలసిన
సారశాస్త్రారుడ మదన శాస్త్రములను నెర చదివెను
** sarasAngi **
sAmi nIpai A sarasAngiyu chAla marulu gonnadirA
AraDamu manasuna gala Aturata teliyavalasina
sAraSAstrAruDa madana SAstramulanu nera chadivenu
** సావేరి **
ఏమి జేయుదునని మనసా వేడితి సావేడి
ఎల్లప్పుడును చింతించుచున్నదిరా
మంచి వితరణ గలది యని యెంచి
సరగున నాపై నెనరుంచి సదనము కొరకు
జని బిగి కౌగలించగ యుంటి
** sAvEri **
Emi jEyudunani manasA vEDiti sAvEDi
ellappuDunu chintinchuchunnadirA
manchi vitaraNa galadi yani yenchi
saraguna nApai nenarunchi sadanamu koraku
jani bigi kaugalinchaga yunTi
** నవరోజు **
నా మనవిని విని నీ వచ్చితివని
నవరోజు నిన్ను కొనియాడునురా
తామసమికను సలుపుట నీకు తగదురా
అలవాని దాతలకు సరియైన ప్రమాప్తుడని నిను మొరలిడ
** navarOju **
nA manavini vini nI vachchitivani
navarOju ninnu koniyADunurA
tAmasamikanu salupuTa nIku tagadurA
alavAni dAtalaku sariyaina pramAptuDani ninu moraliDa
** లలిత **
తామర సాక్షి నీ లలితాకారమును
తగ జూచుటకు ప్రీతియు గలదిరా
గారాబముతో పదముల తిరుగ
గొలుచుటకు దురాగ్రహము నిరాకరించి
బిరాన జూప వరాలొసగు
** lalita **
tAmara sAkshi nI lalitAkAramunu
taga jUchuTaku prItiyu galadirA
gArAbamutO padamula tiruga
goluchuTaku durAgrahamu nirAkarinchi
birAna jUpa varAlosagu
** వరాళి **
ప్రేమతో వరాళియని నిన్ను పిలచి
నీ వద్ద బొమ్మ నేనురా
కౄరమగు విరి శరముల సారెకును
యెదపై కురియగ వారిజముఖి
వలపు మిగుల మీరి నిను కలయుటకు అది
** varALi **
prEmatO varALiyani ninnu pilachi
nI vadda bomma nEnurA
kRUramagu viri Saramula sArekunu
yedapai kuriyaga vArijamukhi
valapu migula mIri ninu kalayuTaku adi
** ఆరభి **
భామకు నీ భ్రమచే మనసార
బిలువలేదని చెప్పుచున్నదిరా
గానరసిక శిఖామణి యును యశముగల నీకు
సరిసమాన మెవరు లేదనుచును ఆననము గానవలె నను
** Arabhi **
bhAmaku nI bhramachE manasAra
biluvalEdani cheppuchunnadirA
gAnarasika SikhAmaNi yunu yaSamugala nIku
sarisamAna mevaru lEdanuchunu Ananamu gAnavale nanu
** ఖమాసు **
వేమరు దాట చేయక మా సుందరి యొక్క
వెత దీర్చుట కిదే సమయమురా
దాని గుణము తెలుప వశమా పరమ పురుష
వరస దానిను మదిలోన దలచు
దానిపై నరమర విని
** khamAsu **
vEmaru dATa chEyaka mA sundari yokka
veta dIrchuTa kidE samayamurA
dAni guNamu telupa vaSamA parama purusha
varasa dAninu madilOna dalachu
dAnipai naramara vini
** భూపాల **
భువిలో వెలయు భూపాలుడని పొగడి
నీ రాక కోరి యున్నదిరా
మార జనక యల మలయ మారుతము
బహు విసరగ వెరచి కరగి
విరహాబ్ధిలో మునిగి చిరకాలమున నిను
** bhUpAla **
bhuvilO velayu bhUpAluDani pogaDi
nI rAka kOri yunnadirA
mAra janaka yala malaya mArutamu
bahu visaraga verachi karagi
virahAbdhilO munigi chirakAlamuna ninu
** శ్రీ **
కామించి దక్కిన శ్రీనివాస నిన్ను
కరుణతో అచ్చటకు రమ్మనెనురా
ఆదరువుగ సకల సుర సేవిత
పద యుగళ మృదు అధర మధుర
సరస లీల వినుత వాహుని సొగసుని
కాలమెరిగి జరుపు నెలత
ఏల పడ దగినదిరా యని
కులవర సుసమయమంచు తూలపరచక
నెలవిమ్ము నెలమెరయు సదయుడ
తమిప్రేమ తాళదురా
విబుధజన పరిపాల నిను విడచి యున్నది
మేలిమి గల నవరత్న మాలికా భరణుడైన సామి
** SrI **
kAminchi dakkina SrInivAsa ninnu
karuNatO achchaTaku rammanenurA
Adaruvuga sakala sura sEvita
pada yugaLa mRdu adhara madhura
sarasa lIla vinuta vAhuni sogasuni
kAlamerigi jarupu nelata
Ela paDa daginadirA yani
kulavara susamayamanchu tUlaparachaka
nelavimmu nelamerayu sadayuDa
tamiprEma tALadurA
vibudhajana paripAla ninu viDachi yunnadi
mElimi gala navaratna mAlikA bharaNuDaina sAmi

#389 మోము జూప mOmu jUpa

Titleమోము జూపmOmu jUpa
Written Byమైసూరు సదాశివరావుmaisUru sadASivarAvu
Book
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమోము జూపవేమి ముద్దు మాటలాడవేమి నాతో
mOmu jUpavEmi muddu mATalADavEmi nAtO
కామిత ఫలదాయక నీవని చక్కగ మ్రొక్కిన యిటునాkAmita phaladAyaka nIvani chakkaga mrokkina yiTunA
తామసము సేయరాదు సదాశివ హృదాబ్జధామtAmasamu sEyarAdu sadASiva hRdAbjadhAma

#388 మనవిని వినుమా manavini vinumA

Titleమనవిని వినుమాmanavini vinumA
Written Byయోగ నరసింహyOga narasim^ha
Book
రాగం rAgaవలచి valachi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమనవిని వినుమా నా
మనసుకు సుఖమొసగుము
నిను బాసి సగమాయను
మేను మనసు తల్లడిల్లెను
manavini vinumA nA
manasuku sukhamosagumu
ninu bAsi sagamAyanu
mEnu manasu tallaDillenu
పగవారు మమ్ము కలయలేక జేసి వేగించిరి
గాని అనురాగము స్థిరముగ నుంచుము నా రాజ
pagavAru mammu kalayalEka jEsi vEginchiri
gAni anurAgamu sthiramuga nunchumu nA rAja
ప్రేమమె నా ప్రాణాధారము ప్రియతమ దేవా
నేమమె నా దినచర్య నీ యతి కొలది కలయగలము
prEmame nA prANAdhAramu priyatama dEvA
nEmame nA dinacharya nI yati koladi kalayagalamu

#387 చిత్తము రాదే chittamu rAdE

Titleచిత్తము రాదేchittamu rAdE
Written ByవెంకటరమణvenkaTaramaNa
Book
రాగం rAgaకమాచిkamAchi
తాళం tALaమిశ్ర ఏకmiSra Eka
పల్లవి pallaviచిత్తము రాదే ఏలనే నాపైన
అంతరంగము తోను
కాంతుడు నను గూడి
పంతము ఏలనే
చెంత రాడాయనే
chittamu rAdE ElanE nApaina
antarangamu tOnu
kAntuDu nanu gUDi
pantamu ElanE
chenta rADAyanE
సరసుడు రాడాయ సఖియరో ఏమిసేతు
మరచినాడే నన్ను మగువరో ఈవేళ
sarasuDu rADAya sakhiyarO EmisEtu
marachinADE nannu maguvarO IvELa
కామునిబారికి కలికి నేనోర్వనే
మమతెందు బోయెనో మంగళపురివాసుడె
kAmunibAriki kaliki nEnOrvanE
mamatendu bOyenO mangaLapurivAsuDe

#386 వింతలెంతని vintalentani

Titleవింతలెంతనిvintalentani
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAgaఖరహరప్రియkharaharapriya
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviవింతలెంతని అడుగుట న్యాయమా సు
కాంతలంతటి మేముండగా మా వింతలెంతని
vintalentani aDuguTa nyAyamA su
kAntalantaTi mEmunDagA mA vintalentani
ఇంతి సంతతంబున మనసు నుంచి ప్రేమించి కామించి భావించితెinti santatambuna manasu nunchi prEminchi kAminchi bhAvinchite
మానాభిమానములకు మానినీమణులు తమ
ప్రాణముల నిచ్చెదరు గాని మనకేలయని
తాళవనేశుని సురేషుని స్మరించే మాట
mAnAbhimAnamulaku mAninImaNulu tama
prANamula nichchedaru gAni manakElayani
tALavanESuni surEshuni smarinchE mATa

#385 పగలు రేయి తెలియదే pagalu rEyi teliyadE

Titleపగలు రేయి తెలియదేpagalu rEyi teliyadE
Written Byధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావుdharmapuri subbarAyar / subbArAvu
Book
రాగం rAgaమోహనmOhana
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviపగలు రేయి తెలియదే నీ
వగలు జూచి చూచి యిపుడు
pagalu rEyi teliyadE nI
vagalu jUchi chUchi yipuDu
సగము జూపించి నవ్వుచు
నగలు కావలెనని
సుగుణయని నన్ను పొగడి
మగమాయలు జేసితివిక
sagamu jUpinchi navvuchu
nagalu kAvalenani
suguNayani nannu pogaDi
magamAyalu jEsitivika
నిదుర రాదు దగ్గరికి సుధాంశు సమ
వదన నీవు రాక నిరాకరణ మిక చేయ
వద్దనగ ముదము లేని వృధ్ధుల కంత
మధుర మాటలేల యని సురబరన నీవు
ధర్మపురీశునికి మనసు నిచ్చితోవిక
nidura rAdu daggariki sudhAmSu sama
vadana nIvu rAka nirAkaraNa mika chEya
vaddanaga mudamu lEni vRdhdhula kanta
madhura mATalEla yani surabarana nIvu
dharmapurISuniki manasu nichchitOvika

#384 మానినీ మణి mAninI maNi

Titleమానినీ మణిmAninI maNi
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమానినీమణి నిన్ను కోరియున్నది
నీ సరసకు తగినది
mAninImaNi ninnu kOriyunnadi
nI sarasaku taginadi
చాన మాటలేల దాని విరహము
బూని తగ్గని దాయెనని యరచినది
chAna mATalEla dAni virahamu
bUni taggani dAyenani yarachinadi
మోహ మాధుర్య మాటలు మా మానినికి గావలెనురా వినరాదురా
సాహసంబు చూపించి సుదతికి రచించెను గొనుమురా చామరాజేంద్ర
mOha mAdhurya mATalu mA mAniniki
gAvalenurA vinarAdurA
sAhasambu chUpinchi sudatiki rachinchenu
gonumurA chAmarAjEndra

#383 ఏరా నా సామి ErA nA sAmi

Titleఏరా నా సామిErA nA sAmi
Written Byమైసూరు వాసుదేవాచారిmaisUru vAsudEvAchAri
Book
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏరా నా సామి పగవారు ఏమి బోధించెరు సామి నీకు
సారస దళ నయన కృప విరహ తాపమును తెలియక పోతివి
ErA nA sAmi pagavAru Emi bOdhincheru sAmi nIku
sArasa daLa nayana kRpa viraha tApamunu teliyaka pOtivi
చరణం
charaNam 1
పరులనుమాట విని పరాకు జేయుట ధర్మము గాదుర
పర వాసుదేవ నా జీవాధారుడు నీవేరా
ననువిడచి కదలకురా సామి
parulanumATa vini parAku jEyuTa dharmamu gAdura
para vAsudEva nA jIvAdhAruDu nIvErA
nanuviDachi kadalakurA sAmi